మిచౌంగ్ తుఫాన్…
ఓ వైపు చలికాలం కొనసాగుతూ ఉంటే మరో వైపు మిచౌంగ్ తుఫాను ముంచేసింది. వరిరైతుల ఉరేసింది. ఈ విపత్తు అన్నదాత ఆశల్ని ఊడ్చేసినంది. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో వరి నేలవాలింది. కోతకొచ్చిన లక్షల ఎకరాల వరిని నేలమట్టం చేస్తూ ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని నీటముంచుతూ.. మిచౌంగ్ తీవ్ర తుఫాను తీరందాటింది. చేతికొచ్చేసినట్లే అనుకుంటున్న వరి రైతుల ఆశల్ని తుఫాను తుడిచిపెట్టేసింది. రాయలసీమ,కోస్తా జిల్లాలో ఉద్యాన పంటలకూ తీరని నష్టాన్ని మిగిల్చింది. తీవ్ర తుఫాన్ కారణంగా వ్యవసాయ,ఉద్యాన పంటల నష్టమే రూ.10వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.అతి భారీ వర్షాలు, గంటలకు వంద కి.మీ.వేగంతో వీచిన గాలుల తీవ్రతకు వందల గ్రామాలు వణికిపోయాయి. 8 జిల్లాలో 60మండలాల్లో తీవ్ర తుపాను ప్రభావం చూపింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం క్రమాంగా మిచౌంగ్ తుఫాన్‌గా ఏర్పడిరది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఎక్కువగా చూపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సాధారణంగా ప్రకృతిలో అనేక మార్పుల వల్ల భూకంపాలు, తుఫాన్లు వస్తుంటాయి. వాతా వరణ ప్రభావం వల్ల తుఫాన్ ఏర్పడి అది సృష్టించే బీభత్సం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. అయితే ప్రతి తుఫాన్ కి వాతావరణ శాఖ వారు ఒక పేరుపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. బంగాళా ఖాతం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడి అల్ప పీడనం కారణంగా క్రమేణా వాయు గుండంగా మారి తుఫాన్ రూపం దాల్చు తుంది. దీని ప్రభావం దేశంలోని పలు రాష్ట్రా ల్లో భారీ వర్షాలు పడుతుంటాయి.ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి పోతాయి. విపరీతమైన గాలులు వీయడంతో కట్టడాలు నేటమట్టం అవుతుంటాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలను వణికి స్తున్న మిచౌంగ్ తుఫాన్‌కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.వివరాల్లోకి వెళితే..
తుఫాన్ అంటే ప్రజలు భయంతో వణికిపోతుంటారు. ప్రతి ఏటా ప్రపంచ వాతావరణ సంస్థ (%ఔవీూ%) సైక్లోన్ పరిస్థితిని బట్టి ఈ పేరును పర్యవేక్షిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఏర్పడే తుఫానులను ఆ ప్రాంతాలలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, ఉష్ణ మండల తుఫాన్ హెచ్చిరికల కేంద్రాల నుంచి పేర్లను సేకరించి వాటికి అనుగుణంగా తుఫాన్ పేరును సూచిస్తాయి. 2021లో ఏర్పడిన తౌటే తుఫాన్‌కి మయన్మార్ పేరు పెట్టింది. మయన్మార్‌లో తౌటే అంటే పెద్ద శబ్ధం చేసే బల్లి అని అర్థం.ఈతుఫాన్ భారీ శబ్ధాలు చేస్తూ రావడంతో మయన్మార్ వాతావరణ శాఖ తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును పెట్టింది.ఆతర్వాత ఏపీని వణికిం చిన హుద్ హుద్ తుఫాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ దీని ఎఫెక్ట్ ఆ ప్రాంతం లో కనిపిస్తూనే ఉంది. హుద్‌హుద్ తుఫాన్ కి ఆపేరు ఒమన్ సూచించింది. ఇది ఇజ్రా యెల్ జాతీయ పక్షి హుపో.హుద్‌హుద్ అంటే ఆఫ్రో-యురేషియా అంతటా కనిపించే రంగుల పక్షి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడును వణికిస్తున్న తుఫాన్ కి మిచౌంగ్ అని పేరు పెట్టారు. ‘మిగ్గామ్’ అని ఉచ్చరించే మిచాంగ్ పేరును మయన్మార్ సూచించింది. మిచాంగ్ అంటే ‘బలం’ లేదా ‘స్థిరత’ అని అర్థం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా మిచౌంగ్ తుఫాన్ గా ఏర్పడిరదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి దీని ప్రభావం విపరీతంగా చూపిస్తుంద. గంటకు 8 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం మరో రెండు రోజులు ఉండ వొచ్చని.. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఈ తుఫాన్ ప్రభావం తమిళనాడులో భారీగా చూపించింది. చెన్నైలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఇప్పటికే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌రంగంలోకి దిగి సహాయకచర్యలు ప్రారంభించింది.
మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్..142 రైళ్లు రద్దు!
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ తుఫాన్ కోస్తావైపు కదులుతున్నట్టు వాతా వరణశాఖ ప్రకటించింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళా ఖాతం లో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం లోపు నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశ ముందని ఐఎండీ వెల్లడిరచింది.ఇక తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలను, మత్స్యకారులను జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కోస్తా, రాయలసీమలో సోమ మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం రైళ్లపై పడిరది. ఈ తుపాను నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 3వ తేదీ నుంచి 6 తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేసినట్టు సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం శుక్రవారం వాయుగుం డంగా మారింది. మిచౌంగ్ తుఫాన్ ఆదివారానికి తుపానుగా బల పడిరది. దీంతో నేడు, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలానే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిరది.ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణి కులను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) హెచ్చరిక జారీ చేసింది. మిచాంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో తిరిగే 142 రైళ్లు రద్దు చేశామని సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణి కులు గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. చెన్నై విమానా శ్రయం మూసివేత!
మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలవల్ల చెన్నై ప్రజల జీవనం దెబ్బతింటోంది. కాలనీలు, ప్రధాన రహదారులు అన్నీ జలాశయాలను తలపిస్తున్నాయి. ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరి స్తున్నారు. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం వాటిల్లింది. ఇప్పుడు చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసేశారు. విమాన రాకపోకలను తాత్కాలి కంగా నిలిపివేసినట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నై ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడిరది. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు రైళ్ల సేవలను నిలిపివేశారు. రోడ్డు మార్గాన కూడా చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు విమాన రాకపో కలకు కూడా అంతరాయం ఏర్పడిరది. రన్ వేని క్లోజ్ చేస్తున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడిరచారు. రాత్రి 11 గంటల వరకు విమానాల టేకాఫ్, ల్యాండిరగ్ జరగదని..రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ప్రకటించారు. వాతా వరణం అనుకూలించక పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేశారు. తుపాను ప్రభావం వల్ల తీర ప్రాంతాలైన చెన్నై, కాంచీపురం,తిరువల్లూర్,చెంగలపట్టు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతోంది. ఈ వర్షాల కారణంగానే విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మిచౌంగ్ తుపాను కారణంగా ప్రస్తుతం 80 నుంతి 90కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షపు నీటి వల్ల విమానాలు, రోడ్డు రవాణా మాత్రమే కాకుండా.. రైళ్ల రాకపోకలకు కూడా అంత రాయం ఏర్పడిరది. చెన్నైలో దాదాపు 14 సబ్ వేలను వర్షపు నీటివల్ల మూసి వేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఇంక ఈ మిచౌంగ్ తుపాను వల్ల అటు తెలుగు రాష్ట్రా ల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడిరచారు. ఈ తుపాను నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఈ నేపథ్యంలోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఈదురు గాలులు కూడా వీచే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఆంధ్రాలో అధికా రులు తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే మరో 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తు న్నారు. మరోవైపు మిచౌంగ్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, కాలనీలు అన్నీ జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల కాలనీల్లో పార్క్ చేసిన కార్లు కాగితపు పడవల్లా వరద నీటిలో కొట్టుకుపో తున్నాయి. ఇప్పటికే చెన్నై నగరానికి మంచి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు అన్నీ నిండిపోయాయి. ఇంకా వర్షాలు కురుస్తూ ఉండటంతో అవి పొంగే ప్రమాదం కూడా ఉందంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే నెట్టింట చెన్నై నగరానికి సంబం ధించిన విజువల్స్ వైరల్‌గా మారాయి. అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలకు ఆ దృశ్యాలు సాక్ష్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నా రు. మరోవైపు ఏటా ఇలాంటి వరదలు వస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే రోడ్లు జలమ యం అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుపానుతో వరి పంటకు తీవ్ర నష్టం
