మైనింగ్ వద్దూ…రాజ్యాంగ చట్టాలే ముద్దు!
దేశానికి స్వాతంత్య్రంవచ్చి 74సంవత్సరాలు అవు తోంది. ఇన్నేళ్లుయినా ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనుల స్థితిగ తులు మారలేదు. సంస్కృతి,కట్లుబాట్లు,సాంప్రదాయాలు అన్నీ అంతరించి పోతున్నాయి. అభివృద్ధిపేరుతో గిరిజన ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు,డ్యామ్‌లు,రోడ్లువిస్తరణ,మైనింగ్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా గిరిజనులు వారి భూములను కోల్పోతూ మరింత నష్టపోతున్నారు. అభివృద్ధింటే ప్రజల్ని భాగ స్వాములను చేయాలి. కానీఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అది జరగడంలేదు. ప్రభుత్వం వారి మనోభావాలను పక్కన పెట్టి గిరిజనుల వనరులు దోచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంది.
ఇటీవల కాలంలో విశాఖఏజెన్సీ అనంతగిరి మం డలం కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు గిరిజనగ్రామాలను సందర్శించడం జరిగింది.మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీ లించడమైనది. మైనింగ్లీజుల వ్యవహారంపై గిరిజనుల మనో భవాలను అడిగి తెలుసు కోవడం జరిగింది. గిరిజన ప్రాంతంలో నిక్షేపమై ఉన్న ఖనిజతవ్వకాలపై 1970లో ప్రభుత్వం లక్ష్మీ నారాయణ అనే వ్యక్తికి ఇచ్చిన లీజును 1990లో ఆయన బిర్లా కంపెనీకి ఆలీజులను అమ్ముకున్నాడు.దీనిపై సమత 1993లో కోర్టును ఆశ్రయించింది. 1995లో హైకోర్టులో ఒడిపోయాం. తర్వాత అదే సంవత్సరంలో సుప్రీంకోర్టుకు వెళ్లాం. ఇదే సమ యంలో బిర్లా కంపెనీ లీజులను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ఇచ్చేసింది. 1997జులైన సుప్రీం కోర్టులో కేసు గెలిశాం. అయితే 1995నుంచి మైనింగ్ లీజును ఏపీఎండీసీ వద్దనే ఉంచుకుంది. రెండు,మూడుసార్లు ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తే శ్రీఅభయ గిరిజన మ్యూచువల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కోర్టుకు వెళ్లారు. మాకే మైనింగ్ లీజులు ఇవ్వాలని కోర్టును కోరడం జరిగింది. కానీ విపత్కరమైన కోవిడ్19 సమయంలో ఏపీఎండిసీ ఈ`టెండర్లులకు ఆహ్వానించింది.తెలివిగా ఇద్దరు గిరిజన వ్యక్తులకు రైజింగ్ కాంట్రా క్టర్లగా (సమతజెడ్జిమెంటును అనుచరిస్తున్నట్టు) ఇచ్చి యున్నారు. అయితే వారికి ఇప్పటివరకు ఎన్ఓసీ (నిరాభ్యంతర పత్రం) ఎవరిపేరు మీద ఇచ్చినట్లు లేదు. అధికారికంగా ఏపీఎండీసీ అయినా, రెవెన్యూ అధికారులైన,స్థానిక ప్రజలకుగాని,రైతులకుగాని ఏవిధమైన నోటీసులు,సూచనలు ఇవ్వలేదు. కానీ కొంతమంది గిరిజ నేతర్ల వ్యక్తులు మైనింగ్ప్రభావిత ప్రాంతానికి చెందిన గిరిజన ప్రజల్ని మభ్యపెట్టి వారి భూముల్లో ఖనిజతవ్వకాలు చేపట్టడానికి మంతనాలు జరుపుతున్నారు. ఏజెన్సీలో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన సమత జెడ్జిమెంటు,పీసాచట్టం గ్రామసభ,అటవీహక్కుల చట్టం వంటి చట్టాల ప్రకారంగా స్థానిక గ్రామసభకే అధికారం ఉంది. కాల్సైట్ మైనర్ మినరల్ కావున గ్రామసభకే అధికారంఉన్నది. ఏపీఎండీసీ ఈ విధా నాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా మైనింగ్ చేపట్టడం అన్యాయం.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యులు ప్రకారం విశాఖ జిల్లా లోని ఏజెన్సీ ప్రాంతంతా ఎల్టీఆర్1/70చట్టం పరిధిలోకి వస్తోంది. గిరిజన చట్టాలను సమర్ధవంతంగా అనుసరించి ఆచరణలోకి తీసుకు వచ్చే బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉంది. షెడ్యూలు ప్రాంతాల్లోని భూము లను ప్రభుత్వం గనుల తవ్వకంకోసం గిరిజనేతరులకు లీజుకు ఇవ్వడం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలుకు విరుద్దం.ఈ ప్రాంతంలోని ప్రభు త్వ భూములు, అటవీభూములు,గిరిజన భూములను గిరిజనేతరులకు గానీ,ప్రైవేటు పరిశ్రమలకుగానీ లీజుకు ఇవ్వకూడదు. ఈఅంశం చేయదాట కుండా ఉన్నతాధికారయంత్రాంగం చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలి.!-రెబ్బాప్రగడ రవి