మొక్క‌లు నాటుదాం…ప‌ర్య‌వ‌ర‌ణాన్ని కాపాడుకుందాం..!

కాలుష్య కాసారం ప్రకృతినీ పర్యావరణాన్నీ, మానవ ఆరోగ్యాన్నీ అనేక రూపాల్లో ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు అందంగా… అహ్లాదం గా…. స్వచ్ఛంగా ఉన్న వాతావరణం క్రమంగా కనుమరగైపో తోంది. అవసరంలేని ఆధునికతతో, రకరకాల వ్యర్థాలతో, కాలుష్యాలతో జీవావరణ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే అది తీవ్రస్థాయికి చేరిందని పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు, ఆందోళనవ్యక్తం చేస్తు న్నారు. మానవ మనుగడ సాఫీగా ఉండాలంటే ప్రకృతిని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినన అవసరం ఉంది. పర్యావరణంలో రోజు రోజుకూ వస్తున్న మార్పులు, పొంచి ఉన్న ప్రమాదం, చేపట్టాల్సిన చర్యలు గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పర్యావరణం విషయానికొస్తే మీకు కొన్ని అంశా ల చెప్పాలి. నాచిన్నప్పుడు యింటి ముందు మట్టి రోడ్లే కానీ తారు రోడ్లు లేవు.స్నేహితులం దరం ఆ మట్టిలో గంటల తరబడి ఆడినా, ఆమట్టి ధూళి పీల్చినా ఏకొంచెం అనారోగ్యం కూడా కలిగేది కాదు. కారణం మట్టిలో ఉన్న సూక్ష్మ జీవులను,కీటకాలను పిచ్చుకలు,కోళ్ళు, పావురాలు పక్షి సమూహాలు ఎన్నో వచ్చి తినేసి పర్యావరణానికి ఎంతో మేలు చేసేవి.ఇక సరు కులకోసం షాపుకెళ్తే షాపు వాళ్ళు న్యూస్‌ పేపర్‌ కాగితాలలో చింతపండు,మిరప కాయలు పప్పు,ఉప్పు,అన్నీ పొట్లాలు కట్టి ఇచ్చేవాళ్ళు ఒక బట్ట సంచీలో వాటిని తెచ్చుకునే వాళ్ళం. కొబ్బరి నూనె అయిపోగానే ఖాళీ సీసా తీసుకు వెళ్తే అందులో.. నూనె కొలిచి ఇచ్చేవారు. కొంచెం సమయం పట్టినా సరుకులు ఇచ్చే విధా నంలో ఎక్కడా పర్యావరణానికి హాని జరిగేది కాదు. కాలుష్యం అనే కాసారానికి ఎంతో దూరంగా పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఎంతో బాగుండేది.అసలు పాలిథీన్‌ కవర్లు 19 80 వరకు మేము ఎన్నడూ చూడలేదు.1978-79లో అంటే అప్పుడు మే8వ క్లాసు/ 9వ క్లాసు లో ఉన్నప్పుడు ‘‘ప్లాస్టిక్కులు’’ అనే తెలుగు పాఠం ఉండేది. బహుశా అప్పటికే రాబోయే సునామీ అది అనే విషయం ఆరోజుల్లో తెలిసేది కాదు, పైగా ప్లాస్టిక్కులవల్ల ఎన్ని లాభాలో ఆపాఠం లో చదువుకున్నాం. ఆరోజుల్లో ఉదయం నిద్రలేపుతూ పాల సీసా బండివాడు బండిపై టక టకా శబ్దం చేస్తూ ..