మాఊరి పండుగలు.. స్థానిక ఆచారాలు…!
జనవరి 25 శనివారం సాయంత్రం రిషీవ్యాలి పాఠశాలో సంక్రాంతి సంబరం. మధ్యాహ్నం పాఠశాలలో పనిచేసే పనివారికి వ్యవసాయశాఖ (ఎస్టేటులో) భోజనాలు పెట్టారు. 3.30 నిము షాలకు ఆవును, ఎద్దును అంకరించి డప్పులు మేళాల సందడితో పిల్లన గ్రోవిల పాటతో, స్త్రీ, పురుషు ఆడే జానపద నృత్యాతో సందడిగా వుంది పాఠశా. విద్యార్థు వసతి గృహా ముందు చక్కగా అలికి ముగ్గువేసి గొబ్బెమ్మతో అంకరించారు. ప్రధాన మార్గం గుండా ఆటస్థంలోకి ఆటపాటతో అందరూ చేరుకున్నారు. అక్కడ ఓ అరగంటసేపు విద్యార్థు కూడ గ్రామీణుతో కలిసి వారు చేసే నృత్యానికి అనుగుణంగా కాళ్లు చేతు కదుపుతు వృత్తాకారంలో చేయి చేయి పట్టుకొని తిరుగుతు, ఎగురుతు ఆనందిస్తున్నారు.సెల్ ఫోన్లలో ఆ దృశ్యాు బంధింపబడు తున్నాయి. నెమ్మదిగా భోజనశా మీదుగ నిర్జన మైదాన ప్రదేశానికి చేరుకున్నారు అందరు. ‘‘చిట్లాకుప్ప’’కు మంట వెలిగించి పశువును మూడుసార్లు ప్రదక్షిణం చేయించి గోశాకు తీసుకువెళ్లారు. నేను పాఠశాలో చేరిన కొత్తలో ఇదంతా ఓవింతగా అనిపించింది. పండుగ ఐపోయి పదిరోజు తరువాత ఈ సంక్రాంతే మిటని అనుకున్నా! ఆ విషయం అప్పుడు అక్కడితో మర్చిపోయా! జనవరి 14,15 తేదీలో సంక్రాంతి పండుగ పూర్తయితే మా ఊరిలో 25న సంక్రాంతేంటనే అనుమానం నాలాగ అందరికీ కుగుతుంది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైన పాఠశా రిషీవ్యాలి స్కూు అదే మాఊరు. దానిని జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించారు. ప్రకృతికి, పక్షు, పశువు, కొండు, గుట్టకు సమీపంగా ప్రశాంతంగా వుండే 350 ఎకరా పాఠశాకు 3కిలో మీటర్ల దూరంలో ‘తెట్టు’అనే గ్రామం ఉంది. తెట్టు గ్రామం అసు పేరు ‘‘శేషనగరము’’. ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన ‘‘సంతాన వేణుగోపాస్వామి’’ దేవాయమునకు అటు తమిళనాడు, ఇటు కర్ణాటక నుండి కూడ భక్తు వచ్చి తమతమ కోరికు నెరవేరినందున మొక్కు తీర్చుకుంటు వుంటారు. అశ్వనీ నక్షత్రముతో కూడుకున్న అమావాస్యనాడు శ్రీవారి కళ్యాణోత్సవము జరుగును. స్వామివారి విగ్రహము కోనేరులో అమావాస్యనాడు భించుటతో ఆనాటి నుండి అమావాస్యనాడే కళ్యాణోత్సవం నిర్వహించటం ఆనవాయితీ అయింది.కాక్రమేణ శేషనగరము ‘తెట్టు’ గా మారింది. సుమారు 20 కుటుంబా వారు గతంలో అక్కడ ఒక కోట నిర్మించుకొని ఏనుగు బారిన పడకుండుటకై చుట్టు ముళ్లకంపతో ఎత్తైన తెట్టు వేసుకున్నందున ఆ గ్రామానికి తెట్టు అను పేరు వచ్చింది. విశిష్టాద్వైత దర్శన ప్రవర్తకుడగు శ్రీమద్రామానుజాచార్యు వారి విగ్రహం ఆ దేవాయంలో వున్నందున రామాను జాచార్యు వారు ఆదిశేషుని అవతారం కావున ఆ ఊరికి నాడు ‘శేషనగరం’ అని పేరు వచ్చింది.