రైతు గెలిచాడు

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. దేశంలో తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉం దన్న ప్రధాని…. వ్యవసాయ బడ్జెట్‌ ను ఐదు రెట్లు పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని వెల్లడిరచారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం.. పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం.. క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న,సన్నకారు రైతులకు మేలు చేసేం దుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు మోదీ సంచలన ప్రకటన. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ గతేడాది నవంబరు 26 నుంచి రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నవంబర్‌ 19న(శుక్రవారం) జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటిం చారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ పేర్కొ న్నారు. అయితే,కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా.. అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పూర్తిచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నవంబర్‌ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్‌ సమా వేశాల్లోనే ప్రకటన చేస్తామని తెలిపారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వెల్లడిరచారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టా మని,ఫసల్‌ బీమా యోజనను మరింత బలో పేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం..పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం..క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. అయితే రైతుల్లో ఒక వర్గం మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిం చింది. చట్టాలలో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమయ్యాం. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది’ అని పేర్కొన్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26నుంచి ఢల్లీి శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. ఏడాదిగా రోడ్లపైనే తిష్ట వేసి..అక్కడే తిండి,అక్కడే నిద్ర. కొంత మంది తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.
రైతు విజయం
కేంద్ర మూడు నూతన సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతు పోరాట ఘన విజయం. స్వాతంత్య్ర భారతాన సల్పిన ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ ఘట్టం. నల్ల చట్టాల రద్దు కోరుతూ సంవత్సర కాలంగా ఢల్లీి సరిహద్దుల్లో లక్షలాది రైతులు బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నా మొండిగా వ్యవహరించింది మోడీ సర్కారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పాశవిక నిర్బంధాలకు, కిరాతక దాడులకు ఒడిగట్టింది. రోజు రోజుకూ ఆసేతు హిమాచలం రైతు ఉద్యమం సంఘటితమవుతున్నదని గ్రహించిన మీదట ఇక తలవంచక తప్పదని భావించి స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. బిజెపి ఏమి చేసినా దాని వెనుక కచ్చితంగా రాజకీయ ప్రయోజనం ఉండి తీరుతుంది. ఏడాదిగా అప్రతిహతంగా సాగిస్తున్న రైతు ఆందోళనను చిన్న చూపు చూసిన బిజెపి, రైతాంగంలో, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను ఇటీవలి ఉప ఎన్నికల్లో చవి చూసింది. లఖింపూర్‌ ఖేరి మారణకాండ, కోర్టు మందలింపులు బిజెపిని ఇంటా బయటా రోడ్డుకీడ్చాయి. ఇప్పటికీ వెనక్కి రాకపోతే త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో పార్టీ పుట్టి మునగడం ఖాయమని తలచి చట్టాల రద్దుకు ఉపక్రమించిందనేది బహిరంగ రహస్యం. చట్టాల రద్దుపై జాతి నుద్దేశించి చేసిన ప్రకటనలోనూ ప్రధాని తన మాటల గారడీని వదిలిపెట్టలేదు. రైతుల సంక్షేమం కోసమే చట్టాలను తెచ్చినప్పటికీ, కొన్ని వర్గాల రైతులకు సర్ది చెప్పలేకపోయామని పేర్కొని, అసలు చట్టాల్లో తప్పేమీ లేదంటూ నల్ల చట్టాలను తెల్లగా మార్చే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛా మార్కెట్‌ కోసం ఎఎంసి రద్దు, కాంట్రాక్టు సేద్యం, నిత్యావసరాల నిల్వలపై పరిమితుల ఎత్తివేతకు ఉద్దేశించిన చట్టాలు కార్పొరేట్ల విచ్చలవిడి దోపిడీకి ఊతం ఇచ్చేవి. ఇప్పటి వరకు కొన్ని పంటలకు ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను హరించేవి. ఈ నేపథ్యంలో చట్టాలు చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసమన్న ప్రధాని వాక్కు నయ వంచన. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థలో వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోని అంశం. రాష్ట్రాలను పట్టించుకోకుండా, రైతులతో సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాలు చేశారు. ఈ వాస్తవాలను మోడీ తన ప్రకటనలో ప్రస్తావించకుండా దాచారు. వినాశకర చట్టాలు తెచ్చినందుకు ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పలేదు. తెచ్చిన చట్టాలను అమలు చేయనందుకు కార్పొరేట్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతానికి చట్టాలను రద్దు చేసినా, ఇంకా వాటి ముప్పు తొలగి పోలేదని ప్రధాని మాటల్లో స్ఫురిస్తోంది.రైతులు కేవలం మూడు సాగు చట్టాల రద్దు కోసమే ఉద్యమం చేయడం లేదు. అన్ని పంటలకూ ఎంఎస్‌పి ని చట్టబద్ధ హక్కు చేయాలంటున్నారు. ప్రధాని ప్రకటనలో ఎక్కడా ఎంఎస్‌పి ప్రస్తావన లేదు. విద్యుత్‌ సవరణల చట్టం రైతులకు హానికరం. ఆ సవరణలను సైతం రద్దు చేయాలని రైతులు అడుగుతున్నారు. మూడు చట్టాల రద్దు ప్రధాని ప్రకటనతోనే జరగదు. పార్లమెంట్‌ ఆమోదిం చిన చట్టాలను రద్దు చేయాలంటే తిరిగి పార్లమెంట్‌లోనే చేయాలి. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు ప్రధాని. అప్పటి వరకు వేచి చూస్తామన్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నిర్ణయం సముచితమైనది. ఉద్యమ ప్రధాన డిమాండ్‌ ఎంఎస్‌పికి చట్టబద్ధత మీదా తేల్చుకోవాలన్న ఎస్‌కెఎం యోచన సరైనది. నలభై రైతు సంఘాలు కలగలిసిన ఎస్‌కెఎం నాయకత్వంలోని ఉద్యమం, ఆ పోరాటానికి అందుతున్న విశాల మద్దతు బృహత్తరమైనది. అంతటి ఒత్తిడి ఫలితంగానే విధి లేక కేంద్రం చట్టాల రద్దుకు దిగొచ్చింది. తమ ఉద్యమం తమ కోసమే కాదని, ప్రజలందరి కోసమని రైతులు నినదిస్తున్నారు. కార్మిక కర్షక ఐక్యత కూడా ఈ సందర్భంలో వెల్లివిరిసింది. కార్పొ రేట్లకు, వాటి అనుకూల ప్రభుత్వాలకు రైతు ఉద్యమం సింహస్వప్నంగా నిలిచింది. సుదీర్ఘ పోరాటంలో 750 మంది అమరులు కావడం మామూలు విషయం కాదు. మహత్తర రైతు ఉద్యమం అభినందనీయమైనది. ఇక్కడితో ఆగకుండా వ్యవసాయ, రైతు రక్షణకు మరింత ఉధృతంగా సంఘటిత ఉద్యమం కొనసాగితేనే అసలైన లక్ష్యం సిద్ధిస్తుంది.
తొలుత కేబినెట్‌ ముందుకు.. దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త చట్టాలను ఉపసంహరించుకునే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. నవంబర్‌ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో మూడు నూతన సాగు చట్టాల రద్దు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.
కొత్త చట్టాల రద్దు ఇలా..
గత ఏడాది ఇదే సమయంలో నూతన సాగు చట్టాలను ఆమెదించింది కేంద్రం. రైతులకు మేలు చేసేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే కొంత మంది రైతులు మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారు. దిల్లీ సరిహద్దుల్లో పలు మార్లు ఈ నిరసనల్లో హింస కూడా చెలరేగింది. ఈ పరిణామా లన్నింటి నేపథ్యంలో ఇటీవల గురునానక్‌ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రైతులు ఉద్యమం వీడి ఇళ్లకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.అయితే సాగు చట్టాలు సన్నకారు రైతులను ఆదుకునేందుకే తెచ్చామని..కానీ అందరికీ దీనిని అర్థమయ్యేలా వివరించలేకపోయామని మోదీ పేర్కొన్నారు. మోదీ సర్కార్‌ సాగు చట్టాలపై వెనక్కి తగ్గడాన్ని విపక్షాలు.. ప్రముఖులు అందరూ స్వాగతిం చారు.
సాగు చట్టాల రద్దు ప్రక్రియ ఇలా..
సాగు చట్టాలను రద్దు చేసే ప్రక్రియ.. కూడా చట్టాలు ఆమలులోకి వచ్చిన విధంగానే ఉంటుంది. అంటే.. ఏదైనా చట్టం కావాలంటే పార్లమెంట్‌?లో అందుకు సంబంధఇంచి బిల్లు ప్రవేశ పెట్టాలి. దానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. ఏదైనా చట్టాన్ని రద్దు చేయాలన్నా ఇదే ప్రక్రియ ఉంటుంది.
క్షమాపణ చెప్పిన ప్రధాని
2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని.. వారి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చానని చెప్పారు.వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని.. ఏటా రూ.1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మోదీ చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పారు. ‘ప్రభుత్వం ఈరోజే వ్యవసాయానికి సంబధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే జీరో బడ్జెట్‌ వ్యవసాయం, అంటే సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, క్రాప్‌ పాటర్న్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో మార్చడానికి, ఎంఎస్‌పీని మరింత ప్రభావంగా, పారద ర్శకంగా మార్చడానికి, ఇలాంటి అన్ని విషయా లపై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిదులు, రైతులు ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు ఉంటారు’.
