రిజర్వేషన్ల విధానంలో కొత్త పోకడలు
ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిధిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మునుపున్న షెడ్యూల్ద్ కులాల (ఎస్.సి.), షెడ్యూల్డు తరగతుల (ఎస్.టి.) జాబితాలో కొత్త వర్గాలను చేరు స్తున్నాయి. ఇలా విస్తరించడానికి ఆర్థిక వెనుకబాటు తనాన్ని కారణంగా చూపుతున్నాయి. ఆర్థిక వెనుక బాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేటట్టయితే అంతకనా వెనుకబడి ఉన్న సామాజిక వర్గాలను విస్మరించినట్టు అవుతుంది. లేవనెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే 10 శాతం, 13 శాతం కులాలకు ఎందుకు పరిమితం చేయాలి. ఈ సూత్రం ద్వారా ప్రభుత్వాలు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల ప్రాతిపదికగా రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తాయి. కొత్త రిజర్వేషన్ల విధానంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఇలాంటి రాజకీయాలవల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మైనారిటీలు ఓటర్లుగా అంత ఆకర్షణీ యంగా కనిపించక పోవచ్చు.
కొత్త రిజర్వేషన్ల విధానంతో మరో సమస్య కూడా ఉంది.ఈ పద్ధతి రాజ్యాంగ నిర్మా తల దృష్టిలో ఉన్న ‘‘పురోగమన’’ అంశాన్ని గమ నంలో ఉంచుకోదు. షెడ్యూల్డ్ జాబితాలో ఉన్న వారికి అవకాశాలు కలిగించడంలో ఉన్న ఇబ్బం దిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విధానాన్ని రూపొందించారు. ఈ కార ణంవల్లే మన దేశంలో అమెరికాలోఉన్న సాను కూల చర్య పద్ధతి కాకుండా రిజర్వేషన్ పద్ధతి అనుసరించారు.ఇది మొదట్లో అవకాశాలు కల్పిం చడానికి ఉద్దేశించింది. దీనివల్ల ఫలితం ఉండా లనుకున్నారు. సానుకూల చర్యవల్ల నిర్దిష్ట ఫలితం ఉంటుందన్న నమ్మకం లేదు.కొత్త రిజర్వేషన్ల విధా నంవల్ల సామాజికంగా వెనుకబడిన కులాల వారికి ప్రాతినిధ్యం అన్న సూత్రం మరుగున పడవచ్చు. ఎంపిక చేసే వారు, పోటీ పడే వారు ఒక సామాజిక నేపథ్యానికి చెందినవారు కావచ్చు. అలాంటప్పుడు ఎంపిక చేసే వారు నియామకాలు చేసేటప్పుడు మరింత నైరూప్య ప్రమాణాలను పాటిస్తారా? లేదా అగ్రవర్ణాలలో ఉప కులాలను దృష్టిలో ఉంచు కుంటారా? కొత్త విధానంవల్ల అయినా, మునుపటి విధానంవల్ల అయినా లబ్ధి పొందే వారు ప్రభుత్వ రంగానికే పరిమితం అవుతారు. అందువల్ల ప్రై వేటు రంగంలో అవకాశం ఉండదు. ప్రైవేటు రంగం రిజర్వేషన్ల పరిధికి దూరంగానే ఉండిపో తుంది.అందువల్ల రిజర్వేషన్లు వర్తించే వారు ప్రభు త్వ ఉద్యోగాల మీదే ఆధారపడాలి. అయితే నిర్దిష్ట కులం దృష్టితో చూసినప్పుడు సిద్ధాంత రీత్యా కోటా విధానాన్ని విస్తరించినందువల్ల ఫలితం ఉండ వచ్చు. అగ్ర కులాల వారికి, దళితులు కాని వారికి, వెనుకబడిన తరగతులకు చెందని వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. ఈ పద్ధతివల్ల అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కొందరిని వదిలివేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్న అవకాశాలను పోటీ తత్వంతో రిజర్వేషన్ల ద్వారా అందుకోవాలంటే ఎస్.సి.,ఎస్.టి.ల విష యంలో జరిగినట్టు అంతర్గతతేడాలకు దారి తీస్తుం ది.దీనివల్ల కులచైతన్యాన్ని వదిలి వ్యక్తులుగా నిల బడే వీలుంటుందని వాదించే వారూ ఉంటారు. వ్యక్తులుగా నిలబడితే కులం ప్రాతిపదికగా కాకుం డా సత్తా ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుం దనే వారూ ఉన్నారు. కుల చైతన్యం నుంచి బయ టపడి కులప్రాతిపదిక మీదఉన్న సామాజిక నైతిక తను అంతం చేసే వీలుంటుంది. అంటే వ్యక్తులు ఆధునిక విధానాల ఆధారంగా పోటీ పడతారు.