లౌకిక సౌభ్రాతృత్వ విలువలు తిరిగి వికసించాలి
మహాత్మాగాంధీ,నెహ్రూ,భగత్‌సింగ్,ఆజాద్ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతం త్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75ఏండ్ల కింద ప్రారం భమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్స వం. ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ జరుపుకొనే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది. మూడు వందల ఏండ్లు బ్రిటిష్ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్రం, దైన్యా లతో ప్రజలు జీవిం చారు. ఆంగ్లే యులు మన దేశాన్ని జయించడానికి, సుదీర్ఘకాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. నైతిక పతనం ఎంత సులువో, దాన్ని తిరిగి నెలకొల్పడం చాలా కష్టం. మన దేశంలో మహమ్మా రిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యాలు,ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల,వర్ణ వ్యవస్థలు,సాంఘిక దురాచారాలు,నీచ స్వార్థాలతో సింథియా,హోల్కర్లు వంటి కొందరి రాజుల,ఆర్కాట్ వంటి నవాబులు అరా చక, భోగ లాలస,వ్యక్తిగత అహంకారాల వల్ల యావత్ ఉపఖండం దాస్యంలోకి వెళ్లిపోయింది.
దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.1757ప్ల్లాసీ,ఆంగ్లో-మైసూర్ యుద్ధా లు,1800 ఆరంభంలో హిందూ సాధువులు సంప్ర దాయ ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగు బాటు (ఈ ఉద్యమం ఇతివృత్తంగా బంకించంద్ర ఛటర్జీ‘ఆనందమఠం’అనే నవల రాశారు), 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం వీటిలో భాగమే.ఈ యుద్ధాల్లో మన ప్రజలనే సైన్యంగా మలచుకొని మన డబ్బుతొనే,మన పాలకులలో కొందరి ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు ఈ దేశభక్తియుత యుద్ధా లలో విజయం సాధించారు. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి. 1900 నుం చి స్వాతంత్య్ర సమరఆకాంక్ష మళ్లీ మొగ్గ తొడి గింది. దీనికి పునాదులు వేసిన వారు సామాజిక సంస్కర్తలు,కవులు,కళాకారులు.వీరి విశేష కృషితో భారతజాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఆంగ్లే యుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండటం సిగ్గు చేటనే భావన ప్రబలింది. 1880 నుంచి గెలుపోట ములతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా, ఉప్పెనగా కొనసాగిన1905,1917,1921,19 29,1942,1947వరకు ప్రజావెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
స్వాతంత్య్ర పాలన తొలినాళ్ళలో వైజ్ఞాని కవేత్త,సోషలిస్ట్ నెహ్రూ,సామాజిక విప్లవ నేత అంబే ద్కర్‌ల నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం,రవాణా, గనులు,శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉం చారు.చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చా రు.విద్య,పాలన,ఆర్థిక విషయాల్లో వేల ఏండ్లుగా భాగస్వామ్యానికి నోచుకొనివారికి చోటుదక్కింది, వ్యవసాయ వైజ్ఞానికరంగాల్లో స్వావలంబనతో పాటు అనేక విజయాలు సొంతం చేసుకున్నాం. వేల ఏండ్లుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచి నమత మౌఢ్యం,విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజల ఐక్యతను చీల్చే రాజకీయాలు పురుడు పోసు కొని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయో ద్యమంలో కానీ,సాంఘిక విప్లవాలతో కానీ సంబం ధం లేని శక్తుల పాలనలో ప్రస్తుత జీవన ప్రామా ణికత సూచికల్లో అన్నీఅధమస్థానాలే. సాధించుకున్న అనేక హక్కులను, రాజ్యాంగ వ్యవస్థలను, రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్యవ్యవస్థ స్ఫూర్తిని కాలరాస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతం త్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే బాధ్యతను విద్యా వంతులు,ప్రజాస్వామికవాదులు తీసుకోవాలి. లౌకిక,సౌభ్రాతృత్వ విలువలను తిరిగి వికసింప జేయాలి.
లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను కాపాడుకుందాం
భయంకరమైన మత విభజనల పెరుగు దలతోపాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనా గరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు.భిన్నాభిప్రా యంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మోడీ ప్రభుత్వం ‘’ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’గా నామకరణం చేసింది. ఈ సందర్భం, దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే దృష్టిని సారించే పెద్ద ప్రచారంగా మారింది. దీని కోసం ఖాదీ, కాటన్,సిల్క్ కానటువంటి పాలిస్టర్ జెండాలను కూడా అనుమతించే విధంగా భారతదేశ జెండా కోడ్‌ను డిసెంబర్ 2021లో సవరించారు. దేశంలో అత్యంత పెద్ద పాలిస్టర్ ఉత్పత్తిదారులెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంపిక చేయబడిన సన్నిహితులు భారీ లాభాలనుపొందే అవకాశాలను ఇది సమ కూర్చుతుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేంతవరకు,ఆరెస్సెస్,బీజేపీలు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. కాషాయ జెండాపైనే వారికి విశ్వాసం. ఆరెస్సెస్‌కు భారత స్వాతంత్య్రో ద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇది చరిత్రకారులు నమోదు చేసిన, ఆనాటి బ్రిటిష్ ఇంటి లిజెన్స్ నివేదికలు ధృవీకరించిన నిజం.
