వలస కార్మికుల కోసం సామాజిక వంటశాలలు
‘‘ వలస కార్మికులకు తిండిగింజలు సరఫరా చేయ డానికి అవసరమైన పథకాన్ని రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేయాలి. రాష్ట్రప్రభుత్వాలు తమ సొంత పథకాలను జూలై31లోపు మొదలు పెట్టి కరోనా కొనసాగినంత కాలం అమలు చేయాలి. ఒకే దేశం ఒకే రేషన్ పథకాన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు జూలై31లోపు దాన్ని అమల్లోకి తీసుకు రావాలి అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. వలసకార్మికులకు రెండుపూటల తిండి కోసం కార్మి కులు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ సామూహిక వంటశాలలు కొన సాగించాలని జస్టీస్ అశోక్ భూషణ్,జస్టీస్ ఎం.ఆర్. షాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేసి అందు లో దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు, వలసకూలీల వివరాల నమోదు ప్రక్రియను జూలై31 లోపు మొదలు పెట్టాలని ఆదేశించింది. కార్మికుల వివరాల నమోదు కోసం నేషనల్ డెటాబేస్ పోర్టల్ ఏర్పాటు చేయడంలో కేంద్ర కార్మికశాఖ చేసిన జాప్యాన్ని సుఫ్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కార్మికులు ప్రభుత్వాల నుంచి వివిధసంక్షేమ పథకాలు అందు కోవడం కోసం వేచిచూస్తున్న తరుణంలో కేంద్ర కార్మికశాఖ ఉదాసీనంగా,నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం క్షమార్హం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం . ఇప్పటికైనా పోర్టల్‌ను తక్షణం ఏర్పాటు చేసి అమల్లో కి తీసుకురావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. అసం ఘటితరంగ కార్మికులు,వలసకూలీల వివ రాల నమో దుకు కేంద్రప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటి క్స్ సెంటర్‌తో కలసి ఒక పోర్టల్‌ను రూపొందించాలి. ఇదే సమ యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘ టిత రంగ కార్మికుల వివరాలను నేషనల్ డేటాబేస్‌లో నమోదు చేసే ప్రక్రియను జూలై31లోపు మొదలు పెట్టి డిసెంబరు31నాటికి పూర్తిచేయాలి’ అని సుప్రీంకోర్టు తెలిపింది.“
రేషన్ కార్డు లేదన్న సాకుతో ఏ ఒక్క వలస కార్మికునికి అందునా ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో రేషన్ నిరాకరించడం ఎంతమాత్రమూ తగదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని సుప్రీం కోర్టు జూన్ 29న ఒక తీర్పులో ఘాటుగా హెచ్చరించింది.‘‘వలస కార్మికుల్లో ఎక్కువ మంది పేదరికంతో చదువుకు దూరమైనవారే.వారి వద్ద ఏ విధమైన కార్డులు ఉండవు.అంతమాత్రం చేత వారికి ఈకరోనా సమయంలో రేషన్‌ను ప్రభు త్వం ఎలా నిరాకరిస్తుంది.వీరిలో చాలామందికి ఎలాంటి స్థిరమైన ఉపాధి ఉండదు. అయినా కనీస అవసరాలు తీరితే చాలు అనుకుంటారు వీరు’’ అని జస్టిస్ అశోక్ భూషణ్,జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన ధర్మాసనం తమ 80పేజీలతీర్పులో పేర్కొం ది. దేశ జనాభాలో నాలుగింట ఒక వంతు అంటే 38కోట్లుగా వలసకార్మికులు ఉన్నారని,దేశ పురోగా భివృద్ధికి, ఆర్ధికాభివృద్దికి వలసకార్మికుల కంట్రిబ్యూ షన్ చాలా గొప్పదని అన్నారు. వలస కార్మికుల్లో ప్రతి ఒక్కరికీ రేషన్ అందేలా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని,వలసకార్మికులకు డ్రై రేషన్ ఇచ్చేందుకు అనుగుణమైన పథకాలను జూలై31 లోగా రూపొందించాలని కేంద్ర,రాష్ట్రప్రభుత్వా లకు గడవుఇచ్చింది.రెండు పూటలా భోజనం ఏఒక్క వలసకార్మికుడికి నిరాకరించకుండా చూడా లని రాష్ట్రప్రభుత్వాలను కోరింది. వలస కార్మికు లను చేరుకునేందుకు అన్నీ రాష్ట్రాలు, కేందప్రాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరింది. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన అదనపు తిండిగింజలను కేంద్రం సరఫరా చేయాలని, కరో నా కాలమంతటా కీలకమైన ప్రాంతాల్లో సామా జిక వంటశాలలను నడపాలని కోరింది. ఆహార హక్కు జీవించేందుకు తప్పనిసరి అని చెప్పింది. హుందాగా జీవించే హక్కులో ఇదోక భాగమని కోర్టు ప్రభుత్వానికి హితబోధ చేసింది. జూలై31 నుంచి ఒకదేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని అన్ని రాష్ట్రాలుపూర్తిగా అమలు చేయనున్నందున, అప్పటి లోగా వలస కార్మికులందరినీ జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ పథకంలోకి తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.
