మన జాతి రత్నం లాల్ బహుదూర్ శాస్త్రి
భారతదేశానికి రెండో ప్రధానమంత్రి,భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి,భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు లాల్‌బహదూర్ శాస్త్రిగారి జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలను ఈకథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్టోబరు రెండవ తేదీ భారత ద్వితీయ ప్రధాని శ్రీలాల్ బహుదూర్ శాస్త్రిగారి జన్మదినం.1904వ సంవత్సరం అక్టోబరు2న ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో జన్మించిన లాల్‌బహదూర్‘జైజవాన్‌జై కిసాన్’ నినాదంతో దేశాన్ని మేల్కొలిపి చ్కెతన్యం రగిలించిన ధన్యజీవి. ఆకలి తీర్చే రైతుకు, దేశాన్ని కాపాడే సైనికుడికి మనం చేసే అభినందనలే వారిలో విజయమార్గంలో నడిపిస్తాయి అని అప్పటి మూడుకోట్ల జనాభాకి పిలుపు నిచ్చారు.భారతదేశాన్ని ప్రపంచదేశాల గుర్తింపు కార్యక్రమంలో భారత భవిష్యత్తును రూపొందిం చటంలో కీలక పాత్ర పోషించిన మేధావి. కాయస్థ వంశంలో శారదాప్రసాదుకు మరియు రామ్‌దులారీ దేవి దంపతులకు జన్మించిన ఈ బాలుడు, బాల్యమునందే తండ్రిని పోగొట్టుకున్నాడు.బీద కుటుంబము
భర్త మరణించటంతో రామ్‌దులారీ దేవి తన ఇద్దరు కుమార్తెలను, కుమారుడు బహదూర్‌ని తీసికొని తండ్రి వద్దకు చేరినది.బహదూర్‌ని అందరూ ‘‘నానీ’’ అని ముద్ధుగా పిలుచుకొనేవారు.అది తాతగారు పెట్టిని ముద్దు పేరు.
బాల్యంలో ఆటల మైదానంలో ఆడుకుంటూ తోటి స్నేహితులతో కలసి ఒకరి జామచెట్టును, యజమాని అనుమతి లేకుండా కాయలు కోసుకొనే సమయంలో,ఆయజమాని చూసి కోపంగా అరచిన అరుపుకి అందరూ తప్పుకున్నారు గాని,నానీ మాత్రం తప్పించుకోలేదు.పైగా ఆయజమానితో ‘తండ్రిలేని వాడిని,నన్ను ఎక్కువగా దండిరచకు’అని బ్రతిమాలితేదానికి ఆయజమాని ‘నీకు తండ్రి లేడు కనుకనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పిన మాటను సందేశంగా భావించి,భవిష్యత్తును క్రమబద్ధంగా చక్కగా తీర్చిదిద్దుకున్నాడు.దాని ప్రభావము ఆయనకు బాగా తోడ్పడిరది.లాల్‌బహదూర్ ప్రాధమిక విద్య గంగానదికి ఆవలి ఒడ్డున గల మొగల్‌సరాయి, వారణాసిలలోని పాఠశాలలో జరిగింది. లాల్‌బహదూర్ నిత్యం పాఠశాలకు గంగానదిపై పడవలో ప్రయాణించి వెళ్ళి చదువుసాగించాడు. ఆ సమయంలో ఒకసారి పైకం చెల్లించే పరిస్థితి లేక బట్టలు,పుస్తకాలు సంచిలో చుట్టుకుని,వాటిని నడు ముకి కట్టుకుని నదిపై ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకుని పాఠశాలకు వెళ్ళటం జరిగింది. పడవకి డబ్బులు ఇస్తామని చాలామంది చెప్పినా సున్నితంగా తిరస్కరించి,ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నాడు. సమ యస్ఫూర్తితో కార్యాలను సాధించుకునేవాడేగాని, పేదరికానికి మాత్రం చింతించలేదు,వెనుకంజ వేయ లేదు.లాల్‌బహదూర్ 13వసంవత్సరంలోనే గాంధీ గారి ప్రసంగాలకి, సిద్ధాంతాలకి ప్రభావితుడ్కె నాడు. విధ్యార్థి దశలోనే భారతసేవా సమితి అనే సంస్థలో సభ్యునిగా ఉండేవారు.బాలగంగాధర్ తిలక్‌గారి ఉపన్యాసాలకు ప్రీతిపాత్రుడ్కె దేశభక్తిని అమితంగా పెంచుకున్నాడు.1921లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణాద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడి, మైనరగుటచే వెంటనే విడుదలకాబడ్డారు. ఆకారణం చేత విధ్యాభ్యాసానికి హాని కలుగలేదు. కాని విశ్వవిధ్యాలయం నుండి‘‘శాస్త్రి’’ పట్టాను పొంది న కారణంగా లాల్‌బహదూర్ శాస్త్రి అయ్యారు. 1927
28 సం.లో లలితాదేవితో వివాహమైనది. వరకట్నంగా మామగారు కొయ్య చరఖాని బహు మతిగా ఇచ్చారు.అప్పుడప్పుడే స్వాతంత్య్ర పోరాటం ఉధృతమవుతున్న సమయంలో శాస్త్రికి,నెహ్రూగారితో సన్నిహిత సంబంధం ఏర్పడిరది.అది వారి మధ్య గొప్ప మైత్రికి దారితీసింది.1930లో లాల్‌బహదూర్ లొలిసారిగ జిల్లాకాంగ్రెస్ కార్యదర్శిగా ఎంపిక కాబ డ్డారు.పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభించిన కార ణంగా 2సంవత్సరాలకాలం కారాగార శిక్ష వేసారు బ్రిటిష్‌వారు.ఆయన ఆశిక్షను అనుభవించారు.
