మహిళలపై పెరుగుతున్న హింస
కోల్‌కతాలో ఆర్‌జికర్‌మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్‌పై ఆగస్టు 9నహత్యాచారం జరిగింది.ఈఘటనపై దేశం భగ్గు మంటోంది.దాదాపు అన్నిరాష్ట్రాల్లో మెడికల్ విద్యా ర్థులు,డాక్టర్లు,నర్సులు,మహిళలు,విద్యార్థి,మహిళా సంఘాలు,మేధావులు ప్రదర్శనలు,సభల ద్వారా తమ నిరసనను తెలుపుతున్నారు.ఈఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారిస్తున్నది. ఈ సమయం లోనే మహారాష్ట్రలోని బాద్లాపూర్‌లో ఇద్దరు మైనర్ అమ్మాయిలపై,అస్సాం రాజధాని గౌహతిలో విద్యార్థి నిపై, హిమాచల్ ప్రదేశ్‌లో నర్సింగ్ విద్యార్థినిపై అత్యా చారాలు జరిగాయి.‘వియె వాంట్ జస్టిస్’ అని ప్రదర్శ నలో అరచిన ఆడబిడ్డల గొంతుల తడారక ముందే ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి.
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రతి గంటకు 51 కేసులు పోలీస్ స్టేషన్లలో రిజిష్టరు అవుతున్నట్లు జాతీయ నేర పరిశోధన బ్యూరో 2023 నివేదిక తెలిపింది. పోలీస్ స్టేషన్ వరకు రాని కేసులు ఇంతకు రెండిరతలు పైగా వుంటాయి. నిందితులు ఇన్ని దారుణాలు చేయగలుగు తున్నారంటే వారికి అంత ధైర్యం ఎక్కడిది? పాలకుల భీకరింపులు, పోలీసు కేసులు, న్యాయస్థానాల శిక్షలు ఈ దారుణాలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?
గత పది సంవత్సరాలుగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలగురించి ప్రధానమంత్రి మాట్లా డుతూనే వున్నారు. అయినా నేరాలు తగ్గకపోగా పెరుగుతూనే వున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారం మహిళలపై 2016లో 3,38, 954బీ 2017లో3,67,000బీ,2018లో 3,92,136బీ 2019లో 4,12,000బీ 2020లో 3,71,503బీ 2021లో 4,28,278బీ 2022లో 4,45,256 నేరాలు జరిగాయి.ఇవన్నీ పోలీసు స్టేషన్లలోరిజిస్టరైన కేసుల వివరాలు.2016-2021 సంవత్సరాల మధ్య మహిళలపై నేరాలు 26.35 శాతం పెరిగాయి. 2021-2022 సంవ త్సరాల్లో అత్యాచారాలు 7.1శాతం పెరిగాయని ఈ రిపోర్టు తెలిపింది. గృహ హింస, కిడ్నాప్‌లు, దాడులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వున్నాయి. మహిళలపై జరుగుతున్న ఈఘోరాలకు పౌర సమాజం స్పందించడంతో కొన్ని చట్టాలు వచ్చా యి. 2012లో దేశ రాజధాని ఢల్లీిలో కదులుతున్న బస్సులో 23ఏళ్ళ ‘నిర్భయ’పై జరిగిన దారుణం తర్వాత ప్రజలు రోడ్లపైకి రావడంతో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.ఎస్.వర్మ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడిరది.వీరి సూచనలతో క్రిమినల్ లా (సవర ణ) చట్టం2013 అమలులోకి వచ్చింది. మహిళ లపై కొత్త తరహాలో జరుగుతున్న వేధింపులు, నేరాలను నిర్వచించింది.శిక్షలను కఠినతరం చేసిం ది.అయినా నేరాలు పెరుగుతున్నాయి. బాలికలపై పైశాచికత్వం ఏడాదికేడాది పెరిగిపోతుంది. చిన్నా రులపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టం వచ్చినా బాలికలపై నేరాలు తగ్గడం లేదు.2018లో37,798బీ 2019లో 45,270బీ 2020లో45,591బీ,2021లో51,863బీ 2022లో61,303 మంది బాలికలపై నేరాలు జరిగాయి.