మహిళా లోకానికి స్పూర్తినిద్దాం

ఇంట్లో అదనపు వరకట్నం కోసం హింసించే భర్త.. పాఠశాల, కళాశాలలో ప్రేమ పేరిట విసిగించే పోకిరీలు అదును చూసి కాటేసే కామాంధులు..పనిచేసే చోట మానసికంగా వేధింపులు ఇలా అడుగుకో మగాడు. మహిళ రక్త మాంసాలు నుంజుకుతినే మృగాడు. మరి ఈ అకృత్యాలకు అంతం లేదా? మగువకు రక్షణ లేదా? అంటే రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు, ఐపీసీలో మరెన్నో సెక్షన్లు ఉన్నాయి. వాటి గురించి అవగాహన లేకపోవడమే మహిళల పాలిటశాపంగా మారింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ దినోత్సవం.లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడానికి చర్యకు పిలుపుని కూడా సూచిస్తుంది. మహిళల విజయాలను జరుపుకోవడానికి లేదా మహిళల సమానత్వం కోసం ర్యాలీ చేయడానికి సమూహాలు కలిసి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన కార్యాచరణ కనిపిస్తుంది.ఏటా మార్చి 8న గుర్తు పెట్టబడుతుంది, ప్రపంచ మహిళా దినోత్సవం అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి.ఈ ఏడాదిప్రచార థీమ్ ఏమిటి?ప్రపంచ మహిళా దినోత్సవం
2024 ప్రచార థీమ్ ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్.(స్పూర్తి చేర్పించడం).మహిళల చేరికను అర్థం చేసుకోవడానికి,విలువైనదిగా ఉండటానికి మేము ఇతరులను ప్రేరేపించి నప్పుడు, మేము మెరుగైన ప్రపంచాన్ని రూపొందిస్తాము. మహిళలు తమను తాము చేర్చుకునేలా ప్రేరేపించబడినప్పుడు, వారికి సంబంధించిన భావన, ఔచిత్యం మరియు సాధికారత ఉంటుంది. ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్ క్యాంపెయిన్ మహిళల కోసం మరింత సమగ్ర ప్రపంచాన్ని రూపొందిం చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐడబ్ల్యూడి` 2024 ప్రచార థీమ్ గురించి ఇక్కడ మరింత తెలుసుకుందాం!. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 ప్రచార థీమ్ ‘స్పూర్తి చేర్చడం’ చేరికను ప్రేరేపించడానికి కట్టుబడి ఉంది. మహిళా ఆర్థిక సాధికారతను కల్పిం చడం,మహిళా ప్రతిభను నియమిం చడం, నిలుపుకోవడం మరియు అభివృద్ధి చేయడం. మహిళలు,బాలికలను నాయకత్వం, నిర్ణయం తీసుకోవడం,వ్యాపారంలోకి మద్దతు ఇవ్వడం, మహిళలు,బాలికల అవసరాలకు అనుగు ణంగా మౌలిక సదుపాయాల రూప కల్పన, నిర్మాణం మహిళలు,బాలికలు వారి ఆరోగ్యం గురించి సమాచారం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయప డటం. స్థిరమైన వ్యవసాయం ఆహార భద్రతలో మహిళలు,బాలికలను చేర్చడం. మహిళలు మరియు బాలికలకు నాణ్యమైన విద్య,శిక్షణను అందించడం.క్రీడలో మహిళలు మరియు బాలికల భాగస్వా మ్యాన్ని మరియు విజయాన్ని పెంచడం. మహిళలు,బాలికల సృజనాత్మక,కళాత్మక ప్రతిభను ప్రోత్సహిం చడం.మహిళలు, బాలికల అభ్యు న్నతికి తోడ్పడే మరిన్ని రంగాలలో ప్రసంగిస్తారు.
సమానత్వం ఎక్కడుంది!..
ఆకాశంలో,అవకాశంలో సగం అన్నది నినాదంగా మిగిలాల్సిందేనా?ఇది చేవికి ఇంపు కలిగించడమే తప్ప..నేత్రానందం ప్రసాదించే అవకాశమే లేదా?జనాబా లెక్కల ప్రకారం,పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువన్నది ప్రపంచ స్థితి.స్త్రీలు ప్రవేశించని రంగం లేదని, నిపుణత కనబరచని పని.లేదని పదేపదే చెప్పడం సరే.వారు నిలబడగలిగేలా చేస్తున్నమా,ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చూస్తున్నామా?అన్నదే మన దేశంలో నాటికీ నేటికీ ప్రశ్న.స్త్రీలంటే అప్పటికే ఇప్పటికీ చిన్నచూపే.విధి నిర్వహణ ప్రదేశాల్లో రక్షణ అంతంత మాత్రమే.శ్రమకు సరిపడా ప్రతిఫలం లభిస్తోందా అన్నది ఈనాటికీ సందేహాస్పదమే.కాకుంటే..గతంలో కంటే వర్తమానంలో ప్రశ్నించే తత్వం పెరిగింది. నిలదీసి,నిగ్గదీసి నిలువునా కడిగి పారేసే ధీరత అలవాటుగా మారింది. ఆడవారిని కించపరిచే దుష్టశక్తుల పనిపట్టే తెగువా విస్తృతమవుతుంది. వీటన్నింటితో పాటు స్త్రీలపట్ల ఆలోచనా ధోరణిని ఇంకా మార్పుకావాల్సిన అగత్యమైతే ఇతర సమా జానికి చాలా ఉంది. ఆచరిస్తే సరి..!
సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. మహిళలూ మీకు జోహార్లు అంటూ ఏటేటా కవితలల్లే వారికీ కొదవ లేదు.ఆకాశం, అవకాశం వివాదాల జోరు సరేసరి.టన్నుల కొద్దీ పదజ్ఞానం కన్నా,ఎంతో కొంతైనా ఆచరించి చూపడం మిన్న.అది సాకార మైనప్పుడే ఆడపిల్ల పెదవి మీద దరహాసం మెరుస్తుంది.అంతేకానీ,ఇంటా బయటా.. మాటలు చేతలూ ఆమె కన్నీటికి కారణ మైతే,జాతికి నిష్కృతి ఉండదు.ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం దాకా ఇంతే!.
వరకట్న నిషేధ చట్టం-1961
భర్త, అతని తల్లిదండ్రులు, అడపడుచులు, అత్తింటి తరపున ఇతర బంధువులు ఎవరైనా వరకట్నం కోసం వేధిస్తే ఐదేండ్లకు పైగా జైలు,రూ.15 వేలకు తక్కువ కాకుండా జరి మానా విధిస్తారు.ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం,తీసుకోవడం రెండు నేరమే. వరకట్న వేధింపులకు సంబంధించి మహిళలు నేరుగా సంబంధింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులపై మొదటి శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తుంది.
ర్యాంగింగ్ నిరోధక చట్టం-1997
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టం నంబర్ 28ను తెచ్చింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 1800 18022 18055 నంబర్లకు విద్యార్థినులు ఫోన్‌చేసి సమస్యలను చెప్పవచ్చు. ర్యాగింగ్ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ర్యాగిం గ్‌కు పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటారు.
మహిళకు స్వేచ్ఛ కొంతే!
అందరూ ఒప్పుకోదగిన పరిణామం నాటికి, నేటికి స్త్రిల పరిస్థితులు మారాయి. నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.ముఖ్యంగా అభినందించవలసిన విషయం- విద్యారంగం లో పాఠశాల మొదలు కళాశాల వరకు బాలికలదే అగ్రస్థానం. చదువులకోసం తాత్కాలిక ఉద్యోగాలు (మెహంది, అల్లికలు, శుభకార్యాలలో పిండివంటలు తయారీ దార్లుగాను, హస్తకళలు, వాహనాలు నడిపే డ్రైవర్లుగాను) ఇలా ఎన్నో మరెన్నో పనులు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడుతూ ఉన్నత వ్యక్తిత్వంతో ప్రయో జకులైన మహిళలు నేటి భారతీయ సమాజంలో నిత్య ప్రకాశ దీపాలుగా చెమటను ఆజ్యంలా పోస్తూ దశదిశలా అఖండమైన కాంతులతో వెలిగిపోతున్నారు. ఆనందించవలసిన విషయం ఏమిటి అంటే వృత్తి విద్యాకోర్సులు, ఉద్యోగాలలో రాజకీయాలలో స్త్రిలకూ ప్రాముఖ్యం లభించడం. స్త్రిలు సమంగా నేర్పుగా అంకితభావంతో గొప్పగా పనిచేయటం, వారు రాణించినంత గొప్పగా పురుషులు రాణించలేకపోవడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి?
ఇలా పలు విధాలుగా వైద్య,విద్యా,విజ్ఞాన, రాజకీయ,క్రీడా,రక్షణ రంగాలలో ఎక్కడ చూసినా,ఏ నోటవిన్నా పదును పెట్టిన ఆయు ధంలా మహిళా శక్తి, యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా ఉప్పెనలా పొంగి పొరలి నింగిని తాకుతున్న కెరటాలవలే ఎగసిన మహిళా స్ఫూర్తికి, ఎవరూ సాటిలేరు, పోటీ పడరు అనే విధం రాకెట్టులా ఆకాశంలో దూసుకుపోతున్న మహిళా చైతన్యం అందరూ హర్షించదగిన విషయం.
ఈ ప్రపంచంలో మహిళలు రచయిత్రులుగా, కవయిత్రులుగా ఉపన్యాసకులుగా,ఉద్యమ కారిణులుగా ఉపాధ్యాయినిలుగా,గృహిణు లుగా ఉన్నత ఉద్యోగస్తులుగా,మంత్రులుగా, శాసనసభ్యులుగా,న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా,ప్రాణాలను రక్షించే వైద్యులుగా,స్వచ్ఛంద సంస్థల అత్యున్నత అధికార సభలకు అధ్యక్షులుగా,ఆయా రంగాలలో వారు చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో మహిళలు ఆకాశంలో వెలిగే స్వయం ప్రకాశక నక్షత్రాలుగా వెలుగొందుతున్నారు.
ఇకపోతే కొన్ని గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే- ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇంత గొప్పగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న ‘మహిళ పాత్ర’ సమాజంలో మమేకమవుతున్న ‘స్త్రి అభ్యుదయం’ ఇంకా మొదట్లోనే వుంది. మొక్కగానే వుంది. ఎక్కడో ఒకచోట దాని కూకటి వేరు కత్తిరించబడుతూనే వుంది. బాలికగా విద్యార్థినిగా, గృహిణిగా.. ఉద్యోగి నిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపొంతరాలు చెంది సమాజంలో భాగంగా మారినా స్త్రి యొక్క స్వయం నిర్ణయం ఇంకా పురుషుల చేతులలోనే వున్నది. స్త్రి పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలిసి నడవా ల్సిందే. కాని నియంతృత్వ ధోరణితో కట్టిపడే యటమే మహిళా స్వేచ్ఛకు ఇబ్బందిగా అభ్యం తరకరంగా ఉంది కాని అదే జరుగుతుంది కదా. కొన్ని చోట్ల అడుగడుగునా ఆటంకాలు. అలుపెరుగని మహిళా పోరాటాలు, మహిళల ఆత్మాభిమాన అణచివేతలు..ఆత్మవిశ్వాసానికి అవరోధం..ఇవన్నీ..కలిసి మహిళలను ఉప్పెన లా చుట్టుకుంటున్నాయి. తర తరాలనుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బాట్లు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థ కాలక్రమేణా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు జరగాలి. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా ఉద్యోగినిగా ఆర్థిక సేవలందిస్తూ, మాతృత్వంతో సంసారాన్ని పెంచే త్రిపాత్రధారిణిగా ఉప యోగపడే యంత్రంలా ఉందనుకుంటారు. కొందరి పురుషుల ఆలోచనలు కాని అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా స్త్రిలు శ్రమిస్తూనే వున్నారు. ఎలా అంటే నిరంతర నిత్య ప్రవాహంలా మహానదులై సముద్రాలై చరిత్రపుటంలో మహిళలు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. గృహ హింస, విడాకుల చట్టం- ఇలా ఇంకా ఎన్నో చట్టాలు స్త్రిలకి రక్షణ కవచాలుగా ఉన్నప్పటికి సగటు స్త్రి జీవితంలో రక్షణ కరువైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరూ అంగీకరించవలసిందే.
వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రిలపైన జరిగే అత్యాచారాలను అరికట్టే వౌలికమైన మార్పు పురుషులలో రావాలి.ఈ మార్పు ముఖ్యంగా ప్రతి ఇంటినుండి మొదలవ్వాలి. చట్టసబలో మహిళలంతా ఏకతాటిపైకొచ్చినప్పటికీ మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికే ఎన్నెన్ని అవస్థలు పడ్డారో, ఎన్నెన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో యావత్ భారతావనికి తెలిసిన విషయమే. స్త్రిల యెడల ఇలాంటి పక్షపాత ధోరణి విడనాడాలి. మహిళా సాధికారత కార్యరూపం దాల్చాలి. మాటల రూపంలోనే మిగిలిపోకూడదు.
ఏది ఏమైనా సగటు స్త్రి జీవితంలో సంపూ ర్ణమైన, సమూలమైన మార్పు రావాలి. అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగా శిక్షించాలి. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో బ్రతుకగలగాలి. నిర్భయంగా నిర్ణయాధి కారాలు చేపట్టగలగాలి. అటువంటి సమ సమాజంలో అద్భుత ప్రపంచాన్ని ఆవిష్క రించాలి.