మళ్లీ గెలిస్తే రాజ్యాంగానికి ముప్పే
ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి తలెత్తితే మనదేశంలో ప్రజాస్వామ్యం పని ముగిసినట్లేనని మనం భావించాలి.
భారత రాజ్యాంగం మత తటస్థతను,మత సమానత్వాన్ని బోధిస్తుంది. కానీ ఇవ్వాళ.. ఈ రెండూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి.బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? అనేది ఆలోచించాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా మోదీ హయాం మొదలైన తర్వాత ముస్లింలను భయభ్రాంతులను చేస్తూ జరుగుతున్న దాడులు ఆకస్మిక ఘటనలు కావు’ అని చెబుతున్నారు ప్రొఫెసర్ అశుతోష్ వర్షిణీ. ఈ అత్యంత ప్రమాదకర ధోరణిని భారతీయులు అడ్డుకోకపోతే, మోదీ మూడోసారి ప్రధాని పదవిని చేపడితే భారత రాజ్యాంగం ఉనికికే భంగం వాటిల్లే పెను ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు.హార్వర్డ్, మిషిగన్ విశ్వవిద్యాలయాల మాజీ అధ్యాపకుడిగా ఆయన పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో రాజనీతిశాస్త్ర అధ్యాప కుడిగా పని చేశారు.‘ది వైర్’ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ భాటియాతో జరిపిన సంభాషణలో అశుతోష్ పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఈమధ్య కాలంలో దేశంలో అనేక చోట్ల మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరిగిపోయాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువ. ఈ హింసా కాండ, దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహి స్తున్నది. ఢల్లీి జహంగీర్‌పురాలో శ్రీరామనవమి సందర్భంగా కత్తులు, కటారులు గాల్లో తిప్పు తూ, పిస్తోళ్లు పేలుస్తూ మసీదుల ముందు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పట్టపగలు ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగటం గమనార్హం.
దేశంలో మత ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.1950ల నుంచి 1995 దాకా దేశంలో 1,180 మతపరమైన అల్లర్లు జరిగాయి. సుమారు 7,173 మంది చనిపోయారు. సుమారు ఎందుకంటే..మత ఘర్షణల్లో చనిపోయిన వారి లెక్క ఎప్పుడూ సరిగ్గా ఉండదు. అధికారిక లెక్క ఒకటి ఉంటే, వాస్తవసంఖ్య భిన్నంగా ఉంటుంది. మతఘర్ష ణలు చోటుచేసుకున్న చోట పోలీసుల తటస్థ తపై అనుమానాలు ఉంటున్నాయి. మరో పరిణామం ఏమంటే..ఈ ఘర్షణలు కొత్త రూపం తీసుకోవటం. మతఘర్షణలు వ్యవస్థీకృత కార్యక్రమంగా మారుతున్నాయి. 1984లో ఢల్లీిలో జరిగిన సిక్కుల ఊచకోత, 2002లో గుజరాత్లో ముస్లింల హత్యాకాండ వీటికి ఉదాహరణ. ఈ రెండిరటిలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా బాధ్యతల నుంచి దూరం జరిగిన తీరు కనిపిస్తుంది. అదింకా పెరిగిపోయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీ సులు, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలు మరిచి మతఘర్షణల్లో పూర్తిగా ఒక వర్గానికే కొమ్ముకాసింది. కొన్ని చోట్ల ప్రభుత్వ యంత్రాం గమే ముస్లిం వ్యతిరేకతలో భాగస్వామ్యం కావ టం ఒక కొత్త పరిణామం.ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. ఉదాహరణకు..కర్ణాటకలో ‘హిజాబ్’ అంశాన్ని చూడవచ్చు. హిందూ దేవాలయాల ముందు ముస్లింలు దుకాణాలు నిర్వహించ వద్దంటూ వారి జీవన ఆర్థిక హక్కుపై దాడి చేసి దాన్ని దూరం చేశారు. వీటన్నింటిపై కేంద్రం ఏమీ మాట్లాడదు. ఇదింకా ముందుకు పోయి,ఢల్లీిలో సిక్కులు దుకాణాలు నిర్వహించ వద్దని,వారి దుకాణాల్లో ఎవరూ కొనుగోళ్లు చేయవద్దని శాసించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. 1984 ఢల్లీి అల్లర్ల సమయంలో నేను ప్రత్యక్షంగా చూశాను.సిక్కులపై దాడులు రాజ్యం అండతోనే జరిగాయి.కానీ అప్పుడు రాజ్యం.. ట్యాక్సీలను సిక్కులు నడుపరాదని అనలేదు. అలాగే సిక్కులు హిందూ దేవాల యాల ముందు మిఠాయిలు,పూలు అమ్మరాదని హుకుం జారీ చేయలేదు.సిక్కులు తలపాగా లాగా ధరించే ‘పగిడి’ని హిజాబ్‌లాగా వివాదం చేయలేదు. 1984కు ఇప్పటికీ గుణాత్మక మార్పు ఇదే. ఇప్పుడు జరుగుతున్న వాటిని గమనిస్తుంటే..ఈ పరిణామాలన్నీ రాబోయే ప్రమాదానికి సంకేతాలు. హిజాబ్‌ను వద్దని అన్నవాళ్లు సిక్కుల పగిడిని కూడా వద్దంటారా? బొట్టు పెట్టుకోవటాన్నీ, కొన్ని విద్యాసంస్థల్లో ధోతి కట్టుకోవటాన్ని కూడా తప్పుపట్టి నియం త్రిస్తారా? భారత రాజ్యాంగం మత తటస్థతను, మత సమానత్వాన్ని బోధిస్తుంది. కానీ ఇవ్వాళ.. ఈ రెండూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడు కోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు ఎక్కువ జరుగు తున్నాయి? అనేది ఆలోచించాలి. హిందూ జాతీయవాదం తొలి నుంచీ తాత్వికం గానే కొన్ని ప్రజా సమూ హాలను జాతి వ్యతిరేక మైనవిగా ప్రకటించింది. ఆ ప్రజలు ఇక్కడే పుట్టినా,వారి పవిత్ర స్థలాలు భారత్‌లో లేవు కాబట్టి, వారి జాతీయత ఈ దేశానికి చెందినది కాదంటున్నారు. దేశంలో 14 శాతం ఉన్న ముస్లింలు, 2శాతం ఉన్న క్రిస్టి యన్లను పరాయివారుగా ప్రకటిస్తున్నారు. వాటిక న్ను, మక్కాను పవిత్రస్థలంగా భావించేవారు నిజమైన భారతీయులు కాదంటున్నారు. మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ‘1200 ఏండ్ల బానిసత్వం వీడిరది’ అని వ్యాఖ్యానించారు. దేశంలో 1920ల్లోనే హిందు త్వానికి పురుడు పోసిన వారు కూడా ఆ కాలం లో సరిగ్గా ఇదే మాట చెప్పటం గమనార్హం. ఈ క్రమంలోంచే..శతాబ్దాల కిందట హిందు వులపై ముస్లిం రాజుల దాడికి ప్రతీకారంగా ఇప్పుడు వారిపై దాడి చేయాలనే వాదాన్ని అమలు చేస్తున్నారు.1947లో మతం పునాదిగా రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత భారత్ లో హిందువులే ప్రధానమని, మిగతావారు ద్వితీయ శ్రేణికి చెందుతారని వారు అంటు న్నారు. హిందూత్వవాదులు,బీజేపీ నేతలు విశ్వసించేది ఏమంటే..