గత ఐదు సంవత్సరాల్లో మొత్తం నేరాలు 2,51,825కాగా,శిక్షలు పడినవి కేవలం25, 961మాత్రమే. నేరగాళ్లకు శిక్షలు పడుతున్న తీరు ‘బేటీ బచావో’ నినాదాన్ని హేళన చేయడంలేదా! మహిళల,బాలికల జీవితాలను ఇలా అర్థాంతరం గా బలి తీసుకోవడానికి ప్రధాన కారణాలు సనా తన పురుషాధిక్య భావజాలం, ఆధునిక వ్యాపార విష సంస్కృతి,పెరుగుతున్న మతతత్వ భావాలలు, వీటిని పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలు. స్త్రీల కంటే పురుషులు అధికమనే భావం మన సమాజంలో నరనరాన ఇంకిపోయింది. హక్కులు లేని జాతి స్త్రీలదనే హీన సాంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. చదువుకునే హక్కు కోసం, బాల్య వివాహాల రద్దు కోసం, వితంతు వివాహాల కోసం, ఆస్తి హక్కు కోసం,వరకట్న నిషేధం కోసం, అత్యాచారాల నిరోధం కోసం, చట్టబద్ద రిజర్వేషన్ల కోసం,ఉద్యోగం, ఆరోగ్యం ఇలా జీవితంలోని ప్రతి అంశం కోసం మహిళ పోరాడి సాధించుకోవలసి వచ్చింది. మహిళలకు కొన్ని హక్కులు, చట్టాలు సాధించుకున్నా దురాగతాలు ఇంకా కొనసాగ డానికి మూల కారణం మన సమాజంలో కొన సాగుతున్న భూస్వామ్య అవశేషాలు. విదేశీ పాల కులు, ఆ తర్వాత స్వదేశీ పాలకులు సమాజాన్ని పురోగతివైపు నడపడానికి కారణమైన భూ సమస్యను పరిష్కరించకుండా భూస్వామ్య వర్గా లతో రాజీ పడ్డారు. కాళ్ళు పాతళంలో ఆలోచనలు ఆకాశంలో వున్నట్లు ఆధునిక వ్యవస్థ గురించి కలలుగనమని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వెనుకటి వ్యవస్థ దుర్లక్షణాలవల్ల మహిళలు, అట్ట డగు వర్గాలపట్ల వివక్ష,హింస,అవమానాలు కొన సాగుతునే వున్నాయి.వీటిని చట్టాల ద్వారా మాత్ర మే పరిష్కరించలేమని,ఈభావాలు కొనసాగ డానికి మూల కారణాలను పరిష్కరించాలని జస్టిస్ భాను మతి 2017లో ఒకతీర్పు సందర్భంగా చెప్పిన విషయాలు అక్షరసత్యాలు. పాత భావాలు ఇంకా మన మనస్సు నుండి దూరం కాకుండానే విదేశీ వ్యాపార సంస్కృతి మన మెదళ్ళలోకి జొరబడిరది. ప్రపంచీకరణ విధానాల పేరుతో స్త్రీని వ్యాపార సరుకుగా మార్చివేశారు.అందమైన, అశ్లీలమైన స్త్రీ బొమ్మల ద్వారా తమ సరుకులను అమ్ముకునే నీచ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగింది. అశ్లీలత చట్టబద్దమైపోతున్నది.అడ్వరటైజ్‌మెంట్లు, సినిమా లు, సీరియళ్లు,రీల్స్, కామెడీ షోలు ఇలా అన్నింటా స్త్రీని అసభ్యంగా చూపడంతో పాటు, జుగుప్సాకర మైన ద్వంద్వార్థాల డైలాగులు నిత్యకృత్యమయ్యా యి.సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ చానెళ్లలో అశ్లీల వీడియోలు విచ్చలవిడిగా యువ తకు అందుబాటులో ఉంటున్నాయి.827 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని 2015లోనే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.అన్ని రకాల పిల్లల అశ్లీల చిత్రాలను నిషేధించాలని 2016లో మరోసారి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాల్సి వచ్చింది.అయితే పోర్న్ హబ్ తాజా లెక్కల ప్రకా రం 2019 తర్వాత ఆన్‌లైన్ పోర్న్ వీడియోలు చూసే వారిసంఖ్య వేగంగా పెరిగింది. మన దేశం లో 18 నుండి 24 ఏళ్ళ లోపు వున్న పిల్లలు 44 శాతం మంది ఈ పోర్న్ వీడియోలు చూస్తున్నారట! ప్రపంచంలో ఇలాంటి వీడియోలుచూస్తున్న వారి లో మన దేశం ప్రస్తుతం మూడో స్థానంలో వుంది. గత పదేళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి భావజా లానికి పునాది మనుధర్మశాస్త్రం.ఈఅశాస్త్రం బోధంచే నీతి స్త్రీ బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త,వృద్ధాప్యంలో తండ్రి సంరక్షణలో పెరగాలని. మానవ సమాజంలో సగ భాగంగా వున్న స్త్రీలు ఇలా పరాన్న జీవులుగా వుంటే ఆ సమాజం ఎలా అభివృద్ధి సాధిస్తుంది? రాజుల కాలంలో రాజ్యాల ఆక్రమణలో భాగంగా పదుల సంఖ్యలో స్త్రీలను పెళ్ళిళ్లు చేసుకోవడం,పరాయి రాజ్య స్త్రీలను చెర చడం,వేశ్యలుగా,బసివినులుగా,జోగినులుగా మార్చి కామాంధులకు బలిపెట్టారు. కౌరవసభలో ద్రౌపదికి జరిగిన ఘోర అవమానాన్ని అటు పౌరాణిక నాటకాల్లో, ఇటు సినిమాల్లో, సీరియ ళ్లలో ఈనాటికీ చూపిస్తూనే వున్నారు. ఈ భావజా లం తలకెక్కిన మతోన్మాదులు పాలకులుగా మారి అదే నీచ పద్ధతులను అనుసరిస్తున్నారు. గుజరాత్ లో బిల్కిస్‌బానోపై జరిగిన సామూహిక అత్యాచా రం,మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగిం చడం,జెఎన్‌యూ,ఇతర యూనివర్శిటీలలో అమ్మా యిలపై దాడులు,హింస ఇందులో భాగమే. ప్రశ్నిం చే ఆధునిక మహిళలపట్ల సోషల్ మీడియాలో జరిగే వేధింపులు,ట్రోలింగ్స్ ఆనాటి నీచ మనస్త త్వానికి ఆధునిక వికృత రూపాలు. బిల్కిస్‌బానో కేసులో నిందితులకు శిక్ష తగ్గించడమే కాకుండా, వారిని జైళ్ల నుండి హారతులు పట్టి పాలక పార్టీనే స్వాగతించిన తర్వాత మహిళల మాన ప్రాణాలను ఎలా కాపాడుతారు?2023 ఎన్‌సిఆర్ నివేదిక ప్రకారంఉత్తరప్రదేశ్‌లో మహిళలపై 56వేల నేరా లు జరిగి మొదటి స్థానంలో వుండగా,40,738 కేసులతో రాజస్థాన్,39,526 కేసులతో మహారాష్ట్ర వరుస రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నేరాలు జరిగిన తర్వాత కేసులు నమోదు చేయకపోగా బెదిరింపులు,పెద్దల పంచాయితీల పేరుతో బాధిత మహిళలను మరింతగా వేధిస్తున్నారు. మహిళా నేరాలపై వచ్చిన ఫిర్యాదులను సకాలంలో చార్జిషీట్ వేసి దోషులకు శిక్షలు వేయించడంలో కేరళ ఆదర్శంగా వుందని ఎన్‌సిఆర్ రిపోర్టు తెలిపింది. ఆ రాష్ట్రంలో నమోదైన మహిళా నేరాల కేసుల్లో 96 శాతం వాటికి చార్జిషీట్ సకాలంలో వేస్తున్నా రు.మహిళలు, బాలికలపై ఘోరాలు జరిగినప్పుడు స్పందించడం కనీస మానవత్వం.ఆమాత్రం ప్రజా స్పందన వుంది కాబట్టే ప్రభుత్వాలు కొంతైనా స్పందిస్తున్నాయి. కానీ వీటితోనే నేరాలను అరికట్ట లేం.మూలమైన భూ సమస్య, వికృత వ్యాపార సంస్కృతి,మతతత్వ పాలక విధానాలను ప్రతిఘ టించి,ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం విభిన్న రూపాల్లో కృషి చేయడమే మహిళల మాన, ప్రాణా లకు నిజమైన రక్షణ.
వైద్య సిబ్బందికి రక్షణ ఏదీ !
కోల్‌కతా నగరంలోని ఆర్.జీ.కార్ ప్రభుత్వ వైద్య కళాశాల,ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా వైద్యు రాలిపై అత్యాచారం, హత్య చేసిన దారుణ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి,తీవ్ర ఆందోళనకు గురి చేసిం ది. దేశంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థి తుల్లో, రక్షణ కొరవడిన స్థితిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా మహిళలు విధుల్ని నిర్వహిం చాల్సి వస్తుందో ఇంకోసారి తేటతెల్లం చేసిన దుర్ఘటన.ఆ పీజీ వైద్య విద్యార్థి36గంటలుగా విధుల్లో ఉన్నా రు.అర్ధరాత్రి దాటాక కాసేపు సెమి నార్ రూమ్‌లో విశ్రమించిన సమయంలో దారుణ సంఘటనకి బలయ్యారు. నగరం మధ్యలో ప్రభుత్వ ఆసుపత్రి లో,తమకి బాగా పరిచయమైన స్థలంలో తమ రక్షణకి ఇంత తీవ్రమైన ప్రమాదం ఉంటుం దని ఆమె కలలో కూడా అనుకుని ఉండరు. అక్కడ సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదట. ఆగంతకులు రాకుండా సరిపడా భద్రత, సరిjైున వెలుతురు లేని క్యాంపస్. ఇవన్నీ ఆ కిరాతక చర్యకు దోహద పడ్డాయి.ఇది వ్యవస్థాగత లోపం.మహిళా ఉద్యో గులకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేని నిర్వాకం. ముఖ్యంగా వైద్యరంగంలో పనిచేస్తున్న వారు ఆరో గ్య సేవలు అందించడంలో తీవ్రంగా శ్రమ పడు తున్నారు. అయినా రోగి బంధువుల నుండి భౌతిక దాడులకు గురవ్వడం లాంటి సంఘటనలు పెరుగు తూ వస్తున్నాయి.వాటిని అరికట్టే కఠిన చట్టాలు, చట్ట ప్రకారం సత్వరం శిక్ష పడేలా ఏర్పాట్లు వ్యవస్థ లో అవసరం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి.ప్రాణాలు నిలిపే డాక్టరు, తానే ప్రాణ భయంతో చికిత్స అందించాల్సి వస్తే అది రోగికి మాత్రమే కాదు ప్రజారోగ్య వ్యవస్థకే ప్రమాదం. ఇక హత్యోదంతం విషయంలో ఆ వైద్య కళాశాల పెద్దలే కాకుండా ప్రభుత్వం కూడా బాధ్యతా రహితంగా వ్యవహరించింది. దుర్ఘటన జరిగిన పిమ్మట ఆ కళాశాల ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆలస్యంచేస్తే,ఆయనపై చర్యలు తీసుకోవా ల్సింది పోయి ప్రభుత్వం ఆయనకు వేరేచోట బాధ్యతలు అప్పగించడం ద్వారా గౌరవిం చింది. సమయానికి హైకోర్టు స్పందించి ఆయన్ని సెల వుపై పంపమని ఆదేశించడం ద్వారా, కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా కొంత న్యా యం చేసింది. ఇలాంటి హీన నేరం జరిగిన తర్వా త కూడా అక్కడి ప్రభుత్వం కోర్టుచెప్తే గానీ సరైన విధంగా స్పందించక పోవడం దారుణం.ఈ హత్యోదంతం నుండి పాఠాలు నేర్చుకుని వైద్యుల, ఆరోగ్య సిబ్బంది రక్షణకు, భద్రతకు ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలి. వారు పని చేసే స్థలం పూర్తి సేఫ్ జోన్‌గా ఉండాలి.
తిరోగమన చర్య
దేశ అత్యున్నత న్యాయస్థానం సూమోటోగా ఈ కేసును విచారణకు తీసుకుంది. విచారణ ప్రారం భించిన మొదటి రోజే ‘మరో అత్యా చారమో హత్యో జరిగేంతవరకు చూస్తూ ఊరుకోవాలా?’అని ప్రశ్నించింది. ఈ పరిణా మాలన్నీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగం గా మహిళల పనిగంటలు తగ్గించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘సాధ్యమైనంత వరకు మహిళలకు రాత్రి డ్యూటీని నివారించాలి’ అని మార్గదర్శకాలను జారీ చేసింది. భద్రత కోసం ఈనిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచర ణలో ఇది మహిళల ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటుగా మారనుంది. మహిళలకు అరకొరగా ఉన్న ఉపాధి అవకా శాలను సైతం ఈ నిర్ణయం గండి కొడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అందుకే, మమతా ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం తిరోగ మన చర్య.మభ్య పెట్టే ఈతరహా విధానాలకు బదులు అసలైన రక్షణ చర్యలు తీసుకోవాలి. కోల్ కతా వంటి మహానగరంలో వైద్యఆరోగ్య రంగంతో పాటు,గిగ్ వర్కర్లు,ఫ్యాక్టరీలు,కాల్ సెంటర్లు, హో టళ్లు, పారిశుధ్య కార్మికులుగా లక్షలాది మంది మహిళలు పనిచేస్తున్నారు.ఆటో డ్రైవర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. విధి నిర్వ హణలో భాగం గా పురుషులతో సమానంగా రాత్రి పూట కూడా వీరు పనుల్లో భాగస్వాములవు తున్నారు. ‘ఎక్కడైనా..ఎప్పుడైనా’వీరందరికి సురక్షిత వాతా వరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆపని చేయడానికి బదులుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేతులెతేస్తోంది. మరో విధంగా చెప్పా లంటే మహిళలు ఇళ్లనుండి బయటకొచ్చి రాత్రి పూట పనిచేస్తున్నారు కాబట్టే,అత్యాచారాలు జరుగు తున్నాయన్నట్టుగా వ్యవహరిస్తోంది.ఇది ఒక రకం గా సంఫ్న్‌పరివార్ వాదనే! ఈనిర్ణయంతో మహి ళల ఉద్యోగ,ఉపాధి అవకాశాలు గణనీ యంగా కుదించుకుపోతాయి.అంతిమంగా శ్రామి క శక్తి నుండి మహిళలను దూరం చేస్తుంది. అదే సమ యంలో వేధింపులు,అత్యాచారాల నుండి మహిళ లకు లభించే భద్రత మాత్రం ప్రశ్నార్థకమే! పగటి పూట వేధింపులు జరగవన్న గ్యారంటీ ఏమిటి? రాత్రిపూట ఇళ్ళ వద్ద ఉన్నా భద్రత ఉంటుం దన్న నమ్మకం ఏమిటి?మహిళలు రాత్రిపూట పని చేయ డంపై చర్చ ఇప్పటిదికాదు.స్వాతం త్య్రానికి పూర్వ మే రామ్ చంద్ వర్సెస్ మథురా చంద్ కేసులో న్యాయస్థానం భద్రత సాకుతో మహిళలను నైట్ డ్యూటీల నుండి దూరం పెట్టడాన్ని తప్పు పట్టింది. స్వాతంత్య్రం తరువాత కూడా అత్యున్నత న్యాయ స్థానంఇదేస్ఫూర్తిని కొనసాగించింది. కె.ఎస్ త్రివేణి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా,ఆర్ వసంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్14ను అత్యున్నత న్యాయ స్థానం ప్రస్తావించింది. ఎటువంటి వివక్షా లేని సమానత్వాన్ని ఆర్టికల్ 14దేశ ప్రజలందరికీ దఖ లు పరుస్తోందని స్పష్టం చేసింది.ఫ్యాక్టరీస్ యాక్ట్‌లో దీనికి భిన్నంగా ఉన్న నిబంధనలను కొట్టివేసింది. ఈ తీర్పుల స్ఫూర్తితో పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం 2013, లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 రూపొందాయి. ఇప్పటికీ వీటి అమలు అంతంత మాత్రమే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈచట్టాల మేరకైనా భద్రతా చర్యలను తక్షణం అమలు చేయా లి.అమలు చేయని సంస్థలను గుర్తించి కఠిన చర్య లు తీసుకోవాలి.మహిళలపట్ల హింసకు, దౌర్జన్యా లకు,లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి.- (అన్విత్/ డా.డి.వి.జి.శంకరరావు)