విద్యార్థుల చూపు ఉన్నత విద్య వైపు
విద్యారంగంపై ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాడు- నేడు మొదలుకొని విదేశీ విద్యాదీవెన వరకు తెచ్చిన పథకాలు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేశాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో(జీఈఆర్) గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉన్నత విద్యలో దాదాపు 12.5 శాతం చేరికలు అదనంగా నమోదయ్యాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పలు చర్యలు చేపడుతుం డటంతో అక్షరాస్యతలో దేశ సగటును మించి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటును నమోదు చేసింది.
విద్యారంగంలో ఏపీకి అరుదైన స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో 2020-21లో 19,87,618 మంది ఉన్నత విద్యాభ్యాసం కోసం కళా శాలల్లో తమ పేర్లు నమోదు చేసుకు న్నారు. 2014-15లో 17,67,086 మంది మాత్రమే ఉన్నత విద్యనభ్యసించగా, 2020- 21 నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీ ఎంపీ పరిమళ్ నత్వానీ ఏపీలో ఉన్నత విద్య గురించి ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాష్ సర్కార్ రాజ్యసభలో సమాధానమిస్తూ ఏపీలో విద్యారంగం ప్రగతిపథంలో ఉందని వివరించారు.
దేశవ్యాప్తంగా మహిళలే ముందంజలో
2022లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధారంగా, రాష్ట్రంలో ఉన్నత విద్యలో నమోదు 12.5% పెరిగిందని మంత్రి సూచించారు. ఇంకా, సర్వే ప్రకారం, %Aూ%లో ఉన్నత విద్యలో మహిళల నమోదు 2014-15లో 7,73,650 నుండి 2020-21లో 9,31,553కి పెరిగింది, ఇది 20.4% పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో చేరిన వారి సంఖ్య మొదటిసారిగా నాలుగు కోట్ల మార్కును దాటిందని మరియు 2014లో 3.42 కోట్ల నుండి 2020-21లో దాదాపు 4.14కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, 2014-15లో1.57 కోట్లుగా ఉన్న మహిళా నమోదులు 2020-21లో 2.01కోట్లకు పెరిగాయి.
నూతన కళాశాలల పెరుగుదలకు తోడ్పాటు
జాతీయ స్థాయిలో, షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నమోదు 2014-15లో 46.06 లక్షల నుండి 2020-21లో 58.94 లక్షలకు పెరిగిందని, ఇది 28% పెరిగిందని సర్వేలో తేలింది. దేశంలో ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) విద్యార్థుల నమోదు కూడా 2014-15లో 16.40 లక్షల నుండి 47% పెరిగి 24.12 లక్షలకు చేరుకుంది. దేశంలో ఇతర వెనుక బడిన కులాల విద్యార్థుల నమోదు 2014-15లో 1.13 కోట్ల నుండి 1.48 కోట్లకు పెరిగింది, ఇది 32% పెరుగుదలను సూచిస్తుంది. 2014-15 మరియు 2020-21 మధ్య దేశంలో 353 విశ్వవిద్యాలయాలు మరియు 5,298 కళాశాలలు అదనంగా పెరిగాయి.
కళాశాలల రీ మోడలింగ్ తోనే సాథ్యం..!
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ పథకం (రాసు) కింద, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలు మరియు ఆశావహ జిల్లాలు వంటి అన్‌సర్వ్‌డ్ మరియు అండర్‌సర్వ్‌డ్ ఏరియాల్లో 130 మోడల్ డిగ్రీ కాలేజీల స్థాపనకు కేంద్ర మద్దతును ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.రాసు ద్వారా, కళాశాలలకు మౌలిక సదుపాయాల గ్రాంట్లు, ఎంపిక చేసిన స్వయంప్రతిపత్త కళాశాలల్లో నాణ్యత మరియు శ్రేష్ఠతను పెంపొందించడం మరియు ఇప్పటికే ఉన్న డిగ్రీ కళాశాలలను మోడల్ డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం వంటి సేవలందించని మరియు తక్కువ సేవలం దించే ప్రాంతాలలో ఉన్నత విద్యను మెరుగు పరచడానికి కూడా కేంద్ర మద్దతు అందించ బడుతుంది.
విద్యా రంగంలో నవశకం
విద్యా రంగాన్ని సమూలంగా మార్చేం దుకు కమిషన్ల ఏర్పాటురాష్ట్ర విద్యారంగంలో నవశకం ఆరంభమైంది.విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం నాంది పలికింది.ఇందుకు సంబంధించి చరిత్రాత్మ కమైన రెండు కీలకబిల్లులను శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యా నియంత్రణ,పర్యవేక్షణ కమిషన్ బిల్లు..ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. దీంతో ఇంత కాలం విద్యార్థులు,తల్లిదండ్రులను ఫీజుల పేరిట పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్,కార్పొరేట్ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట పడనుంది.ఎన్నికలకు ముందు తనసుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రం లోని విద్యారంగ పరిస్థితిని, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి చలించిన ముఖ్యమంత్రి ఈ రెండు బిల్లులకు రూపకల్పన చేసి,తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆమోదింపజేశారు.