వచ్చేవాడు. వెంటనే పిల్లలమంతా అమ్మ ఇచ్చిన ఖాళీపాల సీసాలు రెండు తీసుకుని వీధిలోకి వెళ్లి బండి ఆయనకు ఇచ్చికొత్త పాల సీసాలు రెండు పట్టుకొచ్చే వాళ్ళం.అమ్మ ఆపాల సీసాల ఢక్కన్‌ (మూత)ను తెరవగానే దాన్నిండా వెన్న ఉండేది. ఆవెన్న తినటానికి మేము అప్పుడప్పుడూ పోటీపడే వాళ్ళం. పాలిథీన్‌ కవర్లలో పాలు అప్పట్లో మే ము ఎరగము..షాపు నుండి సరుకులు తెస్తే అన్నీ పాత ఒవల్టీన్‌/డాల్డా వంటివి చిన్న డబ్బా ల్లో పోసుకునేది అమ్మ. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా భూమిలో కరిగిపోని /కలిసిపోని ప్లాస్టిక్‌ కవర్లే. ప్రతి రెండు అడుగుల భూమికీ ఒకటి చొప్పున రోడ్డుపై కనబడుతున్నాయి. ఆ వ్యర్ధాలు తిని ఆవులు, గేదెలు అనారోగ్యం పావుతు న్నాయి. మొన్నీమధ్యే పేపర్‌లో వచ్చింది ఈవార్త ఏమి టంటే…ఆవ్యర్దాలన్నీ తిన్న ఆవుకు ఆపరే షన్‌ చేసి 25 కిలోల ప్లాస్టిక్‌వ్యర్ధాల చుట్టను బయటికి తీసిఆవుకుప్రాణంపోశారటపశు వైద్యు లు !!! అప్పట్లో చాటలో బియ్యం చేరుగుతూంటే వడ్లు/నూకలు (ఈ కాలం పిల్లలకు ఇవిఏంటో కూడా తెలియదు) తినటానికి పిచ్చుక లెన్నో వచ్చేవి కిచకిచమంటూ రెక్కలు అల్లల్లా డిరచు కుంటూ తినేవి అదిచూసి, మేము ఇంకా బియ్యం వేసే వాళ్ళం.మనసుకు ఎంతో ఆహ్లాదం గా, ఆనందంగా ఉండేది. అప్పట్లో ఇన్ని పెట్రోల్‌/డీసిల్‌ బండ్లెక్కడివి? ప్రతియింట్లో విధిగా సైకిల్‌ ఉండేది. 1980 వరకు స్కూటర్‌లు ఎక్కువ కనిపిం చేవి కావు, బైక్‌లు అసలే లేవు. చిన్న దూరాలకు వాకింగ్‌, పెద్ద దూరాలకు సైకిళ్ళు ఉండేవి. అప్పట్లో మేము ఆడ పిల్లలం కూడా సైకిల్‌ నేర్చుకోవటానికి ఉబ లాట పడే వాళ్ళం. అలా నేను కూడా సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు 3మైళ్ళ దూరం వెళ్ళాల్సి వస్తే రిక్షల్లో వెళ్ళే వాళ్ళం. చార్జి కేవలం 2 రూపాయలు (ఇప్పటి పిల్లలకు అవి బొమ్మ గీసి చూపెట్టాల్సి వస్తున్నది). 1980-85 సమయంలో 5,7,రూపాయలకు దింపే వారు. ఇక వాహన కాలుష్యం ఎక్కడిది? అంతా స్వఛ్ఛమైన గాలే కదా! ఇకదానితో బాటుధ్వని కాలుష్యంకూడా లేదు. ఇప్పుడు ఈ వాహనాల మూలంగా, పొగవల్ల థైరాయిడ్‌ గ్రంథి ó పని తీరు అధ్వాన్న మైంది అందరికి ఇదే జబ్బు. ఇక అస్తమా, బ్రోన్కైతిస్‌ అయితే చెప్పనక్కర లేదు ఇవి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రమాదంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. అలాఅవసరం లేకున్నా వాహనాలు చేసే ధ్వని కాలుష్యం (హార్న్‌ శబ్దాలు) వలన తలనొప్పి, అల్జీమర్స్‌, ఒత్తిడి ఆందోళన,మతి మరుపు, నరాల జబ్బులు వస్తున్నాయి ఇళ్ల మధ్యలో ఎక్కడా ఏ చిన్న ఫ్యాక్టరీ కూడా ఉండేది కాదు.