రైతులు మళ్లీ ఎందుకు ఉద్యమిస్తున్నారు?
‘‘కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలను దొడ్డిదారిన అమలు చేయడమే కాక, విద్యుత్ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అమలు చేయిస్తున్నది. కనీస మద్దతు ధర అమలు కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే నాడు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయమని దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమాఖ్య వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢల్లీి చుట్టూ చేరి ఉద్యమిస్తున్నారు. అకస్మాత్తుగా కొందరు రైతులు చేస్తున్న పోరాటం కాదు ఇది. అనేక దశబ్దాలుగా వ్యవసాయం పట్ల, గ్రామీణ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం’’
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందో ళన కొనసాగుతోంది.ఈ చట్టాలను అడ్డు పెట్టు కుని కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంపై గుత్తాధి పత్యం సాధిస్తాయని,అప్పుడు తాము దోపిడికి గురవుతామన్నది రైతుల భయం.అయితే కార్పొరేట్ రంగం వ్యవసాయం రంగంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందనే జాగ్రత్తగా గమనిం చాల్సిన అవస రం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సి ఉన్నా ప్రస్తుతానికి వరి,గోధుములను మాత్రమే ఎక్కువగా కొంటోంది కేంద్ర ప్రభుత్వం.గోధుమలను కొనడంలో ప్రభు త్వం తర్వాత రెండోస్థానంలో ఎవరిది? రూ.75 వేల కోట్ల విలువైన ప్రపంచస్థాయి కార్పొ రేట్ సంస్థ ఐటీసీ గ్రూప్‌ది.ఈ సంస్థ ఈ ఏడాది రైతుల నుంచి 2.2మిలియన్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది.మహీంద్రా గ్రూప్ కూడా వ్యవ సాయ రంగంలో పెద్దఎత్తున వ్యాపారాలు ప్రారం భించింది.నెస్లే,గోద్రెజ్‌లాంటి బడాప్రైవేట్ కంపె నీలు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నాయి.
ఈ-చౌపాల్
ఐటీసీ కంపెనీకి, రైతులకు మధ్య అనుసంధానకర్త పాత్ర పోషించడంలోఈ-చౌపాల్ పథకం కీలకపాత్ర పోషించింది. ఈ-చౌపాల్ సహకారం తో 20 సంవత్సరాలుగా ఐటీసీ గ్రూప్ రైతులతో కలిసి వ్యాపారం చేస్తోంది.2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ-చౌపాల్ మోడల్ గ్రామాల్లో ఇంటర్నెట్ కియోస్క్‌లు ఏర్పాటు ఒక నెట్‌వర్క్‌గా పని చేస్తుంది.చిన్న,సన్నకారు రైతులకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ చేసుకోవడంలో ఇది మెల కువలు అందిస్తుంది. వివిధ మార్కెట్లలో ధరలు, వాతావరణ సూచనల్లాంటివి అందిస్తూ రైతులకు బాసటగా ఉంటుంది.
ఈ-చౌపాల్ మోడల్ ఎలా పనిచేస్తుంది?
అది 2005 సంవత్సరం. మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతంలో సోయాబీన్ పంటకు రైతుల నుంచి పెరుగుతున్న ఆదరణ గురించి ఒక కథనం కోసం నేను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ-చౌపాల్ పథకం గురించి విన్నాను.
