మహా భూతం …ప్లాస్టిక్‌

పర్యావరణానికి వ్యర్ధాలు పెద్ద సమస్యగా మారింది. మహాసముద్రాలు,నదుల నుండి..చిన్న చెరువుల సహా చెత్తా చెదారంతో నిండి పోతున్నాయి. దీంతో పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుంది. వ్యర్థాల ఉత్పత్తి, వ్యాప్తికి అనేక కారణా లున్నాయి. ఈ వ్యర్ధాలను ఎదుర్కోవడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రభుత్వాలు అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తు న్నారు. కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు దక్కలేదు. విస్తృతంగా వ్యర్థాలు పర్యావరణంలో కలిసి పోతున్నాయి.వ్యర్థాలు చాలా రకా లుగా ఉన్నాయి. వీటిని గుర్తిం చడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఏ రకమైన వ్యర్థాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి ..ఏవి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. వ్యర్థాలను గుర్తిం చేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.-గునపర్తి సైమన్‌


వాడేస్తాం..పడేస్తాం…ఇలావాడేస్తూ పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్త బుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్లపైమాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి.మట్టిలో, నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో,గుట్టల్లో, ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.ఆవ్యర్థం కొండలా పేరుకుపోయి,కొండచిలువలా మానవ జాతిని మింగేస్తోంది.సౌలభ్యంగా ఉందని, చవగ్గా వస్తోందని, మహా తేలికని,మడత పెట్టుకోవచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టాల సంగతే పట్టించుకోకుండా మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పో టనం కన్నా పెను ఉత్పాతంలా గుండెల మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. రోజూ అన్ని అవసరాల కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వం సమైంది. మన అవసరాలను తీర్చుకునే క్రమం లో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించ డమనే ఆలోచన మనకుండాలి.పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో,సమ కాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించు కోవాలి.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉద యం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవస రాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడు తున్నాం. టూత్‌ బ్రష్‌లు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌ బాక్స్‌లు,ప్లేట్లు,గ్లాసులు, షాంపులు, పాలు, వంట నూనె ప్యాకెట్లు, తలనూనె,ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు..ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే.ఆశ్చర్యమే మంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిట ల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌, రక్తం భద్రపరచే సంచులు, ఇంజక్షన్‌ సీసాలు, సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యా వరణం,ప్రజా రోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా, ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహనఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూఅదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.
ప్లాస్టిక్‌ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమ రంగులు,రసాయనాలు, పిడ్‌మెంట్లు, ప్లాస్టిసైజర్లు, ఇతర మూలకాలు వినియోగిస్తారు. ఇవి రకరకాల క్యాన్సర్‌ కారకాలు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాలు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం, సీసం వంటి ధాతువులు ఆహారంలో చేరి ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడంవల్ల చాలా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.ఈ ప్లాస్టిక్‌ వస్తువులను పశువులు తింటే వాటికి ప్రాణహాని కలుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పశువుల జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50 ఏళ్ళలో 20రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది.కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది.ప్యాకింగ్‌ రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాలుగా మారుతున్నాయి. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతు న్నాయి.2030నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు రెట్టింపు అయి 2050నాటికి నాలుగిం తలు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికలు చెబుతున్నాయి.2029నాటికి 1టన్ను సముద్ర చేపలకు 3టన్నుల ప్లాస్టిక్‌ పేరుకు పోతుందని ఈ సర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధిక ప్లాస్టిక్‌ వినియోగం వల్ల మగవారిలో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటు వ్యాధులు పెరుగు తున్నాయని, ఆడవారిలో మెనోపాజ్‌, థైరాయిడ్‌, షుగర్‌, గర్భకోశవ్యాధులు పెరుగు తున్నాయని వైద్యులంటున్నారు. జీవక్రియల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’ అనే రసాయనం తీవ్రప్ర భావం చూపుతుంది.ప్లాస్టిక్‌ అనేది‘’కాక్‌ టెయిల్‌ ఆఫ్‌ కెమికల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లో భారలోహాలు, క్రిమిసంహారిణిలు, పెస్టిసైడ్స్‌, పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌లు (పిఎహెచ్‌లు) పాలీక్లోరినేటెడ్‌ బైఫినాల్స్‌ (పిహెచ్‌ బిలు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌,హెప్టేన్‌ల లాంటి సాల్వెంట్‌లుబీ పోటాషియం పర్‌సల్ఫేట్‌, బెంజా యిల్‌ పెరాక్సైడ్‌ లతో పాటు ట్రైబ్యూటాల్టిన్‌, జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌ లాంటి ఉత్ప్రేర కాలుబీ బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియండిఇ) పాలేట్స్‌,సీసం సంయోగాలు, పాలిక్లోరి నేటెడ్‌ బిస్పినాల్స్‌(పిసిబిలు),బిస్పినాల్‌ లాంటి రసాయనా లు ప్లాస్టిక్‌లో ఉంటాయి. ఇవి అంత స్రావీ వ్యవస్థపై వినాళగ్రంథుల స్రవనాలపై దుష్పలితాలు చూపుతాయి.ఈ రసాయనాలన్నీ సముద్ర జీవ రాశులపై, మానవుల శ్వాస కోశంపై, చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఒకటన్ను పాలథిన్‌ సంచులు తయారు చేయాలంటే 11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాలథిన్‌ కూడా ఓకారణమే.పాలథిన్‌ సంచి సగటు జీవిత కాలం 5నిమిషాలకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం.గ్రామాలలోని వీధులనుండి మొదలు మహానగరాల వరకు ఇపుడు సిమెంట్‌ రోడ్లేస్తున్నారు.కాంక్రిట్‌ జంగిల్స్‌ను తలపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయ కుండా అడ్డుకుం టాయి. నగరాలలో 2సెం. మీవర్షం పడితే చాలు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటు న్నాయి. మురుగు నీటి వ్యవస్థలు స్థంబించిపోతు న్నాయి.వీటికి ముఖ్య కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. పైపుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇతర చెత్త పేరుకుపోయి అవి మూసుకుపోతున్నాయి.దీంతో రోడ్లు జలమ య మవుతున్నాయి.ట్రాఫిక్‌ సమస్యలేర్పడుతు న్నాయి.ఓమోస్తరు నగరాలలో కిలోమీటర్ల కొద్దీ, మహా నగరాలలో వందల కిలోమీటర్ల మేర నాలా లుంటాయి.ఈనాలాల చుట్టు పక్కల నివాసంఉండే ప్రజలంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను ఈ నాలాల్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచులు భారీ స్థాయిలో పేరుకుపోయి నాలాలు మూసుకుపోతు న్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీసే యం త్రాంగం సరిపోను లేకపోవడంవల్ల కుంటలు, చెరువుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి.ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ ఉంచి వాడే ఆహారంవల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇండ్లల్లో, కార్యాలయాల్లో, బేకరీ లలో,హోటళ్ళలో ఆహారాన్ని వేడి చేయ డానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడు తుంటారు. ప్లాస్టిక్‌ పాత్రల్లో ఆహారంపెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవల్ల పదార్థాలు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్ర లోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థంకరిగి ఆహారంతో కలసిపోతుంది.ఇలా క్యాన్సర్‌,ఉదర కోశ వ్యాధు లకు అంకురార్పణ జరుగుతుంది. అందుకే ఓవెన్‌లలో ప్లాస్టిక్‌ పాత్రల బదులు బోరోసి లికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తో తయారై అధిక ఉష్ణో గ్రతను తట్టుకోగల పాత్రలు వాడడం మంచిది.