రాష్ట్రాన్ని వెంటాడుతున్న ప్రకృతి విఫత్తులు

ఏదోక ప్రాంతంలో తుఫాన్లు వెంటాడుతున్నాయి. కోస్తాంధ్ర, తీరాలను పెథాయ్‌ తుపాను వణికించింది. అక్టొబరులో తిత్లీ, డిసెంబరు 15న పిథాయ్‌, గత ఏడాదిలో గజ, 2014లో హూదూద్‌..ఇలా ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఏదో ఒకప్రకృతి విపత్తు భయపెడుతూనే
ఉంది.- గునపర్తి సైమన్

‌రాష్ట్రంలో తుపాన్లు వెంటాడుతున్నాయి. ఏపీలో మూడు, నాలుగు నెలలకోసారి వచ్చి పలకరిస్తున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట తుపాను తన ప్రతాపాన్ని చూపుతోంది. మొన్న తిత్లీ, నిన్న గజ, నేడు పెథాయ్‌.. ఇలా వరుసగా తుపాన్లు వస్తూనే ఉన్నాయి. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం అతలాకుతలం కాగా, గజ తుపాను మరికొన్ని జిల్లాలను గజగజ వణికించింది. తాజాగా పెథాయ్‌ కూడా హాయ్‌ అని పలకరించింది. తుపాను తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ- రాజోలు మధ్య తీరం దాటి తన ప్రభావాన్ని తగ్గించుకుంది. అయితే తుపాను ధాటికి ఆ జిల్లా అతలాకుతలమైంది. భారీగా వీచిన గాలులు, జోరుగా కురిసిన వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రోడ్డు రవాణా నిలిచిపోయింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది.
2014లో హుదూద్‌.. 2018లో తిత్లీ తుపాన్లు ఉత్తరాంధ్రను వణికించాయి. అక్టోబరు, నవంబరు తుపాన్ల సీజన్‌లో మళ్లీ తుపాను వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర వాసులు హడలిపోతున్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. హుదూద్‌ మిగిల్చిన విషాదం నుంచి తేరుకోని కుటుంబాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. తాజాగా తిత్లీ తుపాను శ్రీకాకుళం, విజయనగరంల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పంట పొలాలు, కొబ్బరి, జీడి, నివాసాలు, పశువుల పాకలు ఇలా అన్నింటినీ తుడిచిపెట్టింది. పది రోజులు దాటినా శ్రీకాకుళం ప్రజలకు తాగునీరు, విద్యుత్‌, ఆహారం వంటివి పునరుద్ధరించలేదు. అదే విధంగా డిసెంబరు 15న సంభవించిన పిథాయ్‌ తుఫాన్‌ ఉభయగోదావరి,కృష్ణ, కోస్తాతీరప్రాంతంలోని వ్యవసాయాన్ని విచ్ఛన్నం చేసింది. లక్షలాది ఎకరాల్లో చేతకందిన పంటలు నీటమునిగి సర్వనాశనమయ్యాయి. దీంతో కోట్లాది రూపాయల పంటనష్టం వాటిల్లింది. ఎంతోమంది రైతులు, రైతుకూలీలు మృత్యువాత పడ్డారు.
