వినిపించని పక్షుల కిలకిల

తెల్లవారుతుండగా పక్షుల కిలకిలరాగాలతో పల్లెలు మేల్కొనేవి. ఎటు చూసినా పక్షుల రాగాలే.. ఇవి ఒకప్పటి మాటలు. నేడు ఆ పరిస్థితి లేదు. రోజురోజుకూ వాతావరణంలో వచ్చే మార్పులతో జీవజాతులు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పక్షుల సరాగాలు ఇప్పుడు వినిపించడం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం పక్షులు ఉదయాన్నే సందడి చేసేవి. కిలకిల మంటూ మురిపాలు కురిపించేవి. ఇంటి ముందర కట్టే వరిగొలుకలు తింటూ పక్షులు సంగీతాన్ని వినిపించేవి. తెల్లవారకముందే మనుషులను నిద్రలేపేవి. ముద్దులొలికే పిచ్చుక చేస్తున్న చేష్టలు కనువిందు చేసేవి. ఊర పిచ్చుకల జాతి అంతరించుకు పోతోంది. రసాయన ఎరువులు, రేడియేషన్ ప్రభవంతో ఇప్పటికే రాబంధులు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు పశువులు చనిపోతే అక్కడ రాబంధులు వాలి దాన్ని మొత్తం తినేసేవి. అటువంటిది ఇప్పుడు ఊళ్లలో పశువులు లేవు…రాబంధులు రావు. దీంతో రాబోయే రోజుల్లో రాబంధులంటే ఇలా ఉండేవని చెప్పుకోవడమే. ఇంత జరుగుతున్నా మన పాలకుల్లో మార్పు కనిపించడం లేదు.–(జి.ఎ.సునీల్ కుమార్)
మనదేశంలో పదమూడు వందల యాభై మూడు పక్షి జాతులున్నాయి. అంటే ప్రపంచ పక్షి జాతుల్లో ఇవి 12.04శాతం అన్నమాట.వీటిలో డెబ్భైఎనిమిది జాతులు (ఐదుశాతం) మన దేశానికి మాత్రమే చెందినవి.ఈ డెబ్భై ఎనిమిదిలో మూడు జాతులు గత కొన్ని దశాబ్దాలుగా కనుమరుగ య్యాయని ఇటీవల జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్త అమితవ మజుందార్ తెలిపారు. అవి మణిపూర్ బుష్ పిట్ట,(పెర్డికులా మణి పురెన్సిస్)..హిమాలయన్ పిట్ట (ఓఫ్రిసియా సూపర్‌సిలియోసా), జెర్డాన్స్ కోర్సర్ (రినోప్టిలస్ బిటోర్క్వాటస్)లు.అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ (ఐయుసిఎన్) 1907లో వీటి మనుగడకు ముప్పు ఉందని తెలిపే రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసీస్ అనే అధ్యయనంలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణ కు కంకణబద్ధులు కావడం లేదు.విచ్చలవిడిగా మనం ఉపయోగించే ఎరువులు, సెల్‌టవర్‌ల ప్రభావంతో పక్షిజాతులైన రాబంధులు,గద్దలు,పాలపిట్టలు,చిలకలు,గోరింకలు కనిపించ కుండా పోతున్నాయి.వాతావరణ మార్పులకుతోడు పక్షిజాతులు అంతర్థానంతో మానవ మనుగడే ప్రమాదంలో పడబోతోందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
పిండేస్తున్న కొండలు…
ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా జిల్లా ఎడారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన గుట్టలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. విచ్చలవిడిగా, ఇబ్బడిముబ్బడిగా అమ్యా మ్యాలకు ఆశపడి అడ్డగోలుగా అనుమతులిస్తుంటే కొండలు దిక్కుతోచని స్థితిలో దీనంగా చూస్తున్నాయి.మానవుని అత్యాశకు బలవుతున్నామని రోదిస్తున్నాయి. దేవుని గుట్టలైనా, ఏగుట్టలైన డబ్బుల రుచిమరిగిన బకాసురులు కొండలను పిండి చేయడంతో జంతువులు,పక్షులు,కనిపించకుండా పోతున్నాయి.గుట్టల్లో ఎలుగుబంట్లు,తోడేళ్లు,జింకలు,పక్షులు నివాసం ఉండేవి.ప్రస్తుతం జంతువులు జనారణ్యంలోకి పరుగులు పెడుతున్నాయి. ఇలా జరగడానికి కారణం కొండలు కనుమరుగు కావడమే. గుట్టలనే నివాసంగా చేసుకోని జీవించే జీవజాతుల పరిరక్షణకు ప్రభుత్వమైనాచర్యలు తీసుకోవడం లేదు.