ఇది అమాతం జరిగిపోదు. ఆధునికత విసిరే సవాళ్లను ఎదుర్కోలేనప్పుడు కులం మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు. మరో వేపున న్యాయాన్ని విస్తరించడం అంటే రిజర్వేషన్ల వల్ల లభ్ది పొందుతున్నారనే మచ్చ రూపు మాపే అవకాశం కూడా ఉంటుంది. అలాం టప్పుడు సామాజిక న్యాయం,దళితులు అన్న మాట లను ఒకసారి ఒకఅర్థంలో మరోసారి మరో అర్థం లో వాడతాయి. కొత్త కోటా విధానం వచ్చే లోపల రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు సామాజిక న్యాయం అన్న పదానికి పెడార్థం తీస్తారు.ఈపదాన్ని దళి తులను ఉద్దేశించి వాడే అలవాటు ఉంది. కొత్త కోటా విధానం సామాజిక న్యాయాన్ని సమానత్వ దృష్టితో చూడడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే సామాజిక న్యాయం అన్న భావన సర్వజనామోదం పొందుతుంది. దళితులు, ఆదివాసుల విషయంలో లాగా సామాజిక న్యాయాన్ని చులకన భావంతో చూసే వీలుండదు. సమానత్వం అన్న భావన బల హీనంగా ఉన్న సామాజిక సంబంధాలను పటి ష్ఠంచేస్తాయి.
ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన 103వరాజ్యాంగ సవ రణచట్ట బద్ధమేనని అయిదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ ముగ్గురు, వ్యతిరేకిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు విభజన తీర్పు చెప్పడంతో చర్చనీ యాంశమైంది. రిజర్వేషన్ల నిర్ణయానికి ఆర్థిక కొల బద్దను వినియోగించడం న్యాయ సమ్మతమేనన్న విషయంలో న్యాయమూర్తులందరూ ఏకీభావం వ్యక్తంజేశారు. కానీ ఇద్దరు న్యాయమూర్తులు ఇతర అంశాల ప్రాతిపదికన రాజ్యాంగ సవరణ న్యాయ బద్ధతను తిరస్కరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక వివాదాన్ని పరిష్కరిస్తూ మరికొన్ని వివాదాలకు తెర లేపుతున్నదని తనఆందోళనను వ్యక్తంజేస్తూనే ఇ.డబ్ల్యు.ఎస్ రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పు ను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆహ్వా నించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కొంత శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ విషయా లలో ఇవ్వాలని సిపిఐ(ఎం)చాలాకాలం నుండి చెప్తున్నది. బీహార్‌లో కర్పూరీ ఠాకూర్ ప్రభుత్వం 1978లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 6శా తం రిజర్వేషన్లు కల్పించినపుడు సిపిఐ(ఎం) సమ ర్ధించింది. అదే వైఖరికి అనుగుణంగా పార్లమెం టులో 103వ రాజ్యాంగ సవరణను సమర్ధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పును కూడా ఆహ్వానించింది.సిపిఐ(ఎం) మూడు అంశాల ప్రాతి పదికగా ఇ.డబ్య్లు.ఎస్ రిజర్వేషన్లను సమర్ధిస్తున్నది. మొదటిది, సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణిం చాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావి తం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్ యాక్షన్ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజ మైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలావిస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది. రెండ వది,రిజర్వేషన్ల పరిధిలోకిరాని తరగతులలో అత్య ధికులు ఆర్థికంగా వెనకబడినవారున్నారు. పెట్టు బడిదారీ విధానం దేశంలో విస్తరించేకొలదీ వీరి సంఖ్య పెరుగుతున్నది. వారి పరిస్థితి దుర్భరం అవుతున్నది. ఈ తరగతులలోని యువకులకు విద్యా ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. తమ దుస్థితికి ఇతరులకు రిజర్వేషన్లు ఉండడం, లేక తమకు లేకపోవడమేనన్న అపోహలకు గురవు తున్నారు.