ఎల్‌కేజీ మొదలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువుల వరకు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్తులు సైతం అమ్ముకోవడమే కాకుండా ఆచదువులు పూర్తయ్యేసరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారమయం చేయడంతో పేదలే కాకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సైతం విద్య పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిం చడంతో పాటు ఇష్టానుసారం ఫీజులు దండుకొనే స్వేచ్ఛను సైతం ఇచ్చేసింది. కనీస సదుపాయాలు, బోధకులు లేకుండానే కాలేజీలు, స్కూళ్లను నిర్వహిస్తున్నాయి. పిల్లలను జైళ్ల వంటి హాస్టళ్లలో ఉంచి వారిపై విపరీతమైన ఒత్తిడి పెడుతూ వారి బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. సరైన బోధన లేకుండా బట్టీ పద్ధతులను పాటిస్తూ విద్యార్థులను యంత్రాలుగా మార్చేస్తున్నాయి.
రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు
పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్య వేక్షణ కమిషన్ బిల్లులు ఆమోదం పొంద డంతో ఇకపై రాష్ట్రంలో విద్యా రంగ రూపు రేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలే ప్రామాణికం గా విద్యా రంగం పయనిస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లు లు రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుగా పలు వురు అభివర్ణిస్తున్నారు. ఈ కమిషన్లకు ప్రభు త్వం అనేక అధికారాలు కల్పించింది. ఫీజులు, ప్రమాణాలు, విద్యార్థులు.. టీచర్ల సంక్షేమం ఇలా అన్ని కోణాల్లోనూ ఈ కమిషన్లు విద్యారం గాన్ని పర్యవేక్షిస్తాయి. హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఛైర్మన్లుగా ఉండడంతో పాటు ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనుండడంతో విద్యారం గం పగడ్బందీగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీటికి సివిల్ కోర్టు అధికారాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అధికారం విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు మినహా తక్కిన అన్ని సంస్థలు ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయి.ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల సర్వీసు కండిషన్లు, వారికి ఇస్తున్న వేతనాలు, ఇతర అంశాలను కూడా కమిషన్ పరిశీలి స్తుంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. నిబంధనలు అసలు పాటిం చని సంస్థల గుర్తింపు రద్దుకు కూడా చేసే అధికారం ఉంటుంది.సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తున్నందున ఎవరినైనా పిలిపించి విచారిం చే అధికారం కమిషన్‌కు ఉంటుంది.ఇంటర్‌లో దోపిడీకి బ్రేకులు.ప్రస్తుతం పాఠశాల విద్య ఒక ఎత్తు అయితే ఇంటర్మీడియెట్ విద్య మరో ఎత్తు. రెండేళ్ల ఈ కోర్సు పేరిట ప్రవేట్, కార్పొరేట్ సంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నా యి. ఇప్పుడీ కోర్సును ఉన్నత విద్యా నియం త్రణ, పర్యవేక్షణ కమిషన్ ఈ కాలేజీల వ్యవహరాలను పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్మీడియెట్ కాలేజీలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా యాజ మాన్యాల ఇష్టానుసారం అయ్యింది. అలాగే ప్రైవేటు వర్సిటీలు కూడా ఈ రాష్ట్రంతో, ప్రభుత్వంతో సంబంధం లేనట్లు ఇష్టాను సారంగా ఫీజులు, ప్రవేశాలను కొనసాగిస్తు న్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుతో వాటికీ అడ్డుకట్ట పడనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్ చర్యలు చేపడుతుంది.ప్రవేశాలు,బోధన, పరీక్షలు,పరిశోధన,బోధనా సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల నిర్వహణ ఉందా? లేదా అన్న అంశాల పరిశీలన. జూనియర్,డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు (రాష్ట్ర చట్టాలకు లోబడి ఏర్పాటైనవి) కూడా ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయి. ఆయా సంస్థలపై చర్యలకు కమిష న్‌కు అధికారం ఉంటుంది. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థల మూతకు చర్యలు తీసుకొనే అధికారం కమిషన్‌కు ఉంది. నిబంధనలు పాటించని ఉన్నత విద్యా సంస్థలకు పెనాల్టీల విధింపు అధికారం ఉంది. నిబందనలు ఉల్లంఘించే సంస్థల గుర్తింపు రద్దుకు వర్సిటీలను ఆదేశించే అధికారం. చైర్మన్, సభ్యులపై లేదా కమిషన ్‌పై న్యాయపరమైన కేసులు దాఖలు చేసేందుకు వీలులేదు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం నడిచే విద్యా సంస్థలను మూత వేసే అధికారం ఉంటుంది. పెనాల్టీలను విధిస్తుంది. వాటిని కట్టకుంటే వాటి నిధులను, లేదా స్థలాలను స్వాధీనం చేసుకొనే అధికారం కూడా ఉంది. కాగా, కమిషన్ నిర్ణయాలను పరిశీలించే, సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.- జీఎన్‌వి సతీష్