పట్నం(హైదరా బాద్‌) మా చిన్నప్పుడు పల్లె శోభతో కళకళ లాడేది. తులసి కోటలోనే కాకుండా బయట కూడా చాలామొక్కలు తులసివనంలాఉండేది. దాంతో మంచి స్వచ్చమైన గాలి పీల్చే వాళ్ళం. వర్షం పడితేచాలువీధిలో గడ్డిపై వెల్వెట్‌ (ఆరు ద్ర పురుగులు) పురుగులు కనబడితే వాటిని అగ్గిపెట్టె లో పెట్టి అందరికీ చూపించే వాళ్ళం. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు వెలుస్తు న్నాయి. గ్యాస్‌ ఫిల్లింగ్‌ వంటి వైతే పేలుడు కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇళ్లలో ఉండే మొక్కలవల్ల మంచిగాలి పీల్చే వాళ్ళం. ఇప్పుడు ఫ్లాట్‌లలో ఒక్క చెట్టు కూడా కనబడటం లేదు. అసలే ఓజోన్‌ పొరతరిగి పోతున్నది. దాంతో భూమిపై వాతావరణం వేడెక్కి, భూతాపంవల్ల మనుషులకు డ్రైనెస్‌ గొంతులో,కళ్ళలో మంటలు,హైబిపి జబ్బులు వస్తున్నాయి. ఇప్పటికైనా విరివిగా మొక్కలు, చెట్లు పెంచితే కొంత వరకైనా ఈసమస్య నుండి అధిగమించవచ్చు.జలకాలుష్యం:నదులు, సరస్సు లు పూడుకు పోయాయి ఇసుకమట్టి మాత్రమే కాదు ప్లాస్టిక్కులతో నిండి పోయాయి. నాలాలు మరీ ఘోరంగా తయార య్యాయి ఒకవర్షం వస్తే డ్రైనేజ్‌ పొంగి వీధుల్లో యిళ్ళ మధ్య ప్రవహిస్తూ దోమలతో అనారోగ్యం కలిగిస్తున్నది. ప్లాస్టి కవర్లు భూమి పొరల్లో కరుగక, ఎండా` వానలకు రసాయనాలు విడుదల చేస్తూ కాలు ష్యాన్ని పెంచుతు న్నాయి.అవిపీల్చిన వాళ్లకి భయం కరమైన వ్యాధులు,ఆస్తమా,రక్తపోటు, గుండెదడ,ఉబ్బస వ్యాధులు కలుగుతున్నాయి. కొందరు అజ్ఞానంతో,చెత్తలలో టైర్‌లవంటివి కూడా కాలుస్తున్నారు.దీనివల్ల కీడు ఎక్కువ. ఇవన్నీ ప్రజలకు అవగాహన కలిగించాలి .
ఇలా చేయాలి:
ే నేటి తరానికి, పిల్లలకు మన అంత అందమైన బాల్యం కూడా ఇవ్వలేక పోయాం. కనీసం ఇప్పటి నుంచైనా కళ్ళు తెరిచి, పచ్చని వాతావరణం కల్పించి, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి బట్ట సంచులు వాడేలా చేయాలి.
ే దగ్గరి షాప్‌లకు నడిచో, సైకిల్‌ పై వెళ్ళేలాగో చర్యలు చేపట్టాలి. వాళ్లకి ఈ అవగాహన కల్పించాలి.
ే పిచ్చుకలు,కాకులు ఇతర పక్షి జాతులు మనచుట్టూ ఉండేలా చేసుకొనే ప్రయత్నం చేయాలి.తక్కువ నీరు పీల్చే మొక్కలను సత్వరమే పెంచాలి.
ే మళ్ళీ రిక్షాలను, ఆహ్వానించాలి. తద్వారా పేద వారికి ఉపాధి కూడా కలుగుతుంది.