తుపాను బారిన పడిన వారిని ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వాలు నష్ట నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. పైగా అపారనష్టం కలిగేలా తీరాన్ని ధ్వంసం చేసే విధానాలకు తెరతీస్తున్నాయి. తుపాన్లను ఎటూ అడ్డుకోలేం. కనీసం అవి కలిగించే నష్టాన్ని తగ్గించేందుకు తీర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకూ మడ అడవులను పరిరక్షించాలి. ఉన్నవాటిని నరికేయకుండా ఉండటం, లేని చోట వాటిని పెంచడం వల్ల తుపాన్లు తీరాలను తాకేటప్పుడు సముద్రం నుంచివచ్చే తీవ్ర, పెనుగాలల వేగాన్ని అడ్డు కుని కొబ్బరి చెట్లు, నివాసాలు, ఇతరత్రా కూలిపోకుండా మడ అడవు లు రక్షిస్తాయి. వీటిని ద ృష్టిలో పెట్టుకునే 2011లో కేంద్ర అటవీ, పర్యావరణ, సాంకేతిక మంత్రిత్వశాఖ తీరప్రాంత నిర్వహణ (సిఆర్‌ జెడ్‌) పేరుతో పలు నిబంధనలను రూపొందించింది. అధిక పోటు పాటు (హెచ్‌టిఎల్‌) నుంచి 500 మీటర్ల వరకు పక్కా నిర్మాణాలు చేపట్టరాదని చట్టం చేసింది. అయినా కూడా ఫార్మా కంపెనీలు, హోటల్‌ యజమాన్యాలు వాటిని ఉల్లంఘించి ఎప్పటికప్పుడు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నుంచి జిఒలు పొంది యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నాయి. తాజాగా కేంద్రం ఆదేశాలతో ఎపికోస్టల్‌ జోన్‌ మేనేజ్‌ మెంట్‌ ప్లాన్స్‌ (సిజెడ్‌ఎంపి) ప్రకారం హెచ్‌టిఎల్‌ నుంచి 500 మీటర్ల వరకు పక్కా నిర్మాణాలు చేపట్టరాదన్న వాటికి స్వస్తి పలికి 100 మీటర్లు, కొన్ని చోట్ల 200 మీటర్లకు కుదించారు. వీటిపై తాజాగా ఎపిలోని అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతున్నారు. వీటి వల్ల తీర ప్రాంత నిర్వహణ అస్తవ్యస్తమవుతోంది. తీరం అంచునే వందల అడుగుల లోతులో బోరు బావులు వేయడం, మడ అడ వులను నరికేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడు తున్నారు. వీటి వల్లే తుపాను సమయాల్లో సముద్రం ముందుకు రావడం, పెను గాలులు విరుచుకుపడటంతో అపారమైన నష్టాలను చవిచూడాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈవిపత్తులు ఎందుకు జరుగుతున్నాయి?
దేశంలో ఉన్న ప్రధాన పట్టణాలు సేఫ్‌ జోన్‌లో లేవా? ఎందుకు కేవలం పట్టాణాలే ముంపుగురవుతున్నాయి. కారణాలు ఎన్నో..కానీ బలవుతున్నది మాత్రం సామాజిక జనమే. కాంక్రిట్‌ జంగిల్‌, అల్ట్రా మోడ్రన్‌ సిటీగా మారుస్తామని చెబుతున్న ప్రజాప్రతి నిధులు, అధికారపార్టీలు..ఎందుకు ఈ విపత్తుపై సమగ్రంగా ఎదురు కోవడం లేదు అన్న ప్రశ్నలు సామాన్య జనంలో ఉత్పన్నమౌతున్నాయి. దేశంలో ఎన్ని పట్టణాలు సేఫ్‌జోన్‌లో ఉన్నాయి… అధికారుల నోటిలో సమాధానం ఉందా? అంటే దాదాపుగా దొరకదు. తాజాగా ఘోర విఫత్తు ఎదురుకుంటున్న చెన్నై,కేరళ ఇంతటి ధారుణానికి గురికా వడానికి పలు కారణాలు కూడా లేకపోలేదు. ఇందుకు గల కారణాలు పర్యా వరణ శాస్త్రవేత్తలు అంచనాలు వేచారు. ముఖ్యంగా చెన్నై లో మూడు నదులు ప్రవహిస్తాయి. కొసస్తతలయార్‌, కూవూం, అడయార్‌ నదులు ప్రవహిస్తాయి. అయితే ఈనది పరివాహక ప్రాంతాలు ఆక్రమణకు గురికావడం వల్ల నదులు యొక్క పరిమాణం తగ్గాయి. అంతే కాకుండా బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన బంగింగ్‌ హామ్‌ కెనాల్‌ నిర్వహణ గురించి ప్రస్తుతం ఉన్న పాలకులు పట్టించుకోకపోవడం. చెన్నై నగరంలో డ్రైనేజీ సిస్టమ్‌ సరిగా లేకపోవడం, ఇకపోతే గత ప్రభుత్వ హాయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వరదనీరు నేరుగా నదుల్లో పడే విధంగా కాలువలు తొవ్వారు, అయితే వాటిని తాజా ప్రభుత్వం అసంపూర్తిగా నిలిచిపోవడమే ప్రదాన కారణాలుగా కనిపిస్తు న్నాయి. చెన్నై నగరంలో దాదాపుగా 600 పైగా చెరువులు ఉండేవి, కానీ ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా కనిపించుకుంటా పోయాయి. దీనికి చెరువులు కూడా ఆక్రమణకు గురికావడమే ప్రధాన కారణం. అయితే ఇవ్వనీ సక్రమంగా ఉంటే చెన్నై లో ఇంత భీభత్సం ఉండక పోయేదని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఓ ప్రణాళిక లేకుండా జరిపిన నిర్మాణాల వల్లనే ఈదుస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి పదేండ్లలో ఒకసారి ఇటువంటి భారీ వర్షాలు చెన్నై కి అనుభవమే. 1969, 1976, 1985, 1996, 1998, 2005, 2015 లో కుండపోత వర్షాలు కురిశాయి.
