వణికితున్న మన్యం..విసురుతున్న చలి పంజా…!
![](https://i0.wp.com/dhimsa.net/wp-content/uploads/2024/12/6-PAGE.jpg?resize=860%2C280&ssl=1)
చలి తీవ్రత పెరగడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కురుస్తున్నది. సాయంత్రం నుంచి మొదలుకొని మరునాడు ఉదయం 8 గంటల వరకు చలివీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. చలికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య నియమాలు పాటించక పోవడంతో జబ్బుల బారినపడతారని నిపుణులు పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జబ్బులు వారిని పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. – గునపర్తి సైమన్
ఉత్తరాంధ్రలో చలిపంజా విసురుతోంది. అర్ధ రాత్రి నుంచి తెల్లవారే వరకు కురుస్తున్న మంచుకు చలిగాలులు తోడయ్యాయి.దీంతో జనం ఉదయం7 గంటల వరకు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులుచెబుతున్నారు. సాధారణంగాఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు గత వారం రోజుల నుంచి వేగంగా పడిపోతు న్నాయి.మన్యంలోపాటు మహావిశాఖలోను ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.కురి స్తున్న దట్టమైన పొగమంచుతో చలి తీవ్రత పెరగడంవల్ల మన్యం వణికిపోతుంది. ప్రధా నంగా వృద్దులు,పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవా లని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
గతంలో లేని విధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.నగరంలో గతనాలుగైదు రోజుల నుంచి కనిష్టస్థాయిలో సుమారు14 డిగ్రీలుగా నమోదువుతు న్నాయి.చలిగాలి తీవ్రత పెరిగి వణికిస్తోంది.ప్రధానంగా రాత్రిళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతుండడం గమనార్హం.రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావ నేపథ్యంలో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు.ఇక మన్యప్రాంతంలో డుంబ్రిగుడలో8.2, జీ.మాడుగులలో 8.4,అరకులోయలో 8.5,పాడేరులో 10.9,ముంచంగిపుట్టులో 10.9,గూడెం కొత్తవీధిలో 11.4,చింతపల్లిలో11.3,మినుములూరులో9, పాడేరు లో 11డిగ్రీలు నమోదైంది.
మన్యంలో దట్టమైన పొగమంచులు..
చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది.జనం ఇళ్లలో నుంచి బయటకు రావడా నికి భయపడిపోతున్నారు.చలిమంటలు వేసుకుని కాలక్షే పం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదా రుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది.చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడి పోతు న్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. మిచౌంగ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది.తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలితీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది.
ఎంత పొద్దెక్కినా సూరీడు కనిపించట్లేదు..
ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపిం చకపోగా, పాడేరు,చింతపల్లి,అరకు లోయ, డుంబ్రిగుడ, ముంచుంగిపుట్టు, హుక్కుంపేట, తదితర మన్యప్రాంతాన్ని మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతు న్నారు.రోజురోజుకూ ఉష్ణోగ్ర తలు పడిపోవ డంతో పగలైనా సరే,వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్ చెయ్యా ల్సిందే.ఇక ముంచంగిపుట్టులో చలితీవ్రతకు జనం చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది.క్రమంగా ఉష్ణోగ్ర తలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది.తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు చలితీ వ్రత కొనసాగుతోంది.ఇకసాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవు తోంది.కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.ఇక ముంచంగి పుట్టు మండల పరిధిలో గత మూడు రోజులు గా చలి తీవ్రత పెరిగింది.ఉదయం పూట పది గంటల వరకు ముంచంగిపుట్టులో మం చు తెరలు వీడడం లేదు.చలికి జనం గజగజ వణికిపోతున్నారు.సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయ పడుతున్నారు.సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమి స్తున్నాయి.ఇలా ఉండగా ఈవాతావరణ పరిస్థితులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు మంచి అనుభూతినిస్తోంది.చలిలో మంచు అందాలను తిలకిం చేందుకు మాత్రమే వారు సందర్శి స్తున్నారు.మంచు విపరీతంగా పడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు.ఫ్రధానంగా విష(వైరల్) జ్వరాలు విజృంభిస్తున్నాయి.ఆస్తమా(ఉబ్బసం)బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం విశాఖ కేజీహె చ్‌కు జ్వరాలు,ఆస్తమాతో బాధప డుతున్న రోగులు తాకిడి పెరిగింది.ఎక్కువశాతం మందికి ఓపి విభాగంలో చికిత్స చేసి పంపుతున్నామని,శ్వాస తీసుకోవడంతో ఏమైనా ఇబ్బందులుంటే ఆసుప్రతిలో చేర్చి చికిత్స అందిస్తున్నా మని ఆసుపత్రి మెడిసిన్ విభాగా ప్రొఫెసర్ డాక్టర్ వల్లూరి సత్యప్రసాద్ తెలిపారు.చలి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
పెరుగుతున్న బాధితులు..
బాధితుల్లో ఒళ్లునొప్పులు,జ్వరం,జలుబు, గొంతు నొప్పి,నోరు రుచి లేకపోవడం వంటిలక్షణాలు కనిపిస్తు న్నాయి. జ్వరం మాత్రం48గంటలోపే నియంత్ర ణలోకి వస్తోంది.ఐదురోజుల వరకు జ్వరం తగ్గకపోయినా,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. కోవిడ్ టీకాలు వేయించుకోకుంటే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.ప్రస్తుతం వస్తున్నవి విష జ్వరాలే.ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కాస్త ఆప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..` డాక్టర్.యశోధ