విజన్ విశాఖ సదస్సు
విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో విజన్ విశాఖ సదస్సు మార్చి 5నపారిశ్రామికవేత్త లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి హజరై విశాఖపట్నాన్ని ఎలా తీర్చి దిద్దాలి? రాష్ట్రానికి విశాఖపట్నం ఎందుకు అవసరం అన్న అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉందని వివరిం చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసా యాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశంమొత్తం చూసుకుంటే జీఎస్డీపీలో వ్యవ సాయం వాటా17-18శాతంగా ఉంది.మన రాష్ట్రంలో అయితే ఇది35శాతంగాఉంది. ద్వితీయ, తృతీయ రంగాలు వృద్ధి చెందకపోతే రాష్ట్రం కూడా ఆర్ధికంగా నిలబడలేదు.ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగంతో పోలిస్తే ద్వితీయ రంగం, తృతీయ రంగాలు శరవేంగా వృద్ధిచెందాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ముందున్న సవాళ్లను అధిగమించ గలం. అప్పుడే మనం ఆశించిన ఆర్థికాభి వృద్ధిని సాధించగలం.రాష్ట్ర విభజనవల్ల పెనుసవాళ్లు మనకు ఎదురవుతున్నాయి.హైద రాబాద్ నగరాన్ని కోల్పోయాం.దీనివల్ల రాష్ట్రం మీద పెను ప్రభావం పడిరది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఒక చోదకశక్తి అవసరం.ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ఆర్థిక చోదకశక్తి అయిన హైదరాబాద్ను మనం కోల్పోయాం.ఆర్థిక ప్రగతి లక్ష్యాలను చేరుకోవ డానికి ఒక వాహనం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను భావించి…ఆరోజుల్లో కేంద్ర ప్రభుత్వం వాటిని విరివిగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఐడీపీఎల్, ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎఫ్సీ, ఐఐసీటీ లాంటి సంస్థలు హైదరా బాద్లో స్థాపించబడ్డాయి.పెద్ద ఎత్తున పెట్టు బడులు హైదరాబాద్కు వచ్చాయి.దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని ఏఇతర ప్రాంతంతో పోల్చు కున్నా హైదరాబాద్ బాగా అభివృద్ధి చెం దింది. ఇలాంటి సంస్థలు వస్తే గనుక వెంటనే అభివృద్ధి పరంగా మంచి మార్పు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి జీతాలు లభిస్తున్న ఉద్యో గులు ఉంటారు. ఇది వలయంలా మారి మంచి సంస్థలు రావడం,తద్వారా మంచి ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.తద్వారా నగరం బాగా విస్తరిస్తుంది.ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వరంగ సంస్థల్లో 90 శాతం సంస్థలు కేవలం హైదరాబాద్లోనే స్థాపించబడ్డాయి. దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. దురదృష్టవ శాత్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా ప్రాంతా ల్లో అలా జరగలేదు.ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపే సేవారంగం జాతీయ స్థాయిలో చూస్తే జీఎస్డీపీలో 55శాతంకాగా, కానీ తెలంగాణలో సేవా రంగం దాదాపు 62.87శాతంగా ఉంది. కాని మన రాష్ట్రంలో సేవారంగం వాటా కేవలం 40శాతం మాత్రమే. తెలంగాణలో సేవారంగానికి సంబంధించి అత్యధిక వాటా హైదరా బాద్నుంచే వస్తోంది.అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పెరుగుతుంది. తయారీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే జీఎస్డీపీలో సమాన స్థాయిలో ఉన్నప్పటికీ సేవా రంగం విషయంలో గణనీయ ప్రగతి చోటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసా యరంగంతో పోలిస్తే సేవారంగంలో మంచి వృద్ధిరేటు సాధ్యం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీసు రంగం బాగా పెరగాల్సిన అవసరం ఏ రాష్ట్రా నికైనా ఉంది. 2022-3 ఆర్థిక సంవత్స రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం రూ.2,19,518కాగా, తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,12,398లు. తెలం గాణ తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్ నుంచే వస్తోంది.సహజ సిద్ధంగా మనకున్న బలాలను వినియోగించుకుంటూ ఆర్థిక పురోగతిలో ముందుకుసాగాల్సిన అవ సరం ఉంది. దేశంలోనే రెండో అతిపెత్త సముద్రతీర ప్రాంతం మనకు ఉంది.974 కి.