పాలకవర్గాలు,వారి మీడియా ఈ అపోహ లను పెంచు తున్నాయి. పర్యవసానంగా రిజర్వేషన్ వ్యతిరేక భావనలురోజురోజుకీ తీవ్రమవుతు న్నాయి. ఈ మానసిక స్థితి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాల ద్వారా గతంలో వెల్లడవడం చూశాము. మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు పూనుకున్నపుడు, రిజర్వేషన్లు లేని తరగతుల లోని పేద, మధ్య తరగతి ప్రజలను రెచ్చగొట్టి పాలకవర్గాలు రిజర్వే షన్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉసిగొల్పాయి. రిజర్వేష న్లను తొలగించాలనే స్వార్థపర శక్తులకు (వెస్టెడ్ ఇంటరెస్ట్స్‌కు) అవకాశం లేకుండా ఆర్థికంగా వెనక బడిన తరగతులలో రిజర్వేషన్ విధానానికి సాను కూలత సాధించాలంటే వారికి కూడా కొంత రిజ ర్వేషన్ కల్పించడం అవసరం. లేనియెడల రిజర్వే షన్లకే ప్రమాదం వస్తుంది. మూడవది, సమసమాజ సాధనలో పీడిత వర్గాల ఐక్యత కు ఎంతో ప్రాధా న్యత ఉంది. కార్మికులు, ఉద్యోగుల్లో రిజర్వే షన్ అంశం విభేదాలను, విభజనను సృష్టిస్తున్న సంద ర్భంలో దాన్ని అధిగమించి వర్గ ఐక్యతను సాధించా లంటే ప్రస్తుత రిజర్వేషన్ పరిధిలోకి రాని తరగతు లకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా సామాజిక విభజన వలన ఏర్పడే అనైక్యత ను కొంతవరకు నిరోధించే అవకాశం ఉంది. విధానపరమైన అంశంతోపాటు, రిజర్వేషన్ల పట్ల సానుకూల వాతావరణం ఏర్పర్చడానికి, వర్గ ఐక్య తను బలపర్చుకోవడానికి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లను కల్పించడం అవ సరం అన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. కొంత మంది రిజర్వేషన్లకు ఆర్థిక కొలబద్దను ప్రాతిపది కగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాం గంలో సామాజిక విద్యా విషయక వెనకబాటు తనాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ఉంది తప్ప ఆర్థిక వెనకబాటుతనం గురించి ప్రస్తా వన లేదని, అందువలన ఇ.డబ్ల్యు.ఎస్‌కు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని వాదిస్తున్నారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక న్యాయాన్ని అందించడం కూడా రాజ్యాంగ లక్ష్యమని, అందులో భాగంగా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజ ర్వేషన్లు ఇవ్వడం న్యాయమేనని కోర్టు అభిప్రా యపడిరది.ఇ.డబ్ల్యు.ఎస్‌తరగతులను ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయవచ్చు గదా, రిజర్వేషన్ల అవసరమేమిటని ఇంకో వాదన ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక తరగతులకు కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు జమిలిగా అమలవుతున్నాయి. అలా అయినపుడు సామాజిక తరగతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఇ.డబ్లు.ఎస్ తరగతులకు రిజర్వేషన్లు అమలుజేయడాన్ని వ్యతిరేకించడంలో ఔచిత్యం కన్పించదు. రిజర్వేషన్లనేవి సామాజిక అంశానికి వర్తిస్తాయి తప్ప ఆర్థికఅంశానికి విస్తరించడం అంటే రిజర్వేషన్ స్వభావానికే విరుద్ధం అనే వాదన కూడా ఉంది. ఇతర దేశాల అనుభవాలు, మన దేశంలో రిజర్వేషన్లు పరిణామం చెందిన తీరు చూస్తే ఈ వాదన నిలబడదు. రిజర్వేషన్లు ఆయా దేశాల పరిస్థితులను బట్టి,అవసరాలను బట్టి అమల య్యాయి. మలేషియాలో మెజారిటీ మలే జాతి ఆర్థిక వెనకబాటుతనం రిజర్వేషన్‌కు ప్రాతిపదికగా ఉంది. అమెరికాలో మూలవాసి అమెరికన్ల కోసం కొన్ని ప్రాంతాలను రిజర్వేషన్లుగా ప్రకటించారు. ఇక్కడ ప్రదేశం రిజర్వేషన్‌గా ఉంది.విద్యా ఉద్యో గాలలో మన లాగా కోటా పద్ధతి కాకుండా, న్యాయ వ్యవస్థ ద్వారా అమలు సాధ్యంగాని నిర్ణీత లక్ష్యాల ద్వారా వైవిధ్యాన్ని సాధించే పద్ధతులలో అఫర్మేటివ్ యాక్షన్ అమలవుతున్నది. ఐర్లండ్ రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక ఉన్నది.
