Skip to content
మెరుగైన ఐటీ పాలసీతో ఐటీ పరిశ్రమలు రప్పిస్తాం..
- 100 బిలియన్ ఎకానమీగా విశాఖ మహానగరాన్ని అభివృద్ధిచేస్తాం!
- గ్రీన్ చానల్ ద్వారా ఐటి పరిశ్రమలకు రాయితీలను అందజేస్తాం
- ఐటిలో ఎంత ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు
- ఏపి ఐటి అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం: త్వరలో మెరుగైన ఐటి పాలసీని ప్రకటించి, దేశంలోనే ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొ న్నారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఐటి అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ గురువారం ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఐటి రంగంలో ఇప్పటికే అభివృద్ధి సాధించిన హైదరాబాద్, బెంగు ళూరు,చెన్నయ్ లల్లో అమలుచేస్తున్న పాలసీల ను అధ్యయనం చేసి మెరుగైన ఐటి పాలసీని తీసుకువస్తాం.రాష్ట్రంలో అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యం లో ఐటి,ఎలక్ట్రానిక్స్ రంగాలు కీలకపాత్ర పోషించబోతున్నాయి.దేశంలో టాప్-10 ఐటి కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం,త్వరలో రాష్ట ప్రజానీకం ఐటి పరిశ్రమ పెట్టుబడులపై శుభవార్త వింటారు.ఐఎస్‌బి తరహాలో విశాఖ లో ప్రపంచస్థాయి ఎఐ యూనివర్సిటీని ఏర్పా టుచేస్తాం.ఎఐ హబ్ గా కూడా విశాఖను తీర్చి దిద్దుతాం.రోబోటిక్స్,హెల్త్ కేర్,ఎడ్యుకేషన్ వంటి రంగాలతో అనుసంధానించి ఐటిని వేగ వంతంగా అభివృద్ధిచేస్తాం.రాబోయే అయిదేళ్ల లో విశాఖపట్నాన్ని 100బిలియన్ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతాం.ఐటి రంగం లో హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు గారు ఏవిధంగా అభివృద్ధి చేశారో ఐటి పరిశ్ర మదారులకు తెలుసు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడి ఐఎస్ బిని హైజాక్ చేసి హైదరాబాద్‌కు రప్పిం చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్‌ను చూడబోతున్నాం.గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని నెం.1గా నిలి పిన బాబు,ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజి నెస్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించబోతున్నారు.చంద్రబాబుగారిలో 19 95 నాటి సిఎం మాదిరిగా పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేంకట్టుబడి ఉన్నాం విశాఖను ఐటి క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ ముందుకు సాగుతోంది.గత అయిదేళ్లలో ఐటి పరిశ్రమ అష్టకష్టాలు గత అయిదేళ్లలో పరిశ్రమ దారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవం తమైన ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ ఒక్క చదర పు అడుగు కూడా ఐటి స్పేస్ అభివృద్ధి చేయ లేదు. ఐటి పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధిలైట్లు కూడా ఏర్పాటుచేయలేదు. మెరుగైన ఐటి పాలసీ రూపకల్పనకు పరిశ్రమ పెద్దలతో చర్చిస్తున్నాం,గత ప్రభుత్వం పెండిరగ్ పెట్టిని ఇన్సెంటివ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం. ప్రస్తు తం పనిచేస్తున్న ఐటి కంపెనీలు, కొత్తగా ఏర్పా టుచేసే కంపెనీలకు ఇకపై గ్రీన్ చానల్ ద్వారా ఇన్సెంటివ్స్ అందజేస్తాం.రాష్ట్రంలో కొత్తగా వచ్చే ఐటి పరిశ్రమల్లో 90శాతం విశాఖప ట్నానికే రాబోతున్నాయి.విశాఖలో ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్‌ను అభివృద్ధి చేస్తాం.కేవలం ఐటిలో మాత్ర మే కాకుండా ఫార్మా, ఎంఎస్‌ఎంఇ వంటి రంగాల్లో కూడా విశాఖవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటి రంగంలో తెలుగువారు అధికంగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఐటి నిపుణులను తిరిగి ఎపికి రప్పి స్తాం. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నాం, విద్యారంగంలో కెజి టు పిజి వరకు ప్రక్షాళన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ -100 యూనివర్సిటీల్లో ఎపి విశ్వ విద్యాలయాలు ఉండాలన్నదే తమ లక్ష్యం. కొత్త గా ఏర్పాటయ్యే ఐటి పరిశ్రమలు యువతకు ఎన్ని ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సహకాలు అందిస్తాం. – జిఎన్‌వి సతీష్
Related