వలస కార్మికుల ఆందోళనలపై కేంద్ర కార్మిక,ఉపాధి మంత్రిత్వశాఖ ఉదాసీనవైఖరిపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస కార్మికులు డేటాను పోర్టల్‌లో ఉంచడంలో ఆలస్యం జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై31లోగా వలస కార్మికుల కోసం పోర్టల్ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ‘‘అసం ఘటిత,వలసకార్మికుల వివరాలు నమోదు చేయ డానికి కేంద్రప్రభుత్వం జూలై 31లోపు పోర్టల్‌ని అభివృద్ధి చేసి..అందుబాటులోకి తీసుకురావాలి. జూలై 31లోపు ఈ ప్రక్రియను ప్రారంభించాలి’’ అని పేర్కోంది.
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల ఉపాధిని కోల్పో యిన వలస కార్మికులకోసం దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ఆదేశాలను జారీచేసింది. కేంద్ర ప్రభు త్వం అమలు చేయదలిచిన వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకానికి సంబంధించిన ఆదేశాలు అవి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా వలస కార్మి కులకు ఉన్నచోటే చౌక దుకాణాల ద్వారా నిత్యా వసర సరుకులను అందజేయాలని సుప్రీం కోర్టు తాజాగా సూచనలు ఇచ్చింది. జులై31వతేదీ నాటికి..ఈ వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్‌భూషణ్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనికి డెడ్ లైన్ కూడా విధించింది. జులై 31వ తేదీ నాటికి ఈపథకాన్ని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితోపాటు-వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలనిసూచిం చింది.
పోర్టల్ ద్వారా నమోదు..
అసంఘటిత రంగానికి చెందిన కార్మి కులు,వసల కూలీల వివరాలను నమోదు చేయ డానికి ప్రత్యేకంగా ఓపోర్టల్‌ను రూపొందిం చాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. జులై31వతేదీ నాటికి ఈపోర్టల్‌ను అందు బాటులోకి తీసుకుని రావాలని, దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. డిమాండ్లకు అను గుణంగా..ఆహారధాన్యాలు, నిత్యావసర సరుకులను రాష్ట్రాలకు సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాంట్రాక్టర్ల వివరాలు కూడా..
జులై31వ తేదీనాటికి డ్రై రేషన్‌ను చేపట్టాలని,కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సమసిపోయేంత వరకూ దాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేయని రాష్ట్రాలు తాము విధించిన డెడ్‌లైన్ నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలని పేర్కొం ది. అంతర్రాష్ట్ర వలస కార్మికులు (రెగ్యు లేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్)-1979 కింద కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కంపెనీల వివరాలన్నింటినీ నమో దు చేయాలని సుప్రీంకోర్టురాష్ట్రాలకు సూచిం చింది.