మన దేశంలో రిజర్వేషన్ విధానం పరి ణామం చూసినా, సామాజిక అంశంతోపాటు అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకు న్నట్టు విదితమవుతుంది. బ్రిటిష్ వలస పాలకులు తమ విభజించు పాలించు విధానంలో భాగంగా 1909లో మత ప్రాతిపదికగా ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్ ప్రవేశపెట్టారు.బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల ప్రభావంతో కొన్ని సంస్థానాలలో 20వ శతాబ్దం ప్రారంభంలో(ట్రావన్‌కోర్,బరోడా వగైరా) బ్రాహ్మణేతరులకు ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత రిజర్వేషన్లు కల్పించారు.1921లో మద్రాస్ ప్రెసి డెన్సీలో జస్టిస్ పార్టీ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు అమలుచేసింది.ఈరిజర్వేషన్లు ప్రధానంగా జమీం దార్లు,భూస్వాములు బలంగాఉన్న శూద్రకులాలకు ఉద్దేశించబడ్డాయి.అస్పృస్యతకు గురవుతున్న షెడ్యూ ల్డ్ కులాలకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నిర్విరామ ఆందోళన,కృషి ఫలితంగా మొదటి సారి గా1935లో ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చా యి.స్వాతంత్య్రం వచ్చిన తర్వాతగానీ షెడ్యూ ల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించబడలేదు. షెడ్యూల్డ్ తెగలలో కుల వ్యవస్థ, అస్పృశ్యత లేకపోయినా సాంస్కృతిక, విద్య, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.అప్పుడు కూడా వెనక బడిన కులాల అభివృద్ధి విషయం రాష్ట్రాలకు వదిలి వేయబడిరది.వర్ణ వ్యవస్థ లోని సామాజిక అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కులాలన్నీ రిజర్వే షన్లకు అర్హులు. ఈ అంశాన్నిబట్టే అనేక ఆధిపత్య శూద్రకులాలు బి.సిజాబితాలో చేర్చబడి రిజర్వే షన్లు అనుభవిస్తున్నాయి. ఇంకాఅనేక కులాలు అటు వంటి డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నాయి. కానీ వర్ణ వ్యవస్థలో సామాజికంగా అగ్రవర్ణాల కన్నా దిగువస్థాయిగా పరిగణించబడే శూద్ర కులా లన్నీ ఒకే మోస్తరుగా వెనకబడిలేవు.వాటిల్లో కొన్ని గ్రామీ ణ సమాజంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం ఈ కులాల్లో ధనాఢ్య వర్గాలు అభివృ ద్ధి అయ్యాయి. ఈ తరగతులలోని నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనం అందాలంటే ఆర్థిక కొలబద్దను వినియోగించడం తప్ప మార్గం లేదు. అందుకే బిసి తరగతులకు క్రీమీలేయర్‌ను మినహాయిస్తూ ఆర్థిక పరిమితి విధించబడిరది.