రసాయన ఎరువులు…
మనం వ్యవసాయానికి వాడే రసాయన ఎరువులు వల్ల జంతువులు,పక్షులు చనిపోతున్నాయి. వాటిలో ఉండే విష పదార్థాల వల్ల పక్షులు అంత రించిపోతున్నాయి. గతంలో జాతీయ పక్షులు నెమళ్లు విషాహారం తిని మృతి చెందిన సంఘ టనలు జరిగాయి.పంటలు బాగా పండాలని మనం వాడే రసాయనాలతో పక్షులు ఆ పంట లను తిని తనువుచాలిస్తున్నాయి. పక్షిజాతుల్లో ఇప్పటికే పలు పక్షులు కనుమరుగైపోయాయి. పూర్వం కోడిపిల్లలు గద్దలను చూసి భయపడేవి. ఇప్పుడు కోడి పిల్లలు లేవు.గద్దలు కానరావడం లేదు. గద్దలు,గోరింకాలు, చిలుకలు,పిచ్చుకలు ఒకటేమిటి భూమి మీదఉన్న పక్షిజాతులన్నీ రాను..రాను కన్పించకుండ పోయే దుస్థితి నెలకొంటోంది.
సెల్ టవర్లతోనూ ముప్పు..
సెల్ లేని ఊరులేదు. సెల్‌టవర్ లేని పట్టణం లేదు.సెల్ టవర్ల వినియోగంతో రేడియేషన్ సమస్య ఉందని పర్యావరణ విశ్లేషకులు చెబుతు న్నారు. వీటి వినియోగంతో మనుషులు సైతం రోగాల బారిన పడుతున్నారు. రేడియేషన్ ప్రభా వంతో పక్షుల్లో రోగాలు పెరుగుతు న్నాయి. ఫలి తంగా మృత్యువాత పడుతున్నాయి.ఇటీవల కాలంలో ఎక్కువ కావడంతో అసలు పక్షులే కని పించకుండా పోతున్నాయి. భవిష్యత్తు తరాలకు మనం పక్షులంటే ఇలా ఉంటాయని బొమ్మల ద్వారా చూపించే రోజులు వస్తున్నాయి. పర్యా వరణ పరిరక్షణ కోసం పాటుపడకపోతే భవిష్యత్తు అంధకారమే.దీనిపై ప్రభుత్వాలు,పాలకులు స్పం దించి పర్యావరణ సంరక్షణ కోసం నడుం బిగించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఆజాదీ ఏదీ..!
ప్రచురణ రచయితలలో ధృతి బెనర్జీ ఒకరు. ఈమె ‘మన దేశంలో డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ‘ఆజాదీకా అమృత్ మహో త్సవ్’ వేడుకలు జరుపుకున్నాం. అదే సమయంలో జెడ్‌ఎస్‌ఐ ‘75ఎండిమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఒక నివేదికను ప్రచురించింది.ఈ విష యాన్ని అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడిరచింది కూడా.అయినా పరిస్థితి క్షీణ దశ లోనే ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచ డం..నిషేధిత ప్రాంతాలలో మాత్రమే కనిపించే జాతులను సంరక్షించడం తక్షణం చేయవలసిన కర్తవ్యం.ఇదే మా నివేదిక ప్రగాఢ ఉద్దేశ్యం’ అని ధృతి పేర్కొన్నారు.
అరుదైనవి..అంతరిస్తున్నాయి..
‘తెల్ల బొడ్డు మినివెట్ పెరిక్రోకోటస్ ఎరిత్రోపైజియస్ పక్షులు పశ్చిమ కనుమలు, నేపాల్, మన దేశంలోని ఆకురాల్చే అడవుల్లో అత్యధికంగా ఉండేవన్నారు. అండమాన్ నికోబార్ దీవులలో ఆసక్తికరమైన నాలుగు పక్షి జాతులు కనిపిస్తున్నాయి.అవి నికోబార్ మెగాపోడ్ (మెగాపోడియస్ నికోబారియన్సిస్),నికోబార్ సర్పెంట్ ఈగిల్ (స్పిలోర్నిస్ క్లోస్సీ), అండమాన్ క్రేక్ (రల్లినా కన్నింగి),అండమాన్ బార్న్ గుడ్లగూబ (టైటో డెరోప్స్టోర్ఫీ).ఇవి తూర్పు హిమాలయాలు, దక్కన్ పీఠభూమి, మధ్య భారత అడవులకు చెందినవి. ఇంకా ఆ దీవుల్లో మరెక్కడా కనిపించని 25 పక్షి జాతులు ఉన్నాయి.అవి నికోబార్ మెగాపోడ్,నికోబార్ సర్పెంట్ ఈగిల్, అండమాన్ క్రేక్, అండమాన్ బార్న్ గుడ్లగూబ వంటి జాతులు.వీటి ఆవిర్భావానికి స్థానిక భౌగోళిక పరిస్థితులే కారణం’ అని డాక్టర్ మజుందార్ చెప్పారు. ఆ ప్రదేశాల్లో మారిన పరిస్థితులకు ఈ పక్షుల మను గడ ప్రమాదంలో పడిరది. పశ్చిమ కనుమల్లో ఇరవై ఎనిమిది ప్రత్యేకమైన జాతులున్నాయి. అవి మలబార్ గ్రే హార్న్‌బిల్, మలబార్ పారాకీట్, అశంబు లాఫింగ్ థ్రష్, వైట్-బెల్లీడ్ షోలకిలి.
