విద్యలో వండర్ ఎడెక్స్
పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోనుంది. ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ ‘‘ఎడెక్స్’’ల మధ్య ఒప్పందం జరగనుంది.టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా రూపొందించిన ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ.
‘‘ఎడెక్స్ ఒప్పందం’’ ముఖ్యాంశాలు
హార్వర్డ్,ఎంఐటీ, ఎల్‌ఎస్‌ఈ,కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ..తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
‘‘ఎడెక్స్ ఒప్పందం’’తో ప్రయోజనాలు
విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్,ఎంఐటీ,కొలంబియా,లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సి టీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులు బాటు.. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్లో భాగమవుతాయి.తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్‌గా ఎదుగు తారు. ఉన్నత విద్యలో జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు..పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసిం చేందుకు వీలు కల్పిస్తూ జగనన్న విద్యా దీవెనద్వారా పూర్తి ఫీజు రీయింబ ర్స్మెంట్.. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి సౌకర్యాలు, ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే (జూన్ / జులై), చివరిలో ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్/టైమ్స్ ర్యాంకింగ్స్ 21 ఫ్యాకల్టీలలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం.జాబ్ ఓరియెంటెడ్ కరిక్యు లమ్‌తో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు. విద్యా ర్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు.కరిక్యులమ్‌లో భాగంగా సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్.తద్వారా విద్యార్థులు తాము చదువుతున్నకోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్‌లైన్‌లో నేర్చుకునే వెసులుబాటు. కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యా ర్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్దిదిద్దడం. ఇప్పటికే 7లక్షల మంది విద్యార్థు లు 2 నెలల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్, 5.2లక్షల మంది 2నెలల షార్ట్‌టర్మ్ ఇంటర్న్ షిప్ మరియు 2లక్షల మంది 6నెలల లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయగా మరో 3 లక్షల మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ ఇంట ర్న్ షిప్స్ పూర్తి చేయనున్నారు. థియరీతో పాటు Iఅసబర్‌తీవ శీతీఱవఅ్‌వస జశీబతీంవం చేయడం వల్ల 2018-19 విద్యా సంవత్స రంలో 37,000 ఉన్నప్లేస్ మెంట్స్ ఇప్పుడు (2022-23లో) 1 లక్షకు పెరిగింది.నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్,సెక్టార్ స్కిల్ కౌన్సిల్ లతో ఒప్పందం.50బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ప్రోగ్రామ్ లతోపాటు 159 సింగిల్ మేజర్ కోర్సులు.డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్ నుంచి మెషిన్ లెర్నింగ్,డేటా సైన్స్,రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్,కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనాలసిస్ ఇన్వెస్ట్ మెంట్స్,లాజిస్టిక్స్, రిస్క్ మేనేజ్ మెంట్,స్టాక్ ఎక్చేంజ్,సైబర్ ఫోరెన్సిక్స్ ఫైనాన్షియల్ మార్కెట్ అనాలసిస్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి మైనర్ కోర్సులు ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా అందుబాటులోకి. డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్ క్యాస్టులు. రాష్ట్రంలోని 18యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీకి మన జగనన్న ప్రభు త్వం సన్నాహాలు. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ ప్రారంభం. మన విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా తయారు చేసే క్రమంలో ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన స్టెయిన్ బీస్- జర్మనీ, మెల్బోర్న్ ఆస్ట్రేలియా, కెంపెన్-జర్మనీ, బ్లెకింగ్-స్వీడన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బ్యాంకాక్ లతో అవగాహన ఒప్పందాలు. ఉన్నత విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయి వినియోగానికి చర్యలు. యూనివర్సిటీల్లో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్‌ల ఏర్పాటు. ఒక్కో జోన్ కు రూ.10 కోట్ల పెట్టుబడి..ఇప్పటికే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభం. యువతలో సామాజిక సృహ, సమాజం పట్ల బాధ్యత పెంపొందించటానికి దీశీaతీస టశీతీ జశీఎఎబఅఱ్‌వ ణవఙవశ్రీశీజూఎవఅ్ ్‌ష్ట్రతీశీబస్త్రష్ట్ర జుసబషa్‌ఱశీఅ (దీజణజు )ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా 553 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు.. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా నమోదు. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే చీAAజ గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలో చీAAజ గుర్తిం పు పొందిన 437విద్యా సంస్థలు.
