యజమానుల లాభాల కోసం కార్మికుల హక్కులు..
‘‘ ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల పేరుతో పాలక పార్టీలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఇన్‌స్పెక్షన్ రాజ్ (తనిఖీల రాజ్యం)ను ఎత్తివేయాలనే సాకుతో తనిఖీలను నామమాత్రం చేశాయి. ప్రైవేట్ సంస్థలకు తనిఖీలు, సేఫ్టీ ఆడిట్‌లు చేసే అవకాశమిచ్చాయి. వాస్తవంగా ప్రైవేట్ సంస్థలు తనిఖీలకు వెళ్లవు. సేఫ్టీ ఆడిట్‌ను కూడా నిర్వహించవు. ఆఫీసులో కూర్చొని సర్టిఫికెట్లు తయారు చేస్తాయి’’-(పి.అజయకుమార్)
వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ థర్ట్‌పార్టీ సేఫ్టీ ఆడిట్ టీమ్‌ల దగ్గర ముడుపులు తీసుకుని వీరి సర్టిఫికెట్లకు ప్రభుత్వ అధికారులు ఆమోదం తెలి పారని నేటి టిడిపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభు త్వ కార్మికశాఖా మంత్రి వాసంసెట్టి సుభాష్ ఆరోపించారు.అందుకే అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ,విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్, అనకా పల్లి కెమికల్ ప్లాంట్, సామర్లకోట కాంక్రీట్ మిక్స్ యూనిట్‌లో ప్రమాదాలు జరిగాయన్నారు. కానీ ఇటువంటి మోసపూరిత థర్డ్ పార్టీ ఆడిట్‌ను తమ ప్రభుత్వం రద్దు చేస్తుందా?లేదా?అనే మాట చెప్పలేదు.రాష్ట్రంలో ఎక్కడా కనీస వేతనాలు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ తదితర హక్కులు అమలు కావు. కర్మాగారాల ప్రమాదాల్లో కార్మికులు పిట్టల్లా రాలి పోతున్నారు.మొన్న ఎన్‌టిఆర్ జిల్లా సిమెంట్ కర్మా గారంలో జరిగిన ప్రమాదంలో నలుగురు, నిన్న అదే జిల్లా దొనబండ క్వారీ పేలుడులో ముగ్గురు, ఆ తరువాత అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడు ప్రమాదంలో ఒకరు మరణిం చారు.2021 నుండి2023 వరకు కేవలం మూడు సంవత్సరాల్లో చోటుచేసుకున్న కర్మాగార ప్రమాదాల్లో 28మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఒక పక్కన కార్మిక హక్కులు అమలు చేయకుండా శ్రమ దోపిడీ కొనసాగుతోంది. మరో పక్క యజమానుల లాభాల కోసం, వారి వ్యాపా రాన్ని సులభతరం చేయడం కోసం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పాలకులు తనిఖీలు ఎత్తివేసి కార్మికుల ప్రాణాలను బలిస్తున్నారు.ప్రమాదాలు జరిగిన తరువాత ఎప్పటిలాగే కార్మికుల ప్రాణా లకు విలువగట్టడం, అధికారుల హడావిడి, విచా రణలు కొనసాగుతాయి. కానీ బాధ్యతారహితంగా వ్యవహరించి కార్మికుల ప్రాణాలు తీసిన యజమా నులను మాత్రం శిక్షించరు. అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగార యజమానిని ఇంత వరకు అరెస్టు చేయ లేదు. కార్మికుల హక్కులకు, ప్రాణాలకు, భద్రతకు ఎందుకు విలువ లేకుండా పోతోంది.
లోపం ఎక్కడ ఉంది..ఎవరిదీ పాపం?