ఒకసారి అలహాబాదు నగరమధ్యలో జాతీయ పతాకం ఎగురవేయుటకు కాంగ్రేస్ సభ్యులందరూ భయాందోళనలో వుండగా, శాస్త్రిగారు స్త్రీ దుస్తులలో బురఖా వేసుకుని పైకిపాకి జెండాను ఎగురవేసి నారట. అతని ధ్కెర్యసాహసాలకు భారతీయులందరూ ప్రసంసించినా, అందుకుగాను మరల జైలు శిక్ష అను భవించవలసి వచ్చింది.1936లో ఆంగ్ల ప్రభుత్వానికి పోటీగా కేంద్ర,రాష్ట్ర శాసనసభలకు జాతీయ కాం గ్రెసు పోటీ చేసింది.శాస్త్రిగారు అలహాబాదు నియో జగవర్గం నుండి ఎన్నికైనారు.వారు ఎప్పుడూ సమ యాన్ని వృధా చేయలేదు.జ్కెలులో ఉన్న సమయంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ‘మేడం క్యూరీ’ జీవితగాధను హిందీలోనికి అనువదించారు. కాలాన్ని వ్యర్ధం చేయక పఠనానికో, గ్రంధరచనకో ఖర్చుచేసేవారు.విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో భార్యను కూడా పాల్గొనమని ప్రోత్సహించారు. శాస్త్రిగారి జీవితం మిక్కిలిఆదర్శప్రాయమైనది. భారతీ యుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిన అమర జీవి.ప్రధానిగా కొంతకాలమే వున్నప్పటికీ, ముందు వారికంటే కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. పదవు లకోసం ప్రాకులాడలేదు.పదవులే వారిని వెదుక్కుంటూ వచ్చాయి.ఉక్కుమనిషి,ఆజాత శత్రువు, నిగర్వి,ధ్కెర్య శాలి, స్థిరచిత్తుడు వంటి పదాలకి సరైన నిర్వచనం శాస్త్రిగారు.భారత స్వాతంత్య్రానంతరం అలహాబాద్ మున్సిపల్ ఎన్నికలలో గెలిచి ‘అలహాబాద్ ఇంప్రూవ్ మెంటుట్రస్టుకు’ట్రస్టీగా నియమించ బడినారు. రెండు బాధ్యతలు నిర్వర్తించే సమయంలో ‘‘టాగూర్ నగర్’ అనే పేరుతో అర ఎకరం భూమిని ప్లాటుగా విభజించి శాస్త్రిగారు లేని సమయంలో మిగిలినవారు వేలానికి పెట్టారు.ట్రస్టు సభ్యులందరూ తలొక ప్లాటును స్వంతం చేసుకోవాలనుకున్నారు.
