వలస కార్మికులకు సామాజిక వంటశాలలు

నేను చిన్నప్పుడు చదువుకొనే రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పేవారు. భారత దేశంవ్యవసాయరంగ దేశమని,ఇందులో80శాతం ప్రజలు గ్రామీణులు వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అనేవారు. ప్రస్తుతం వ్యవసాయరంగంపై ఆధారపడేవారు మాత్రం20శాతం మంది మాత్రమే. కరోనాతొలివేవ్‌ ఉధృతమైన 2020మార్చి,ఏప్రిల్‌ నెలల్లో,2021 ఏప్రిల్‌ నుంచిసెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న కాలంలో వలస కార్మికులు భారీ ఎత్తున తమ తమ ఊళ్లకు వెళ్లిపోవడం చూసినప్పుడు జాతీయ రాజధాని సరిహద్దుల్లో భారత రైతులు కొనసాగిస్తున్న నిలకడైన పోరాటంతో వలస కార్మికుల జీవితం ముడిపడి ఉందనిపించక మానదు. ప్రస్తుతం కోవిడ్‌19వచ్చిన తర్వాత దేశమంతా వలస కార్మికులపైనే జీవనం సాగుతోంది. ముఖ్యంగా దేశంలో అభివృద్ధి జరుగుతున్నతీరు, అది అమలవుతున్న పరిస్థితులు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలసకార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందులో పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా సరిjైున విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటులేదు.భారత్‌లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. ఈసమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస జీవుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృతస్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది.ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. దీనిమూలంగానే దేశ అత్యున్నత న్యాయస్థానం వలస కార్మికులవెతలపై జోక్యం చేసుకోవడం అనివార్యమైంది. వలస కార్మికుల ఆకలి కేకలు,కష్టాలనుదృష్టిలో ఉంచుకొని ఢల్లీికి చెందిన బంధువ్‌ ముక్తి మూర్చ అనే సంస్థ 2020లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గానే జోక్యం చేసుకొని,కేంద్రప్రభుత్వానికి 26.5.2020న మొదటసారి నోటీసులు ఇచ్చింది. తర్వాత రెండువసారి 28.5.2020న మరో నోటీస్‌ పంపింది. వీటికి స్పందించక పోవడంతో ఆఖరిగా 9.6.2020న ఎనిమిది రకాల ఆదేశాలతో ఘాటుగా మూడోవసారి నోటీసు జారీ చేసింది. వలస కార్మికుల చట్టం1979,ఇంటర్‌ స్టేట్‌ మైగ్రేషన్‌ వర్కుమెన్‌ యాక్ట్‌1997, కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ యాక్ట్‌1996,ఆర్గనైజడ్‌ వర్కుర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ యాక్ట్‌`2008 వంటి చట్టాలను పరిగణనలోకి వలసకార్మికులకు అను గుణంగా వారి సంరక్షణపై జూన్‌ 29న తీర్పు నిచ్చింది.

జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ధర్మాసనం తమ 80పేజీలతీర్పులో దేశ జనాభాలో నాలుగింట ఒక వంతు అంటే 38కోట్లుగా వలసకార్మికులు ఉన్నారని పేర్కొంది.దేశపురోగాభివృద్ధికి,ఆర్ధికాభివృద్దికి వలసకార్మికుల కంట్రిబ్యూషన్‌ చాలా గొప్పదని వెల్లడిరచింది.వలసకార్మికుల్లో ప్రతిఒక్కరికీ రేషన్‌ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని,వలసకార్మికులకు డ్రై రేషన్‌ ఇచ్చేందుకు అనుగుణమైన పథకాలను జూలై31లోగా రూపొందించాలని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు గడవుఇచ్చింది. రెండు పూటలా భోజనం ఏఒక్క వలసకార్మికుడికి నిరాకరించకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాలను కోరింది. వలసకార్మికులను చేరుకునేందుకు అన్నీ రాష్ట్రాలు, కేందప్రాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరింది.ఈవిషయంలో రాష్ట్రాలకు అవసరమైన అదనపు తిండిగింజలను కేంద్రంసరఫరా చేయాలని, కరోనా కాలమంతటా కీలకమైన ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను నడపాలని ఆదేశించింది.

అలాగే ఒకేదేశం ఒకే రేషన్‌ పథకాన్ని అమలు చేయాలి. వీటిన్నంటినీ రాష్ట్రాలు జూలై31లోపు దాన్ని అమల్లోకి తీసుకు రావాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అలాగే కేంద్రప్రభుత్వం ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేసి అందులో దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు,వలసకూలీల వివరాల నమోదు ప్రక్రియను జూలై31లోపు మొదలు పెట్టాలని ఆదేశించింది. కార్మికుల వివరాలతోపాటు 1979 చట్టం ప్రకారం వివిధవ్యాపార సంస్థలు,కాంట్రాకర్లు వివరాల సైతం నమోదుచేసి రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరింది. దీని కోసం నేషనల్‌ డెటాబేస్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అసంఘటితరంగ కార్మికులు,వలసకూలీల వివరాల నమోదుకు కేంద్రప్రభుత్వం నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌తో కలసి ఒకపోర్టల్‌ను రూపొందించాలి. ఇదే సమయంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘ టితరంగ కార్మికుల వివరాలను నేషనల్‌ డేటాబేస్‌లో నమోదుచేసే ప్రక్రియను జూలై31లోపు మొదలు పెట్టి డిసెంబరు31నాటికి పూర్తిచేయాలి’ అని సుప్రీంకోర్టు తెలిపింది. వలసకార్మికులు,అసంఘటిత రంగకార్మికుల ఆకలిని తీర్చేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు హర్షనీయం. కానీ ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఎంతవరకు ఆచరించి వారికి ప్రయోజనం కల్పిస్తాయో వేెచి చూడాలి.!- రెబ్బాప్ర‌గ‌డ ర‌వి