ే ఇంటి బయట పావురాలకు కాస్త ధాన్యం వేసి, మంచి నీరు ఒక మూకుడులో పెట్టి, ఆకర్షించాలి
ే ప్లాస్టిక్‌ కవర్లు వాడ కూడదు. ప్లాస్టిక్‌ను వీధుల్లో ఎక్కడ బడితే అక్కడ వేసే వారికి జరిమానా వెయ్యాలి. అలాగే పేరుకున్న వాటన్నింటినీ వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలి. కాలనీల వారీగా ఈ ప్రయత్నం చేయించాలి.
ే నాలాలను, చెరువులను వర్షా కాలం లోపలే చెత్త రహితంగా చేసుకోవాలి
ే ఇళ్లల్లో ,ఆఫీసుల్లో అవసర మైనంత మేరకే విద్యుత్తు వాడాలి/ స్విచ్‌ ఆఫ్‌ చేస్తూ ఉండాలి. సెల్‌ ఫోన్‌లను రోజుకో గంట స్విచ్‌ ఆఫ్‌ చేయాలి, రేడియేషన్‌ను తగ్గించాలి
ే సౌర శక్తిని విరివిగా ప్లేట్‌లుభవనాలపై నిర్మించి విద్యుత్‌ ఆదా చేయాలి.
ే బియ్యం, కూరలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి.
ే వాహనాల హారన్‌లు ఊరికే మోగించ కుండా చర్యలు చేపట్టాలి
ే ఇళ్ళ మధ్యలో, మైదానాల్లో పార్క్‌లు అభివృద్ధిపరిచే చర్యలు చేపట్టాలి. ఉదయం సాయం సంధ్యలలో వాకింగ్‌ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించాలి. చీటికి మాటికి మందులు వేసుకోవటం కూడా తగ్గించినట్లు అవుతుంది
ే పిల్లలకు పట్టే పాలల్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు వార్తలొచ్చాయి సింథటిక్‌ పాలను, కృత్రిమ పాలనునిషేధించాలి.
ే కంపోస్ట్‌ ఎరువులనే వాడాలి.రసాయ నిక ఎరువులను వాడకుండాచర్యలు చేపట్టాలి
ే సేంద్రీయపధ్ధతిలోపెంచే కూరగాయా లనే వాడేలా, జనరిక్‌ మందులనే వినియోగించేలా ప్రజలకు అవగాహనా సదస్సులు పెట్టి వారిని చైతన్య వంతులను చేయాలి.
ే ధాన్యాల్లో కల్తీని అరికట్టే చర్యలు చేపట్టాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే తప్పకుండా భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, వాతా వరణాన్ని అందించ గలుగుతాం.
కార్భన్‌డయాక్సైడ్‌తో నష్టాలు:
వాతావరణంలో కర్బనం రెండు ఆక్సిజన్‌ అణువులతో కలిసి కార్బన్‌ డయాక్సైడ్‌గా మారుతుంది. కార్బన్‌ డయాక్సైడ్‌,గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్టు కారణంగా భూమి గడ్డ కట్టుకుపోకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు వాడే శక్తి అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎక్కువ మొత్తా ల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ వాతా వరణంలో కలు స్తోంది.వాతావరణంలో ఇప్పుడు సగటున మిలి యన్‌కు 380పార్ట్‌ల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉంది. పారిశ్రామిక విప్లవం మొదలు కావడానికి ముం దు ఇది280స్థాయిలో ఉండేది.అంటే ఇప్పుడు 36శాతం ఎక్కువైంది.శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కాలుష్యాలను తగ్గించకపోతే గనుక 2100 సంవత్సరంనాటికి ఉష్ణోగ్రత3నుంచి 6డిగ్రీల సెల్సియస్‌ పెరుగు తుందని వాతా వరణ నిపుణులు పేర్కొం టున్నారు.భూమిమీద వేడి పెరిగితే మంచు పర్వతాలుకరిగి,సముద్ర మట్టాలు పెరుగుతాయి.దీనివల్ల తీరానఉండే ద్వీపాలు,లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ఇంకా పెరుగుతుంది.ఇది లాగే కొన సాగితే భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది.(జీ.ఏ.ఎస్‌. కూమార్‌ )