మైనింగ్ తవ్వదు..!
తమ పంటపొలాలు నాశనమై పోతు న్నాయి..పర్యావరణానికిహాని కలిగించడంత పాటు గిరిజన ప్రజల ప్రశాంత వాతావర ణాన్ని దెబ్బతీ సేలా ఉన్న అక్రమ మైనింగ్ లీజులను శాశ్వతంగా రద్దు చేసి రక్షణ కల్పించాలని మైనింగ్ ప్రభావిత ప్రాంత గిరిజనులు డిమాండ్ చేశారు.మైనింగ్ తవ్వకాల కోసం ప్రజాభిప్రా యసేకరణకు వచ్చిన ఉన్నతాధికార బృందాన్ని చుట్టు ముట్టారు.వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమకు నష్టం కలిగి స్తున్న మైనింగ్‌లు మాకొద్దు అంటూ వ్యతిరేకించారు. మైనింగ్ తవ్వొద్దు..మా పొట్టలు కొట్టొద్దు అంటూ అధికారులను నిలదీశారు.అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు వాలసి పంచాయతీ గిరిజ నులు ముక్తకంఠంతో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. –సైమన్ గునపర్తి అల్లూరి సీతారామరాజు జిల్లా అనం తగిరి మండలంలో వాలసీ పంచాయితీ పరిధి కరకవలస,రాళ్లగరువు వద్ద సర్వే నెంబర్లు 29,33, 34,35లలోదురియ రుక్మిణీ,రొబ్బ శంకర్ల పేర్లతో ఉన్న 124ఎకరాల్లో జరుగుతున్న కాల్సైట్ మైనింగ్ లీజులపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు జిల్లాజాయింట్ కలెక్టర్ శివ శ్రీని వాస్,కాలుష్యనియంత్రణ మండలిబోర్డ్, ఎపిఎండిసి అధికార్లు నిమ్మలపాడు బుధవారం విచ్చేశారు. అధికార బృందాన్ని మైనింగ్ ప్రభావిత గిరిజన గ్రామాలైన వాలాసి పంచాయతీ నిమ్మలపాడు, తూభూర్తి, కరకవలస,రాళ్లవలస గిరిజనప్రజలు, సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి రెబ్బా ప్రగడ, అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు, ప్రజాప్రతి నిధులు అడ్డుకున్నారు. అక్రమ బినామీ మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన లీజులను రద్దు చేయలని ముక్త కంఠంతో నినాదించారు.గిరిజనులకు నష్టం కలిగిస్తున్న మైనింగ్‌లు మాకొద్దు అంటూ వ్యతిరేకిం చారు.2006 నుండి 2023 వరకు 18సంవత్స రాల నుంచి బినామీలీజులతో అక్రమ మైనింగ్ తవ్వకాలు చేపట్టి అమాయక గిరిజనుల వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.ఇతర ప్రాంతా లకు చెందిన కొంతమంది బడాబాబులు, కొంత మంది ప్రభుత్వ పెద్దల అండదండలతో మైనింగ్ మాఫీయా చెలరేగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనచట్టాలు,హక్కులను తుంగలో తొక్కి తమ పంటపొలాల్లో నిక్షేప్తమైన గనులు, ఖనిజా లను తరలించుకు పోతున్నారని,మా అభిప్రాయా లను గౌరవించి అక్రమ మైనింగ్‌లు శాస్వతంగా రద్ధుచేయలని కోరారు.తర్వాత నిమ్మలపాడు గ్రామంలో ప్రారంభమైన ర్యాలీ కరకవలస, రాళ్ల గెడ్డలో ఏర్పాటు చేసిన సభా వేధిక వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
అధికారులను అడ్డుకున్న గిరిజనులు
ప్రజాభిప్రాసేకరణ చేపట్టేందుకు విచ్చే సినఅధికార బృందాన్ని స్థానిక గిరిజనులు, సమత సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రబ్బ ప్రగాడ రవి,సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజులు అడ్డుకుని అధికా రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత జాయింట్ కలెక్టర్ శివశ్రీనివాస్,ఖనిజ సంపద కాలు ష్య నియంత్రణ అధ్యక్షతన ఏపీఎం డిసి అధికారుల బృందం మైనింగ్ ప్రభావిత గిరిజన గ్రామాలైన నిమ్మలపాడు,రాళ్లగరువు గ్రామం మైనింగ్ ప్రదేశం వద్ద ప్రజాభిప్రాసేకరణ నిర్వహిం చారు. ఈసభలో కూడా గిరిజనులుఅధికార బృందాన్ని నిలదీశారు. స్థానిక సర్పంచ్‌తో సహా మైనింగ్ తవ్వకాలకు వ్యతి రేకంగా ఆందోళన చేపట్టా రు.ఆందోళన అనం తరం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ప్రజా ప్రతిని ధులు,గిరిజనులకు ఎటువంటి సమాచారం ఎందు కు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎటువంటి ప్రజాభిప్రా సేకరణ లేకుండా గత 18సంవత్సరాలుగా మైనిం గ్ జరపడం సరికాదని, దీంతో తమ పంట పొలా లు కాలుష్యంతో దెబ్బతిం టున్నాయని,పలు రోగు లతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అక్రమంగా తవ్వకాలు జరిపిన మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిం చాలని అధికారులను చుట్టుముట్టి నిలదీశారు. దీంతో జేసీ శివశ్రీనివాస్,ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ,స్థానికతహాసిల్దార్,ఏపీఎండీసీ అధికా రులను ప్రజాప్రతి నిధులు,మైనింగ్ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అనం తరం సభావేదికకు వచ్చిన అధికారులు గిరిజన ప్రజలు,స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వేరువేరుగా అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు.