కమ్యూనిటీ కిచెన్లు సైతం
వలసకార్మికుల సంక్షేమం కోసం కమ్మూ నిటీ కిచెన్లను అందుబాటులోకి తీసుకుని రావాలని, కరోనా సంక్షోభం ముగిసేంత వరకూ వాటిని కొనసాగించాలని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల వలస కార్మికులు ఉపాధిని కోల్పోయిన విష యం తెలిసిందే. ఫలితంగా-వారు వందలాది కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుకున్నారు.
సుమోటోగా స్వీకరణ
దీన్ని గతఏడాది మేలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టింది. తాజాగా ఈఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులకు ఉన్నచోటే ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ఇప్పటికే జాప్య మైందని న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యా నిం చింది.
ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు
ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలసకార్మికుల డాటా బేస్ నిమి త్తం జాతీయ స్థాయిలో వర్కర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశిం చింది. ‘వలసకార్మికుల సమస్యలు,కష్టాలు’పై సుమో టో కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఈ మేరకు 80పేజీల తీర్పు వెలువరించింది. ప్రతివారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు,రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటితరంగ కార్మికులకోసం జాతీయస్థాయి డేటాబేస్ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈసందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. ఈ విష యంలో కేంద్ర కార్మికశాఖ కనబరుస్తున్న ఉదాసీ నత,నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు రేషన్ సరు కుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకా లన్నీ జూలై 31కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్ నేషన్-వన్ రేషన్ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలంది.రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంట శాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగిం చాలని పేర్కొంది.వలస కార్మికు లకు రేషన్ సరఫరానిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకు రావాలి.ఆమేరకు కేంద్రం అదనపు ఆహార ధాన్యాలను రాష్ట్రా లు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగినపథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది.
దేశంలో వలస కార్మికుల తరలింపుపై ఏకీకృత విధానం అవసరమని సుప్రీంకోర్టు కేంద్రా నికి సూచించింది. వారిని వారి స్వస్థలాలకు తరలిం చే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వ యం ఉండాలని, ప్రతి కార్మికుడూక్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని కోరింది. వీరి దుస్థితిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం.. కేంద్రానికి మొత్తం 50 ప్రశ్న లను వేసింది.లాక్ డౌన్ అమల్లో ఉండగా ప్రధా నంగా వలస జీవుల తరలింపు పైనే దృష్టి పెట్టింది. వారికి షెల్టర్,ఫుడ్, వారిట్రాన్స్ పోర్టేషన్ తదిత రాలపై కేంద్రం చేపట్టిన చర్యలను వివరంగా తెలుసుకుంది. ప్రతివారినీ ఒకేసారి వారి ఇళ్లకు పంపడం సాధ్యంకాదని, కానీ వారికి రవాణా సౌకర్యం కల్పించేంతవరకు తగిన వసతి, ఆహారం సమకూర్చవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొం ది. కాగాకేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..
గతేడాది మే1న శ్రామిక్ రైళ్లను ప్రారం భించినప్పటి నుంచి ఇప్పటి వరకు 91లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించినట్టు వెల్లడిరచారు. వలస కార్మికుల అంశంపై రాజకీయ ప్రసంగాలతో కూడిన పిటిషన్లను అనుమతిం చరాదని, అలాంటి వారు కావాలంటేఅఫిడవిట్లు దాఖలు చేసుకోవాలని ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. వలస జీవులకు రైల్వే శాఖ 84లక్షల ఆహార పాకె ట్లను అందించిందని తుషార్ మెహతా తెలిపారు. ఈ సదుపాయం మరికొన్ని రోజులు కొనసాగుతుం దన్నారు. కాగా-తమ పేర్ల నమోదు లోను, టికెటింగ్ సిస్టంలోను జాప్యం జరుగు తుండ డంతో..ఇంకా వేలాది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు చట్టవిరుధ్ధంగా తిరుగుతున్న వాహనా లను ఆశ్రయి స్తున్నారు.మరికొందరు కాలి నడకనే సాగుతున్నారు. Saiman Gunaparthi