రెండు రోజులకి తిరిగి వచ్చిన శాస్త్రిగారికి ఈ విషయం తెలిసి,వారందరినీ పిలిచి,మనం ప్రజా ప్రతినిధులము,ప్రజల ముందు నిజాయితీగా నిల వాల్సిన వారం,అందరూ వాపసు ఇచ్చేయండి లేదా రాజీనామా చేద్దాం.కావలసివారు వేలం పాటలో పాల్గొని దక్కించుకోండి అని చెప్పి అందరిచేత వాపసు చేయించారు.శాస్త్రిగారు ప్రధానమంత్రిగా పనిచేసినా పదిరూపాయలు కూడా దాచుకోలేదు. స్వంత ఇల్లు కూడా లేని నిజాయితీకి మారు రూపం.రాజకీయంగా కీలక పదవులు చేపట్టిన సందర్భాలలో కూడా దేశానికి మేలు చేసే శాశ్వత కార్యక్రమాలు చేపట్టారు. రైల్వేమంత్రిగా 195156 వరకూ,హోంమంత్రిగా ఏప్రిల్ 61 నుండి ఆగస్టు 63వరకూ,ప్రధానమంత్రిగా జూన్ 64నుండి జనవరి 66వరకూ (మరణించే వరకూ) పనిచేసారు.ఈసమయలో ప్రధాన మంత్రి గాచేస్తూ అదనంగా కొంత కాలం హోం మంత్రి త్వశాఖను కూడా నిర్వహించారు. ఆ సమ యంలో ఎదురైన ఆహారధాన్యకొరత, పొరుగు దేశాల వత్తిడికి ధీట్కెన సమాధానం చెప్పి రెండు సమస్యలకు పరి ష్కారం చూపారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమ యంలో కూడా వారి సంతానం సిటీబస్సులలోనే ప్రయాణించే వారు.ప్రధానిగా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన సౌకర్యాలు సమ కూర్చలేదు.వారిలోని జాతీయ భావానికి శాస్త్రిగారి సంస్కారానికి ఆకుటుం బ సభ్యుల సహకారానికి నమోవాకాలు అర్పించ వలసినదే.వారి పెద్దకుమారుడు హరికృష్ణకు అశోక్‌లేలాడ్ సంస్థలో ఉద్యోగం చేసే సమయంలో, అకస్మాత్తుగా సీనియర్ మేనేజర్‌గా పదోన్నతి కల్పిం చారు.శాస్త్రిగారికి ఈవిషయం తెలిసి, ఆసంస్థవారు నీకు అర్హతలు చూడ కుండా పదోన్నతి కల్పించడం లోని ఉద్ధేశ్యం వారు ప్రధానిగా నానుండి ఏదో ఆశిం చవచ్చును.కనుక నేను ప్రధానిగా ఉన్న సమయంలో ఆసంస్థలో నీవు ఉద్యోగం చేయవద్దని ఖండిరచిన మహనీయులు శాస్త్రి గారు. రైల్వేమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రమాద సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారు. అనేక విశేష సలహాలు, నిర్ణయా లపై కేంద్రమంత్రి వర్గంలో విశిష్టస్థానంలో ఉన్న శాస్త్రిగారి నిర్ణయంతో జరిగేవి.ఏపదవీ లేన ప్పుడు కూడా ఇదే పంధాలో కొనసాగుతూ దేశానికి సేవ చేశారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థానుతో యుద్ధం సంభవిం చింది.వారి దురాక్ర మణను గుండె నిబ్బరంతో అణచివేసిన వీరుడు. శాంతి స్థాపనకై రష్యా నాయకుల ఆహ్వానంతో తాష్కెంటుకు వెళ్ళి సంధి పత్రంపైన సంతకం చేసి, గుండె పోటుతో 1966 జనవరి 11వారు మరణిం చారు.ఆయన విశ్రాంతి స్థానం‘విజయ్ ఘాట్’గా గుర్తింపబడినది.ఆయన మరణానంతరం ‘భారతరత్న’ బిరుదును ప్రకటించారు. శాస్త్రిగారు వాయిదాల పద్దతిలో తీసుకున్న కారు వాయిదా నాలుగు వేల రూపాయలను వారి సతీమణి,శాస్త్రి గారి మరణా నంతరం చెల్లించి వారి నిబద్ధతకు, నిరా డంబర జీవితానికి భర్తకి సహకరిం చిన ఆదర్శమహిళ లలితా శాస్త్రిగారు.‘జ్కె జవాన్
జ్కె కిసాన్’నినాదాలు ఎప్పటికీ మనతోనే వుంటాయి. మహనీయుల పుట్టుకకు ఒకపరమార్థం వుంటుంది. భారతదేశాన్ని ఉద్దరించ టానికి జన్మించిన నిస్వార్థ మహనీయులలో శాస్త్రిగారి కీర్తి ఆచంద్రార్కం నిలచి వుంటుంది.వారికి నమోవా కములు.జై భారత్.(వ్యాసకర్త : సాహితీరత్న,ప్రముఖ రచయిత్రి
విశాఖపట్టణం`9849692414
) డాక్టర్ దేవులపల్లి పద్మజ