ఈ-చౌపాల్ పరిధిలో ఉండే మార్కెట్లకు వెళ్లి చూశాను.ఒకరిద్దరు యువకులు గ్రామాల్లో కంప్యూ టర్లు పెట్టుకుని వాతావరణ సమాచారాన్ని రైతు లకు అందించడం, అంతర్జాయతీయ మార్కెట్‌లో సోయాబీన్ ధరల గురించి వివరించడం గమ నించాను.ఇక్కడి ధరలు తెలుసుకున్నాక రైతులు మార్కెట్‌కు వెళ్లి సోయాబీన్ ధరను ముందుగా నిర్ణయించిన ధరకు ఐటీసీకి అమ్మేవారు. అప్పటికి ఆ పథకం కొత్తది. ఒక కార్పొరేట్ కంపెనీ, రైతులు కలిసి పని చేయడం కూడా కొత్త విషయమే. రైతులతో తమకున్న అనుబంధంపై ఐటీసీ సంస్థ ఒక వీడియో ఫిల్మ్ తయారు చేసిగ్రామాల్లో రైతు లకు ప్రదర్శించి చూపేది. తమ పథకాల గురించి వివరించేది. అప్పట్లో రైతులు,సంస్థా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు.కానీ ఒక సంస్థ రైతులను మోసం చేయాలను కున్నా, దోచుకోవాలనుకున్నా అది పెద్దకష్టం కాదు. ఎందుకంటే రైతుల రక్షణకు చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు.
ఈ-చౌపాల్‌లో ఇప్పుడు 40లక్షల మందిరైతుల నెట్‌వర్క్‌గా మారింది.10 రాష్ట్రాల్లో 6100 కంప్యూటర్ కియోస్క్‌ల ద్వారా 35,000 గ్రామాల్లో విస్తరించి ఉంది. కోటిమంది రైతులను సభ్యులుగా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.రైతులు, కంపెనీల మధ్య కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఈ-చౌపాల్ ఒక మోడ ల్. అయితే కొత్త వ్యవసాయ చట్టం కార్పొరేట్ గ్రూప్‌లైన అంబానీలు,అదానీలు వ్యవసాయ రంగంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అందుకే రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
వ్యవసాయోత్పత్తిలో భారత్ వెనకబాటు
అమెరికా తరువాత భారతదేశంలో అత్యధికంగా సాగు చేయగల భూమి ఉంది. కాని దిగుబడిలో మాత్రం భారతదేశం అమెరికా కంటే చాలా వెనకబడి ఉంది.సాంకేతిక పరిజ్ఞా నం వాడకం తక్కువగా ఉండటం,వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించే పరిజ్జానం రైతులకు అందుబాటులో లేకపోవడం ఒక కారణ మైతే, ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయాలు క్రమంగా తగ్గుతుండటం మరో కారణం. అయితే వ్యవసాయంలో ప్రభుత్వం ఎక్కువ భూమికను పోషించడం సరికాదని నిపుణులు అంటుండగా, ఉత్తర భారతదేశ రైతులు మాత్రం సర్కారుకు దూరమయ్యేందుకు సిద్ధంగా లేరు.
ఆహార భద్రతలో అదనపు భారం
ప్రజలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం(పీడీఎస్) ద్వారా కరువుల, అంటువ్యాధుల సమయంలో ఉచితంగా ధాన్యం అందిస్తారు. కానీ ఈ పథకం పేరుతో సేకరిస్తున్న ధాన్యం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంది.ఆహార భద్రత పేరుతో ఎక్కువ గా ధాన్యాన్ని కొనడం రాజకీయ అనివార్యతగా మారింది.‘‘ప్రభుత్వం బియ్యం,గోధుమల కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది.దానికి బదులు వల్ల ఆరోగ్యం,మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం మంచిది’’అని ముంబయికి చెందిన ఆర్థిక నిపుణుడు వివేక్ కౌల్ అన్నారు.
రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు?
కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) చట్టంలో చేర్చాలని,ప్రభుత్వం మండీల (మార్కె ట్లు) నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని ప్రస్తుత చర్చల్లో రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాలు ప్రస్తుత అవసరమని, దానివల్ల రైతులే ప్రయోజనం పొందుతారని మోదీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుత ఆందోళ నల కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగు తోంది.అయితే దీనిని వాస్తవిక దృష్టితో చూడాల్సి న అవసరముంది.
