యూపీకి ఆదర్శంగా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ విధానాలు, పని తీరు బాగున్నాయని, సాంకే తికత అత్యున్నతంగా ఉందని, వాటిని తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ చంద్రకాంత్‌ చెప్పారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐటీ నిపుణుడు ప్రశాంత్‌ షాహి తదితరులతో కలిసి ఆయన తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. యూపీ విపత్తుల నిర్వహణ సంస్థను ఆధునికీరిస్తున్న క్రమంలో దేశానికే రోల్‌ మోడల్‌గా ఉన్న ఏపీ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం ఇక్కడకు వచ్చింది.
ఏపీలో అధునాతన టెక్నాలజీ
ఉత్తరప్రదేశ్‌ ప్రాజెక్ట్‌ ఎక్సపర్ట్‌ చందర్‌ కాంత్‌ మాట్లాడుతూ..ఏపీ స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అనుసరిస్తున్న నూతన విధివిధానాలు, కార్యచరణ తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. వాతావరణ పరిశోధన విభాగా లలోని వివిధ అంశాలను అడిగి తెలుసు కున్నారు. ఏపీలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తుందని తమ రాష్ట్రంలో ఇక్కడ సాంకేతికతను అమలు చేస్తామని తెలిపారు. విపత్తులను ఎదుర్కోడానికి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పాటిస్తున్న ఉత్తమ విధానాలు, కార్యచరణ ప్రణాళికలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల గురించి విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బిఆర్‌ అంబేద్కర్‌ ఉత్తరప్రదేశ్‌ అధికారులకు వివరించారు. తుఫానులు, వరదలు, పిడుగులపై అప్రమత్తం స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సాంకేతికతను, దాన్ని వినియో గిస్తున్న తీరును నిశితంగా పరిశీలించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వారికి స్టేట్‌ ఎమర్జెన్సీ సెంటర్‌లోని అన్ని విభాగాలను చూపించి, పని విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో తుఫా­నులు, వరదలతోపాటు పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం విపత్తుల నిర్వహణ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేసిందని తెలిపారు.
నష్టనివారణపై ముందస్తు ప్రణాళికలు
తుపాను, వరద వచ్చే అవకాశం ఉందని తెలిసిన వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయ స్థాయి వరకు ఉన్న విపత్తుల నిర్వహణ బృందాలు క్షేత్ర స్థాయిలో పని ప్రారంభిస్తాయని వివరించారు. ఈ అప్ర మత్తత వల్లే నాలుగేళ్లలో తుపానులు, వరదలొచ్చినా ప్రాణ నష్టాన్ని నివారించగలి గామన్నారు. వాతావరణ పరిశోధన విభా­గాలు, వివిధ వాతావరణ మోడల్స్‌, కార్యాచరణ ప్ర­ణాళికలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల గురించి అంబేడ్క­ర్‌ వారికి వివరించారు.
ఒడిశా,అసోం,తెలంగాణ,ఢల్లీి సైతం
గతంలో ఒడిశా,అసోం,ఉత్తరాఖండ్‌, తమిళ నాడు, తెలంగాణ, ఢల్లీి రాష్ట్రాల అధికారులు ఇక్కడకు వచ్చి విపత్తుల్లో ఏపీ అవలంబిస్తున్న విధివిధానాలు తెలుసుకున్నారు. ఏపీలో 44% తుపాను, 15% వరదలు, 68% కరువు, పిడుగులు, వడగాల్పులు 100శాతం ప్రభావితం చేస్తున్నట్లు బృందానికి అంబేద్కర్‌ తెలిపారు. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి 24 గంటలు పర్యవేక్షించే విధానం, వాతావరణం గురించి వివిధ మోడల్స్‌ క్రోడికరించి హెచ్చరికలు జిల్లాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. విపత్తుల సమ యంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్‌ పంపే విధానాన్ని చూపించారు. కామన్‌ అలెర్ట్‌ ప్రోటోకాల్‌, ఏపీ అలెర్ట్‌ద్వారా ప్రజలకు హెచ్చరిక మేసేజ్లు పంపించే విధానం చూపించారు. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్‌ ఫోన్స్‌, శాటిలైట్‌ బేస్డ్‌ మొబైల్‌ డేటా వాయిస్‌ టెర్మినల్‌, వాకీటాకీ, వి-శాట్‌ కమ్యూనికేషన్‌ పరికరాలను ఉత్తర ప్రదేశ్‌ అధికారులకు చూపించారు. వెబ్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌, జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ గురించి విపత్తుల సంస్థ అధికారులు వివరించారు.
విపత్తు -నిర్వహణ
మానవ దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించే వైపరీత్య సంఘటనను ‘విపత్తు’ అంటారు. విపత్తులు సంభవించడానికి భౌగోళిక, వాతావరణం వంటి ప్రత్యేక పరిస్థితు లతోపాటు మానవుడి చర్యలు, కార్యకలాపాలు కారణమవుతున్నాయి. ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఓచోట ఏదో ఒక విపత్తు సంభవి స్తుంది. దీనికి భారత్‌ అతీతం కాదు.ప్రత్యేక భౌగోళిక పరిస్థితులైన ఎత్తయిన పర్వత శ్రేణులు, విశాలమైన ద్వీపకల్ప పీఠభూమి, వేల కిలోమీటర్లు ప్రవహించే జీవనదీ వ్యవస్థ వల్ల భారత్‌ విపత్తుల బారిన పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, కాలుష్యం పెరిగిపోవడం, జీవవైవిధ్యం దెబ్బతినడం, వాతావరణం వేడెక్కడం మొదలైనవి. చీa్‌బతీవ ూతీశ్‌ీవష్‌ం ఱట ంష్ట్రవ ఱం ూతీశ్‌ీవష్‌వస అంటే మనం ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ‘ప్రకృతిని అనుసరించాలేకాని శాసించకూడదు’ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన కార్యకలాపాలను కొనసాగిస్తే ఈ విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది.
విపత్తు -నిర్వచనాలు
విపత్తు నిర్వహణ చట్టం-2005

1 నిర్వచనం.. ఏదైనా భౌగోళిక ప్రాంతం ప్రకృతి లేదా మానవ తప్పిదాలు లేదా ప్రమాదవశాత్తు లేదా నిర్లక్షం వల్ల తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్దఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, పర్యావరణ నష్టానికి లేదా విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవాలు లేదా ప్రమాదాలు లేదా దుర్ఘటనలను ‘విపత్తు’ అంటారు. 2.నిర్వచనం..సమాజపు సాధారణ నిర్మాణానికి, సాధారణ లేదా కమ్యూనిటీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించే ఆపదనే ‘విపత్తు’ అంటారు.పపంచ ఆరోగ్యసంస్థ) 3.నిర్వచనం..ఏదైనా ప్రదేశంలోని సమూహానికి వెలుపల నుంచి సాయం పొందవలసినంత తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని, పర్యావరణ నష్టాన్ని, ఆర్థిక విధ్వం సాన్ని, ఆరోగ్య సమస్యలను కలుగజేసే సంఘటననే ‘విపత్తు’ అంటారు. 4. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వచనం..సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని రక్షించి, సంరక్షించడానికి.. అసాధార ణ, అత్యవసర చర్యలు అవసర మయ్యే ఉపవూదవ పరిస్థితినే ‘విపత్తు’ అని నిర్వచించారు.
విపత్తు సంస్థాగత చట్రం
1900,1905,1907,1947లలో వచ్చిన వరుస దుర్భిక్షాలు, 937లో సంభవించిన బీహార్‌-నేపాల్‌ భూకంపం మొదలైన వాటి నేపథ్యంలో భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్‌వారికాలంలో ప్రారంభమైంది.బ్రిటిష్‌ పరిపాలనలో విపత్తువల్ల వచ్చే అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు పునరావాస విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ విభాగాలు విపత్తు అనంతర పరిస్థితుల్లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టేవి. స్వాతంత్య్రం అనంతరం విపత్తుల నిర్వహణ బాధ్యతను ప్రతి రాష్ట్రం లో ఉండే పునరావాస కమిషనర్లు, కేంద్రంలో కేంద్ర పునరావాస కమిషనర్లు నిర్వహించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యారాజ్యసమితి సాధారణసభ 1990వ దశాబ్దాన్ని ‘అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దశాబ్దంగా ప్రకటించింది. దేశంలో 1990 అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కింద విపత్తు నిర్వహణ సెల్‌ను ఏర్పాటు చేయడంతో ఒక శాశ్వత, వ్యవస్థాగతమైన ఏర్పాటు ప్రారంభమైంది. తదనంతరం దేశంలో సంభవించిన విపత్తులను అనుసరించి అప్పటి వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి జేసీ పంత్‌ చైర్మన్‌గా విపత్తుల నిర్వహణపై సమగ్ర విధానాన్ని రూపొందించడానికి అత్యున్నతాధికార కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారం 2002లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోకి మార్చారు. దీన్ని అనుసరించి దేశంలో విపత్తు నిర్వహణకు ఒక అధికార క్రమ నిర్మాణం ఏర్పడిరది.
దేశంలో విపత్తు నిర్వహణ నిర్మాణం
విపత్తు నిర్వహణ కోసం జాతీయస్థాయిలో శాసననిర్మాణ అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్న అన్ని పార్టీల సమావేశం 2005 జనవరి 9న జరిగింది. విపత్తు నిర్వహణ బిల్లును రాజ్యసభలో మొదటిసారిగా 2005 మే 11న ప్రవేశపెట్టారు.- జిఎన్‌వి సతీష్‌