సుదీర్ఘ రైతు ఉద్యమంలో కీలక నేతలు ..
358 రోజుల అలుపెరగని రైతుల పోరాటం .. మోడీ ప్రభుత్వం దిగి వచ్చేలా చేసింది. రైతులకు క్షమాపణ చెబుతూ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించేలా చేసింది. వణుకు పుట్టించే చలి, వేసవిగాలులు, తుఫానులు వేటికీ వారు వెనుకంజ వేయలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలతో వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించేది లేదంటూ ప్రతినబూనారు. మాజీ సైనికుడు, వైద్యుడు, ఎన్నికల సర్వే అధికారి, జాత్‌ నేత, మహిళా హక్కుల కార్యకర్త ఇలా కొందరు రైతుల నిరసనను ఏడాది పాటు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. కొందరి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. ఈ ఉద్యమంలో పాల్గన్న ప్రతి రైతు ఒక నాయకుడే. ఇది భారత్‌లో ప్రజా ఉద్యమాలను పునర్నిర్వచించింది. భవిష్యత్‌ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వారి నాయకత్వంతో రైతుల మధ్య రాజకీయ విభజనను తగ్గించడంలో సహాయపడిరది. పంజాబ్‌,హర్యానా,ఉత్తర ప్రదేశ్‌ నుండి రైతులు ఉమ్మడి వేదికపై సమావేశమై సుదీర్ఘ కాలం పోరాడేందుకు మార్గం సుగమం చేసింది.
మహిళల పాత్ర
ఈ నిరసనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కీలకంగా మారింది. ఉద్యమంలో మహిళల గొంతును వినిపించేలా చేయడంలో హరీందర్‌ బిందు, జస్బీర్‌ కౌర్‌ నట్‌లు ముందంజలో ఉన్నారు. ప్రత్యేక మరుగుదొడ్లు వంటి వసతులు లేనప్పటికీ ట్రాక్టర్లు నడిపారు. విప్లవ గీతాలు పాడారు. జాతీయ రహదా రులను తమ నివాసాలుగా మార్చు కున్నారు. పితృస్వామ్య సమాజం, పురుష ఆధిక్య సమాజంలో పలువురు సామాజిక శాస్త్రవేత్తలు మహిళా మేల్కోల్పును చూశారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) ఏక్తా ఉగ్రహాన్‌ మహిళా విభాగం ఇన్‌చార్జ్‌ హరీందర్‌ బిందు పంజాబ్‌లోని మారుమూల గ్రామాల నుండి మహిళలను ఉద్యమంలో నిమగం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె స్వయంగా నిరసన ప్రాంతంలోనే నెలల తరబడి ఉన్నారు. నిరసనలో చేరేలా పలువురు మహిళలను ప్రోత్సహించారు. పంజాబ్‌ వ్యవసాయ సంస్థలలో మహిళల భాగస్వామ్యాన్ని చూసి, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలోని తమ సహచరులు కూడా మహిళలను నిరసనలోకి తీసుకువచ్చేలా ప్రేరణ పొందారని, ఇది గొప్ప విజయమని ఆమె హరీందర్‌ అన్నారు. పంజాబ్‌లోని ప్రముఖ మహిళా రైతు నేతల్లో ఒకరైన జస్బీర్‌ కౌర్‌ తిక్రీ సరిహద్దుల్లోని నిరసనలో మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించారు. పంజాబ్‌ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులుగా జస్బీర్‌ వ్యవహరిస్తున్నారు. కాలేజీ రోజుల్లో దళిత హక్కుల కార్యకర్తగా పనిచేసిన ఆమె వ్యవసాయ రంగంలో మహిళల దుస్థితిని చూసి పోరాటం దిశగా వారిని నడిపించేందుకు నడుం బిగించారు.ఆమె కుమార్తె నవకిరణ్‌ నట్‌ కూడా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రైతు ఉద్యమాన్ని గురించి వివరించిన వార్తాపత్రిక ట్రాలీటైమ్స్‌ వ్యవస్థాపక సభ్యులలో నవకిరణ్‌ కూడాఉన్నారు. గతేడాది నుండి వీరిద్దరూ నిరసన ప్రాంతంలోనే ఎక్కువ సమయం గడిపారు.