వ్యవసాయంలో పెను మార్పులు
గత రెండు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. అయితే ఈమార్పులు ప్రభుత్వంకన్నా ప్రైవేటుశక్తుల వల్లనే ఎక్కువగా సాధ్యమయ్యాయి.టెక్నాలజీ,కొత్త విత్తనా లు,నాణ్యమైన ఎరువుల్లాంటి అంశాలు వ్యవసా యాభివృద్ధికి కారణం.ఇవే మార్పులు వ్యవసాయ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు చోటు కల్పించా యి.కానీఏ వేగంతో మార్పులు జరుగుతున్నాయో, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలలో కూడా మార్పులు చేయాలన్న డిమాండ్ వినిపి స్తోంది.కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ కాలంలో ఈకొత్త చట్టంపై చర్చ జరిగింది. కానీ అది అమలు కాలేదు.2019 ఎన్నికల మ్యాని ఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ప్రైవేటు కంపెనీలు వ్యవసాయ రంగంలోకి రాకుండా నిరోధించలేనప్పుడు కొన్ని చట్టాలు, నిబంధనలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి ప్రైవేట్ కంపెనీలు తమను దోచుకోకుండా తమ ఆదాయా న్ని పెంచే విధంగా ఉండాలని రైతులు కోరుతు న్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఈ మూడు చట్టాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే తెచ్చామని చెబుతున్నా, తమను పరిగణనలోకి తీసుకోకుండా,హడావుడిగా ఆమోదించారని రైతులు ఆరోపిస్తున్నారు.వ్యవసాయ రంగంలో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని, అయితే అవి రైతులను దోచుకునేందుకు అవకాశాలు పెరిగాయని, రైతుకు రక్షణ లేదని కేరళ మాజీ శాసన సభ్యుడు, రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కృష్ణ ప్రసాద్ అంటున్నారు.
ప్రభుత్వం-రైతులు ఎందుకు పట్టుదలగా ఉన్నారు?
‘‘రైతులకు మరిన్ని ఆప్షన్లు ఇస్తుంటే మమ్మల్ని రైతు అనుకూలురు అంటారా లేక వ్యతి రేకులు అంటారా?కొత్తవ్యవసాయ చట్టంతో రైతు లు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ము కునే అవకాశం కల్పించాం’’అని బీజేపీ తన ట్వీట్ లో పేర్కొంది.కానీ ఈచట్టంపై ప్రత్యేక పార్ల మెంటు సమావేశాలు నిర్వహించి మరీ దీన్ని ఉపసంహరించుకోవాలని దర్శన్‌పాల్ లాంటి రైతు ఉద్యమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇందులో ఎవరు గెలుస్తారు? ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17 శాతం. ప్రపంచ భూమిలో కేవలం2.4శాతం మాత్రమే వున్న దేశం మనది. దేశ జనాభాలో 48.6శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదఆధారపడి గ్రామాల్లో జీవిస్తు న్నారు.ఈ లెక్కలు మన భూమికి, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతలను చెబుతున్నాయి.దేశ జనాభా కు అవసరమైన ఆహారం,వారి కొనుగోలు శక్తి పెరిగి తద్వారా పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాలు వ్యవ సాయానికి అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలి.అనేక విషాదాల అనుభవాల నుండి వ్యవసాయఉత్పత్తులను పెంచుకున్నాము. 