రాజముద్రతో..భూ పట్టాదారు పాస్‌పుస్తకాలు

త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.ప్రజలపాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం15కోట్లు జగన్‌ ప్రభుత్వం తగలేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు,ప్రజల కోరిక మేర కు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేం దుకు ప్రభుత్వ నిర్ణయించిందన్నారు. రాజము ద్రతో ఉన్న పుస్తకాన్ని అధికారులు ముఖ్యమం త్రికి చూపించారు.క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆస్తి వివరాలు,ఆ ఆస్తి అడ్రస్‌ వద్దకు తీసుకు వెళ్లే మ్యాప్‌ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు.రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్‌ కోరిక తీర్చేందుకు 650 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కేంద్రం చెప్పిన రీసర్వేలో ఎక్కడా రాళ్లుపాత మని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్‌ గ్రానైట్‌రాళ్లు సిద్ధం చేశారు.జగన్‌ బొమ్మ ఉన్న 77లక్షల గ్రానైట్‌ రాళ్లను ఏమి చేయాలి అనేదానిపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది.ఆ రాళ్ల పై బొమ్మలు చెరపడానికి మరో 15కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలి కంగా అంచనా వేశారు. జగన్‌ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా 700కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అయ్యింది.ఆ గ్రానై ట్‌ రాళ్లను ఎలా ఉప యోగించు కోవచ్చు, వాటితో ఏం చెయ్యవచ్చో చూడమని ముఖ్య మంత్రి చంద్రబాబు అధికా రులను ఆదేశిం చారు. రెవెన్యూ శాఖలో పరిస్థి తులు,మదనపల్లి ఫైల్స్‌ దగ్దం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి చంద్ర బాబు సమీక్ష నిర్వహించారు.గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు,అవి దుర్వినియోగం అయిన తీరుపై చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై సమీక్షిం చారు. పెరిగిన భూవివాదాల నేపథ్యంలో ప్రజ లకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకు రావాల్సిన చర్యలపై చర్చించారు.ల్యాండ్‌ గ్రాబింగ్‌ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవా ల్సిన అవసరం ఉందా,ఎటువంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపైనా చర్చ జరిగింది.
పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండ కూడదు.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమా వేశంలో ప్రస్తా వించిన చంద్రబాబు,భూ యజ మానుల కిచ్చే పట్టాదారు పాస్‌ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు.పార్టీల రంగులు,నేతల ఫొటోలు ఉండ కూడదన్నారు.తాము రూపొం దించిన పట్టాదారు పాసు పుస్తకం నమూనాను అధికా రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా,దానిలో కొన్ని మార్పులను సూచించారు.పట్టా దారు పాసు పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు…
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గృహ నిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు,పట్టణాల్లో రెండు సెంట్లు స్ధలం కేటాయించాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణశాఖ మంత్రి పార్ధసారధి వెల్లడిరచారు. గత ప్రభుత్వం ఇళ్లపట్టాల కోసం భూ సేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
వంద రోజుల్లో 1,25లక్షల ఇళ్ల నిర్మాణం
ఇళ్ల నిర్మాణమనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు.రాబోయే వంద రోజుల్లో 1.25లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.వచ్చే ఏడాది కాలంలో 8.25లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడిరచారు.గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఇళ్ల లబ్దిదారులను పక్కన పెట్టేసిందన్నారు.ఇళ్లు పూర్తియినా పేమెంట్లు చెల్లించలేదని,ఇలాంటి బాధిత లబ్దిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించారు.మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో హౌసింగ్‌లోనే రూ.10వేల కోట్లు నష్టం
జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఇళ్ల నిర్మా ణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగిందని,ఇప్పటికే ప్రారం భించిన ఇళ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని,అలాంటి చోట మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఒక్క హౌసింగ్‌శాఖ లోనే రూ.10వేల కోట్ల మేర నష్టం వాటిల్లిం దని విమర్శించారు.ఎస్సీ,ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.2014`2019మధ్యకాలంల నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పరిశ్రమల శాఖపై నూతన పాలసీలు రూపకల్పనకు ఆదేశం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకు రావా ల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టు బడులపై ఒప్పందాలు చేసుకోగా…తరువాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపో యారని సీఎం అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని…కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించా ల్సిన అసవరం ఉందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములను కూడా ఇతర అవసరాలకు వినియోగించారని సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం అంటూ తీసుకున్నారని అధికారులు తెలిపారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అసవర మైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నా… పరిశ్రమలకు ఇచ్చే స్థలాలు ఇచ్చారని వివరిం చారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే….వైసీపీ ప్రభుత్వంలో 34 శాతం మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దా మన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. 2014-2019 కాలంలో64ఇండస్ట్రియల్‌ పార్కుల ద్వారా14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే 2019-2024 మధ్య కేవలం 31పార్కు లు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఇలాంటి పరిణామాలతో పారిశ్రమిక వేత్తలు, పెట్టుబడి దారులు నమ్మకం కోల్పోయారని సీఎం అన్నారు.నాడు ఒప్పందం చేసుకుని వైసీపీ ప్రభుత్వ విధానాలతో వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరం అయితే తాను కూడా వారితో మాట్లాడుతానని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం అన్నారు. తద్వా రా ఏడాది కాలంలో లక్ష కోట్ల పెట్టుబ డులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 1,36, 260 మందికి ఉపాది కల్పించాలని అన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రా మిక వాడలో భూముల రేట్లు తగ్గించి పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని సీఎం అదేశించారు.వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా వివాదాల్లోకి నెట్టేసి…నిర్వీర్యం చేసిందని సీఎం అన్నారు.