డా. దర్శన్‌ పాల్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా కింద వివిధ రైతు సంఘాలను ఏకం చేసి సైద్ధాంతిక రూపాన్ని అందించిన దర్శన్‌ పాల్‌ వైద్యుడని చాలా మందికి తెలియదు. పంజాబ్‌ సివిల్‌ మెడికల్‌ సర్వీస్‌లో అనస్థీషియా విభాగంలో పనిచేసే ఆయన 2000 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2016లో క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌లో చేరడానికి ముందు రైతు సంఘాల కార్యకలాపాలలో పాల్గొన్నారు. అనంతరం ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఉద్యమంలో పాల్గనడమే కాకుండా నిరసన ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందేందుకు కృషి చేశారు. రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వాలని మొదటి నుండి ఆయన పోరాటం చేశారు. 2020 జూన్‌లో కేంద్రం వ్యవసాయ ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించిన రైతు సంఘాల్లో ఆయనది కూడా ఒకటి. ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెఎస్‌సిసి)లో సభ్యులు కూడా. పంజాబ్‌ నుండి ఉద్యమాన్ని ఢల్లీి వరకు తీసుకెళ్లడంలో పాల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన ప్రేరణతోనే ఎఐకెఎస్‌సిసి సభ్యులు యుపి,రాజస్తాన్‌,కర్ణాటక, మహారాష్ట్ర నుండి రైతులను ఢల్లీి సరిహద్దులకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
రాకేష్‌ తికాయత్‌
పశ్చిమ యుపికి చెందిన జాత్‌ నేత రాకేష్‌ తికాయత్‌ వ్యవసాయ ఉద్యమాన్ని పునరు ద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు. పంజాబ్‌,హర్యానా నుండి రైతు నిరసనను ఢల్లీికి మారినప్పటికీ కొన్ని నెలల పాటు తికాయత్‌ పేరు వినిపించలేదని రాజకీయవిశ్లేషకుడు అశుతోష్‌ కుమార్‌ తెలిపారు. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీ అనంతరం రైతుల నిరసన విఫలమవుతుందనుకున్న సమయంలో తికాయత్‌ ముందుకు వచ్చారు. ఆయన ఉద్వేగ భరితమైన ప్రసంగాలు రైతులను ఉత్తేజ పరిచాయి. అనంతరం నిరసన మరింత బలంగా మారింది. తికాయత్‌ తండ్రి మొహీందర్‌ తికాయత్‌ కూడా వ్యవసాయ నేత అని, 1980లో కేంద్ర ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారని అశుతోష్‌ తెలిపారు. నిరసనలో కుల, మత విభజనలను తలెత్తకుండా ఉండేందుకు పలు మహా పంచాయత్‌లను నిర్వహించారు.
బల్బీర్‌ సింగ్‌ రేజ్వాల్‌
పంజాబ్‌ నుండి ఢల్లీికి ఉద్యమాన్ని తీసుకెళ్ల డంలో కీలకంగా వ్యవహరించిన మరో నేత బల్బీర్‌సింగ్‌ రేజ్వాల్‌. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)లో ప్రముఖంగా వ్యవ హరించారు. అనంతరం భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు)ని ఏర్పాటు చేసి రైతు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. వివిధ సమస్యలపై పంజాబ్‌లోని రైతులను ఐక్యం చేసిన అనుభవం ఉద్యమంలో రైతులను సమీకరించడంలో ప్రముఖంగా నిలిచింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టి నప్పటినుండి బల్బీర్‌ సింగ్‌ ట్రాక్టర్‌ ర్యాలీలు చేపడుతూ నిరసన తెలిపారు. అనంతరం ఢల్లీి సరిహద్దులోనూ ఉద్యమాన్ని నడిపించారు.
జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌
మాజీ సైనికుడైన జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ పదవీ విరమణ అనంతరం వ్యవసాయం ప్రారంభించారు. 2002లో బికెయు (ఏక్తా ఉగ్రహాన్‌) స్వంత శాఖను ఏర్పాటు చేసుకు న్నారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాం తంలో రైతుల ఉద్యమం సుమారు ఏడాది పాటు కొన సాగేలా చర్యలు చేపట్టారు. చిన్న, సన్నకారు రైతులతో ఉన్నప్పటికీ.. రైతు సంఘాల్లో అతి పెద్ద సభ్యత్వాన్ని కలిగి ఉందని మాజీ ప్రొఫెసర్‌ మంజిత్‌ సింగ్‌ తెలిపారు.
యోగేంద్ర యాదవ్‌
ఉద్యమ ప్రతినిధి యోగేంద్రయాదవ్‌ అనడంలో అసత్యం లేదనేలా ఉద్యమంలో యోగేందర్‌ పాలుపంచుకున్నారు. ఎన్నికల సర్వే అధికారి, కార్యకర్త అయిన యోగేంద్ర ఉద్యమాన్ని గురించి ఆంగ్లంలో అందరికీ చేరువయ్యేలా చేశారు. యోగేంద్ర యాదవ్‌ ఇంటర్వ్యూలు నిరసనలను ప్రపంచప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లాయి. నిరసనలపై అసత్యాలు ప్రచారం చేసినప్పుడల్లా మీడియా సమావేశాల ద్వారా ఎస్‌కెఎం వైఖరిని స్పష్టం చేశారు. (‘ది వైర్‌’ సౌజన్యంతో)
-గునపర్తి సైమన్‌