రాజ్యాంగ హక్కులు కోల్పోతున్న ఆదివాసీలు
‘‘ ఆదివాసీలు అడవితల్లి ముద్దు బిడ్డు.ఈ సమాజానికి మూవాసు. భారత దేశానికి అసు వారసు. నీతి నిజాయితీకి నిువెత్తు నిదర్శనం.ఆదివాసీలు నేడు72వ సంవత్సరా స్వతంత్య్ర భారతావనిలో తమ అస్థిత్వం కోసం, మనుగడ కోసం అల్లాడిపోతునÊఆనరు. ఈ మట్టిలోనే కసి పోతున్నారు. సామ్రాజ్యవాద అభివృద్ధఇ నమూనాలోనే ఆదివాసీలు అంతం అవుతున్నారు. వారి హక్కుఉు హరించిపోతున్నాయి. దేశ దళారీ పాకవర్గాలు ఆదివాసులు అంతం చేసి వారి సమాధుపైనే అభివృధ్దికి పునాదు వేస్తున్నారు. మేకు బలి ఇస్తారు..పులను బలి ఇవ్వరు అన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మాటు అక్షర సత్యాుగా చరిత్రలో నిలిచాయి. మన కల కన్నా తెంగాణ కన్నీరు పెడుతుంది’’
తెంగాణ ప్రభుత్వం 2016 నుంచి చేపట్టిన హరితహారం ఆదివాసీ ప్రజ మెడకు ఉరితాడుగా మారుతున్నది. 230కోట్ల మొక్కు నాటి ( పెంచటం కాదు) ప్రపంచ రికార్డ్ నెక్పొుతున్నట్టు చెప్పుకొన్న ప్రభుత్వం తెంగాణలో 24శాతమే అటవీ భూమి ఉందని,అందులో ఈఅయిదేండ్లలో 100కోట్ల మొక్కు నాటి అడవుల్ని దట్టంగా తయారు చేస్తామని ప్రకటించింది. హరితహారం క్ష్య ప్రకటనలోనే ‘’అటవీ భూముల్ని దురాక్రమణ నుంచి’’ కాపాడుతామన్నది. ఇక్కడ దురాక్రమణ దారు నగానే ఎవరో మైనింగ్ మాఫియా అనో, ‘’రియల్’’ మాఫియా అనో మనం పొరపడకూడదు. వారి దృష్టిలో దురాక్రమణదారుంటే జీవిక కోసం పొడు చేసుకుని బతికే పేద గిరిజన ఆదివాసులే. హరిత హారానికి ఈ ఏటితో ఐదేండ్లు పూర్తవుతాయి. ఇప్పుడు రాష్ట్రం నందనవనం కాలేదు, అడవు సందు లేకుండా దట్టంగా కాలేదు. కానీ హరితహారం పేరుతో ప్రభుత్వం మాత్రం ఈ అయిదేండ్లుగా ఏజెన్సీ ప్రాంత ఆదివాసు అనుభవంలోని క్షలాది ఎకరా పోడు భూమిని బవంతంగా స్వాధీనం చేసుకుంటూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముకపల్లి మండం అన్నారం అనే ఒక్క హమ్లెట్ గ్రామంనుండే హరితహారానికి ఏటా 50ఎకరా చొప్పున ఇప్పటిదాకా 250ఎకరాు స్వాధీనం చేసుకున్నారు. భూమి కోల్పోయిన వాళ్లంతా కోయు. అదే మండంలో పది చిన్న గ్రామాల మద్య గల ఉమ్మడి శివారులోగ 500ఎకరా భూమిపైకి గత జూన్ నుంచి అటవీ అధికాయి పోలీసుతో వస్తున్నారు. ఈభూమిపై పోడు కొట్టారని ఇరవై మందిపై 2001లోనే కేసు, అరెస్టు అయ్యాయి. ఇంకా ఆ కేసుల్లో వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ ప్రకారంగా అయినా వాళ్ళు అప్పటి నుంచి పోడు చేసుకున్నట్టే లెక్క. 2006లో అటవీ హక్కు చట్టం ప్రకారం 2005 వరకు అనుభవంలో ఉన్న పోడు భూముల్లో కుటుంబానికి నాుగు హెక్టార్ల చొప్పున పట్టాు ఇవ్వాలి. అలా 500ఎకరాల్లో అందరికీ పట్టాు రావాల్సి ఉండగా 50ఎకరాకి మాత్రమే పట్టాు ఇచ్చారు. అన్ని కేసు మధ్య కూడా కనీసం 200 ఎకరాను అప్పటినుంచి ప్రజు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు, వారికి పట్టాు లేవని అటవీ అధికాయి ఆ భూము స్వాధీనానికై దాడు చేస్తున్నారు. పట్టాలు ఉండి, పట్టాలు లేకుండా కగసి పోయి ఉన్న భూముల్లో విచక్షణ లేకుండా కందకాు తవ్వటం, భూమిని తమ స్వాధీనంలోకి తీసుకున్న గుర్తుగా దున్నేయటం చేస్తున్నారు. ఇంకా నిత్య ఉద్రిక్తత, కేసు నడుస్తున్నాయి. ఈ ఫిబ్రవరి మొదటి వారంనుండే ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్పల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో రానున్న వర్షాకాలానికి ముందస్తు ఏర్పాట్లుగా జేసీబీను, ప్రొక్లెయినర్లను ఆదివాసీ భూము పైకి తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా క్ష్మీదేవిపల్లి మండం ఒక్క పునుకుడు చెక గ్రామం నుండే 250ఎకరా పోడు భూమును స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్తూ, రబీకి విత్తనాలు వేయకముందే హరితహారం మొక్క కోసం గుంటు తీయటానికి బయు దేరారు. కేవం ఈ గ్రామంనుంచే గత నాుగు ఏండ్లలో 450ఎకరా పోడు భూమిని ఆదివాసునుండి లాక్కున్నారు. స్వాధీనం చేసుకోగా మిగిలిన భూమి ఇక మీకే ఉంటుందని ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నారు. అదే మండం బొజ్జాయి గూడానిదీ ఇదే పరిస్థితి. పాతిక,ముప్పై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముకు గతంలో అతి కొద్ది మందికి,సెంట్లల్లో భూమి ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాు రాకుండా ఉన్న భూమును, పట్టా లేదు కాబట్టి మీకిక ఆ భూమిపై హాక్కు లేదని,పోలీసు సాయంతో దౌర్జన్యంగా అక్రమిస్తున్నారు. అడ్డువచ్చిన ప్రజపై లాఠీలు, కేసు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 5న మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండం గుంజేడు గ్రామంలో హరిత హారమంటూ గిరిజను భూముపైకి వస్తున్న జేసీబీు, ప్రొక్లైనర్ను అడ్డుకున్నందుకు మహిళతో సహా 13మందిపై పొలీసు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 8న గూడూరు మండం లైన్ తండాలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వానికిదో ఆట, ప్రజకది జీవన్మరణ సమస్య. ఆదివాసుకు సహజ సిద్దంగా అన్నీ అయి ఉండిన అడవిని తమ స్వంత ఆస్తిగా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు, తర్వాత నిజాం,ఇప్పుడు ఈ కాపు ప్రభుత్వాు భావించుకుంటూ అడవితో ఆవిభాజ్యంగా అు్లకున్న జీవితాను అ్లకల్లోం చేస్తున్నారు. ఇంకా అదే మైదాన ప్రాంతపు ఆధిపత్యం, రాజ్యంలోని ప్రతీదీ రాజు స్వంత ఆస్తిగా ఊహించు కునే ఫ్యూడల్ సమాజపు అవశేషాలూ అలాగే కొనసాగుతున్నాయి. ఇలా ఎవరిది కానిదంతా తనదే అనుకునే రాజ్యపు అసంబద్ధ భావనే ఆదివాసును తర తరాుగా కోుకోనివ్వకుండా చేస్తున్నది. చరిత్ర పూర్వయుగం నుంచీ ఆదివాసుకు అడవి అంటే కేవం అందమైన చెట్లు, పచ్చదనం కాదు. అడవేవారి మాతృ భూమి, ఇు్ల, వాకిలి, జీవనాధారం. ఇంకా, వారి సంస్కృతి, ఆచా రాు,మతం దేవుళ్ళు, అన్నీ. ఒక్క అదివాసు కేమిటి! ఈరోజు మైదాన ప్రాంతపు గ్రామీణ, నగర వాసుందరు కూడా శతాబ్దా కింద అడవుల్లో జీవించిన వాల్లే కదా! వ్యవసా యానికి, ఆవాసానికీ తమ చుట్టూ ఉన్న అడవుల్ని నరుకుతూ మైదానాుగా మార్చేశారు. అది నాగరికతైంది. అదేపని ఇప్పుడు ఆదివాసు చేసుకుంటే తప్పెలా అవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రాంతం మనదైనప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రాంతం వారిది కాదా! ఎన్నో అవమానాు,మోసాు గుర్తించి, గుర్తించకుండా భరిస్తూ, అనుభవిస్తూ అడవిపై తమకు గ హక్కుల్ని కోల్పోతూ క్రమంగా అడవిలో మిగిలిన ఒకే ఒకజీవనాధారమైన స్థిరవ్యవసాయానికి ఆదివాసు ఇప్పుడిప్పుడే అవాటు పడుతున్నారు. వారికవసరమైన వ్యవసాయ భూమినివారి స్వంత శివారు అయిన అడవి నుంచి తీసుకోవటం వారి సహజ హక్కు కదా. అవికూడా ఎత్తైన, లోతట్టు ప్రాంతాల్లో దొరికే రాళ్ళు రప్పతో కూడిన భూములే. ఈ భూముకు ఏ సాగునీటి ఆధారము ఉండదు. పూర్తిగా వర్షాదారం. ఇందులో వచ్చే దిగుబడి మైదాన ప్రాంతాల్లో వచ్చే దిగుబడిలో అక్షరాలా పది నుంచి ఇరవై శాతమే ఉంటుంది. ఇటు వంటి ప్రాంతాల్లో మరో జీవనాధారం లేక ఆ పోడు భూమునే నమ్ముకున్న ఆదివాసును దురాక్రమణదాయిగా చిత్రిస్తూ పరిపాకు వారి భూముల్లో ట్రాక్టర్లు పెట్టి దున్నించి, చుట్టూ కందకాు తవ్వుతూ అంతా చిన్నాభిన్నం చేస్తున్నారు. ఏకైక ఉపాధిగా మిగిలిన వ్యవ సాయాన్ని కూడా చేసుకోనివ్వకపోతే వారెలా బతకాలి, ఏం కావాలి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్ష్మీదేవి పల్లి మండం పునుకుడు చెక, బొజ్జాయి గూడెం రెండు గ్రామా పరిధిలో 80 మందిదాకా డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న ప్లిున్నారు. ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. వచ్చే సూచను కూడా లేవు. పోలీసు వారికి క్రికెట్, వాలీబాల్ కిట్లు ఇస్తూ తమ కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. ఇంకా కొంతమందిని నెవారీగా జీతాు ఇస్తూ పోలీస్ ఇన్ఫార్మలుగా మారుస్తున్నారు. దాని పరిణామాు మనం ఊహించుకోవాల్సిందే. ఒకవైపు అర్హతున్న యువతకు ఉద్యోగాలి వ్వకుండా, మరో వైపు కనీస వ్యవసాయానికి కూడా దూరం చేస్తూ హరిత హారం, అడవు సంరక్షణ పేరుతో వారి బతుకుదెరువును విచ్ఛిన్నం చేసే నైతిక అర్హత ప్రభుత్వానికి ఉందా? నిజానికి, పచ్చదనం పెంచానుకుంటే రాష్ట్రంలో పుచగా ఉన్న అటవీ ప్రాంతంలో మొక్కు నాటుతూ, వాటిని రక్షిస్తూ దట్టంగా మార్చవచ్చు. ఇంకా, వ్యవ సాయ భూముల్లో కూడా కొంత భాగంలో అటు వంటి వక్షాు పెంచటాన్ని తప్పనిసరి చేయ వచ్చు. ప్రతీ గ్రామ శివారులో ఉమ్మడి అటవీ ప్రాంతానికి కొంత భూమి కేటాయించ వచ్చు. ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేముందు ప్రతి ఇంటికి ఒక వక్షమైనా పెంచాని షరతు పెట్టవచ్చు. రియల్ ఎస్టేట్ లేఅవుట్లో 10 శాతం భూమిలో భారీవక్షాు ఉండాని నియమం పెట్టవచ్చు. రోడ్ల పక్కన నాటే వాటిలో 80శాతం మొక్కు బతకటం లేదు. వాటిని బతికించవచ్చు.అడవి నుంచి ఆదివాసీ ను నిరాశ్రయును చేయటం అంటే వారి మాతృభూమిపై రాజ్యం దురాక్రమణ చేయటమే అవుతుంది. ఆదివాసీ జీవించే హక్కును కారాసే,అందరి అవసరాకూ ఆదివాసునే బలిచేసే విధానాన్ని పాలకలు మానుకోవాలి. ప్రతి కుటుంబానికి కనీసం నాలుగు హెక్టార్లు స్వంత భూమి వుండేటట్టు చూడాలి. ఆ భూమికి సాగు నీరు, ఇతర సౌకర్యాు కల్పించాలి.
-ఎస్. తిరుపతయ్య