ప్రస్తుతం ఈ తెట్టు చుట్టు ప్రక్క గ్రామా కంటే పెద్దది కావున ‘‘కస్ఫా’’ గ్రామం అంటారు. చుట్టుప్రక్క గ్రామీణుకు స్వామి వారిపై అమిత భక్తి కావున సంక్రాంతి, దసరా మొదగు పండుగు తెట్టు దేవా యంలో ఐన తరువాతే మిగిలిన గ్రామాల్లో చేస్తారు. ఆవిధి విధానాన నుసరించి మాపాఠశా ప్రతి సంవత్సరం శనివారం ఈ సంక్రాంతి పశువు పండుగ చేస్తాం. శనివారం మధ్యాహ్నం నుండి తరగతు వుండవు కావున విద్యార్థు చదువుకు ఏవిధమైన ఆటంకం ఉండదు. తెట్టులో సంక్రాంతి కాగానే మిగిలిన గ్రామా వారు వారివారి అనుకూతను పెద్దతో చర్చించి నిర్ణయించి జరుపుకుంటారు. గ్రామం మొత్తం ఒకేరోజు ఈ సంక్రాంతి పండుగ చేస్తారు. ఆదివారాలో చేయరు. ఆరోజు మాంసాహార భోజనం కావున. సంక్రాంతికి కొత్త అు్లళ్లను పివటం, నూతన వస్త్రాు యివ్వటం వంటి ఆచారం మా ప్రాంతంలో లేదు. ఉభయ గోదావరి జిల్లా వారు ఈ సంక్రాంతిని ‘‘పెద్దపండుగ’’ అని ఘనంగా చేస్తారు. అు్లళ్లతో, కూతుళ్లతో, మనుమడు, మనుమరాళ్లతో, హరిదాసు కీర్తనతో, గంగిరెద్దువారి విన్యాసం వంటి వినోదాతో, కోడిపందాుతో ఆనందంగా గడుపుతారు. ఈ రకమైన ఆచార వ్యవహారాు యిక్కడ వీరికి తెలియవు. మదనపల్లి దగ్గర ‘పెంచుపాడు’, పుంగనూరు తాూకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్రాంతి, సంక్రాంతి రోజు కాకుండ తరువాత వచ్చే ‘మంగళవారం’ చేస్తారు. ఈరోజు అనపకాయ పితికిపప్పు, దోశొ, వడు తప్పనిసరిగా ప్రతి యింటిలో చేస్తారు. పశువు అంకరణ, ‘‘చిట్లాకుప్ప’’ ప్రదక్షిణ మామూు. బుధవారం ఊరంతా కలిసి పొట్టేును కోసి దాని రక్తం ఊరి పొలిమేరల్లో చల్లి ఆ మాంసం గ్రామస్తుంతా ప్రసాదంగా పంచుకొని వండుకుంటారు. కురబకోటలో సంక్రాంతి తరువాత కనుమ పండుగ సోమ వారం, శనివారం వస్తే చేయరు. కారణం కనుమరోజు మాంసాహారం సేవిస్తారు కాబట్టి. ఒక్కో పండక్కు ఒక్కో గ్రామంలో ఒక్కో ఆచారం పాటిస్తారు యిక్కడి ప్రజు. తమిళనాడు సరి హద్దు గ్రామాల్లోని ‘‘పానటూరు’’ గ్రామం గుడి పా మండం లోనిది. సంక్రాంతికి ఎద్దు పందా పోటీు నిర్వహిస్తారు.పోటీలో గెలిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ ఎద్దుకు వస్తు రూపేణ (బంగారం, వెండి) బహుమ తు యిస్తారు. పోటీు కాగానే గ్రామదేవతకు దివ్వెను మోసి పూజించిన తరువాత, ఊరేగించి రాత్రికి పౌరాణిక నాటకం వేయిస్తారు.కర్ణాటక రాష్ట్రానికి చెందిన చింతామణి, రాయల్ పాడు, శ్రీనివాసపురాు మా సమీప ప్రాంతాు. ఇంచుమించుగా మదనపల్లె పరిసరా వాళ్లు చేసే విధంగానే తేదీు నిర్ణయించుకొని సంక్రాంతి పండుగ చేస్తారు. కురబకోటలో ఉగాది కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. ముస్లిము కొందరు హిందూ పూజారు ఇండ్లకు ఓరోజు ముందు వచ్చి బియ్యం,పప్పు,ఉప్పు,నెయ్యి మొదగు సంభారాు యిచ్చి ఉగాది ప్రసాదం పెట్టమంటారు. ఉగాదిరోజు ఉదయం ఉపవాసముండి మధ్యాహ్నం పూజాయి యిచ్చిన అన్నప్రసాదాన్ని తీసుకుని భక్తితో ఆరగిస్తారు. హిందూ ముస్లిము ఐక్యతకు చక్కని ఉదాహరణ ఈ ఉగాది. ఇలా ఎందుకు చేస్తారని ముస్లిమును అడిగితే మాపెద్దు చెప్పారు మేం చేస్తున్న ఆచారం అంటారు. పండుగు ఆచారాలో చెప్పుకోతగినది ఏమంటే వినాయకచవితి. ఇది ఇక్కడ తొలి పండుగగా భావింపబడుతుంది.