సామాజిక అంశాన్ని రిజర్వేషన్లకు ఏకైక కొలబద్దగా ఉంచాలనేవారు సామాజిక వెనకబాటు తనం అన్ని కులాలకు, తరగతులకు ఏకరూపంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. సామా జిక పీడన అసలైన రూపం అస్పృశ్యత, అంటరాని తనం. ఇది దళితులకు మిగతా అందరికీ మధ్య ఉన్న సామాజిక అగాధం.దళితులు ఎదుర్కొం టున్న సామాజిక దుస్థితికి, ఇతరులు ఎదుర్కొనే సామాజిక వెనకబాటుతనానికి పోలిక లేదు. అలాగే సేవాకులాలకు మిగిలిన శూద్రకులాలకు, ముఖ్యం గా వ్యవసాయ కులాలకు మధ్య ఉండే సామాజిక వ్యత్యాసం అనేక రూపాలలో కొట్టొచ్చినట్లు కనపడు తుంది. చాలా సందర్భాలలో శూద్ర కులాలలోని ఆధిపత్య కులాలు సామాజిక వివక్ష పాటింపులో ముందుంటున్న స్థితిచూస్తున్నాం.అగ్రకులాల్లో సైతం ఉపశాఖల మధ్య సామాజిక తారతమ్యాలు,హోదా వ్యత్యాసాలు ఉంటున్నాయి. అందుకే కుల వ్యవస్థను డాక్టర్ అంబేద్కర్ నిచ్చెన మెట్లతో పోల్చారు. వైవిధ్య రూపాలలో కొనసాగుతున్న సామాజిక వివక్షపై పోరాడాలంటే అందరికీ ఒకే కొలబద్దలు సరిపోవు. దేశంలో ప్రస్తుతం సామాజిక బృందాలపై ఆధార పడిన వర్టికల్ రిజర్వేషన్లతో పాటు, ఇతర అంశా లను పరిగణనలోకి తీసుకున్న సమాంతర రిజర్వే షన్లు కూడా అమలవుతున్నాయి.మహిళలు, విక లాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు, వెనకబడిన ప్రాంతాలు, స్థానికులు-స్థానికేతరులు వగైరా రిజర్వేషన్లుకూడా అమలవుతున్నాయి. రిజర్వే షన్ల వర్తింపునకు సామాజిక అంశంతో పాటు అనేక అంశాలను పరిగణిస్తున్నారన్నది గమనించ వచ్చు. అందుకే ఈ సమస్యపట్ల ఒక సమగ్ర దృక్పథం అవసరం.
ఇ.డబ్యూ.ఎస్.రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముం దుకు వచ్చిన మరికొన్ని వివాదాలను పరిశీలించాలి. ‘ఆర్థిక కొలబద్ద’సమంజసత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మెజారిటీతో ఏకీభవిస్తూనే,10 శాతం ఇ.డబ్ల్యు.ఎస్ రిజర్వేషన్ 50శాతం పరి మితిని దాటుతున్నందున అది న్యాయబద్ధం కాదని ఇద్దరు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అభిప్రా యాన్ని తిరస్కరిస్తూ మెజారిటీ తీర్పు 50శాతం పరిమితి అనుల్లంఘనీయమైనదేమీ కాదని కొట్టి పారేసింది.ఈవ్యాఖ్యానం1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విధించిన పరిమితిని వివా దాస్పదం జేసింది.సిపిఐ(ఎం)తో పాటు అనేక ఇతర శక్తులు50శాతం సీలింగును తొలగించాలని, అప్పు డే రిజర్వేషన్లకు అర్హులైన ఇతర తరగ తులను ఆ పరిధిలోకి తీసుకురావచ్చని వాదిస్తూ వస్తున్నాయి. తీర్పు ఈ వాదనలను బలపరుస్తున్నది. మండల్ కమిషన్ సిఫార్సులు అమలయినప్పుడు ఓబిసి రిజర్వేషన్లు 27శాతంగా నిర్ణయించడానికి 50శాతం పరిమితి తప్ప వేరే కొలబద్దేమీ లేదు. ఇప్పుడు 50శాతం పరిమితి అనుల్లంఘనీయం కానప్పుడు ఓబిసిలకు, ఎస్సి, ఎస్‌టిల వలే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అవస రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓబిసి జనాభా నిష్పత్తిని నిర్ణయించేందుకు సరైన లెక్కలు ప్రస్తుతం లేవు. ఉజ్జాయింపుగా లెక్క వేయ డానికి బ్రిటిష్‌వారు నిర్వహించిన 1931సెన్సస్ వివరాలను వినియోగించుకుంటున్నారు.ఈ సమా చార లేమిని సరిజేసేందుకు అందరూ కోరుతు న్నట్లుగా జనగణన సందర్భంగా ఎస్సి, ఎస్‌టితో పాటు అన్ని కులాల గణన చేయడం అవసరం. అప్పుడే కొన్ని వివాదాలు సక్రమంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం ఈవిషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ధర్మాసనం10శాతం ఇ. డబ్ల్యు.ఎస్ రిజర్వేషన్‌ను వర్తింపజేసిన తీరు కూడా వివాదాస్పదం అయింది. ఇ.డబ్ల్యు.ఎస్ రిజర్వేషన్ ఇప్పటివరకు రిజర్వేషన్ అనుభవించని తరగతులకు (నాన్ రిజర్వుడ్ కేటగిరీకి) మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. అంటే ఈ పది శాతానికి ఎస్సి,ఎస్టి,బిసిలోని పేదలను అనర్హులను చేయడం ద్వారా ఇంతకుముందు ఉన్న50శాతంలో పోటీపడే అవకాశాన్ని 40 శాతానికి కుదించినట్లయింది. 10శాతం ఇ.డబ్ల్యు.ఎస్ రిజర్వేషన్‌ను జనరల్ కేటగిరీగా భావించి దానికి అన్ని తరగతులలోని పేదలను అర్హులుగా చేయడంద్వారా లోపాన్ని సరి దిద్దాల్సి ఉంది. లేనియెడల ఎస్సి,ఎస్టి,బిసి పేదలు గతంలోఉన్న సౌకర్యాన్నికోల్పోతారు. అంతే కాక ఇ.డబ్ల్యు.ఎస్ రిజర్వేషన్లు10శాతం ఉండాలని ఏకొలబద్ద ప్రకారం నిర్ణయించారన్న విమర్శకు తావు లేకుండా పోతుంది.ఇ.డబ్ల్యు.ఎస్ రిజర్వే షన్లకు అర్హత నిర్ణయించేందుకు ప్రభుత్వం ప్రతి పాదించిన ఆర్థిక పరిమితి, మంచి చెడుల జోలికి సుప్రీంకోర్టు పోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన 8 లక్షల రూపాయల ఆదాయం, ఐదెకరాల భూమి, వెయ్యి అడుగుల ఇల్లు, వంద గజాల స్థలం పరిమితి సంపన్నులను కూడా రిజర్వేషన్లకు అర్హులను చేస్తున్నది. నిరుపేదలు మాత్రమే అర్హులయ్యే పద్ధతి లో ఆర్థిక పరిమితిని తిరిగి నిర్ణయించకపోతే ఇ. డబ్ల్యు.ఎస్ రిజర్వేషన్ల లక్ష్యం పూర్తిగా దెబ్బతిం టుంది.ఈ వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్క రించి అమలు చేయకపోతే వివాదాలు అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి జస్టిస్ దారువాలా రిజర్వేషన్ల విధా నాన్ని సమీక్షించాలన్న అభిప్రాయాన్ని వెల్లడిరచారు. ఇటువంటి వాదన కోర్టు బయట అనేకమంది వివిధ సందర్భాలలో గతంనుండి వ్యక్తంచేస్తున్నారు. ఆర్ఎ స్ఎస్ అధినేత గతంలో బహిరంగంగానే ఈ అం శాన్ని ప్రస్తావించారు. క్రమేణా కొన్ని తరగతులలో, మీడియాలో రిజర్వేషన్ వ్యతిరేక ధోరణి ప్రబలు తుందనడానికి ఇదొక నిదర్శనం. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాలలో ప్రభుత్వ రంగం విస్తరించి,పాలనా వ్యవస్థ పెరిగింది. దీని మూలంగా రిజర్వేషన్ల వలన విద్యా, వైద్య, ప్రజా ప్రాతినిధ్య రంగాలలోకి కొన్ని కుటుంబాలు అభి వృద్ధి కావడానికి తోడ్పడిరది. కానీ అత్యధికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నాలుగు దశాబ్దా లలో వచ్చిన విధాన మార్పులతో ఉన్న పరిమిత రిజర్వేషన్ సౌకర్యం కూడా నిరుపయోగం అవు తున్నది. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, యాంత్రీ కరణ మూలంగా విద్య, వైద్యం, ఉపాధి రంగా లలో రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడంలేదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి పాలక వర్గాలు,కార్పొరేట్లు సుముఖంగా లేవు. ఇటు వంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు,వాటిని విస్తరించి పటిష్టం గా అమలుచేయడం అవసరం. మన దేశంలో రిజర్వేషన్ అవసరం తీరిపోయిందని అనుకోవడం తప్పు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం రిజర్వేషన్ అవసరం తీరిపోదు. ఈ పరిమిత సదు పాయాన్ని కొనసాగిస్తూనే రిజర్వేషన్లు అవసరం లేని సమసమాజ స్థాపనకు సాగిపోవాలి.వ్యాసకర్త : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు,(ప్రజాశక్తి సౌజన్యంతో..)