‘ప్రచురణలో స్థానిక పక్షి జాతుల జీవ-భౌగోళిక ప్రాంతాల వివరాలు,శాస్త్రీయపేర్లు,ఉప జాతుల తేడాలు, ప్రత్యేక లక్షణాలు, ఇష్టపడే ఆవా సాలు,సంతానోత్పత్తి అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు, చారిత్రక ఔచిత్యం ఉన్నాయి’ అని డా.మజుందార్ తెలిపారు. సామాన్యులు, విద్యార్థులలో అవగాహన పెంపొందిద్దాం.. పక్షులను, ప్రాణికోటిని కాపాడు కుందాం.
కాపాడుకోవడం మన బాధ్యత
జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి. సామాజిక అడవుల పెంపకాన్ని పర్యావరణ వేత్తలు ఉద్యమంలా చేపట్టాలి. ప్రభుత్వం పర్యావరణ సంబంధిత శిక్షణా కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేస్తూ జీవ వైవిధ్య అవశ్యకతను తెలియజేయాలి. జానపద కళలు,వీధి నాటకాల ద్వారా ప్రజల్లో జీవవైవిధ్యంపట్ల అవగాహన కలిగించాలి. సామా జిక మాధ్యమం, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వినూత్న శైలిలో జనాలకు సులభతరమైన భాషలో సరళంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలి. పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలు అనేక అంతర్జాతీయ ధరిత్రీ సదస్సులు ఏర్పాటు చేసి కార్యాచరణ అమలుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికి భూతాపం, అనావృష్టి, అతివృష్టి, అకాల వర్షాలు, వరదలు, కరవు తదితరాలు ఇటీవలి కాలంలో ఇంకా అధికమవుతూనే ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే లక్ష్యాల సాధనకు కార్యాచరణకు పొంతన లేదనే విషయం తెలుస్తుంది. కనుక వాతావర ణంలో వస్తున్న విపరీత మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ కార్యాచరణను సత్వరమే చేపట్టాలి. ప్రకృతి అందించిన జీవవైవిధ్య సంపదను కాపాడు కోవడం ఆధునిక మానవుడి ప్రాధమిక బాధ్యత అని గుర్తెరగాలి.
మన రాజ్యాంగం అధికరణం 48(ఏ) లో పర్యావరణ పరిరక్షణకు..అభివృద్ధికి, ప్రభుత్వం కృషి చేయాలి. దేశంలోని వనాలను, వన్యప్రాణులను కాపాడడం రాజ్యవిధి అని ఆదేశిక సూత్రాల్లో చెప్పింది. అంతేకాదు పర్యా వరణ రక్షణ పౌరుల ప్రాథమిక విధి అని 51 ఏ(జి) లో స్పష్టంగా పేర్కొంది. అంటే పౌరులుగా మనం జీవ వైవిధ్య పరిరక్షణ మన ప్రాధమిక బాధ్యత అనే విషయం గుర్తించిన నాడు జీవ వైవిద్యానికి జరిగే నష్టత అరికట్టబడుతుంది.
ఎందుకంటే అంతరించి పోయిన వృక్ష, జంతు జాలాన్ని ఎప్పటికీ పునరుద్ధరించుకోలేం. ఏ జీవి అయినా తనకు తానుగా స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. తప్పనిసరిగా ఇతర జీవుల మీద ఆధారపడాల్సిందే.ఈసత్యాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించి ఇప్పటికైనా పరిరక్షణ దిశగా అడుగులు వేయగలిగితే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము.దీనివలన ప్రస్తుత తరం వారమైన మనం ప్రయోజనం పొందటమే కాకుం డా రాబోయేతరాల వారి ప్రయోజనాలను కాపాడే దిశగా కొనసాగించే అభివృద్ధికి అవకాశం అందించిన వారం అవుతాం.