దీన్ని ‘‘టెంకాయ పండుగ’’ అంటారు. ఉదయం ఊరుచివర వున్న ‘‘నాగ ప్రతిమను’’ కడిగి పసుపు రాసి పూతో అంకరించి దారా పోగు చుట్టు చుడతారు. పాతో అభిషేకాు చేస్తారు పుట్టలో పాు పోస్తారు. తరువాత ఇంట్లో ‘పేడ’, మట్టి వినాయకుకు పూజ చేసి ఆహార పదార్థాు ఆరగింపు చేస్తారు. పొలాకు వెళ్లి వారి తాతముత్తాత సమా ధును శుభ్రం చేసి టెంకాయు కొట్టి ఆరగింపు చేసి బట్టు పెడతారు. కొందరు దీన్ని ఉగాదిరోజు చేస్తారు.ఈ ప్రాంతంలో అన్నీ ఆవులే కావున ఆవుపేడతో వినాయకుడిని చేస్తారు. వ్యవసాయదారు వ్యవసాయపు ఎరువు ఈ పేడే. అందునా ఆవు పేడ. చనిపోయిన తల్లిదండ్రుకు పూజ వారి పొలాల్లోనే వారి సమాధుకే! మట్టితో విడవలేని మమకారానికి భక్తికి యింతకంటే ప్రత్యేకమైన ఉదాహరణ ఏమన్నా కావాలా? జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టిన మదనపల్లిలో యీ టెంకాయు కొట్టడం శ్రీరామనవమి పండుగరోజు కూడ చేస్తారు. వారివారి మీ చూచుకొని ఉగాదికి కాని, వినాయకచవితికి కాని కుదరకపోతే శ్రీరామ నవమికి చేస్తార నిజానికి ఇది వ్యవసాయదారు పండుగ. తమ పంటను విపరీతంగా పాడుచేసే ఎుకకు -ఏనుగుకు చేసే ప్రార్థన. పంట నాశనం చేయవద్దని ప్రార్థన.
ఇలా ప్రతి పండుగ సాంప్రదాయంలో ఓ చక్కని నిక్షిప్తమైన సందేశం వుంది. నేడు యీ దేశానికి కావసినది ఇదే! మట్టిలో కలిసిపోయే మనం ఆమట్టిని పూజిద్దాం! ఆ ధరిత్రి తల్లి యిచ్చే పంటని కడుపార ఆరగిద్దాం. చివరిగా ‘‘తింటే గారొ తినాలి. వింటే భారతం వినాలి’’ సామెతలో ‘భారతగాధు’ ఈ జిల్లా ప్రత్యేకత.‘‘భారతం మిట్ట’’అనే పేరుతో ఓ ఊరే వుందంటే దాని ప్రాధాన్యత ఎంతో చెప్పాలా? కుప్పం,మదనపల్లి, రామసముద్రం, కాళహస్తి, చెంబుకూరు మొదగు అనేక ప్రాంత గ్రామాల్లో యీ భారతాకు పెట్టింది పేరు. ఎండా కాంలో 18పగళ్లు,14రాత్రులో ఈ కార్యక్రమాు జరుగుతాయి. రోజుకో పర్వం, మధ్యాహ్నం హరికథా రూపంలో భాగవ తాయి చెపుతారు. రాత్రికి ఆకథనే పౌరాణిక నాటకంగా వేస్తారు. ఇందులో ‘బలిబండి’ ‘అర్జునుని తపస్సు’బీ దుర్యోధన వధ ముఖ్యమైన ఘట్టాు. పగటిపూట యివి ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. మరో చెప్పుకోదగిన విషయం ‘ఉత్తరగోగ్రహణం’ గ్రామీణు తమ గోసంపదను ఓ చోటికి చేర్చి అర్జునుడు, ఉత్తరకుమార పాత్రతో రసవత్తరంగా కథ సాగిస్తారు. కుప్పం దగ్గర ‘‘పెద్ద బంగారు నత్తం’’ గ్రామంలో ఏకంగా ‘‘పాండవుకు దేవాయాలే వున్నాయి’’.ఈ గ్రామంలో 18 రోజు కార్యక్రమా చివరిరోజు ద్రౌపదీ కళ్యాణోత్సవం చేస్తారు. చిత్తూరు జిల్లా పండుగలో స్థానిక ఆచారాు ‘ఎంత మధురం ఎంత మనోహరం’,ఎంత సుందరం? అందరం ఆఆచార సాంప్రదాయాల్ని పండుగల్ని విశ్వాసాల్ని, నమ్మకాల్ని ముందు తరా వారికి ఆదర్శంగా కొనసాగిద్దాం!
-శ్రీ గోమఠం రంగా చార్యులు