మీ పొడవైన తీర ప్రాంతం కారణంగా పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మనకు అపార అవకాశాలున్నాయి. దీనివల్ల తయారీ రంగాన్ని కూడా గట్టి ఊతం లభిస్తుంది. పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా తయారీ రంగానికి తగిన సహకారాన్ని అందిస్తూ ,974 కి.మీ. తీరంవెంబడి వివిధ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసుకుంటూ, మరోవైపు విశాఖ పట్నాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ రెండూ కలిసి రాష్ట్రానికి మంచి ఆర్థిక ప్రగతిని అందిస్తాయి. 2019కు ముందు కేవలం 4చోట్ల నుంచే ఎగుమతులు జరిగేవి.కాని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మరో నాలుగు పోర్టు లు కడుతున్నాం. వీటి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు రూ.16వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే దాదాపుగా రూ.4వేల కోట్లు ఖర్చు చేశాం. రామాయపట్నం పోర్టులో వచ్చే నెలలోనే షిప్పులు వచ్చే పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు. మచిలీపట్నం, కాకినాడలోని ప్రయివేటు పోర్టు, మూలపేట పోర్టులవద్ద కూడా పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. నాలుగులో మూడు పోర్టులు ప్రభుత్వ రంగంలో వస్తుం డగా,మరో పోర్టు ప్రయివేటు రంగంలో వస్తోంది.బ్లూ ఎకనామీకి ఊతమిచ్చేలా 10 పిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం.తీరం వెంబడి ప్రయాణిస్తే ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఒక ఫిషింగా హార్బర్ ఉంటుంది. అలాగే 6 ఫిష్ ల్యాండిరగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటితోపాటు పారిశ్రామిక నోడ్స్ను అభివృద్ధి చేస్తూ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ను నెలకొల్పాం. అచ్యు తాపురం,ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో పారి శ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నాం.అలాగే రాష్ట్రమంతటా కూడా సమతుల్య అభివృద్ది ఉండేలా చూస్తున్నాం. ప్రభుత్వం తీసుకుం టున్న సానుకూల చర్యలవల్ల, వ్యాపార అను కూల వాతావరణం వల్ల గడచిన మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక వేత్తలకు, పారిశ్రామిక రంగాన్ని రాష్ట్రం ఎంత స్నేహపూర్వకమైనదో చెప్పడానికి ఇదే ఉదాహ రణ. గత ఏడాది ఇదే విశాఖట్నంలో నిర్వ హించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సంద ర్భంగా రూ.13లక్షల కోట్లకుపైగా విలువైన 352 ఒప్పందాలు కుదిరాయి.దాదాపు 6 లక్ష ల మందికి ఉద్యోగావకాశాలు లభించను న్నాయి. ఇందులో 39శాతం ఒప్పందాలు ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఇప్పటికే కార్య రూపంలోకి వచ్చాయి. మిగిలిన ఒప్పందాలు కూడా శరవేగంగా అమల్లోకి వస్తున్నాయి. కేవలం అతి పెద్ద తయారీ పరిశ్రమలు రావడంద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి, లబ్ధిదారు లను సుస్థిర స్వయం ఉపాధి మార్గాలవైపు నడిపించింది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గణనీయమైన మార్పును తీసుకు వచ్చాయి.లంచాలకు తావులేకుండా, దళారీలు లేకుండా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా పథకాలు డీబీటీ పద్ధతిలో అమలు చేసింది. ప్రతి సంక్షేమ పథకం కూడా లబ్ధిదారులను చేయిపట్టుకుని నడిపించాయి. ఉదాహరణకు చేయూత పథకాన్ని తీసుకుంటే క్రమం తప్పకుండా ఒకే మహిళకు రూ.18,750లు చొప్పున నాలుగేళ్లపాటు స్థిరంగా ఇచ్చాం.ఆ లబ్ధిదా రులైన మహిళలను బ్యాంకులతో అనుసం ధానం చేశాం. అమూల్, ఐటీసీ, రియలన్స్, పీ అండ్ జీ లాంటి పెద్ద కంపెనీల భాగస్వా మ్యంతో వారికి స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశాం.వాల్లకాళ్లమీ వాళ్లు నిల బడేలా చేశాం.రాష్ట్రం ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇలాగే అమలు చేసింది. ఇదివరకు జీవనోపాథి పొందుతున్న మార్గాన్ని బలోపే తం చేయడమో లేక కొత్త ఉపాథి మార్గాన్ని సృష్టించడమో జరిగింది.
ఉద్యోగ రంగాన్ని మొత్తం చూస్తే.. ప్రభుత్వంలో ఉన్నవి కొన్ని మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మేం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యగుల సంఖ్య 4లక్షలు అయితే, మేం వచ్చిన తర్వాత సుమారో మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను జోడిరచ గలిగాం. దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య 4లక్షలు అయితే,50శాతం అధికంగా కొత్త ఉద్యోగాలను మేం అధికారం లోకి వచ్చాక సృష్టించగలిగాం.అలాగే భారీ పరిశ్రమల విషయంలో కూడా కోట్లాది రూపాయల పెట్టుబడులను పెడితే,ఆ పెట్టు బడులు ఉద్యోగావకాశాల రూపంలో మారేది కూడా స్వల్పంగానే ఉంటుంది.కాని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో పెద్ద వాటా వ్యవసాయం సహా ఇతర మూడు రంగాల్లో ఉన్నాయి. వ్యవసాయరంగంపై 62శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు.52 శాతం మంది రైతులకున్న భూమి అర హెక్టారు లోపలే.70 శాతం మంది రైతులకున్న భూమి హెక్టారు లోపలే.అభివృద్ధిగురించి మనం మాట్లాడుకు నేటప్పుడు ఈ వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మనకు పెద్ద మొత్తంలో సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వీరు ఆదాయాలు పొందలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూప్పకూలి పోతుంది. అందుకే రైతులకు చేయూనిచ్చి నడిపించడానికి,ఆర్బీకేలద్వారా,అగ్రికల్చరల్ అసిస్టెంట్లను పెట్టడంద్వారా,రైతు భరోసా ద్వారా వారికి తోడుగా నిలుస్తున్నాం.ఉపాథి రంగంలో వ్యవసాయానిది ప్రముఖ పాత్ర. ఇక మరో కీలక రంగం ఎంఎస్‌ఎంఈలు. అతి భారీ,భారీ పరిశ్రమలవల్ల కేవలం3-4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే ఎంఎస్ ఎంఈల్లో 30లక్షల మంది ఉద్యోగాలు చేస్తు న్నారు.ఎంఎస్‌ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది.వీటన్నింటికంటే ఎక్కడు మంది స్వయం ఉపాధి మార్గాల ద్వారా జీవిస్తున్నారు.1.5 కోట్ల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేం వెనుక వీరి పాత్రే కీలకం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్ర మాల ద్వారా వీరికి చేదోడుగా నిలుస్తోంది. వారి స్వయం ఉపాధికి సహకారాన్ని అంది స్తోంది.ఉదాహరణకు చూసుకుంటే రాష్ట్రంలో కోటిమందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలు,ఎన్పీఏలు 80 శాతం వరకూ ఉండేవి.ఇప్పుడు కేవలం 0.3శాతం మాత్రమే ఉన్నాయి. కోటిమంది మహిళలు దీనిపై ఆధారపడి ఉన్నారు. అలాగే కార్లు, వాహనాలు నడుపుతూ బతుకుతున్న వారిని వాహనమిత్ర ద్వారా చేదోడుగా నిలు స్తున్నాం. అలాగే కులవృత్తులు చేసుకుంటున్న నాయీబ్రాహ్మణులు,రజకులు, టైలర్లు వంటి వారికి కూడా ప్రభుత్వం చేదోడుగా నిలి చింది. ఆర్థికాభివృధ్ధిలో వీరందరిదీ కీలక పాత్ర. రాష్ట్రంలో ఇలా ప్రతి వర్గానికి కూడా చేయూత నందించేలా ప్రభుత్వం అనేక కార్య క్రమాలు చేపట్టింది. కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలో కూడా ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో ప్రోత్సాహకాలను విడుదలచేసి ప్రభుత్వం వారిని ఆదుకుంది. ఇది ఎంఎస్ ఎంఈల రంగాన్ని రక్షించింది. అందుకే ఈ రంగంలో వృద్ధి గతంతో పోలిస్తే గణనీయం గా ఉంది. 