పెరుగుతున్న విఫత్తులు :
ఇటీవలి కాలంలో సంభవిస్తున్న అనేక ప్రకృతి విపత్తులకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అలాప్రకృతి విపత్తుల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న 15 దేశాల జాబితాను 2018 వరల్డ్‌ రిస్క్‌ రిపోర్ట్‌ ప్రచురిం చింది. ఆ జాబితాలో భారత్‌ పొరుగు దేశం బంగ్లాదేశ్‌ కూడా ఉంది. భూకంపాలు, సునామీ, తుపాన్లు, వరదల లాంటి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉన్న 172 దేశాలను ఈ రిపోర్ట్‌ అధ్యయనం చేసింది. దాంతో పాటు ఆవిపత్తులకు ఆయా దేశాలు స్పందించే శక్తిని కూడా అంచనా వేసింది. జర్మనీకి చెందిన వివిధ సంస్థలు సంయుక్తంగా చేసిన ఈ అధ్య యనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తు న్నారు. గత ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా ఇళ్లను కోల్పోయి వలస వెళ్లిన వారిలో సగం మంది 18 ఏళ్ల లోపు వాళ్లేనని ఐరాస చెబుతోంది. ప్రమాదం పొంచి ఉన్నప్రాం తాలు (ఆధారం:వరల్డ్‌ రిస్క్‌ రిపోర్ట్‌ 2018)
వ.స దేశం ప్రమాద తీవ్రత సూచీ (100కు)

 1. వానువాటు 50.28
 2. టోంగా 29.42
 3. ఫిలిప్పీన్స్‌ 25.14
 4. సోలోమన్‌ దీవులు 23.29
 5. గుయానా 23.23
 6. పపువా న్యూ గినీ 20.88
 7. గ్వాటెమాలా 20.60
 8. బ్రూనే 18.82
 9. బంగ్లాదేశ్‌ 17.38
 10. ఫిజీ 16.58
 11. కోస్టారికా 16.56
 12. కంబోడియా 16.07
 13. ఈస్ట్‌ టైమర్‌ 16.05
 14. ఎల్‌ సాల్వడర్‌ 15.95
 15. కిరీబాటీ 15.42
  ఈ జాబితాలో ఎక్కువగా దీవులే ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుండటంతో, వాటికి పొంచి ఉన్న ప్రమాదం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అన్నిటి కంటే దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న వనువాటు దీవి పరిస్థితే మరింత ప్రమాదకరంగా ఉంది. ప్రకృతి విపత్తుల ప్రమాదంతో పాటు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాను రూపొందించారు. అందుకే నిత్యం భూకంపాల బారిన పడే జపాన్‌, చిలీ లాంటి దేశాలు ఈ జాబితాలో కనిపించలేదు. అలాగే వందల ఏళ్ల పాటు పెరుగుతున్న సముద్ర మట్టం సమస్యతో పోరాడిన హోలాండ్‌ కూడా జాబితాలో 65వ స్థానంలో ఉంది. ఈ దేశాలు విపత్తుల ప్రమాదాన్ని తగ్గించలేకపోవచ్చు, కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోగలవని ఆ నివేదిక చెబుతోంది. ఈఅధ్యయనం ప్రకారం అత్యంత తక్కువ ప్రమాదం పొంచి ఉన్న దేశం ఖతార్‌.
  ప్రకృతి విపత్తుల ప్రమాదం తక్కువ
  2030 నాటికి 32కోట్ల మంది ప్రజలు విపత్తులు ఎక్కువగా పొంచి ఉన్న ప్రాంతాల్లో జీవిస్తారని అంచనా. ఈ విపత్తులు ప్రజల జీవితాలను నాశనం చేయడంతో పాటు దేశాలను మరింత పేదరికంలోకి నెట్టేస్తాయి. ఇథియోపియాతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతా ల్లో అనారోగ్యం, వరకట్నాలతో పాటు కరవు లాంటి విపత్తులు కూడా ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తున్నాయని ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక చెబుతోంది. ‘గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంభవిం చిన ఫైలిన్‌ తుపానునే తీసుకుంటే ఆ తుపాను ధాటికి ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం తక్కువే. కాబట్టి ఆప్రాంతానికి ఆర్థిక సాయం భారీగా అందలేదు. అది ప్రజల జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపింది. చనిపోయే వారి సంఖ్యకూ, ఆర్థిక సాయానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది’ అని ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఓడీఐ)కు చెందిన డాక్టర్‌ మిషెల్‌ వివరిస్తారు. ప్రకృతి విపత్తుల కారణంగా మరింత పేదరికంలో జారిపోయే దేశాల జాబితానూ ఓడీఐ తయారు చేసింది. అందులో బంగ్లాదేశ్‌ తొలి స్థానంలో ఉంది.
  ‘తిత్లీ’ తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్‌
  2012 నాటి ‘మ్యాపిల్‌ క్రాఫ్ట్‌’ నివేదిక ప్రకారం…ఆసియాకు చెందిన బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మయన్మార్‌, భారత్‌, వియత్నాం లాంటి దేశాలకే ఎక్కువగా ప్రక ృతి విపత్తుల ప్రమాదం పొంచి ఉంది. విపత్తులను నివారించలేకపోయినా, వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితే నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. ఆవిషయంలో ఒడిశాను స్ఫూర్తిగా తీసుకో వచ్చని పర్యావరణ నిపుణులు చెబుతారు. 1999లో ఒడిశాలో సంభ వించిన తుపాను ధాటికి పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పో యారు. ఆ తుపాను నుంచి ఒడిశా చాలా పాఠాలు నేర్చుకుంది. గత 20 ఏళ్లలో తుపాన్లను ఎదుర్కోవడానికి పక్కాగా సన్నద్ధమైంది. దానికోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని సైతం తీసుకుంది. ఈ క్రమంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీ సహకారంతో దాదాపు 900 తుపాను సహాయక శిబిరాలను నిర్మించింది. ‘1999 పెను తుఫాను తరువాత మేం పాఠం నేర్చుకున్నాం. ఆపైన ఎలాంటి విపత్తు ఎదురైనా సమర్థం గా ఎదుర్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం.
  1999 తరువాత ఒడిశా ఏమేం చర్యలు తీసుకుంది?
