మహిళల శ్రమకు కొలమానం ఏదీ?
జాతీయ సమయ వినియోగ సర్వే’ ప్రకారం 81.2 శాతం మహిళలు ఎటువంటి చెల్లింపు లేని ఇంటి చాకిరిలో నిమగమై ఉన్నారు. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి 26.1 శాతం మాత్రమే అటువంటి పనిలో వున్నారు. పురుషులు వారానికి సగటున 42 గంటల పాటు సాంప్రదాయకంగా ఆర్థిక కార్యకలా పంగా పరిగణించే ఉత్పత్తి పనుల్లో పాల్గొంటారు. స్త్రీలు 19 గంటలు పాల్గొం టున్నారు. అయినప్పటికీ మహిళలు గృహ నిర్వహణ, పిల్లలు-వృద్ధుల సంరక్షణ, కుటుం బంలో జబ్బు పడిన వారి కోసం 34.6 గంటలు వెచ్చిస్తారు. పురుషులు ఈ విధమైన పనులకు వెచ్చించేది 3.6 గంటలు. అంటే స్త్రీలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా కుటుంబ నిర్వహణ పనులలో వుంటారన్న మాట. నేడు భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు…ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32.8శాతం వుండగా, ప్రపంచ బ్యాంకు ప్రకారం 24శాతం వుంది. అదే చైనాలో 61శాతం,బంగ్లాదేశ్‌లో 38శాతం, నేపాల్‌లో 29శాతం,పాకిస్తాన్‌లో 25శాతం వుంది. మహిళా సాధికారతను కల్పించేందుకు శ్రమలో స్త్రీల వాటా పెంచాలని భారత్ భావించినట్లయితే…మహిళల పనికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలి. స్త్రీల పనిని సముచితంగా లెక్కించాలి. వారు శ్రమ చేయడానికి మద్దతు ఇవ్వాలి.
తల్లిదండ్రులు ఇంటి బయట పని చేస్తున్నప్పుడు వారి బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలనేది విశ్వవ్యాప్తంగా అంగీకరించిన సత్యం. భారతదేశంలోని కుటుంబ నిర్మాణాలు చారిత్రాత్మకంగా తరచూ ఈ అవసరాన్ని పూరించాయి. తండ్రులు ఇంటి వెలుపల పని చేస్తారు. పిల్లలు, పెద్దల సంరక్షణ పనులను తల్లులు చేస్తారు. అయితే, ఈ విధమైన కుటుంబ నిర్మాణం…పెరుగుతున్న భారత దేశ ఆశయాలకు అనుకూలంగా లేదు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగా లంటే, మహిళల భాగస్వామ్యం వుండాలి. అందుకు రెండు ప్రత్యేక మార్గాలు ఉన్నాయి: మహిళల పని (తరచుగా పిల్లలు, పెద్దల సంరక్షణ పని)ని సక్రమంగా విలువ కట్టాలి. ఇంటి బయట ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మహిళలకు తగిన మద్దతు ఇవ్వాలి. మహిళలందరూ పని చేస్తారు. కానీ వారందరికీ జీతం అందదు. 2023 నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్ అమెరికా చరిత్రపై చేసిన కృషి ఈ అంశాన్నే తెలియ చేస్తుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2020లో విడుదల చేసిన భారతదేశపు మొట్టమొదటి ‘జాతీయ సమయ వినియోగ సర్వే’ ప్రకారం 81.2 శాతం మహిళలు ఎటువంటి చెల్లింపు లేని ఇంటి చాకిరిలో నిమగమై ఉన్నారు. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి 26.1 శాతం మాత్రమే అటువంటి పనిలో వున్నారు. పురుషులు వారానికి సగటున 42 గంటల పాటు సాంప్రదాయకంగా ఆర్థిక కార్యకలాపంగా పరిగణించే ఉత్పత్తి పనుల్లో పాల్గొంటారు. స్త్రీలు 19 గంటలు పాల్గొంటున్నారు. అయినప్పటికీ మహిళలు…గృహ నిర్వహణ, పిల్లలు-వృద్ధుల సంరక్షణ, కుటుంబంలో జబ్బు పడిన వారి కోసం 34.6 గంటలు వెచ్చిస్తారు. పురుషులు ఈ విధమైన పనులకు వెచ్చించేది 3.6 గంటలు. అంటే స్త్రీలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా కుటుంబ నిర్వహణ పనులలో వుంటారన్నమాట. దీనికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి- శ్రామిక మహిళలు భయంకరమైన ‘’రెట్టింపు భారాన్ని’’ ఎదుర్కొంటారు. ఇక్కడ ఇంటి బయట పని చేయడం, కుటుంబ ఆదాయానికి తోడ్పడడం వల్ల వారి ఇంటి చాకిరి ఏమీ తగ్గదు. రెండు-పిల్లలు, వృద్ధుల సంరక్షణకు వారు చేసే పనులేవీ ఆర్థిక కార్యకలాపాలుగా లెక్కించబడవు. ఈ పనులతో అలసిపోయిన మహిళలకు పురుషులతో పోల్చుకుంటే వారంలో అతి తక్కువ విశ్రాంతి సమయమే మిగులుతుంది. ఎస్‌బిఐ నివేదిక ప్రకారం ఎటువంటి చెల్లింపు లేకుండా మహిళలు చేస్తున్న పని ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది జిడిపిలో 7.5 శాతానికి బాధ్యత వహిస్తుంది. మరో మాటలో చెప్పా లంటే, మహిళలు ఇంటి పని భారాన్ని మోయడమే కాకుండా, ఈ ప్రక్రియలో వారు జిడిపిని కూడా పెంచుతారు. అయినా అధికారిక రికార్డుల ప్రకారం వారు పనిచేయనట్టే లెక్క.మహిళలు చేసే శ్రమను లెక్కించే విధానాన్ని ప్రభుత్వాలు మార్చు కోవాలి. అంతర్జాతీయంగా నిర్వచించబడిన ‘జాతీయ ఖాతాల వ్యవస్థ’ ప్రమాణాలలో మార్పు కోసం భారతదేశం పిలుపు ఇవ్వ వచ్చు. ఆ కృషికి నాయకత్వం వహించవచ్చు. తద్వారా జిడిపి గణన నుండి జనాభా గణనకు ఉద్దేశించబడిన ప్రశ్నాపత్రాలన్నింటిలో మార్పులు, చేర్పులు చేయవచ్చు. లెక్కించనప్పుడు మహిళల చాకిరీ కనిపించదు. దీని ప్రభావం కార్మిక, ఉపాధి విధానాలపై ఉంటుంది. శ్రమ లెక్కల్లో కనిపించకపోవడంతో ఇంటి చాకిరి చేసే వీరు ‘’రక్షిత కార్మిక చట్టాల పరిధి వెలుపలే’’ వుండిపోతారు. అంతేగాక ఇది పనిదినాన్ని పరిమితం చేస్తుంది. కార్మిక పరిస్థితులను నియంత్రిస్తుంది. భారతదేశంలో స్త్రీలు పురుషుల కంటే రోజుకు 1.5 గంటలు ఎక్కువ పని చేస్తారు. అది కూడా ఏ విధమైన జీతం లేకుండా, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పని చేస్తారు.
ఈ అంశానికి మరొక కోణం ఉంది. అదే-ఇంటి వెలుపల పని చేసే మహిళలకు మద్దతు ఇవ్వడం. తక్కువ-ఆదాయ కుటుంబాలలో, ఒక్కరే ఆదాయ వనరుగా వుండడమనేది అసంభవం. తల్లిదండ్రులు ఇద్దరూ పని చేయాల్సి ఉంటుంది. అంటే, డబ్బు సంపాదిం చేవారికి, కుటుంబ సంరక్షణ చూసే వారికి ఇప్పటి వరకు వున్న నమూనా విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. తక్కువ ఆదాయ మహిళలు మనం ఊహించన దానికంటే ఎక్కువగా ఎవరి మద్దతు లేకుండానే పని చేస్తున్నారు. అయితే ఈ పనిలో కనిపించే అస్థిరత కారణంగా వీరి శ్రమ గణాంకాల్లో ప్రతిబింబించదు. మహి ళల పని కాలానుగుణంగా వుంటుంది. చెదురుమదురుగాను, క్రమరహితంగా కూడా వుంటుంది. వీరు తరచుగా ఇంట్లోంచే కుటుంబ వ్యాపారాలకు తోడ్పాటునందిస్తారు. నాలుగు నెలల వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాదాపు 44 శాతం మహిళలు శ్రామిక శక్తిలో భాగంగా వున్నారని ఒక అధ్యయనం వెల్లడిరచింది. అయితే దానికి కొనసాగింపుగా నాలుగు సంవత్సరాల వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు కేవలం 2 శాతం మహిళలు మాత్రమే లెక్కల్లో వున్నారు. ఇంటి బాధ్యతలు వారిని సాధారణ ఉద్యోగం నుండి దూరంగా ఉంచు తాయి. వారు పని చేసినప్పుడు సాధారణంగా పిల్లలు వెంటే వుంటారు. నిర్మాణ ప్రదేశాలలో ప్రమాదకరమైన పరికరాలు, అధిక కాలుష్యం నీడలో పిల్లలు ఆడుతున్నారని 2013లో హార్వర్డ్ పరిశోధకులు వివరించారు. ఇది మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమైన వయస్సులో (మూడేళ్ల లోపు) వారి జీవితా లను, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం కోసం ఉద్దేశించిన అన్ని తదుపరి ప్రయత్నాలు, ప్రజా నిధులు బలహీనమైన పునాదిపైనే నిర్మితమయ్యాయి. పిల్లల కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రపం చంలోకెల్లా అతి పెద్ద ప్రజా వ్యవస్థ-అంగన్‌వాడీ వ్యవస్థను నడుపుతోంది. 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరు సంవత్సరాలలోపు 8 కోట్ల మంది పిల్లలకు ఈ సేవలు అందుతాయి. అయినప్పటికీ, ఈ కేంద్రాలు ఉదయం 9నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. కాబట్టి, మహిళలు పూర్తిగా ఎనిమిది గంటల పని చేయాలంటే వారికి అదనంగా సంరక్షణ కేంద్రాలు అందుబాటులో వుండడం అవసరం. వేగంగా పట్టణీకరణ చెందుతున్న భారతదేశంలో మహిళలు శ్రమ చేసేందుకు వీలుగా వీరికి పలు సౌకర్యాలు కల్పించాలి. క్రెచ్‌లు ఒక పరిష్కారాన్ని అందిస్తాయి. 2020 నాటికి ‘జాతీయ క్రెచ్ పథకం’ దేశవ్యాప్తంగా దాదాపు 6,500 క్రెచ్‌లను నిర్వహిస్తోంది. తల్లులు ఒక స్థిరమైన వృత్తిని/ఉద్యోగాన్ని ఎంచుకుని పని చేయడానికి ఈ క్రెచ్‌లు సహాయ పడతాయి. అలాగే పిల్లలు సురక్షి తంగా, ఆరోగ్యకరంగా ఎదిగే వాతావరణాన్ని అందిస్తాయి. ప్రైవేట్ రంగం ఈ అవసరాన్ని గుర్తించి అధిక-ఆదాయ కుటుంబాలకు ఈ సేవలను అందిస్తుంది. పిల్లల సంరక్షణ/ప్రీస్కూల్ అనేది రూ.31,256 కోట్ల పరిశ్రమ. 2028 నాటికి వార్షిక రాబడి (సిఎజిఆర్) 11.2 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా. కాబట్టి ఆదాయ అసమానతను అధిగమించడానికి, అందరికీ నాణ్యత కల్గిన బాలల సంరక్షణ సేవలు అందిం చడానికి…ప్రభుత్వ రంగం ఇప్పటికే మొదలెట్టిన ప్రయత్నాలను వేగవంతం చేయాల్సి వుంది. నేడు భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు…ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32.8 శాతం వుండగా, ప్రపంచ బ్యాంకు ప్రకారం 24 శాతం వుంది. అదే చైనాలో 61 శాతం, బంగ్లాదేశ్‌లో 38 శాతం, నేపాల్‌లో 29శాతం, పాకిస్తాన్‌లో 25 శాతం వుంది. మహిళా సాధికారతను కల్పించేందుకు శ్రమలో స్త్రీల వాటా పెంచా లని భారత్ భావించినట్లయితే…మహిళల పనికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలి. స్త్రీల పనిని సముచితంగా లెక్కించాలి. వారు శ్రమ చేయడానికి మద్దతు ఇవ్వాలి.
భారత్‌లో మహిళల స్థితిగతులు చట్టాలు
భారతీయ సమాజం మహిళను ఆకాశంలో సగం అన్నట్లుగా పురుషునితో సమానంగా వర్ణించింది. కానీ ఆచరణలో మహిళపై అడుగడుగునా ఆంక్షలు విధించింది. మహి ళను అనాదిగా ఇంటికే పరిమితం చేసి అబలగా చిత్రించింది. నేటి ఆధునిక కాలంలో కూడా ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంత సామాజిక నిర్భందంలోనూ ఎంతోమంది మహిళా మేధావులు తమ ఉనికిని గొప్పగా చాటారు. పురుషునితో పోల్చితే మహిళ ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. కానీ పురుషాధిక్య సమాజంలో అంత త్వరగా మార్పు లేదు. గృహ హింస, దాడులు, అణచివేత కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి మహిళకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయి. లింగపరమైన స్తరీకరణ: మానవ సమాజం మొదటగా స్త్రీలు, పురుషులు అని స్తరీకరిం చబడిరది. అందుకే ఇయాన్ రాబర్ట్‌సన్ కులాలు, వర్గాలు, వర్ణాల కంటే ముందు మగవారికి ఉన్నత స్థానాన్ని, స్త్రీలకు సమాజంలో రెండో స్థానం ఇచ్చారని గమనించవచ్చు.
ా ఈ లింగపరమైన స్తరీకరణ ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతిలో భాగంగా అందించబడుతుంది.
ా ఇందులో ప్రధాన కారణాలు లింగ పరమైన పాక్షిక అభిప్రాయాలుస్మెల్‌సర్ అభిప్రాయంలో
ా జైవికపరమైన తేడాలు
ా లింగపరమైన గుర్తింపు
ా లింగపరమైన ఆదర్శాలు
ా లింగపరమైన పాత్రలు పాటించడాన్ని బట్టి లింగపరమైన స్తరీకరణ చోటు చేసుకున్నదని అభిప్రాయపడ్డారు. లింగపరమైన శ్రమ విభజన
సమాజంలో పురుషులు మాత్రమే చేయాల్సిన పనులని, స్త్రీలు మాత్రమే చేయాల్సిన పనులని, లింగం ఆధారంగా సామాజిక పాత్రలు, బాధ్యతలు విభజించడం. తక్కువ శ్రమ, తక్కువ విలువ, గృహసంబధ శ్రమను స్త్రీలకు ఆపాదించి సమాజంలో రెండో స్థానం పొందటానికి కారణమైంది. రిచర్డ్ ఫ్లెక్స్‌నర్ ప్రకారం లింగతత్వం అంటే ఒక లింగం వారికంటే మరొక లింగంవారు అధికమయ్యే టువంటి పాక్షిక భావనలు, గుడ్డి నమ్మకాలు, విచక్షణ పూరిత వైకరులు. లైంగికత, లింగంఅనేవి వేర్వేరు అంశాలు, లైంగికత అనేది ఎటువంటి సామాజిక, చారిత్రక పరిస్థితుల్లోనైనా మార్పు చెందదు. దానికి సంబంధించి నిర్వహించే పాత్రలు మారవు. కానీ ఆధారంగా ఆయా స్త్రీ, పురుషులు అనుసరించాల్సిన సామాజిక, సాంస్కృతిక పాత్రలను తెలుపుతుంది.స్త్రీవాదులు స్త్రీలంటే భయంమిసోగని అంటే స్త్రీల పట్ల తగని ద్వేషంఫిలోగని అంటే పురుషుల పట్ల తగని ద్వేషం భారతీయ సమాజంలో స్త్రీల స్థానంవేదకాలంలో స్త్రీ-పురుషుల మధ్య అసమా నతలు లేవుస్త్రీల పట్ల విభిన్న వైఖరిని ప్రదర్శించినవాడు మనువు స్త్రీలకు విద్య అవకాశాలున్నాయి. బాల్య వివాహాలు లేవు, స్త్రీలకు కూడా బ్రహ్మచర్య ఆశ్రయం, ఉపన యన సంస్కారం కూడా ఉంది.స్వయం వరాలు, గాంధర్వ వివాహాలున్నాయి. బహు భార్యత్వం కేవలం ఉన్నతవర్గాల వారికే పరిమితం.రుషులతో పాటు రుషీమణులు కూడా ఉన్నారు. వితంతు వివాహాలను వియోగ అనే పద్ధతిలో పాటించేవారు. వరకట్నాలు లేవు.కుటుంబమే ఉత్పత్తి కేంద్రం కనుక స్త్రీలు పురుషులతో సమానంగా ఉత్పత్తి లో పాలు పంచుకొనేవారు. స్త్రీలకు వారసత్వ హక్కులు లేవు. కానీ స్త్రీధనంపై పూర్తి హక్కులు కలవు.వేదానంతర కాలంలో స్త్రీల స్థాయి ఆదర్శ స్త్రీ లక్షణాలు చిత్రించబడినవి ఉదా..రామాయణంలో సీత పురాణాలు, ఇతిహాసాల ప్రాధాన్యంతో స్త్రీల స్థాయి,స్వేచ్ఛ హరించిపోయాయి. తొలి, మధ్య యుగాల నుంచి విదేశీ సంస్కృతులతో సమ్మేళనం, భూస్వామ్య లక్షణాలు, వేదాలకు వక్రభాష్యం వంటి కారణాలవల్ల సతి ఆచారం, పరదాపద్ధతి, బహుభార్యత్వం లాంటివి ప్రారంభమయ్యాయి. ఇందుకు ఆర్యులకు, అనార్యులకు మధ్య జరిగిన వివాహాలు, ప్రతిలోమ వివాహాలు, బ్రాహ్మణ భావజాలం కూడా కారణాలుగా పనిచేశాయి. మధ్య యుగంలో జైన, బౌద్దం బలహీనపడటంతో రాజపుత్రులు, ఇస్లాం రాజ్యాల విస్తరణ జరగడంతో స్త్రీల స్థాయి వారి వారి సాంస్కృతిక విధానాలకు అడుగడుగునా దిగజారుతూ వచ్చింది.భారత జాతీయవాది అరవింద్‌ఘోష్ మొదటిసారిగా 1893లో భారతదేశంలో ఉద్భవించిన నూతన సామా జిక వర్గాన్ని మధ్య తరగతి వర్గం అని పిలిచారు.
ఈ సామాజిక వర్గం ఏర్పడటానికి కారణాలు..
- పరిశ్రమల ఏర్పాటుతో కులవృత్తులతో, భూ సంపదతో సంబంధం లేకుండా సంపద, హోదాని పొందే అవకాశాలు రావడం.
- బ్రిటిష్ వారు తమ పరిపాలనలో భాగంగా ఎంపిక చేసుకున్న భారతీయ అధికారగణం.
- లార్డ్ మెకాలే విద్యావిధానంతో ఆధునిక విద్య, వృత్తి విద్య అభ్యసించి ఉద్భవించిన నూతన భారతీయ మేధావి వర్గం. ఇలా పై కారణాలతో మొదటిసారి భారతీయ సమాజంలో సామాజిక సంబంధం లేని (వర్ణం, కులం) ఆర్థిక హోదా, నైపుణ్యాలు, వృత్తి వర్గాలు ఏర్పడ్డాయి.
గృహహింస నిరోధక చట్టం..
గృహంలో చిన్న పిల్లలకు సంబంధించిన హింసా చర్యలకు కూడా వర్తిస్తుంది. దేశంలో మొదటిసారిగా ఈ చట్టం గృహ హింసను సమగ్రంగా నిర్వచించింది.కింది అంశాలన్నీ గృహ హింస పరిధిలో వస్తాయి.వరకట్నాన్ని డిమాండ్ చేయడం. (అదనపు కట్నం) మానసిక, శారీరక, లైంగిక, మౌఖిక పరమైన ఇబ్బందులకు గురిచేసే చర్యలు.భార్యను కొట్టడం, శారీరకంగా హింసించడం.చట్టాన్ని అతిక్రమించినవారికి ఏడాది వరకు జైలుశిక్ష, రూ. 20 వేల వరకు జరిమానా.ఈ చట్టం కింద జిల్లా స్థాయిలో ప్రొటెక్షన్ ఆఫీసర్ నియామకం జరుగుతుంది. వారు బాధితురాలికి అవసరమైన న్యాయ, పునరావాస, నివాసపరమైన అంశాల్లో మార్గదర్శకత్వాన్ని అందించాలి. ఈ చట్టం కింద బాధిత మహిళలకు షెల్టర్ హోమ్స్, గృహహింస కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం-2013 మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులను నిరోధించడం, నియం త్రించడం, మహిళలపై వేధింపులకు సంబం ధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం 2013లో ఈ చట్టాన్ని రూపొం దించారు.2013 డిసెంబర్ 9 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.స్వేచ్ఛగా జీవించే హక్కు,1979 ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదించారు. ఈ కన్వెన్షన్‌పై 1993 జూన్ 25న భారత్ సంతకం చేసింది. దీనికి కొనసాగింపుగానే పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టాన్ని తీసుకొనివచ్చింది. ఈ చట్టం దేశీయంగా ఇళ్లలో పనులుచేసే మహిళలకు (%ణశీఎవర్‌ఱష ఔశీఎవఅ ఔశీతీసవతీం%), ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు, కాంట్రాక్టు మహిళా కార్మికులకు, ఒప్పంద మహిళా కార్మికులకు, మహిళా శిక్షకులకు వర్తిస్తుంది.సెక్షన్- 4 ప్రకారం 10మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న చోట వారికి ఉద్యోగాన్ని ఇచ్చిన ఎంప్లాయర్ తప్పకుండా ఇంటర్నల్ కైంప్లెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి.
ఆ సంస్థకు చెందిన సీనియర్ మహిళని విచారణ అధికారిగా, ఇద్దరు ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒక ప్రతినిధిని కలిపిని ఏర్పాటు చేయాలి.వచ్చిన కైంప్లెంట్స్‌పై 90రోజుల్లో విచారణ పూర్త య్యేలా కమిటీ చర్యలు చేపట్టాలి.నమోదైన కేసులకు సంబంధించి సంస్థలోని ఏ ఉద్యోగికి అయినా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆజ్ఞ జారీచేయవచ్చు.కేసుకు సంబంధించి ఏవిధమైన డాక్యుమెంట్‌ను అయినా సంస్థ నుంచి కోరవచ్చు.-జి.ఎన్.వి.సతీష్