2018-19లో ఆర్థిక వృద్ధిరేటులో రాష్ట్రం చివరల్లో ఉంటే గత ఏడాది మొదటి ఐదు రాష్ట్రాల్లో నిలవడం దీనికి నిదర్శనం. భారత్లో తయారీ రంగం జీవీఏలో రాష్ట్ర తయారీ రంగం జీవీఏ 2019-24 మధ్య 4శాతంగా ఉంటే,2014-19 మధ్య కేవలం 2.9శాతం మాత్రంగా ఉండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మరి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి? వైజాగ్ విషయంలో మనం ఏం చేయాలి? వైజాగ్ అభివృద్ధి చరిత్రను మనం ఏరకంగా మార్చా లి? వచ్చే పదేళ్లలోగా మనం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలతో ఎలా పోటీపడాలి? అన్నదానిపై మనం దృష్టిపెట్టాలి. ఇదే విజన్ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి. ఈ ప్రాంతం పట్ల ఈ నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్త శుద్ధి లేకపోతే ఈ విజన్‌అన్నది సాకారం కాదు, వాస్తవంలోకి రాదు. అన్నికంటే ముందు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇక్క డకు వచ్చి నివాసం ఉండాలి. ఆది నేను అనగానే,మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలు ఉన్న నెగెటివ్ మీడియా ఒక్కసారిగా బోరున విలపిస్తాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వైజాగ్కు మారుస్తా న్నామంటే చాలు, ఇక్కడ భూముల కబ్జాచే యడానికి వస్తున్నారనీ, అది చేస్తున్నారనీ, ఇది చేస్తున్నారనే రక రకాల కథనాలు ప్రచురి స్తున్నారు, ప్రసారంచేస్తున్నారు.
సిగ్గులేకుండా ఇలాంటి రాతలు రాస్తున్నారు. సిగ్గులేకుండా చూపిస్తున్నారు.కోర్టులకువెళ్తున్నా రు. కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వాళ్లు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి విశాఖపట్నం రాకూడదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇక్కడకు వస్తే,ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పురోగతి సాధిస్తుంది. అందుకే సీఎం ఇక్కడకు రాకూ దని అనుకుంటున్నాకు. దీనివెనుక మరోచోట వారికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. బినామీల పేర్లతో భూములు కొన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూ టివ్ క్యాపిటల్ అనగానే ఈ భూముల కొన్న వారంతా అక్కడ వారి భూముల రేట్లు తదు పరి పడిపోతాయని ఒక్కసారిగా భీతిల్లి పోయారు. వారి స్వప్రయోజనాల కారణంగా వైజాగ్ సందిగ్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది.నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. మార్పులు అనేవి అనివార్యం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులతో పోటీపడాలంటే వైజాగ్ అనేది ఎకనామిక్ ఇంజిన్-ఆర్థిక చోద కశక్తి కావాల్సిందే. నాకేమైనా స్వప్రయోజనం ఉంటే నేను కడప గురించి మాట్లాడేవాడిని. రాష్ట్రం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదీ అనేది నా అభిప్రాయం.భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది,మన పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది,ఏం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి, దేని వల్ల ఆర్థికంగా పురోగమిస్తాం, అనేరకంగా మనం ఆలోచన చేయకపోతే,ఈ కోణంలో మనం వైజాగ్ను మనం ఆలోచించలేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అన్నది మనం అంతా ప్రశ్నిం చుకోవాలి.
నాయకుడి దార్శినికత తప్పు అయితే…
నాయకుడి దార్శినికత నెగెటివ్ అయితే… వైజాగ్ వృద్ధిచెందదు,విస్తరించదు.దురదృష్టవ శాత్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పట్నం కోసం ఎవరైనా నిలబడ్డారంటే..అది నేను మాత్రమే. ఇది వాస్తవం. విశాఖపట్నం కోసం ప్రతిపక్షాలతోనూ, స్వప్రయోజనాలున్న మీడియాతోనూ పోరాడుతున్నాం. వారిలో ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధాని కాకూడదని కోరుకుం టున్నారనేది వాస్తవం.వైజాగ్ తప్పనిసరిగా అభివృద్ధి చెందాలి. ఒకవైపు కోర్టు కేసులు నడుస్తున్నాయి, మరోవైపు విశాఖపట్నాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటాను.నా ప్రమాణస్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుంది.వైజాగ్ పట్ల నాకు న్న కృతనిశ్చయం ఇది.
విశాఖ అభివృద్ధికోసం పదేళ్ల విజన్‌ఇది.
మనం ఈ నగరాన్ని ఓన్ చేసుకోవాలి. కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దాలి. దీనికోసం సాకారమయ్యేలా, వాస్తవ రూపంలో ప్రతింబింబించేలా వైజాగ్ కోసం మార్గదర్శక ప్రణాళిక రూందించాం.పెద్దగా కలలు కని, ఆచరణలో మాత్రం ఏమీ సాధ్యంకానట్టుగా కాకుండా వాస్తవిక దృక్పథంతో,అనుకున్నవన్నీ సాకారమయ్యేలా ఈ విజన్ను రూపొందిం చాం.పదేళ్లకాలంలో ఇవన్నీకూడా వాస్తవ రూపం దాలుస్తాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వ మే కాకుండా కేంద్ర ప్రభుత్వం,పీపీపీ పద్ధతు ల్లో, ప్రయివేటు రంగం వీరందరూ కూడా ఈ విజన్ సాకారంలో భాగస్వాములు అవుతారు. పదేళ్లకాలంలో హైదరాబాద్,బెంగుళూరు, చెన్నై నగరాలకు పోటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేలా ఈ విజన్ ఉంటుంది.రాజధానిగా అమరావతి ఆలోచనను నేను ఎందుకు వ్యతిరేకించాలి? అలాంటి వ్యతిరేకత కూడా నాకేమీ లేదు. పైగా శాసన రాజధానిగా అమరావతిని ప్రటించిందీ, నిర్ణయించిందీ నేనే. కర్నూలును కూడా న్యాయరాజధానిగా ప్రకటించిందీ నేనే. నాకేం ఎలాంటి వ్యతిరే కతా లేదు. కాని వాస్తవం ఏంటంటే.., అమ రావతి అనేది 50వేలఎకరాల వర్జిన్ ల్యాండు, ఖాళీ భూమి. రోడ్లు,నీళ్లు,విద్యుత్ లాంటి కనీస సదుపాయాలు కల్పించడానికి మాత్రమే వాళ్లు ఇచ్చిన డీపీఆర్ ప్రకారమే ఎకరాకురూ.2కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతి ప్రాంతంలో భవనాలు రావాలంటే దానికి ముందు కనీ సంగా రూ.1లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది.ఇవాళ మనం ఒకలక్ష కోట్లు అనుకుంటే..20 ఏళ్లలో ఏటా రూ.5వేల కోట్లు చొప్పున వేసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లో, అది చివరకు ఖర్చులు పెరిగీ, పెరిగీ ఏరూ.15లక్షల కోట్లో అయినా అవు తుంది. అందుకనే అమరావతి ఆలోచనకు నేను వ్యతిరేకం కాదు, కాకపోతే అక్కడ అది చేయలేం అంటున్నాం.
కాని వైజాగ్ విషయానికొస్తే.. కనీస మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. మంచి రోడ్లు, కరెంటు,తాగునీటి సదుపాయం.. ఇలా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కొన్ని మెరుగులు దిద్దితే సరిపోతుంది. వీటితో సిటీ రూపురేఖలు గణనీయంగా మారుతాయి. కార్యనిర్వాహక రాజధానిగా ఇక్కడకు మారే సమయంలో ఉద్యోగులు పనిచేసుకునేందుకు ఐకానిక్ సెక్రటేరియట్ ఒకటి ఉండాలి. ఇది దేశం దృష్టిని ఆకర్షించాలి.అలాగే దేశం అంతా ఇటు చూసేలా ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్,అలాగే అహ్మదాబాద్ తరహాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉండాలి. మ్యాచ్లు జరిగేటప్పుడు దేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తంకూడా మాట్లాడుకోవాలి. ఇవన్నీవస్తే ప్రపంచంలో వైజాగ్ స్ధాయి పెరుగుతుంది.దేశం మొత్తమే కాదు, ప్రపం చం మొత్తం సంభ్రమాశ్చర్యంతో చూస్తుంది. ప్రపంచ ఆధునిక సాంకేతిక రంగంలో అంశా లను బోధించేలా ఎమర్జింగ్ టెక్నాలజీ యూని వర్శిటీ ఒకటి రావాల్సి ఉంది. ఎమర్జింగ్ టెక్నాలజీలో మన విద్యార్థులకు ఇది చక్కటి వేదిక కావాలి. అలాగే భోగాపురం ఎయి ర్పోర్టు నిర్మాణం శరవేంగా సాగుతోంది.15-18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా వేగంగా పనిచేస్తున్నారు.భోగాపురం ఎయిర్ పోర్టును అనుసంధానించేలా ఆరు లేన్లతో అందమైన బీచ్ కారిడార్ రోడ్డు ప్రాజెక్టు కూడా రావాల్సి ఉంది.అలాగే మెట్రో రైల్ ప్రాజెక్ట్,ఏడాది కాలంలోగా ప్రారంభమయ్యే మూలపేట పోర్టు.దీంతో మొత్తం హారిజాంటల్ గ్రోత్ కారిడార్ ఏర్పడుతుంది. అలాగే డేటా సెంటర్, సబ్మెరైన్ కేబుల్ రూపంలో పెద్ద పెట్టుబడులు అదానీ పెడుతుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ చేశాం. వచ్చే 5-6 ఏళ్లలో విడతల వారీగా ఈప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆతిథ్య రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఓబరాయ్, మై ఫెయి ర్ కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. బెస్ట్ ఫైవ్ స్టార్ సదుపాయాలు రాబోతున్నాయి. అలాగే ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ రూపంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు రాబోతు న్నాయి. ప్రధానమంత్రి నిన్ననే దీనికి శంకు స్థాపన చేశారు. ఇవన్నీ కూడా సాధ్యం కానివి కాదు. ఇవన్నీకూడా వాస్తవరూపంలోకి వచ్చేవే. వచ్చే పదేళ్లలో ఇవన్నీ రాబో తున్నాయి. ఇవేమీ ఊహించలేనివి కూడా కాదు. ఇవన్నీకూడా సాకారమయ్యేవే. అలాగే హైస్పీడ్ రైలు కారిడార్లపై కూడా ప్రధాన మంత్రితో మాట్లాడుతున్నాం. హైదరాబాద్-వైజాగ్,విజయవాడ-బెంగళూరుల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లకోసం సంప్రదిస్తున్నాం. ఇవన్నీరావమే కాకుండా, సీఎంకూడా ఇక్కడకు వస్తే పదేళ్లకాలంలో వైజాగ్ ప్రపంచంలోని, దేశంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతుంది. ఇన్ని అడ్డంకులు ఉన్నా, అవరో ధాలు ఉన్నా విశాఖ నగర వాసులకు నేను ఒక్కటే చెప్తున్నాను.మనం తప్పక విజయం సాధిస్తాం.విశాఖపట్టణంలోని వి-కన్వెన్షన్ హాలులో జరిగిన భవిత కార్యక్రమంలో భాగంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొంది ప్రయివేటు రంగాల్లో ఉపాధి పొందిన యువత తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. విద్యా దీవెన,వసతి దీవెనల సాయంతోనే చదువుకున్నాం ః దీపిక,గ్రాడ్యు యేట్ ఇంజినీర్ ట్క్రెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ,చెన్నై. మాది విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను.మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మగృహిణి.నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకు న్నాం.నేను నా గ్రాడ్యు యేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను.సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎంపికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యు యేట్ ఇంజినీర్ ట్క్రెనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్లో అనేక మంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి,ఏపీ ప్రభుత్వా నికి, స్కిల్ డెవల ప్మెంట్కు, సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు.నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేశాను. అప్పుడు ఏపీ ఎస్‌ఎస్డీసీ స్కిల్ ట్క్రెనింగ్ ప్రోగ్రామ్ లో 45రో జులు శిక్షణ తీసుకు న్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకు న్నాను.మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూ నికేషన్ స్కిల్స్ నేర్పారు. -జిఎన్‌వి సతీష్