1950 -1990 మధ్య దేశ జనాభా పెరుగుదల 2.5 శాతం ఉంటే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల 3.4శాతానికి చేరింది.1980-90 మధ్య వ్యవ సాయ ఉత్పత్తులు సగటు నాలుగు శాతం పెరుగుదల సాధించాయి.1991నుండి ప్రారం భమైన ప్రపం చీకరణ విధానాలు వ్యవసా యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.1990 చివరినాటికి వ్యవ సాయం తిరోగమనంలోకి దిగజారిదాని ఉత్పత్తు లు మైనస్ 2శాతానికి పడిపోయాయి. దీని వల్ల ఆహారధాన్యాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసిన పూర్వ పరిస్థితి వచ్చింది. గత పదేళ్ళ నరేంద్ర మోడీ పాలన వ్యవసాయాన్ని పూర్తిస్థాయి సంక్షోభంలోకి నెట్టి కార్పొరేట్ కంపె నీలకు అప్పగించడానికి సిద్ధమయ్యింది. అందుకే రైతులు పోరాడుతున్నారు. దేశంలో 14.58 కోట్ల రైతు కుటుం బాల కింద 38.82 కోట్ల ఎకరాల సాగు భూమివుంది.ఇందులో ఐదుఎకరాల లోపు ఉన్న రైతు కుటుంబాలు12.57కోట్లు కాగా, వీరివద్ద వున్న భూమి మాత్రం18.38 కోట్ల ఎక రాలు మాత్రమే. వీరిలో అధికులు వెనుకబడిన కులాలకు చెందిన పేదలు.సెంటు సాగు భూమి లేని గ్రామీ ణ కుటుంబాలు ఏడు కోట్లకు పైగా ఉన్నాయి. వీరిలో అత్యధికులు దళితులు, మైనారి టీలు,గిరిజనులు.వ్యవసాయ రంగం మీద ఆధార పడిన కోట్లకుటుంబాలు నిత్యం అప్పుల్లో ఉండ డానికి, పేదరికంలో మగ్గుతుండడానికి ప్రధాన కారణం తగినంత సాగు భూమి నిజమైన సాగు దార్ల వద్ద లేకపోవడం.శాస్త్ర, సాంకేతికత పెరిగే కొద్ది గ్రామీణ వృత్తులు అంతరించి వాటిపై ఆధా రపడిన వారు వ్యవసాయానికి అదనపు భారమ య్యారు. ప్రభుత్వాల నుండి రైతులకు అందాల్సిన రుణ పరపతి,ఎరువులు,విత్తనాల సబ్సిడీ తగ్గిపో వడం,పంటలకు గిట్టుబాటు ధరలు అమలు కాక పోవడంతో వ్యవసాయం తీవ్రసంక్షోభంలోకి వెళ్ళి గ్రామీణ జీవితం ఛిద్రమయ్యింది.
వ్యవసాయాన్ని ముంచే మోడీ విధానాలు
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపె నీలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం 2020 జూన్ 5న ఆర్డినెన్స్ ద్వారా మూడు నల్ల వ్యవ సాయ చట్టాలు తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను చట్టాలు గా మార్చుకునేందుకు అదే సంవత్సరం సెప్టెంబర్ 17-19తేదీల మధ్య లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందారు.వ్యవసాయ ఉత్పత్తుల వ్యా పార,వాణిజ్య చట్టం,రైతు ధరల హామీ,వ్యవ సాయ సేవల ఒప్పందచట్టం,నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం వల్ల వ్యవసాయంపై తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటల ఉత్పత్తుల ధరలను ప్రభుత్వాలు కాకుండా పెద్ద కంపెనీలు నిర్ణయిస్తాయి. దేశ ప్రజల అవసరాల కోసం పంటల సాగు కాకుండా, ఈ కంపెనీలకు ఏది లాభమో దానినే ఉత్పత్తి చేయించగలరు. ఇప్పటి వరకు పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న కొద్దిపాటి ఆహారధాన్యాలు కూడా దూరమవుతాయి. ప్రభుత్వాలు ఎరువులు, విత్తనాల మీద ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా తొలగిస్తాయి.వ్యవసాయ రంగంలో నూతన పరి శోధనల నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. జాతీయ బ్యాంకుల నుండి రైతులకు అందుతున్న అరకొర రుణ సదుపాయం కూడా అందక పం టల పెట్టుబడికి, రైతు కుటుంబ అవసరాలకు ప్రైవేట్‌వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తుంది. వీటన్నింటివల్ల పేద,దిగువ మధ్య తర గతి రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని కోల్పో యి భూమి లేని నిరుపేదల్లో చేరిపోతారు. ముఖ్యం గా ఎం.ఎస్.స్వామినాథన్ సిఫారస్సు చేసిన మొత్తం ఉత్పత్తి ఖర్చులకు 50శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న కీలక అంశం అమలుకు నోచుకునే అవకాశమే లేదు.