కొన్ని వర్గాల వారిని అణచివేత ద్వారానే అదుపులో పెట్టగలమని. వీరి సిద్ధాంతకర్తలు కూడా ‘ముస్లింలకు సామాన్యుల భాష అర్థం కాదు. వారికి బలప్రయోగం ద్వారానే ఏదైనా అర్థం చేయించగలం. చరిత్ర ఇదే చెప్తున్నది’ అని ఆనాడే అన్నారు. అలాగే..‘వారు (ముస్లింలు) ఆనాడు బలప్రయోగం ద్వారానే మనలను ఓడిరచి ఆధిపత్యం సాధించారు. ఇప్పుడు హిందువులకు సమయం వచ్చింది. వారిని ఆ విధంగానే నియంత్రించి ఆధిపత్యం సాధిం చాల’ని ప్రబోధించారు. సరిగ్గా దాన్నే ఇప్పుడు బీజేపీ, హిందూత్వ వాదులు అమలు చేస్తు న్నారు. కాబట్టి వీటిని ఏదో కాకతాళీయంగా జరిగిన, జరుగుతున్న ఘటనలుగా చూడవద్దు. వీటిని ప్రయత్నపూర్వకంగా, పద్ధతి ప్రకారంగా జరుగుతున్న దాడులుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిందుత్వవాదులు కొత్తదశలోకి ప్రవేశించారు. దేశంలోని హిందువులు ప్రథమ శ్రేణి పౌరులని, మిగతావారిని ద్వితీయ శ్రేణిగా చెప్తున్నారు. రాజ్యాంగపరంగా అంబేద్కర్ చెప్పిన వాటిని కూడా తిరస్కరిస్తున్నారు. మనుషులంతా సమానం అన్నదాన్నే కాదు, మతాలన్నీ సమానమే అనటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. హిందూత్వం పేరుతో రాజ్యాంగాన్నే గుర్తించనివారు..రాజ్యాంగాన్ని అమలుచేసే అధిపతులుగా మారారు. ఎన్నికల ద్వారా పార్లమెంటు, అసెంబ్లీల్లో మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఏ రాజ్యాంగ విలువల పునాదులపై మన ప్రజాస్వామ్యం మనగలిగిందో, ఆ రాజ్యాం గం పైనే దాడికి దిగుతున్నారు. బీజేపీ విజయం రాజ్యాంగ పరమైన సమస్య మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య సంక్షోభానికీ అది కారణమవు తుంది. దేశంలో 11రాష్ట్రాలు ఇప్పటికీ వారి ఆధీనంలో లేవు. అందులో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఉన్నాయి. యూపీలో రెండోసారి అధికారాన్ని నిలుపుకొన్నా, గతంలో మాదిరిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించటం అంత సులువు కాదు. అయితే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కొనగలవా? పంజాబ్, బెంగాల్, మహారాష్ట్ర, బీహార్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే రాజకీయ శక్తి ఏది? అన్నది ప్రధానమైనది. అలాగే, బీజేపీని ఎదు ర్కోబోయే రాజకీయశక్తికి ఎవరు నేతృత్వం వహించాలి అన్నది క్లిష్టమైనది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 19శాతం ఓటు బ్యాంకుఉన్నది. మిగతా పార్టీలన్నీ రెండు, మూడు శాతం ఓట్లే కలిగి ఉన్నాయి. తృణముల్ కాంగ్రెస్ 3.3 శాతం,డీఎంకే 2.7శాతం,ఆమ్ ఆద్మీ పార్టీ 2 శాతం ఓట్లు కలిగి ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీని నిలువరించే శక్తి సమకూరు తుంది. ఒకవేళ మూడోసారి మోదీ అధికా రంలోకి వస్తే..