ఫ్యాక్టరీల చట్టంలో పని ప్రదేశంలో కార్మికుల భద్ర తకు, ఆరోగ్యానికి, సంక్షేమానికి యజమానులు తీసుకోవాల్సిన చర్యలు అన్నీ ఉన్నాయి. వాటిని గట్టిగా అమలు చేయకుండా%ౌ% వ్యాపారాన్ని సులభతరం చేయడమనే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పేరుతో తనిఖీలు లేకుండా లేదా నామ మాత్రం చేస్తూ జీవోలు ఇచ్చిన పాలకులదే అసలు పాపం. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న చంద్ర బాబు నాయుడు కార్మిక వ్యతిరేక మార్పులను అమలు చేయటంలో ప్రథముడు అన్న సంగతి అందరికీ తెలుసు. 2001, 2002 సంవత్సరా ల్లోనే తనిఖీలను నామమాత్రం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆ తర్వాత 2014లో మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వచ్చీ రావటంతోనే తనిఖీ లకు చెల్లు చీటీ ఇస్తూ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మోడీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2014-2019లో టిడిపి,2019-2024లో వైసిపి ప్రభుత్వాలు జీవోలు జారీ చేశా యి. వీటి కారణంగానే కార్మికులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ జీవోల్లో ఏముంది? వచ్చిన మార్పులు ఏమిటి?
2015లో మోడీ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకశాఖ (డిఐపిపి) మార్గదర్శకాలను అను సరించి టిడిపి ప్రభుత్వం 6కార్మిక చట్టాలకు ఒకే యాన్యువల్ రిటర్న్ సమర్పించే అవకాశమిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇదే ప్రభుత్వం 2019లో ఫ్యాక్టరీల చట్టంతో సహా మరో 6 చట్టాలను చేర్చి 12చట్టాలకు ఒకే రిటర్న్ సమర్పించే అవకాశ మిచ్చింది. ఈ చట్టం ప్రకారం సంస్థ వివరాలు ఇవ్వటంతోపాటు కార్మిక చట్టాలన్నిటినీ అమలు చేస్తున్నామని యజమానులు సొంత సర్టిఫికెట్‌ను (సెల్ఫ్ సర్టిఫికేషన్) సమర్పిస్తే సరిపోతుంది. 2020లో మోడీ ప్రభుత్వ మార్గదర్శకాలపై గత వైసిపి ప్రభుత్వం మరో పెద్ద ముందడుగు వేసింది. మొత్తం కార్మిక చట్టాలన్నిటినీ సొంత సర్టిఫికెట్ (సెల్ఫ్ సర్టిఫికేషన్) ఇచ్చే పద్ధతి కిందికి తెచ్చింది. 2019లో టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో62 ప్రకా రం కొత్తగా ప్రారంభించిన సంస్థల్లో 3సంవత్సరా ల వరకు తనిఖీలు ఉండవు.ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్‌లు),ఎగుమతి ఆధారిత జోన్ల (ఈపీ జెడ్‌లు)లో ఉండే సంస్థలకు తనిఖీలు ఉండవు. అన్ని చట్టాలకు కలిపి యాన్యువల్ రిటర్న్ సమర్పించిన సంస్థలకు కూడా మూడు సంవత్స రాలు తనిఖీల నుండి మినహాయింపు ఉంది. అయితే ఈసంస్థలు కార్మిక చట్టాలను అతి క్రమిం చకూడదు.అయితే దీన్ని ఎవరు నిర్ధారి స్తారు? ఉద్యోగాలు పోతాయనే భయంతో కార్మికులు కూడా ముందుకు రారు. ఒకసారి తనిఖీ జరిగి న సంస్థలో మరో రెండు సంవత్సరాల వరకు తనిఖీలు ఉండవు.