  ఐఐటీ-ఖరగ్‌పూర్‌ సహాయంతో 879 తుపాను, వరద సహాయక శిబిరాలను నిర్మించారు. లక్షమందికి పైగా బాధితులకు ఆవాసం కల్పించేందుకు 17వేలకు పైగా ప్రత్యేక కేంద్రాలను నిర్మించారు. తీర ప్రాంతాల్లో 122 సైరన్‌ టవర్లతో పాటు, తుపాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 17 జిల్లాల్లో ‘లొకేషన్‌ బేస్డ్‌ అలారం వ్యవస్థ’ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజలకు తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందించారు. బలమైన గాలులను తట్టుకునేలా తీరప్రాంతంలో ఇళ్ల గోడలు, పైకప్పులను పటిష్ఠ పరిచారు.మత్స్యకారుల కోసం ప్రత్యక వార్నింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు
  తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
  తుపాను వచ్చినపుడు ఏం చేయాలి? తుపాను నుంచి ఎలా తప్పించుకోవాలి? తుపాను రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? భారత వాతావరణ శాఖ చెబుతున్న సూచనలు ఇచ్చాంది. తుపాను వస్తుందన్న సమాచారం అందిన వెంటనే ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేయాలి. పెంకులు,పైకప్పు,తలుపులు,కిటికీలు ఎలా ఉన్నాయో చూసి తగిన మరమ్మతులు చేయాలి. ఇంటి పరిసరాలనూ పరిశీలిం చాలి. ఎండిన చెట్లు, కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను తొలగిం చాలి. గాలికి ఎగిరి వచ్చి పడే అవకాశమున్న హోర్డింగ్‌లు, ఇతర భారీ వస్తువులను తొలగించాలి. కిటికీల దగ్గర, గాజు పదార్థాలకు ముందు చెక్కలను అడ్డుగా పెట్టాలి. దీని వల్ల గాలికి కొట్టుకుని వచ్చి తగిలే వస్తువుల నుంచి వాటికి, ఇంటికి రక్షణ లభిస్తుంది. ఒకవేళ చెక్క పదార్థాలు లేకుంటే.. కిటికీలకు, గాజు పదార్థాలకు కాగితాలను అంటించాలి. కరెంటు పోయి నపుడు వెలుగు కోసం లాంథర్లు, కిరోసిన్‌ దీపాలు, ఇతర ఫ్లాష్‌ లైట్లు, బ్యాటరీలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పాడైన, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను వెంటనే తొలగించాలి. కరెంటు పోయినపుడు టీవీలు పని చేయవు. మరి వాతావరణ సంబంధిత హెచ్చరికలు అందుకోవడం ఎలా? అందు కోసం మొబైల్‌ ఫోన్లను చార్జ్‌ చేసి పెట్టుకోవాలి. లేకుంటే రేడియోలను సిద్ధం చేసుకోవాలి. మీకు అందిన తుపాను సంబంధిత అధికారిక సమాచారాన్ని ఇతరులకూ చేరవేయాలి. విపత్తు సమయాల్లో వదం తులు వ్యాపించే అవకాశం ఎక్కువ. అందువల్ల మీకు అధికారిక వెబ్‌ సైట్లు వార్తా సంస్థలు అందించిన సమాచారాన్నే ఇతరులకు చేరవేయండి. అనుమానాస్పద సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేయొద్దు. భారీ అలలు ఎగసి పడే అవకాశమున్న సముద్రతీరాల వద్ద తుపాను సమయంలో ఉండకూడదు. వరదవచ్చే అవకాశం ఉన్నచోట ఉంటే.. వెంటనే ఖాళీ చేసి పునరావాస శిబిరాలు, లేకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. విలువైన వస్తువులను వీలైతే తీసుకెళ్లాలి. లేకుంటే ఎత్తైన చోట ఉంచాలి.వండాల్సిన అవసరం లేకుండా వెంటనే తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రెండు మూడు రోజులకు సరిపడా సిద్ధం చేసుకోవాలి. అలాగే సురక్షిత తాగునీరు, దుస్తులు కూడా. గాలి బలంగా వీస్తున్నపుడు దానికి ఎదుటివైపు తలుపులను, కిటికీలను తెరవకూడదు. గాలి ప్రభావం లేని వైపు తలుపులు, కిటికీలు తెరవ వచ్చు. మీరున్న చోట నుంచి తుపాను తీరం దాటుతున్నా లేకుంటే తీరం దాటి వస్తున్నా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గంటల పాటు భారీ వర్షాలు, బలమైన గాలులకు సిద్ధంగా ఉంటూ సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలి. చిన్నారులను మరింత సురక్షిత ప్రదేశాలకు పంపాలి. వేలాడే విద్యుత్తు తీగలు కనిపిస్తే వాటిన తాక వద్దు. ఆ ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి అదుపులోకి వచ్చాక రిపేర్లు చేయించుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉన్న సమాచా రాన్ని మీ బంధువులకూ చేరవేయాలి. వాహనాలను నడుపుతున్నపుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయాలి.