మన్యంలో సికిల్‌సెల్‌ మహామ్మారి

సికిల్‌ సెల్‌ అనీమియా జనాన్ని మింగేస్తోంది .పచ్చటి మన్యాన్ని ఓ మహామ్మారి మింగే స్తోంది. గిరిజనుల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తోంది. ఏజెన్సీలో మృత్యుఘటికలు మోగి స్తోంది. చిన్నారులే లక్ష్యంగా ప్రాణాలనే హరిస్తోంది.ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈవ్యాధి బారినపడి చనిపోతున్నారు. మన్యా న్ని వణికిస్తున్న ఆజబ్బు పేరు సికిల్‌ సెల్‌ అనీమియా.జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈరక్తహీనత జబ్బు చాపకింద నీరులా ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారా మారాజు జిల్లా ఏజెన్సీప్రాంతాన్ని చుట్టు ముట్టుతోంది. భయంకరమైన ఈ వ్యాధి జన్యుపరమైన మార్పులవల్ల వచ్చే జబ్బుని వైద్యులు గుర్తిస్తున్నారు. ఈవ్యాధి నివారణకు ఇంతవరకు మందులు లేవు.ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈరోగం బారినపడి చనిపోతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 10లక్షల గిరిజన జనాభా ఉంది.ఇందులో కనీసం పదిశాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి.ఈ వ్యా ధికి గురై మరణించవారి సంఖ్య ఏటా పెరుగు తూ పోతుంది.యూనివర్శిటీ స్థాయిలో హ్యూ మన్‌ జెనెటిక్స్‌ విభాగం వారు జరిపిన పలు శాంపిల్‌ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివశిస్తున్న గిరినేతర కులాల్లో కూడా ఈవ్యాధి లక్షణాలు కనిపిస్తుం డటం మరింత ఆందోళన కలిగించే విషయం. అల్లూరిసీతారామారాజు,పార్వతిపురం మన్యం, అనకాపల్లి,ఏలూరు,శ్రీకాకుళం జిల్లాల్లో ఈవ్యా ధి లక్షణాలు కలిగిన రోగులు అనేక మంది బాధపడుతున్నారు.
నిర్లక్ష్యానికి పరాకష్ట..
పాడేరు పరిసర ప్రాంతాల్లో సికిల్‌ సెల్‌ అనీమి యా రోగుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. ఎత్తయిన ప్రాంతం(3,600అడుగులు)కావడం వల్ల ఈ ప్రాంతంలో ఆక్సిజన్‌ లభ్యతలో తేడా లుంటాయి.రోగులకు తరచూ రక్తం ఎక్కించా ల్సిన అవసరం ఉంటుంది.ఈరోగానికి మందు లు లేవు.సికిల్‌ సెల్‌ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడమే మార్గం.
సికిల్‌ సెల్‌ అనీమియా వ్యాధి లక్షణాలు ఇలా..
సికిల్‌ సెల్‌ ఎనీమియా అనే వ్యాధి వారస త్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహం.రక్తములో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులు లోపబూయిష్టంగా మారతాయి.ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలలో హిమోగ్లోవిన్‌ కొడవలి కణా లుగా మారి తద్వారా ఏభాగంలోనైనా కణజాలం,అవయవ వైకల్యానికి దారితీ స్తుంది.కొడవలి ఆకారంలో కణాలు మార డం వలన రక్తహీనత పరిస్థితులకు దారి తీస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారంగా ఉండడం,అవయవ వైఫల్యం కలుగుతోంది.రక్త కణాలు సంఖ్య తగ్గడం (రక్తహీనత) కళ్ళు పసుపు రంగులో మార డం,తీవ్రమైన కీళ్ల నొప్పులు,ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,అలసట, తరచూ వచ్చే అంటువ్యాధులు,గర్భాధారణ సమయంలో ఎదురయ్యే సమస్యలు,అవయవ వైకల్యం,పెరుగుదల వంటి సమస్యలు ఈవ్యాధి లక్షణాలు.ప్రతి ప్రాథమిక వైద్య శాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు 40ఏళ్లు ఉన్న వారందరూ చేయించు కోవాలి. జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి చిన్నపిల్లలకు ఈవ్యాధి సోకే ప్రమాదం ఉంది.ఈ వ్యాధి అంటువ్యాధి కాదు.ఒక వ్యక్తి నుండి ఒకవ్యక్తికి గాలి,నీరు,చర్మములైన వాటిద్వారా రాదు.ఆహార అలవాట్లువల్ల కూడా సంభవించదు.కేవలం జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్ర మిస్తుంది. ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో జీరో నుండి 45ఏళ్ల మధ్య వయస్సున్న జనాభాకు అవగాహన కల్పించడం,సార్వ త్రిక నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్‌ ద్వారా ఈ వ్యాధిని అరికట్టడానికి దోహదపడు తుందని పాడేరు సర్వజన ఆసుపత్రి సికిల్‌ అనీమియా వైద్యనిపుణ రాలు డాక్టర్‌ ఆశాలత తెలిపారు.
సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యం
సికిల్‌ సెల్‌ అనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర,కేంద్రప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.వ్యాధి గ్రస్తులకు నెలకు రూ.10వేలు చొప్పున ప్రొత్సహాకలు అంది స్తోంది.సికిల్‌ సెల్‌ అనీమియా లక్షణాలు కలిగిన రోగులకు నిరంతరం రోగనిరోధక పరీక్షలు చేస్తోంది.రోగం ఉందని నిర్ధారణ అయితే వారికి ప్రభుత్వం సర్టిఫికేట్లు అందజేస్తోంది.తద్వారా ప్రభుత్వం కల్పించే రాయితీ మంజూరు చేస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సికిల్‌ సెల్‌ ప్రభా విత గిరిజన ప్రాంతాల్లో అవగాహన చాలా అవసరం.40ఏళ్ల మధ్య గిరిజనుల్లో నిర్ధా రణ పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్‌ ఇవ్వాలి.హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వాళ్లకి ఈవ్యాధి వ్యాపిస్తోంది.దీనిని నిరోధించేం దుకు గిరిజనులకు స్కానింగ్‌ పరీక్షలు పాడేరు ఆసుపత్రిలో అందుబాటులోఉన్నాయి. సకాలంలో ఈవ్యాధి నిర్ధారిం చడంవల్ల చికిత్స ను వెంటనే ప్రారంభిం చడానికి అవకాశం ఉంది.ఈ వ్యాధి తీవ్రంగా మారకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. మెరుగైన జీవనశైలి అలవర్చు కోవాలి.ఈ వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని,సమతుల ఆహారం,పౌష్టికా హారం తీసుకోవాలని విపరీతమైన వాతా వరణ పరిస్థితిలకు ఎదురు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని,ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పాటు చేసుకోవాలని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకూడదని తెలియజేశారు.ఈ వ్యాధిని నిర్ధా రించడానికి ఎలక్ట్రోఫోరోసిస్‌ అనే రక్తపరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారించవచ్చని ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే ఈ పరీక్ష చేయిం చుకుని చికిత్స పొందినట్లయితే ఈ వ్యాధిని నివారించడం ద్వారా వారి జీవనశైలి మెరుగు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
సికిల్‌ సెల్‌ రోగుల లక్షణాలు…
సికిల్‌ సెల్‌ వ్యాధిని నివారించడానికి,దాని కారణాలను మొదట అర్ధం చేసుకోవడం చాలా అవసరం.ఒక్కోసారి ఈవ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభిస్తుంది.అంటే తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ దీని బారిన పడినట్లుయితే,అది పిల్లలకీ కూడా వచ్చే ప్రమా దం ఎక్కువగా ఉంటుంది.ఈ వ్యాధి జన్యుపు ఒకతరం నుంచి మరోక తరానికి వచ్చే అవకా శం ఉంది.అందువల్ల ముందు జాగ్రత్త కోసం వివాహానికి ముందు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.అంతేకాకుండా ఈవ్యాధి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఈ వ్యాధి నుంచి ఎలా బయ పడొచ్చు..
ఎర్ర రక్తకణాలను ప్రభావితం చేసే ఈవ్యాధి జన్యుపరమైన కారణాలవల్ల మాత్రమే వస్తుంది. ఎర్రకర్తకణాల ఆకారం మారిపోతుంది.దీనివ్ల శరీరానికి తగినంత ఆక్సిజన్‌ లభించదు. ఎందుకంటే హిమోగ్లోబిన్‌లో అసాధారణైన గొలుసులు ఏర్పడటంతో సికిల్‌ సెల్‌ అనీమి యా,సికిల్‌ సెల్‌ తలసీమియా వంటి వ్ధాఉలు వస్తాయి.అందువల్ల సకాలంలో సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యమని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
ఈవ్యాధిని నయం చేయడం సాధ్యమేనా ?..
వైద్యులు సాధారణంగా సికిల్‌ సెల్‌ అనీమి యాతో బాధపడుతున్న వ్యక్తులకు రక్తమార్పిడి అవసరమని సిఫార్సు చేస్తారు.శరీరంలోని ప్రతి భాగానికి తగినంత ఆక్సిజన్‌ అందనప్పుడు, దానివల్ల కలిగే తీవ్రమైన నొప్పి నుంచి ఉపశ మనం పొందేందుకు హైడ్రాక్సీ యూరియాని ఉపయోగిస్తారు.రానున్న కాలంలో ఈ వ్యాధి చికిత్సలో జన్యు చికిత్స ఎంతగానో ఉపకరి స్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.దీనివ్ల తీవ్ర లక్షణాలున్న రోగులకు ఎంతో మేలు చేకూరనుంది.
పరీక్ష ఖరీదు పది రూపాయలే..
జబ్బు నిర్దారణకు జరిపే ప్రాధమిక రక్త పరీక్ష ఖరీదు రూ.10లోపే ఉంటుంది. రక్తనమూనాను సోడియం మెటాట్రై సల్ఫేట్‌లో కలిపి మైక్రోస్పోప్‌ కింద చూస్తే రక్తకణాలు మామూలుగా ఉన్నాయా?వంపు తిరిగి ఉన్నాయా?అని తెలుస్తుంది.ఈ ప్రాధ మిక పరీక్షను ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల (పీహెచ్‌సీ)స్థాయిలోనే జరప వచ్చు.జిల్లాలో సికిల్‌ సెల్‌ అనీమియా ఎక్కువగా ఉన్న పాడేరు,అరకు పరిధిలో 22 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.అయితే ఎక్కడా సికిల్‌ సెల్‌ పరీక్షలు జరపడం లేదు.రోగులు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీ హెచ్‌ ఆస్పత్రిక వచ్చినప్పుడు అక్కడ పరీక్షల్లో మాత్రమే వీరికి సికిల్‌ సెల్‌ అనీమి యా ఉన్నట్లుగా నిర్ధారణ అవుతోంది. ప్రస్తుతం పాడేరు సర్వజన ఆసుపత్రిలో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కొడుకు చనిపోయాడు..కుమార్తెకూ వ్యాధి…
రaూన్సీరాణి,క్రాంతిరాజు దంపతులకు ఒక కుమారుడు.ఒక కుమార్తె ఉన్నారు. రaూన్సీ రాణి పాడేరు సమీపంలోని కిండంగిలో ఎన్‌ఎన్‌ఎంగా పనిచేస్తోంది.క్రాంతారాజు గిరిజన కార్పొరేషన్‌లో సేల్స్‌మేన్‌,తొమ్మిదేళ్ల క్రితం 9వ తరగతి చదువుతున్న కొడుకు సురేష్‌కు విపరీతైన జ్వరం వచ్చింది.డాక్టర్లు సికిల్‌ సెల్‌ అనీమియా అన్నారు.అన్నీ రకాల వైద్యం చేయిస్తూ వచ్చినా 2013 సెప్టెంబర్‌లో చనిపోయాడు.ఆ దు:ఖం నుంచి కోలుకోక ముందే కుమార్తె శ్రీలతకూ అదే విధమైన జబ్బు వచ్చింది.కూతుర్ని దక్కించుకోవడమెలాగో తెలియక ఆ దంప తులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.ఇది వీరి ఒక్కరి సమస్య కాదు.. ఉత్తరంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో గల పలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గుడెం లోను వందలాది కుటుంబాలు ఇలాంటి వ్యధ ను అనుభవిస్తున్నాయి.ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. వీటిన్నింటిపై ప్రజ లకు అవగాహన కల్పిం చాలనే లక్ష్యం.
సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత సమాజమే లక్ష్యం
సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత గిరిజన సమాజ మే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పీవో వి.అబి óషేక్‌ తెలిపారు.ఏజెన్సీలో గిరిజనులను దీనిపై చైతన్య పరచాలన్నారు. ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (జన్‌మన్‌)లో భాగంగా ఏర్పాటు చేసిన సికిల్‌ సెల్‌ ఎనీమియా ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించాయన్నారు. తొలి విడతగా స్థానిక ఐటీడీఏకు రెండు ప్రచార వాహనాలు పాడేరు చేరుకున్నాయని, మరో నాలుగు వాహనాలు త్వరలో వస్తాయ న్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 35 ప్రాథ మిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియాపై ప్రచారం చేసి గిరిజనులకు అవగాహన కల్పించా లన్నారు. డివిజన్‌ పరిధిలో 1,550 గ్రామాల్లో ప్రచారం చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించామని, ప్రతి రోజు మూడు నుంచి ఐదు గ్రామాల్లో ప్రచార రథం పర్యటించాలన్నారు. ఎంపిక చేసిన గ్రామాలకు ప్రచార రథం వచ్చిన సమయంలో సంబంధిత వైద్యాధికారి, వైద్య సిబ్బంది, గ్రామ సర్పంచులు విధిగా భాగ స్వామ్యం కావాలన్నారు. సికిల్‌ సెల్‌ ఎనీమి యా లక్షణాలను, నివారణ చర్యలను ప్రజలకు వివరించాలని ఐటీడీఏ పీవో సూచించారు. ఐటీడీఏ పరిధిలో లక్షా పది వేల మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చగా వారిలో 1,050 మందికి సికిల్‌సెల్‌ ఎనీమియా పాజిటివ్‌ వచ్చిందని, వారికి మరో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 650 మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా ఉందని తేలిందన్నారు. దీంతో వారికి అవసరమైన మందులు, సికిల్‌ సెల్‌ ఎనీమియా పింఛన్‌ మంజూరుకు సిఫా రసు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భారత దేశంలో ఈవ్యాధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, చత్తీష్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, తూర్పు గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమ ఒడిశా,ఉత్తర తమిళినాడ్‌లలో ప్రబ లంగా ఉంది.
తెలంగాణలో వరంగల్‌,ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,జయశంకర్‌ భూపాలపల్లి,ఖమ్మం,భద్రాద్రి కొత్త గూడెం, నల్లకొండ,మహాబూబ్‌నగర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల వారు,ఆదివాసులు అత్యధిక సంఖ్య లో ఈ వ్యాధికి గురవుతున్నారు.దీనికి సంబం ధించి వైద్య చికిత్సల కోసం నగరానికి రాకపోకు సాగిస్తున్నారు.
మేనరికపు వివాహాలు కూడా కారణమే…
తండాలలో ఈవ్యాధి ఎక్కువగా కనిపించడానికి మేనరిక వివాహాలు,దగ్గర బంధువుల్లో వివా హాలు కూడా కారణమే.ప్రణాళికబద్దంగా పరీ క్షల నిర్వహణ,అవగాహన పెంచడం,ముం దుస్తుగా వ్యాధిని గుర్తించడం,ఆయా ప్రాంతాల్లో వ్యాధి నిర్మూలనకు దోహద పడతాయి.జాతీ య ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్‌ సెల్‌ అనీమియా బారిన పడుతున్నారు. సరైన అవగహణ లేక,గుర్తిం చడంలో ఆలస్యం వల్ల,అనేక ంది బాధితులుగా మారుతున్నారు. వచ్చే 2047కల్లా సికిల్‌ సెల్‌ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 0`40ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న 7కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించ డంవ్యాధి నిర్మూ లనకు దోహదపడుతుంది. గత కొన్నేళ్లుగా బాధితులకు స్వచ్చంధ సేవలు తలసీమియా, సికిల్‌సెల్‌ సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ అగర్వాల్‌ అందిస్తున్నారు.
– గునపర్తి సైమన్‌