సభలో సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మాట్లాడుతూ 1995 నుంచి ఈ ప్రాంతంలో సమత చేపడు తున్న వనరుల పరిరక్షణ ఉద్యమాన్ని అధికారులకు వివరించారు. నిమ్మలపాడు కాల్ సైట్ మైనింగ్ తవ్వకాలు నిర్వహించేందుకు టాటా,బిర్లా అప్పట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదిరించు కుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన సమత సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగిందని గుర్తుచేశారు. తమకు అనుకూలంగా 1997లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో టాటా, బిర్లా సంస్థలు వెనుక్కు వెళ్లి పోయారని తెలిపారు. ఇదే గతి నేడు ఏపీఎండిసికు కూడా పడుతుం దన్నారు. ఐదో షెడ్యూల్ ఏరి యాలో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు,పంచాయితీ రాజ్ విస్తీర్ణ చట్టం(పీసా) అనుమతులు లేకుండా ఇష్టం రాజ్యంగా మైనింగ్ తవ్వకాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకునేది లేద న్నారు. తర్వాత అనంతగిరి మండల జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లా డుతూ,వాలసి పంచా యతీ తూభుర్తి. కరకవలస, రాళ్లగెడ్డ గ్రామాలకు అనుకొనున్న కాల్సైట్ మైనింగ్ 2006 సంవత్సరం నుంచి బినామీదారులతో తవ్వ కాలు జరుపుతు న్నారన్నారు. బినామీ దారులైన దురియా రుక్మిణి, రొబ్బ శంకరరావులు మైనింగ్ కొల్లగొట్టి దోచుకు న్నారని విమర్శించారు. గ్రామ అభివద్ధి, పనిచేసిన రైతులకు కనీస కూలి చెల్లించ కుండా కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియా దోచుకుందన్నారు. మైనింగ్ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీకి రాయల్టీ చెల్లించాల్సి ఉందన్నారు. ఏపీఎండిసి పేరుతో బినామీ వ్యవస్థను పెట్టి మై నింగ్ తవ్వకాలు జరితే చూస్తూ ఊరుకునేది లేదని, గిరిజనుల పక్షాన అంటూ న్యాయం జరిగే వరకూ తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిం చారు. పూర్తిగా మైనింగ్ లీజులనురద్దు చేసి గిరిజన భూములు గిరిజనులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్పంచ్ సాంబె సన్యాసిరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ,ప్రజలకు నష్టానికి గురి చేసే మైనింగ్ తవ్వకాలకు వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఉంటానన్నారు. ఇప్పటికైనా మా అభిప్రా యాలను గౌరవించి అక్రమ మైనింగ్ లీజులు, తవ్వకాలను శాస్వతంగా రద్ధుచేెయలని కోరారు
అనంతరం గిరిజనుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ మాట్లాడారు.గిరిజనులు వెల్లడిరచిన వారి మనో భావాలు,అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మైనింగ్ తవ్వకాలను పరిశీలించి ప్రభుత్వానికి,అధికారులకు తెలియపరచాలని ఆయన ఆదేశించారు ఈకార్యక్రమంలో ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ ఇంజనీరింగ్ అధికారి. సుదర్శన్,తహసిల్దార్ రామభాయి,సమత డైరెక్టర్ సుశాంత్ ప్రాణగ్రహి,కందుకూరి సతీష్ కుమార్, సిపిఎం టోకూరు సర్పంచ్ కె.మొసియా,మండల కార్యదర్శి ఎస్.నాగులు,వాలసి మాజీ సర్పంచ్ ధర్మన్న, గురుమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.