కనీస మద్దతు ధర ఎందుకు ?
అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే 23పంటలకు మాత్రమే ఈ మద్దతు ధర ప్రకటించబడుతుంది. అందులో 20 పంటలు ఆహారానికి సంబంధిం చినవి. ఇందులో వరి,గోధుమ,జొన్నలాంటి ఏడు ముతక ధాన్యాలు,ఆరు పప్పుధాన్యాలు,ఏడు నూనె గింజల పంటలు ఉన్నాయి. వాస్తవంగా వరి, గోధుమ పంటలకు మాత్రమే కొద్దిమేర ఈ కనీస మద్దతు ధర అమలవుతుంది.ఈ రెండు పంటల సేకరణలో65శాతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండే జరుగుతుంది.ఈ రాష్ట్రాల్లో వ్యవసాయం వృద్ధి చెందడానికి వరి,గోధుమ పంటలకు మద్ద తు ధర లభించడం ఒకకారణం. పంజాబ్‌లో వరి పంట అమ్మకాలు 78శాతం,హర్యానాలో 90శాతంచిన్న,సన్నకారు రైతుల నుండి జరుగు తున్నాయి.అందుకే మోడీ నల్ల చట్టాల ప్రభావం దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడే ఎక్కువగా ఉంటుంది.అందుకే ఈ రెండు రాష్ట్రాల రైతులు కేంద్రం పెట్టే అన్ని నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమిస్తున్నారు.2000 నుండి 2014వరకు దేశవ్యాప్తంగా 45 శాతం మంది మధ్య తరగతి రైతులు వ్యవసాయాన్ని వదిలి పెట్టినట్లు వ్యవ సాయ శాస్త్రవేత్తల అధ్యయనాలు తెలుపుతు న్నాయి.ఈచట్టాలు అమలైతే దేశంలో, మన లాంటి రాష్ట్రాల్లో రైతు వ్యవసాయం కనుమ రుగవుతుంది. దీనివల్ల పట్టణాల్లో పనులకు పోటీ పెరిగి వేతనాలు తగ్గడం, ఆకలి చావులు, ఆహార ధాన్యాల కొరత తీవ్రమవుతాయి. అందుకే ఢల్లీిలో జరుగుతున్న రైతుల ఉద్యమం దేశ ప్రజల బతుకు కోసం సాగుతున్న ఉద్యమం.
నీరో చక్రవర్తిలా మోడీ
చరిత్రలో రోమ్‌ను పాలించిన నీరో చక్రవర్తి అనగానే ‘రోమ్‌నగరం తగలబడి పోతుంటే ఫిడేల్ వాయించిన వ్యక్తిగా’ గుర్తుకు వస్తాడు. అది చరిత్ర. వర్తమానంలో ఢల్లీి చుట్టూ వేలాది రైతులు రెండు వారాలుగా ఆందోళన చేస్తుంటే ద్వారకలో డైవింగ్ చేసిన, తిరువ నంత పురంలో గగన్‌యాన్ అంతరిక్ష మిషన్ ముందు మోకరిల్లిన మన ప్రధానిని చూసి తరించే భాగ్యం దేశ ప్రజలకు పట్టుకుంది. గత 45 సంవత్సరా ల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపో యిందని ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా-2023’ నివేదిక ప్రకటించిన,గత 11సంవత్సరాల్లో కుటుం బ ఖర్చులు ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగి పోయాయని,అందుకు అనుగుణంగా ప్రజల ఆదా యం పెరగలేదని హెచ్‌సిఇఎస్ తాజా నివేదిక బట్టబయలు చేసినప్పటికీ ఏ మాత్రం చలించక, వేషాలు మార్చి మార్చి దేశ ప్రజలకు దర్శన భాగ్యం కల్గించగల నేర్పరి మన ప్రధాని. కొద్ది మంది దేశీయ, విదేశీ సంపన్నుల కోసం కోట్ల మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడు తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించకుండా వ్యవ సాయాన్ని, దేశాన్ని కాపాడుకోలేం.-వి.రాంభూపాల్