మహోన్నతమైన పాత్ర
దీనికి భిన్నంగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)కి చెందిన తొమ్మిది మంది వ్యవస్థా పక పొలిట్ బ్యూరో సభ్యులందరినీ బ్రిటిష్ ప్రభు త్వం అరెస్ట్ చేసింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో సుదీర్ఘ కాలంపాటు వారంతా జైల్లోనే గడిపారు. అండమాన్‌లోని సెల్యులార్ జైల్ (కాలాపాని) వద్ద పాలరాతిపై చెక్కబడిన చాలాపేర్లు కమ్యూనిస్ట్ విప్ల వోద్యమంతో ముడిపడి ఉన్నాయి. 1947 ఆగస్ట్, 15 నాటికి కన్ననూర్ జైల్లో ఖైదీగా ఉన్న కామ్రేడ్ ఎ.కె.గోపాలన్‌జాతీయ జెండాను ఆవిష్క రించాడు. 1932 హోషియార్పూర్ కలెక్టరేట్లో యూనియన్ జెండాను కిందకులాగి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన 16 ఏళ్ల హరికిషన్ సింగ్ సూర్జిత్‌ను బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు. కమ్యూనిస్టులకు, సీపీఐ(ఎం)కు దేశ భక్తి, త్యాగనిరతి అనేవి భారతదేశ సోషలిస్టు పరివ ర్తన యొక్క విప్లవ దార్శనికతకు అంతర్భాగంగా ఉంటాయి.1920లో దాని పుట్టుక నుండే కమ్యూ నిస్ట్ పార్టీ జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడం ఆరంభించింది. 1921లో అహ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమా వేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మౌ లానా హస్రత్ మోహాని,స్వామీ కుమారానంద బ్రిటిష్ వారినుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాం డ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ దానిని గాంధీజీ అంగీకరించలేదు (‘సంపూర్ణ స్వరాజ్యం’ పిలుపు 1929లో మాత్రమే ఇచ్చారు). తరువాత 1922లో గయ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను పంచింది. ఆతర్వాత జరిగిన ఏఐసీసీ సమావేశా ల్లో కూడాఇది కొనసాగింది.జాతీయోద్యమ ఎజెం డాను ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పాత్రను పోషించారు.1940లలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూపోరాటాలు స్వాతంత్య్ర సాధనలో కీలకమైనవి.కేరళ లోని పున్నప్ర వాయలార్, బెంగా ల్ లోని తెభాగపోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీటిలో ముఖ్యమైనవి.భారతదేశంలోని భాషాపరమైన భిన్న త్వాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారిని స్వాతంత్య్ర పోరా టంతో ఐక్యంచేయడంతో,స్వతంత్ర భారత దేశంలో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది.లౌకికవాదంపట్ల కమ్యూనిస్టులకుండే అచం చలమైన నిబద్ధత, స్వాతంత్య్ర పోరాట కాలంలో చెలరేగిన మత ఘర్షణల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పి,నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్రను పోషించింది. కమ్యూనిస్టులు నేటికీ లౌకికవాదానికి అత్యంత నిబద్ధత కలిగిన సమర్థకులుగా ఉన్నారు.
