వాయు కాలుష్యంలో ఢల్లీి..ప్రమాద అంచన జనజీవనం
దేశ రాజధాని ఢల్లీిలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది.దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది.దేశంలో అత్యంత ప్రముఖలుండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదు.ఈఏడాది మళ్లీ కొరలు చాస్తోంది.వాయు నాణ్యత సూచీలో ఇది 422గా సూచిస్తోంది.కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపరితీసుకోలేకపోతున్నారు.కాలుష్యం దెబ్బకు విద్యాసంస్థలను మూసివేయాల్సి వచ్చింది.విమానాలకు అంతరాయం కలుగుతోంది.సాధారణ జన జీవనం ప్రభావితం అవుతోంది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు.
దేశ రాజధాని ఢల్లీి నగరం కాలుష్య రాజధానిగా కూడా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢల్లీితో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్.సి.ఆర్)అంతా వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర రీతిలో పెరుగుతోంది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎ.క్యు.ఐ)వరుసగా మూడు రోజుల పాటు 500మార్కును దాటడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. నిపుణులు ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా దీనిని అభివర్ణిస్తున్నారు.కొద్ది రోజుల నుండే దేశ రాజధానిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. జెఎన్‌యు ఆన్‌లైన్‌బాట పట్టింది. అనేక ప్రైవేటు సంస్థలు ఇప్పటికే వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమ లు చేస్తుండగా,తాజాగా ఢల్లీి ప్రభుత్వం సైతం 50శాతం ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని ఆదేశించింది.పెద్ద సంఖ్యలో ప్రజానీకం రోగాల బారిన పడటం,రోడ్లన్నీ పొగతోనిండి ఊపిరాడని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర పనులుంటేనే ప్రజలురోడ్ల మీదకు రావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.ఇళ్ల దగ్గర కూడా కిటికీలు మూసి ఉంచాలని, నాణ్యమైన ఎయిర్ ప్యూరిఫయర్లు వాడుకోవాలని సూచించింది.వీటన్నింటిని పాటించడం ఎందరికి సాధ్యమవుతుందన్న సంగతి అటుంచితే పరిస్థితి తీవ్రతకు నిదర్శనాలుగా భావించవచ్చు.ఈస్థాయి విపత్తును కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండటం, ఆప్ సర్కారుకు సహాయ నిరాకరణ చేస్తుండటం మోడీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.వర్షాలు కురిస్తే కాలుష్యం అదుపులోకి వచ్చే అవకాశం ఉండటంతో మేఘ మథనానికి అనుమతి ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం! రెండు సంవత్సరాల క్రితం ఇటువంటి పరిస్థితే నెలకొన్నప్పుడు వాయుకాలుష్యాన్ని రాజకీయ పోరుగా మార్చవద్దని సర్వోన్నత న్యాయ స్థానం సూచించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరం. వాయు కాలు ష్యంతో ఢల్లీి ప్రజానీకం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు జోక్యం చేసుకుంది.అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో పంజాబ్,హర్యానాతో పాటు ఢల్లీి పరిసరాల్లో ఉన్న అనేక రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబట్టే సంఘటనలు గత రెండు సంవత్సరాల్లో కొంత మేర తగ్గిన్నట్లు చెబుతున్నారు.అయినా కాలుష్యం తగ్గకపోగా, మరింతగా పెరుగుతోంది. దీంతో ఇతర కారణా లనూ అధికార యంత్రాంగం అన్వేషిస్తోంది.ఉదాహరణకు ఈ నెల 12వ తేది ఒక్కరోజే ఢల్లీి నగరంలో 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగినట్లు, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చినట్లు అధికారులు గుర్తించారు. వ్యక్తిగత వాహనాల వినియోగం సాధ్యమైనంత మేర తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సి.ఎస్.ఇ) అక్టోబర్‌లో చేసిన అధ్యయనం ప్రకారం ఢల్లీి స్థానిక వాయు కాలుష్యంలో రవాణా రంగ వాటా సగానికి పైగా ఉందని తేలింది. 2021లో విడుదలైన ఒకనివేదిక ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతంలో కాలుష్యానికి పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం కూడా ప్రధాన కారణాలే! 30శాతం ఢల్లీి నగరంలో నగర పాలక సంస్థ సేవలు అందకపోవ డంతో స్థానిక ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ తగల బెడుతున్నారు. ఈ పరిస్థితులే ఢల్లీిని కాలుష్య రాజధానిగా మారుస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ రెండు సంవత్సరాల క్రితం రూపొందించిన నివేదికలో కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢల్లీి ప్రజానీకం తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారంటూ హెచ్చరించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పులు రాలేదు. సమిష్టి చర్యల ద్వారానే కాలుష్య నియంత్రణ సాధ్యమవు తుందన్న అంశాన్ని కేంద్రం గుర్తించాలి. ఢల్లీి ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి.ఇప్పుడు కూడా ఈదిశలో కదల కపోతే, భవిష్యత్తులో చేయడానికి ఏమీ మిగలని పరిస్థితి ఏర్పడుతుంది.
గాలి కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారు? ఏక్యూఐ ఏ స్థాయికి పెరిగితే మనుషులకు ప్రమాదకరం?
విషపూరితమైన గాలి,పొగ కమ్మేసి,ఏమీ కనిపించని పరిస్థి తులతో దేశ రాజధాని దిల్లీతో పాటు చుట్టుపక్కల నగరా ల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం,సురక్షిత స్థాయిగా భావిం చే గాలి నాణ్యత (ఏక్యూఐ)కన్నా దిల్లీ,చుట్టుపక్కల ప్రాం తాల్లో 30నుంచి35రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంది. నాసా అంతరిక్షం నుంచి తీసినశాటిలైట్ చిత్రాల్లో ఉత్త ర భారతదేశంతో పాటు పాకిస్తాన్‌ను కూడా దట్టమైన పొగ కమ్మేసినట్టు కనిపిస్తోంది.దట్టమైన పొగతో విమా నాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.కొన్ని విమానాలు రద్దవుతున్నాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)మానిటరింగ్ గ్రూప్ లెక్కల ప్రకారం, 2023లో ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన రాజధాని దిల్లీ.అత్యంత కాలుష్యపూరితమైన దేశాల జాబి తాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు స్థానాల్లో బంగ్లాదేశ్,పాకిస్థాన్ ఉన్నాయి.
ఏటా భారత్‌లో అక్టోబరు నుంచి జనవరి వరకు శీతాకాలంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతుంది.ఉష్ణో గ్రతలు పడిపోవడం,పొగ,దుమ్ము,చల్లని గాలులు, వాహ నాల నుంచి వచ్చే వ్యర్థాలు,చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంవల్ల వచ్చే పొగ కలిసి ఈ పరిస్థి తిని సృష్టిస్తాయి.భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ జనా భాలో 99శాతం మంది నాణ్యత లేని గాలిని పీల్చుక ున్నారు. పేద, వెనకబడిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
గాలి కాలుష్యం ఎలా లెక్కిస్తారు?
మనుషులు చేసే పనుల వల్ల కొంతమేర గాలి కలుషిత మవుతోంది.వాహనాలకు ఉపయోగించే ఇంధనం, వంట నుంచి వచ్చే ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఇక ధూళి తుపాను, కార్చిచ్చులు, అగ్నిపర్వతాలు పేలడం వంటివి గాలి కాలుష్యానికి ప్రకృతి పరమైన కారణాలు. కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి ఎయిర్ క్వాలిటీ మానిటర్లు సెన్సర్లను ఉపయోగిస్తాయని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ తెలిపింది.గాలి కాలుష్యం తీవ్రతను గుర్తించడానికి కొందరు లేజర్లను ఉపయోగిస్తే, మరికొందరు భూమి నుంచి విడుదలయ్యే శక్తిని అంచ నావేయడానికి శాటిలైట్ చిత్రాలపై ఆధారపడతారు. మనుషుల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాలలో పీఎం 2.5, పీఎం 10,ఓజోనో, నైట్రోజన్ ఆక్సైడ్,సల్ఫర్ డయాక్సైడ్ వంటివి ఉన్నాయి. పీఎం 2.5లో 2.5మైక్రోమీటర్లు అంతకన్నా తక్కువ మందమైన సూక్ష్మ రేణువులు ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.ఈసూక్ష్మ రేణువులు మన రక్తనాళా ల్లోకి ప్రవేశించి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగి స్తాయి.గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) స్కేల్ సున్నా స్థాయి నుంచి 500 వరకు ఉంటుంది. ఏక్యూఐ సున్నా ఉంటే గాలిలో ఎలాంటి కాలుష్యం లేదని అర్థం. 500 ఉంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. గాలి నాణ్యతకు సంబంధించిన సంక్లిష్ట సమాచారాన్ని, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోగ లిగే సమాచారంగా మార్చే కమ్యూనికేషన్ సాధ నం ఏక్యూఐ అని ఐక్యూఎయిర్ సంస్థ ప్రతినిధి అర్మన్ అరరా డియన్ చెప్పారు.
కచ్చితత్వం ఉందా?