తుపాను వల్ల జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాన్ని రవాణాకు వాహనాలు లేకపోవడంతో కొంతమంది రైతులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకొని తమ ధాన్యాన్ని తరలించు కుపోయే పనిలో ఉండగా,మరి కొంతమంది రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని టార్పలిన్లతో కప్పి భద్రపర్చుకొంటున్నారు. ఇప్పటికే పొలం లో కోసి ఉన్న పంటను కుప్పలు వేసుకుని పంటను తడవకుండా కాపాడుకునే పనిలో కొంతమంది రైతులు నిమగమైనారు. కల్లాల్లో, పొలాల్లో ఎక్కడ చూసినా రైతులు పండిన పంటను, అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని, బస్టాండ్లో నింపిన ధాన్యాన్ని తరలించే పనిలోనే ఉంటూ తమ పంటను కాపాడుకునే పనిలోనే ఉన్నారు.పాలకొండ: తుపాను హెచ్చ రికతో రైతులకు పాట్లు తప్పటం లేదు. ఓ మోస్తారు వర్షం కురువడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరి పొలాలు, కల్లంలో ఉన్న వరికుప్పలను తర్బాన్లనతో రక్షణ కల్పించుకున్నారు. మండలంలో 17 వేల ఎకరాల్లో వరిసాగవుతోంది. అయితే ఈసారి సాగునీరందక వ్యయప్రయాసాలు పడి మోటర్లు సాయంతో సాగునీటిని పొలాలకు అందించారు. పంట చేతిక అందిన సమ యంలో తుఫాన్లు రావడంతో పంట ఏమివుతుందో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో గోపాలపురం, భాసూరు,వి.పి రాజుపేట, అంపిలి తదితర ప్రాంతాల్లో పొలాల్లోనే ధాన్యం కుప్పలు ఉన్నాయి. దీంతో ధాన్యం తడిసి రంగు మారుతుందన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులపాటు ఈ వర్షాప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలో మిచాంగ్ తుపానుతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. రెండు రోజులుగా ఈ తుపాను ప్రభావం ఉండడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏజెన్సీలో చినరామదేవనాపురం, పెదరామం, దోను బాయి తదితర ప్రాంతాల్లో కోతలైపోవడంతో రైతులు ఆదరా బాధరాగా వరి చేను పంట పొలాల్లోనే కుప్పలు వేస్తున్నారు. మరి కొంత మంది వరిచేలపై టార్బన్ కప్పుతున్నారు. చేతికి అందించిన పంట చేజారి పోతుందే మోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది 2532 ఎకరాల్లో వరి నాట్లు పడగా,580 ఎకరాల వరకు కోతలు జరిగాయి. కోసిన పంటను సురక్షిత ప్రాంతా లకు తరలించాలని పనిలో రైతులు ఉన్నారు. పొలాల్లో కాస్త మిగిలి ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తమ య్యారు. కోసిన వరి పంట కల్లానికి తీసుకువచ్చి కుప్పలుగా పెట్టి టార్ఫాన్లతో కాపాడుకుంటున్నారు. మరి కొన్నిచోట్ల ఆదివారం రాత్రి నుంచి మిషన్లతో నూర్పులు చేపట్టి పంటను ఇంటికి తీసుకెళ్తున్నారు. సకాలంలో వర్షాల్లేక పంట ఎండిపోయి కరువు ఏర్పడిరదని ఆందోళన చెందుతున్న తరుణంలో మరోవైపు తుఫాను ప్రభావంతో మిగిలిన కాస్త పంటైన దాచుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. అప్రమత్తమైన అధికారులుతుపాను కారణంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి విపత్తు వచ్చిన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా గుమ్మిడి లక్ష్మీపురం మండలంలోని 27 పంచాయ తీలు అధికారుల దృష్టి సాధించారు. తుపాను కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు.వాతావరణ మార్పులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కడ వర్షం పడుతుందోనని వరిరైతులు వణికిపోతు న్నాయి. ప్రస్తుతం మండలంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంటను రక్షించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. కోసిన పనులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. సుమారు 1700 వేల వరిసాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన వరి పైరు కోతలు జరుగుతున్నాయి.ఈ పరిస్థితుల్లో వర్షం కురిస్తే వరి పనలు, ధాన్యం పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మను షులు తో కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలించి వాటిపై పరదాలు కప్పి రక్షణ చర్యలు చేపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో ఆపకుండా, గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని, వీటిని తరలించేందుకు సరిపడా వాహనాలను ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.-గునపర్తి సైమన్