5 నూతన పాలసీలు
వచ్చే 100రోజుల్లో కొత్తగా 5పాలసీలు తీసుకు రావాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూతన ఇండస్ట్రీయల్‌ పాలసీ,ఎంఎస్‌ఎంఇ పాలసీ,ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ,ఎలక్ట్రానిక్‌, ఐటీ అండ్‌ క్లౌడ్‌ పాలసీ,టెక్స్‌ టైల్‌ పాలసీలు తీసుకురావాలని అన్నారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతారవణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రాన్ని గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా చెయ్యాలనే లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని అన్నారు. అదే విధంగా కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లష్టర్లపై ప్రతి పాదనలు సిద్ధం చేసి కేంద్ర అనుమతులు పొందాలని సీఎం అన్నారు.కుప్పం,మూల పేట,చిలమత్తూరు,దొనకొండ లేదా పామూ రులో కొత్త క్లష్టర్స్‌ ఏర్పాటు చేయాలని..ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.ఆయా క్లష్టర్లలో ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా,ఫుడ్‌ ప్రాసెసింగ్‌,హార్డ్‌ వేర్‌ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని సిఎం అన్నారు. అలాగే కృష్ణపట్నం,నక్కపల్లి,ఒర్వకల్లు,కొప్పర్తి నోడ్స్‌ ప్రోగ్రస్‌పై చర్చించారు.నక్కపల్లిలో రూ.11,542కోట్లతో ఏర్పాటు చేసే బల్క్‌ డ్రగ్‌ పార్క్‌,రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు అయ్యే గ్రీన్‌ హైడ్రొజన్‌ హబ్‌, ప్రస్తుతం చర్చలు జరు పుతున్న బిపిసిఎల్‌ ప్రాజెక్టుల స్థితిగతులపై అధి కారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్‌ కూడా పాల్గొన్నారు. సమీక్ష ముగిసిన అనంతరం టీజీ భరత్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీకి రూ.75,000 కోట్లతో బీపీసీఎల్‌ పరిశ్రమ రాబోతోందని వెల్లడిర చారు. బీపీసీఎల్‌ పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయి స్తారని తెలిపారు.కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్‌ ఫాస్ట్‌ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ కూడా ఆసక్తి కనబరిచారని మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.ఇక, దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావాలని నేటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ ఎంఎస్‌ఎంఈ, క్లస్టర్‌ విధానాలు అమలు చేస్తామని తెలిపారు. సీబీఎన్‌ బ్రాండ్‌తో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్‌ వెల్లడిరచారు. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం,ఏపీ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌, ఓర్వకల్లు, కొప్పర్తిలో 4ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు ఉన్నాయని వివరించారు.కొత్తగా కుప్పం, లేపాక్షి, దొన కొండ, మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తా మని చెప్పారు.చిత్తూరు నోడ్‌ కింద రూ.1, 350 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడిరచారు. రాజధాని అమరావతి సమీ పంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాల నేది తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరి స్థితి కల్పించారని మంత్రి టీజీ భరత్‌ విమ ర్శించారు. గతంలో పారిశ్రామికవేత్తలను షేర్లు,పర్సంటేజీలు అడిగే పరిస్థితి ఉండేదని తెలిపారు.-జి.ఎన్‌.వి.సతీష్‌