ప్రభుత్వ కేంద్రాలు, ఇతర మార్గాలు, శాటిలైట్ మానిటర్ల నుంచి వచ్చే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సమాచారాన్ని సమ్మిళితం చేసి కాలుష్యాన్ని లెక్కిస్తారని యూఎన్‌ఈపీ తెలిపింది.వాస్తవ పరిస్థితులు, కాలుష్య కారకం ఆధారంగా ఎయిర్ క్వాలిటీ ఇండె క్స్ రీడిరగ్స్ ఉంటాయి.2001లో యూఎన్ ఈపీ,ఐక్యూఎయిర్ కలిసి తొలి రియల్ టైమ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్‌పోజర్ క్యాలి క్యులేటర్‌ను ప్రారంభించాయి.ఇది117 దేశాలకు చెందిన6,475మానిటర్ల నుంచి వచ్చే రీడిరగ్‌లను ఒకేసారి లెక్కిం చగలదు. ‘పీఎం2.5స్థాయి పెరిగేకొద్దీ వృద్ధులు, పిల్లలు,శ్వాస,గుండెసంబంధమైన సమస్య లున్నవారిపై మొదట ప్రభావం పడుతుంది’’ అని అరరాడియన్ చెప్పారు.‘‘పీఎం2.5 రేణువులస్థాయి ఇంకా పెరిగే కొద్దీ జనాభా లో ఎక్కువమంది ఆరో గ్యంపై నాణ్యతలేని గాలి ప్రభావం పడు తుంది.పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్య లకు గురయ్యే ప్రమాదముంది’’అని ఆయన చెప్పారు. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాల నుంచి తీసు కున్న లెక్కల ఆధారంగా ఏక్యూఐఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బిజీరోడ్లు, పారిశ్రామిక జోన్‌ల వంటి ప్రాం తాల్లో గాలికాలుష్యం భిన్నంగాఉం టుంది. బిజీగాఉన్న ప్రాం తాల్లో గాలి కాలుష్యం స్థాయిని లెక్కిం చడా నికి నగరమంతా విస్తృత నెట్‌వర్క్ ఉన్న మానిట రింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయా లని అరరాడి యన్ సూచించారు.
ఏ స్థాయి కాలుష్యం మనుషులకు ప్రమాదకరం?
డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏఐక్యూ) వంద లోపు ఉంటే..ఆగాలి మనిషికి సురక్షితమై నది. ఏఐక్యూ 400నుంచి 500ఉంటే గాలి లో కాలుష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు.ఈ వారంలో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 500కు చేరింది. నోయిడా, గురు గ్రామ్ వంటి ప్రాంతాల్లో కూడా ఏక్యూఐ లెవల్స్ 500కి దగ్గరలో ఉన్నాయి. 2021 లో యూఎన్ ఈపీ రిపోర్ట్ ప్రకారం,గాలి నాణ్యత పర్యవేక్షణ ప్రపంచంలోని 37శాతం దేశాల్లో చట్టపరమైన అంశం లా లేదు.అనేక పద్ధతుల్లో గాలి నాణ్యత లెక్కించ డంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాలి కాలుష్యాన్ని గుర్తించడం ప్రభు త్వాల బాధ్యతగా మారేలా చట్టపరంగా చర్య లు తీసుకోవాలని,సమాచారంలో కచ్చిత త్వాన్ని పెంచడానికి మౌలిక సదుపాల యాలు కల్పించాలని యూఎన్‌ఈపీ తెలి పింది.
గాలి కాలుష్యం వల్ల ఎలాంటి జబ్బులొస్తాయి?
సూక్ష్మకణాలు,ఇతర కాలుష్య కారకాలు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయని, రోగనిరోధక వ్యవస్థను బలహీ నం చేస్తాయని,రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తా యని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పిల్లలు, వృద్ధులు, పోషకా హార లోపం,సౌకర్యాల లేమితో బాధపడే పేదల్లో శ్వాస కోస సమస్యలు,గుండె సంబంధిత రోగాలు,గుండెపోటు, లంగ్ క్యాన్సర్ వంటివి వస్తాయని ఆయన తెలిపారు.ఉదాహ రణకు ఆస్తమాపై ఓజోన్,సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రో జన్ డై ఆక్సైడ్ వంటివి ఊపిరి తిత్తుల వాపు, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి వాటికి కారణమవు తాయి.గర్భస్థ శిశువుల ఆరో గ్యంపైనా నాణ్యత లేని గాలి ప్రభావం ఉంటుందని, కొన్నిసార్లు చనిపోయిన పిల్లలు పుడతారని, అబార్షన్లు జరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.గాలి కాలుష్యం ప్రభావంతో ప్రపం చవ్యాప్తంగా ఏటా70లక్షల మందితమ ఆయు ర్దాయం కన్నా ముందే చనిపోతు న్నారని డబ్ల్యూ హెచ్‌ఓ తెలిపింది. అందులో దాదాపు 85 శాతం మంది గుండె సంబంధిత వ్యాధు లు,గుండెపోటు,ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా,సీఓపీడీ,డయాబెటిస్,వంటి కారణా లతో మర ణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలి పింది. పొగా కు తర్వాత ఎక్కువ మరణాలకు కారణ మవు తోంది గాలి కాలుష్యమని, బహి రంగ ప్రదే శాల్లో గాలి కాలుష్యంవల్ల ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో 90శాతం పేద,అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారని తెలిపింది.ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్లాట్ ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో దిల్లీ,చుట్ట పక్కల నగరాల్లో 81శాతం కుటుం బాల్లో ఎవరో ఒకరు గడిచిన మూడు వారాల నుంచి కాలుష్యంవల్ల అనారోగ్యంతో బాధ పడుతున్నారు.