రాజ్యాంగం ఉనికే ప్రశ్నార్థక మవుతుంది. 2024లో మోదీ గెలుపుతో ఆ ప్రమాదం పొంచి ఉందనటంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇక్కడే మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఒక రాజనీతి శాస్త్రవేత్తగా, రాజకీయ పరిశీల కుడిగా.. మెజారిటీ వర్గం రాజకీయ ఆధిపత్యం సాధిస్తే సంభవించే పరిణామాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. శ్రీలంక, మలేషి యా గురించి తెలుసుకోవాలి. సింహళీయుల ఆధిపత్యం గల రాజ్యంగా శ్రీలంక అవతరిం చింది. ఆ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు లేవు. ద్వితీయ పౌరులుగా పరిగణిం చబడిన తమిళులపై తీవ్ర వివక్ష, అణచివేత కొనసాగాయి. ఫలితంగా తమిళులు తిరగ బడ్డారు. 20ఏండ్ల పాటు శ్రీలంక అంతర్యు ద్ధంలో మునిగి పోవాల్సి వచ్చింది. అదే మలేషియా ఒక మెజారిటీ వర్గం ఆధిపత్యం వహించే విధంగా ఏర్పడలేదు.అక్కడ మైనా రిటీలుగా ఉన్న చైనీయులను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడలేదు. జాతి సమానత్వం పాటించారు. దీంతో అక్కడ జాతిపరమైన పోరాటాలు ప్రజ్వరిల్లలేదు. దీన్నిబట్టి, మెజారిటీవాద ఆధిపత్య రాజకీయాధికారం దీర్ఘకాలంలో తీవ్రమైన అంతర్యుద్ధాలకు, హింసకు కారణమవుతుందని అర్థమవుతున్నది. అణచివేత కారణంగా ఒకవేళ భారతీయ ముస్లింలు ద్వితీయశ్రేణితో రాజీపడితే.. అది కనిష్ఠ స్థాయి ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది. కానీ, వారు అణచివేతను ధిక్కరించి సంఘ టితమైతే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. శ్రీలంకను తలపిస్తాయి. దేశంలో ముస్లింలంతా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై లేరు. మూలమూలలా విస్తరించి ఉన్నారు. భౌగోళికం గా అనేక దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్న భారత్‌లో ముస్లింలలో అలజడి,అసంతృప్తి ఊహించని ఫలితాలకు దారితీస్తుంది.ఇక్కడే ఇజ్రాయిల్, పాకిస్థాన్ గురించి కూడా చెప్పు కోవాలి. ఈ దేశాల్లో మైనారిటీ వర్గాలకు సమాన స్థాయి, గౌరవం ఇవ్వలేదు. తమను తాము యూదు, ముస్లిం దేశాలుగా అవి ప్రకటించుకున్నాయి. కానీ, భారతదేశం తననుతాను ఒక మతదేశంగా కాకుండా లౌకికదేశంగా ప్రకటించుకుంది. దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయని రాజ్యాంగం హామీ ఇచ్చింది. కాబట్టి మైనారిటీ వర్గాల రక్షణ, భద్రత అనేది ప్రభుత్వం పైనున్న రాజ్యాంగ పరమైన బాధ్యత. ఇప్పటిదాకా పౌరుల హక్కుల రక్షణకు మన రాజ్యాంగం హామీగా నిలిచింది. అందుకే దేశవాసులకు ఇప్పటికీ రాజ్యాంగంపై ఎనలేని విశ్వాసం ఉన్నది. ఈ మధ్యన కార్యనిర్వాహక, రాజకీయ వర్గాల ఆధిపత్యంలో న్యాయవ్యవస్థను నిష్క్రియా పరత్వం చేసే ప్రయత్నం జరుగుతున్నది. నా వ్యక్తిగత ఆలోచనాదృక్పథం చెబుతున్న దేమంటే.. న్యాయవ్యవస్థ ఎన్ని సమస్యలు ఎదురైనా సానుకూల శక్తుల