ఎడెక్స్‌తో ఒప్పందం..
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో కీలక ఒప్పందం చేసుకుంది ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.ఫిబ్రవరి 15న సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యా శాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవో యూకి సీఎంజగన్ అధ్యక్షత వహించి మాట్లా డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపో తుందని అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత విధానం.. నాణ్యమైన విద్య అన్నది హక్కు.. ఇది కొత్త నినాదం అని అన్నారు.నాణ్యమైన విద్య ను అందించడంలో మనం వెనకబడితే.. మిగతా వళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని, ఈ దేశంలో ఉన్నవారితో కాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నామని జగన్ అన్నారు. మన పిల్లలు మంచి మంచి జీతాలతో మెరుగైన ఉద్యోగాలు సాధించాలని అది జరగా లంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యం అవుతుం దని సీఎం జగన్ అన్నారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు..ఫలాలు ఇవ్వా లంటే బహు శా నాలుగైదేళ్లు పట్టొచ్చని, కానీ, మనం వేసిన ప్రతి అడుగుకూడా ప్రాథమిక విద్య స్థాయి నుంచి ఉన్నతవిద్య వరకూ కూడా సమూలంగా మార్చు కుంటూ వస్తున్నామని చెప్పారు. మానవ వనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా మన ప్రభుత్వం భావిస్తోందని, అందుకనే ప్రతి అడుగులోనూ చిత్తశుద్ది, అంకిత భావం చూపి స్తున్నామని సీఎంజగన్ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ల లో ఇంగ్లీష్ మీడియాంను ప్రవేశ పెట్టామని, గ్లోబల్ సిటిజన్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పు రావాలని అన్నారు. అందుకే ఇంగ్లిష్ మీడియం నుంచి నాడు`నేడు, అమ్మఒడి,గోరుమద్దతో మన ప్రయాణం ప్రారంభ మైందని,అక్కడితో మనం ఆగిపోలేదని జగన్ పేర్కొన్నారు.వచ్చే పదేళ్లలో టెన్త్ విద్యార్థి ఐబీ విద్యాబోధనఅందించే దిశగా అడుగులు వేస్తు న్నామని,ఐవీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్ చేస్తున్నామని జగన్ అన్నారు. బైజూస్ కంటెంట్‌తో అనుసంధానం చేశామని, ఈ ప్రయాణం, ఇక్కడితో ఆగిపోకూడదని, అత్యు తన్నత విద్యలో కూడా ఇలాంటి అడుగులు వేయా ల్సిన అవసరాన్ని భావించి దానిపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు.ఎడ్‌క్స్‌తో ఈరోజు చేసుకుం టున్న ఒప్పందం మరో అడుగు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 2వేలకుపైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్‌కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి.
ఐంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులుకూడా దీనిద్వారా నేర్చుకోవచ్చు.క్రెడిట్స్ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మన దగ్గర అందుబాటులో లేని కోర్సులు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది.అత్యుత్తమ యూనివర్శిటీల నుంచి సర్టిఫి కెట్లు ఉండడంవల్ల ఉద్యోగం సాధనమరింత సులభతరం అవుతుందని, మన పిల్లలకు ఇవ్వగ లిగిన ఆస్తి విద్య మాత్రమేనని జగన్ అన్నారు. నాణ్యమైన విద్యవారికి అదించగలిగితే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపె నీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. టాప్-50 ర్యాం కింగ్స్‌లో ఉన్న 320కాలేజీల్లో సీటు వస్తే.. రూ. 1.2 కోట్ల వరకూ కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని సీఎం జగన్ చెప్పారు.-జి.ఎన్.వి.సతీష్