మే31,2016లో టిడిపి ప్రభు త్వం ఇచ్చిన జీవో 27 మోడీ విధానాల అమలుకు పరాకాష్ట. దీని కొనసాగింపుగానే టిడిపి, వైసిపి ప్రభుత్వాలు మరి కొన్ని జీవోలు తెచ్చాయి. వీటన్ని టికీ ప్రేరణ, మార్గదర్శకం మోడీ ప్రభుత్వానిదే. ఈ జీవో ప్రకారం కంప్యూటర్‌లో నమోదైన సంస్థ ల వరకే తనిఖీలు ఉంటాయి. ఆ తనిఖీలు కూడా కంప్యూటర్ యాదృచ్ఛికంగా ఎంపిక చేసే (రాన్‌డ మ్ బేస్డ్ ఇన్‌స్పెక్షన్లు) కొన్ని సంస్థల వరకే ఉంటా యి. ఆఫ్‌లైన్‌లో తనిఖీలకు వెళ్లటం నిషేధం. ప్రైవేట్ థర్డ్ పార్టీ సంస్థల తనిఖీలకు, సేఫ్టీ ఆడిట్ లకు ఈ జీవో అవకాశమిచ్చింది. షెడ్యూల్డు ఎంప్లా రుమెంట్లలో ఉన్న10రకాల సంస్థలు, 300 మంది కార్మికులకు పైగా పని చేసే సంస్థలు,పెట్రోలు, ఆయిల్ టెర్మినళ్లు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ఫ్యాక్టరీల్లో 20 నుండి 149 మంది వరకు కార్మికులు ఉన్నవి, ఇతర ఫ్యాక్టరీల్లో 150కి పైన వెయ్యి లోపు కార్మికులున్న వాటిని ప్రైవేట్ సంస్థల తనిఖీలకు,సేఫ్టీ ఆడిట్‌కు అప్పజెప్పారు. ఈ తనిఖీ లు కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్ర మే.ప్రమాదం అత్యధికంగా జరిగే ఫ్యాక్టరీలు, వెయ్యి మందికి పైగా కార్మికులు పనిచేసే ఫ్యాక్ట రీలు,వృత్తి రుగ్మతలకు అవకాశం ఉన్న ఫ్యాక్టరీలకు, షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లలో 38 రకాల సంస్థల్లో కూడా లేబరు అధికారులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తనిఖీలకు వెళ్లాలి. రిస్క్ ఎక్కువ ఉన్నా, మధ్యస్థంగా ఉన్నా, తక్కువగా ఉన్నా కంప్యూటర్ రాన్‌డమ్‌గా ఎంపిక చేసిన సంస్థలకు మాత్రమే తనిఖీలకు వెళ్లాలి.
2001లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనిఖీ లను నామమాత్రం చేస్తూ ఇచ్చిన జీవో 40 ప్రకారం తనిఖీలకు వెళ్లబోయే ముందు యజమానులకు తెలియజేయాలి. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. దాంతో జీవో 40ని రద్దు చేసి జీవో 33 ఇచ్చారు. ఈ కొత్త జీవోలో యజమా నులకు ముందుగా సమాచారం ఇవ్వాలని లేనప్ప టికీ తనిఖీలకు పరిమితులను మాత్రం యథాత థంగా కొనసాగించారు. తనిఖీకి వెళ్లే సంస్థకు ముందుగా సమాచారం ఇవ్వాలనే నిబంధనను మోడీ ప్రభుత్వ ఆదేశానుసారం 2019 మార్చిలో టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో 62లో మరలా చేర్చారు.2001నుండి ఇప్పటి వరకూ కూడా ఆకస్మిక తనిఖీలకు చెల్లు చీటీ ఇచ్చారు. పాలక వర్గ పార్టీలు ఏవి అధికారంలోకి వచ్చినా కార్మిక వ్యతిరేక సంస్కరణల అమలులో ముందుంటాయని మోడీ,చంద్రబాబు,జగన్ ప్రభుత్వాలు రుజువు చేశాయి. చట్టాలు ఎన్ని ఉన్నా, వాటి అమలు కీలకం. కార్మిక చట్టాల అమలు, తనిఖీ నిర్వీర్య మైతే కార్మికుల హక్కులు, ప్రాణాలు గాలికి కొట్టుకు పోతాయి.