దన్నుతో అది నిలబడుతుంది. అలాంటి శక్తులను పక్కకు జరిపి 1975,76 లోలాగా రాజ్యాంగాన్ని అతిక్రమించటం అంత సులువు కాకపోవచ్చు. అయితే రాజ్యాంగ విధ్వంసం ఎంతదాకా పోతుంది, ఏమవుతుందన్నది ఆందోళన కలిగించేదే. అన్ని విషయాలూ`గిరిగీసినట్లుగా జరుగకపోవచ్చు. అయితే ఆశావహ దృక్పథం ఎప్పుడూ అస్పష్టం,బలహీనం కాబోదు. మన దేశం ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ వచ్చింది. గత 70 ఏండ్లుగా ప్రజాస్వామ్య దివిటీగా ప్రపంచంలో వెలుగొందుతున్నది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి గాంచింది. కొన్ని శక్తుల అవాంతరాలతో ఇంతటి ఘనచరిత్ర మసకబారుతుందా,దారి తప్పుతుందా? ప్రఖ్యాత అంతర్జాతీయ ‘ప్రజా స్వామ్య అధ్యయన సంస్థలు’ ఫ్రీడం హౌజ్,వి-డెమ్ ఇన్స్టిట్యూట్-స్వీడన్..భారత్‌లో దిగజారిన ప్రజాస్వామ్యం పరిస్థితులను తెలియజెప్పాయి. ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రజాస్వామ్యంతో తీవ్రంగా ఘర్షణ పడుతున్న పరిస్థితి నెలకొన్నది.విస్తృతార్థంలో చెప్పుకోవాలంటే.. ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు. రెండు ఎన్నికల మధ్య కాలంలో జరిగే సామాజిక ఆచరణే ప్రజాస్వామ్యం.ఆ ఐదేండ్ల కాలంలో రాజ్యాంగ నియమాలను ప్రభుత్వం ఎలా అమలు చేసిందన్నదే ప్రజాస్వామ్యం. కాబట్టి, మనది చైతన్యవంతమైన ప్రజాస్వా మ్యమని అనలేం. మనది చైతన్యవంతమైన ఎన్నికల ప్రజాస్వామ్యం మాత్రమే. కానీ, రాజ్యాంగ ప్రజాస్వామ్యం మాత్రం రోజు రోజుకీ బలహీనపడుతున్నది.
‘పౌరులకు హక్కుల కన్నా విధులు ముఖ్యం’ అని ఆ మధ్య ప్రధాని మోదీ ప్రకటించారు. గతంలో హిందూత్వ సిద్ధాంతకర్తలు కూడా..‘హక్కులు దేశాన్ని బలహీనపరుస్తాయి. బాధ్యతలు బలోపే తం చేస్తాయి’ అనే అన్నారు. వాస్తవానికి దీంట్లో ఉన్న అసలు విషయం ఏమిటంటే.. ప్రజలకు హక్కులు లేకుండా చేయటం.దాని గురించి ప్రశ్నించనివ్వకుండా నోరు నొక్కటం.మోదీ కూడా ప్రజల హక్కులను అణచివేస్తూనే, తాను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొం టున్నారు. ఇదంతా హిందూత్వ భావజాల కార్యాచరణలో భాగమేనని అర్థం చేసుకోవాలి. మనం పేపర్లు చదువుతాం.టీవీ చూస్తాం. వాట్సాప్ సరేసరి. వీటి ప్రభావం చాలా పెద్దది. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా స్పందిస్తున్నాం. మనదేశంలో మన చుట్టూ జరుగుతున్న వాటిపై కూడా భారతీయులు సరిjైున విధంగా స్పందిస్తారనే ఆశ, నమ్మకం నాకున్నది. గతంలో ఈ దేశ ప్రజానీకం దాటి వచ్చిన అవరోధాలను బట్టి, నేడు కూడా వారు విజయం సాధిస్తారనే విశ్వాసం నాకు న్నది’.ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి తలెత్తితే మనదేశంలో ప్రజాస్వామ్యం పని ముగిసినట్లేనని మనం భావించాలి.- వాసకర్త : ప్రముఖ పాత్రికేయులు,రాజకీయ విశ్లేషకులు (నమస్తే తెలంగాణ సౌజన్యంతో..)- (అశుతోష్ వర్షిణీ)