చరిత్ర వక్రీకరణ
కానీ,నేడు తమను తాము స్వాతంత్య్రో ద్యమ పోరాటంలో భాగస్వాములమని తప్పుడు ప్రచారం చేసుకోవడం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలు చరిత్రను వక్రీకరించి,చరిత్రను తిరగ రాసే ప్రయ త్నం చేస్తున్నాయి. హిందూత్వ, ఆరెస్సెస్ నాయకులు స్వాతంత్య్ర సమర యోధులని చిత్రీకరిస్తూ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. ఈప్రచారంలో ఉదహరిం చబడిన వారిలో వీడీ సావర్కర్ ముందున్నాడు. హిందూ మతాచారంతో సంబంధం లేని రాజకీయ లక్ష్యాలు గల ‘హిందూత్వ’ అనే పదాన్ని 1923లో కనుగొన్నది వి.డి.సావర్కర్. ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం మహ్మదాలీ జిన్నా పోరాటానికి నాయ కత్వం వహించడానికి రెండు సంవత్సరాల ముందే సావర్కర్ ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చా డు.దానిని బ్రిటిష్ వారు ప్రోత్సహించాడు.ఆ తర్వా త విషాదకరంగా దేశ విభజన జరిగింది. బ్రిటిష్ పాలకులతో సంధి కుదిరిన తరువాత సావర్కర్, తనరాజకీయ జీవితంలో ఎక్కు వ భాగం, కాంగ్రెస్, వామపక్షాల నేతృత్వం లోని ఉద్యమాలకు వ్యతిరేకం గానే ఉన్నాడు. హిందూ మహాసభ నాయకునిగా, 1942లో జరిగిన క్విట్ ఇండియా లాంటి ఉద్య మాలలో హిందూ మహా సభ, ఆరెస్సెస్ సభ్యుల భాగస్వామ్యం లేకుండా చూశాడు. వాస్తవాలన్నిటిని మరుగునపెట్టి వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కమ్యూ నిస్టుల విషయం పక్కన పెట్టండి, ప్రభుత్వ ప్రచారా లలో జవహర్ లాల్ నెహ్రూ గురించి కూడా ఎక్కడా ప్రస్తావిం చడం లేదు.భారత రాజ్యాంగం, స్వాతంత్య్ర భారత దేశం ఒకఆధునిక లౌకిక ప్రజా స్వామిక రిపబ్లిక్‌గా రూపొందేందుకు దారి తీసిన అనేక చర్చలు, తీర్మా నాలకు దారి చూపిన వ్యక్తి నెహ్రూ. ఈ విషయాన్ని మరుగుపరిచి బీజేపీ తన ఫాసిస్ట్ హిందూత్వ రాజ్యం ఆలోచనను నిజం చేసే చర్యలను ముందుకు తీసు కొనిపోతోంది.
భారత రాజ్యాంగంపై దాడి
ఈఫాసిస్ట్ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, మన రాజ్యాంగం కల్పించిన భారత రిపబ్లిక్ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణం పైన దాడి చేసి, బలహీనపరచి, నాశనం చేయాల్సి ఉంది. తదనుగుణంగానే 2019లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుండి…మన రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాలు తీవ్రమైన దాడికి గురవు తున్నాయి. చర్చలులేని తీరుతో పార్లమెంట్ సాంప్ర దాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఏ విధమైన చర్చలు లేకుండానే కేవలం మంద బలంతో చట్టా లను ఆమోదింపజేసు కుంటున్నారు. ప్రస్తుత పార్ల మెంట్ సమావేశాల్లో, ఆకాశాన్నంటే ధరలు, పెరిగి పోతున్న నిరుద్యోగం లాంటి ప్రజలెదుర్కొం టున్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన నేరా నికి గతంలో ఏనాడూలేని విధంగా27మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పని చేయని పార్ల మెంట్ చాలా ప్రమాదకరం.అంటే భారత రాజ్యాం గం యొక్క ప్రాముఖ్యత, ప్రజల సార్వభౌ మత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఎంపీల అధికారం, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం లేకుండాపోవడం.పార్లమెంట్‌ను బలహీనపర్చ డమంటే, ప్రజల సార్వభౌమత్వాన్ని రద్దు చేయడం, ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకొని, ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వం వైపు వెళ్లడం.దాదాపు మూడేళ్లుగా ఆర్టికల్ 370,ఆర్టికల్ 35ఏ రద్దు సవాళ్లు, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం),రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికలబాండ్లు మనరాజ్యాంగాన్ని ఉల్లం ఘించే అంశాలుగా మారాయి. ఇవేవీ సుప్రీం కోర్టుకు వినిపించవు. న్యాయ వ్యవస్థ యొక్క నిష్పా క్షికత,స్వతంత్రత తీవ్రంగా రాజీ పడినప్పుడు, రాజ్యాంగ నిబంధనల అమలు,ప్రజాస్వామిక హక్కు ల హామీలు,పౌర హక్కులపై విచారణ ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది.అదేవిధంగా,ఒక ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ, స్వేచ్ఛాయుత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిష న్ స్వతంత్రత, నిష్పాక్షికత చాలా ముఖ్యమైనవి. ఇది రాజీ పడినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకే మాత్రం ప్రజల తీర్పును, ప్రజాస్వామిక అభిప్రాయా లను ప్రతిబింబించవు. సీబీఐ,ఇ.డిమోడీ ప్రభుత్వ రాజ కీయ ఎజెండాను అమలు చేయడానికి సాధనా లుగా మారిన తీరును దేశమంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచడం,ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన ప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడానికి గల హామీకై పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దానిని నాశనం చేస్తున్నారు.
తీవ్రమైన మత విభజనలు
ఇలా భారీగా రాజ్యాంగ క్రమాన్ని నాశ నం చేయడంతో పాటు భారతరిపబ్లిక్ లౌకిక ప్రజా స్వామిక లక్షణాన్ని నాశనం చేయడానికి విషపూరిత మైనద్వేషం,భయాల వ్యాప్తిపై ఆధారపడి క్రూరమైన రీతిలో మత విభజనల ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ‘బుల్డోజర్ రాజకీయాల’ వ్యూహ రచన, కొన్ని రాష్ట్రాల్లో హింసకు దారితీసే రీతిలో మైనా రిటీలను లక్ష్యంగా చేసుకోవడం, పార్లమెంట్ నూతన భవనంపైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సంద ర్భంలో హిందూ మతాచారాలను ఆచరించడం లాంటి చర్యలు భారతరాజ్యాన్ని,ప్రభుత్వాన్ని హిం దూత్వతో గుర్తిస్తున్నారు కానీ భారత రాజ్యాంగంతో కాదని స్పష్టం చేస్తున్నాయి.ఇలాంటి భయంకరమైన మత విభ జనల పెరుగుదలతో పాటు గతంలోలేని విధంగా ప్రజల పౌరహక్కులు,ప్రజాస్వామిక హక్కు లపై దాడులు జరుగుతున్నాయి.తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇత రులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభి ప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.ఈ హిందూత్వ కథనం విజయవంతం కావాలంటే,ఈ ఫాసిస్ట్ ప్రాజెక్ట్ లోని సిద్ధాంతం కొనసాగడానికి భారతదేశ చరిత్రను తిరగ రాయా ల్సిన అవసరం ఉంటుంది. అందుకే విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు. వివేచనా రహిత ఆలోచనలను ప్రచారంచేస్తు న్నా రు.హేతుబద్ధత స్థానాన్ని మార్చేప్రయత్నం చేస్తు న్నారు.గుడ్డివిశ్వాసాలను ప్రచారం చేస్తూ, శాస్త్రీయ తను కాదని పురాణాలను ప్రచారం చేస్తు న్నారు. చరిత్రస్థానంలో హిందూ పురాణాలను, తత్వ శాస్త్రం స్థానంలో హిందూ ధర్మశాస్త్రాన్ని తీసు కొని రావడంద్వారా భారతదేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని నాశనం చేస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పౌష్టికాహార లోపం లాంటి రోజువారీ సమస్యలపై ప్రజా పోరా టాలను, ప్రతిఘటనలను పెంచడం ద్వారా భారత దేశం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాం గాన్ని రక్షించి, బలోపేతం చేసే బాధ్యతను తీసు కోవాలి. ప్రజా స్వామ్యం,ప్రజాస్వామిక హక్కులు,పౌర హక్కులు, లౌకికవాదాల రక్షణకై పోరాటా లను ఉధృతం చేయాలి. బలమైన ప్రజా పోరాటా లను ఉధృతం చేయడం ద్వారా సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. వామపక్ష శక్తుల ఐక్యతను సంఘటిత పరచడం, వామపక్ష ప్రజా తంత్ర శక్తుల్ని ఏకం చేయడం, హిందూత్వ మతో న్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన లౌకిక శక్తులను సిద్ధం చేయడం ద్వారానే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్ రాజ్యాంగాన్ని రక్షించు కోగలం.ఈలక్ష్యాన్ని నిజం చేసే మన దేశభక్తి తోనే ఆగస్ట్ 15న అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీ య జెండాను ఆవిష్కరించి, మనరాజ్యాంగంలోని పీఠిక పై ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోవాలి.ఈఉన్మాద పూరిత,ఫాసిస్టు ప్రయ త్నాల నుండి స్వేచ్ఛకోసం, మనలౌకిక ప్రజాస్వామికరిపబ్లిక్‌నుకాపాడు కోవడం కోసం జరిగే పోరాటాన్ని బలపరుచు కుందాం!
భయంకరమైన మత విభజనల పెరుగు దలతో పాటు గతంలో లేనివిధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు..కొంతమంది జర్నలిస్టులు,ఇతరులు అనా గరిక చట్టాలకింద జైల్లోఉన్నారు. భిన్నాబి óప్రాయం తో కూడిన ప్రతీవ్యక్తీకరణను ‘దేశద్రోహం’గానే పరిగణిస్తున్నారు.
వ్యాసకర్త : సిపిఎం ప్రధాన కార్యదర్శి (ప్రజాశక్తి సౌజన్యంతో)- (అస్నాల శ్రీనివాస్ / సీతారాం ఏచూరి)