సులభతర వ్యాపారం పేరుతో తనిఖీలను నామమాత్రం చేయటమంటే యజమానుల లాభాలకు కార్మిక హక్కులను, ప్రాణాలను బలి ఇవ్వటమే. ఈ పాపానికి పాల్పడుతున్న పాలకుల విధానాలపై కార్మికులు ఐక్యంగా పోరాడాలి. శ్రమ దోపిడీ నుండి బైటపడి కార్మికులు తమ హక్కులను కాపాడుకోవాలి. పరిశ్రమలలో పని చేసే కార్మికుల భద్రతకు ఉద్దేశించిన చట్టాలు ఆచరణలో కార్మి కేతర పౌరులకు కూడా భద్రతను చేకూరుస్తాయని ఈ విశాఖ దుర్ఘటన రుజువు చేసింది.మూడు లేదా నాలుగు దశాబ్దాల క్రితంవరకూ సమాజంలో మధ్య తరగతి విద్యాధిక వర్గాల ప్రజలసంఖ్య చాలా తక్కు వగా ఉండేది.ఆనాడు కార్మిక వర్గానికి ప్రాధా న్యత ఉండేది.సేవారంగాల పేరిట తెల్లచొక్కా ఉద్యోగు లు, విద్యాధిక మధ్య తరగతి ప్రజల సంఖ్య ప్రపంచీ కరణ తర్వాత పెరిగింది.దీనితో పారిశ్రామిక కార్మి క వర్గానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రాచుర్యతలు క్రమంగా తగ్గాయి.శ్రమ దోపిడీని వ్యతిరేకించడం లో పారిశ్రామిక కార్మిక వర్గ సంఘటిత సామర్థ్యం కూడా తగ్గసాగింది. అవి తగ్గే కొద్దీ, పరిశ్రమల్లో కార్మికుల ప్రాణ భద్రతకు కూడా ప్రాధాన్యత తగ్గింది.కార్మికులకు ప్రాణభద్రత కొరవడటం వల్లే పాలిమర్స్ విషవా యువు లీకైనది. తత్ఫలితమే విశాఖ పౌర సమాజం నేడు ప్రమాదానికి గురైనది. కార్మికుడి హక్కుల రక్షణ, ప్రాణ భద్రతలతో పౌర సమాజానికి పరస్పర అనుబంధం ఉందని ఇవి నిరూపిస్తున్నవి. ప్రజల ప్రాణాల కంటే, ప్రజలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులు ఎప్పటికీ విలువైనవి కావని ఆధునిక సామాజిక నీతి బోధిస్తున్నది. మనిషి చేత సృష్టించబడి, తిరిగి అదే మనిషి చేత వినియోగిం చబడే సరుకుల కంటే మనిషే నూరురెట్లు ఉన్నతు డు.అలాంటి మహనీయుడైన మానవుడి ప్రాణా లను బలి పెట్టి పరిశ్రమలను స్థాపించాలని ఏ ఆధునిక మానవ విలువలూ బోధించడం లేదు. కేవలం పెట్టుబడిని విస్తరించుకునే లక్ష్యం గల పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గం మానవుణ్ణి ఒక సరుకుగా దిగజార్చింది. అట్టి పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలే పరమావధిగా మారితే జనావా సాలలో పాలిమర్స్ వంటి ప్రాణాంతక పరిశ్రమల స్థాపన జరుగుతుంది.ఈ దుర్ఘటనను గుణ పాఠం గా తీసుకొని, మనిషిని కేంద్రంగా చేసుకొని ఇలాం టి పరిశ్రమలను ప్రజల నివాస ప్రాంతాల్లో లేకుం డా చేసే ఉద్యమాన్ని నిర్మించవలసి ఉంది. ఏ పరిశ్రమ యాజమాన్యాల లాభ(ధన) దాహానికి ప్రజలు బలవుతున్నారో, వారికిచ్చే నష్ట పరిహారాల సొమ్మును కూడా అట్టి నేరస్థ యాజమాన్యాల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ డిమాండుతో ఒక పౌర ప్రజా ఉద్యమం నిర్మాణం కావాలి. ఎవరు వాస్తవ నేరస్థులో వాళ్లకు పరిహారం రూపం లో కూడా శిక్ష విధించాలి. అట్టి సామాజికోద్య మాలకు దుర్ఘటన స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.
-వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు