వాక్సిన్‌పై అవగాహన
కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే,వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు, సందేహాలు రాజ్యమేలుతున్నాయి. కొంత మంది ఫేక్ప్రచారం వల్ల ప్రజలు వాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దేశంలో కరోనా కట్టడికి, ప్రభుత్వ లక్ష్యానికి ఇది అడ్డంకిగా మారింది. అందువల్ల, గ్రామీణ ప్రాంతప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. తాజాగా,తమిళనాడుకు చెందిన ఒకయువకుడు తన గ్రామప్రజలకు వాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు నడుం బిగించాడు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒక బహుమతి ఇస్తూ, ఎక్కువ మంది ప్రజలు టీకాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాడు. కల్లకూరిచి జిల్లాలోని ఉలుందూర్పేట గ్రామానికి చెందిన ఆర్. తంబిదురై అనే స్టూడియో ఫోటోగ్రాఫర్,సామాజిక కార్యకర్త ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు తన గ్రామానికి రాగా.. ప్రజల్లో అవగాహన లేక ఎవరూ వాక్సిన్? తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీన్ని గ్రహించిన తంబిదురై తన గ్రామ ప్రజలను వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రోత్సహించాలనుకున్నాడు. వెంటనే తంబిదురైకి ఒక ఆలోచన వచ్చింది. ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఫ్రీగిఫ్ట్ స్కీమ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఫ్రీ గిఫ్ట్‌లు కొనుగోలు చేసేందుకు తన సొంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఆయన తీసుకున్న చొరవ ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది.
ఈకార్యక్రమంపై తంబిదురై మాట్లాడుతూ‘‘కోవిడ్-19సెకండ్ వేవ్ విజృంభనతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మా గ్రామానికి సమీపంలో టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కానీ గ్రామస్థుల్లో అవగాహన లేకపోవడం వల్ల వాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు నా సొంత ఖర్చులతో బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. టీకాలు తీసుకున్న వారికి వంట పాత్రలు వంటి బహుమతులను అందజేస్తున్నా. దీనివల్ల ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్? తీసుకునేందుకు ముందుకొస్తున్నారు’’ అని అన్నాడు. ఫ్రీగిఫ్ట్‌లు అందజేస్తుండటంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు టీకా తీసుకొని నా నుండి బహుమతి వస్తువులను అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశాడు.
యువకున్ని ప్రశంసిస్తున్న గ్రామస్థులు..
కాగా,మొదటి రోజుటీకా తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అయితే, రెండో రోజు మాత్రం తంబిదురై చొరవతో 94మందికి టీకాలు తీసుకునేందుకు ముందుకొచ్చారు.తంబిదురై అవిశ్రాంతంగా పనిచేస్తున్నందున గ్రామస్థులు,వైద్యులు, ప్రంట్ లైన్ వారియర్స్, స్వచ్చంద సంస్థలు ఆయన్ను ప్రశంసించారు.కోవిడ్-19పై పోరాటంలో యువతది చాలా కీలక పాత్ర. ప్రజల్లో ఉన్న అపోహలు,అనుమానాలు తొలగించి వారిని వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రోత్సహించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.-రెబ్బాప్రగడ రవి