మడ అడవుల జీవ వైవిధ్య ప్రతీకలు
మడ అడడులు..పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి ప్రసాదించిన వరాలు.తీర ప్రాంతాలకు సహజ రక్షణ గోడలు.సముద్ర తీర జీవవైధ్యంలో వీటిదే కీలక పాత్ర.ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషల్ని,వన్యప్రాణుల్ని కాపాడుతు న్నాయి. కోట్ల మంది జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయి.వీటినిభద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాన వాళిపై ఉంది. జూలై26 అంతర్జా తీయ మడ అడువుల సంరక్షన దినోత్సవం సందర్భంగా…
ఉష్ణమండలం..ఉప ఉష్ణమండల ప్రాంతాలు, అత్యధిక వర్షపాతం నమోదయ్యే భూ భాగాలు,నదులు,సముద్రంలో కలిసేతీర ప్రాం తాల్లో మడ అడవులు ఏర్పడతాయి. అత్యధిక ఉప్పు సాంధ్రత,నీటినిల్వఉండి, తరచూ తుఫాన్లు సంభవించే ప్రాంతాల్లో అలలు,ఉప్పెనల ప్రభా వంతో నెలకొం టాయి.మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో తుఫానుల తీవ్రత,వాటివల్ల కలిగే నష్టం తక్కువగా ఉన్నట్లు కోనసీమ ఉప్పెన సహా పలుసందర్భాల్లో తేలింది.ఇవి ఉండే చోట మత్స్య సంపద అధికంగా ఉంటున్నట్లు అధ్యయ నాల్లో వెల్లడైంది.చేపలు,రొయ్యలకు ఆహారంగా మత్స్యసంపదను పెంపొందిం చడంలోనూ తోడ్ప డుతున్నాయి. పర్యాటక పరంగానూ వేల మందికి ఉపాధిని కల్పిస్తు న్నాయి.వాతావర ణంలో కర్బన్ ఉద్గారాలు కార్బొన్ డై ఆక్సైడ్‌ను తగ్గించు డంలో కీలక పాత్ర పోషిస్తు న్నాయి. సముద్ర తీరప్రాంతంలో నీటి నాణ్యత ను పెంచేందుకు దోహదపడుతు న్నాయి. పర్యా వరణ పరిరక్షనతోపాటు జీవవైధ్యానికి అండగా నిలుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో పలురకాల గ్రామీణ జీవనోపాధి అవకాశాలు కల్పించడం లో గణనీయ పాత్ర పోషిస్తున్నాయి.తుఫానులు, ఉప్పెనల నుంచి తీరప్రాంత గ్రామాలను కాపాడుతున్నాయి. బలమైన వేళ్లతో అల్లుకుపోయిన మడ అడు వులు అటుపోట్లకు అడ్డుగా నిలిచి భూమి కోతకు గురికాకుండా పరిరక్షిస్తున్నాయి. ప్రత్యేకమైన,విలువైన మరియు సున్నితమైన పర్యావరణాలుగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతపై ప్రపంచ అవగాహనను పెంచడం దీని ఉద్దేశ్యం..యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 2015లో ఈఅంతర్జాతీయ దినోత్సవాన్ని అధికారికంగా ఆమోదిం చింది. అలాగే తాజాగా జీ20సదస్సులో వాతావరణ మార్పుల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మడ అడవులను పరిరక్షించుకోవాలని ప్రపంచ దేశాల నేతలు పిలుపు నిచ్చారు.సదస్సు సాక్షిగా మడ అడవుల పరిరక్షణకు ఉద్దేశించిన మాం గ్రూప్ ఆలయన్స్ ఫర్ క్లైమేట్ వేదికలో భారత్ భాగస్వామిక చేరినట్లు ప్రధాని మోది ప్రకటిం చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థాలాల కేటాయంపు పేరుతో కాకినాడ తీరంలో పెద్దఎత్తున మడ అడవు లను ధ్వంసం చేయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) తప్పుపట్టింది.ధ్వంసం చేసిన మడ అడవులను అయిదేళ్లలో ప్రభుత్వం పునరుద్దరించాలని ఆదేశిం చింది.అందుకోసం అయిదుకోట్ల రూపా యలమేర మధ్యంతర పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని ట్రైబ్యునల్ ఆదేశించడం సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది.
భారతదేశంలోని మడ అడవులు
ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021ప్రకారం,2019 అంచనాతో పోలిస్తే భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం17చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది ఇప్పుడు 4,992 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. మడ అడవులు అత్యధికంగా పెరిగిన మూడు రాష్ట్రాలు- ఒడిశా (8చదరపు కి.మీ),మహారాష్ట్ర (4చదరపు కి.మీ) మరియు కర్ణాటక (3 చ.కి.మీ).వీటిలో తీర రక్షణ: మడ అడ వులు అలలు మరియు తుఫానుల ద్వారా ఏర్పడే కోతల నుండి తీరప్రాంతాలను రక్షిస్తాయి.వాటి చిక్కుపడినట్టు ఉండే వేర్లు అవక్షేపాలను బంధించడానికి,నీటి ప్రవా హాన్ని తగ్గించడానికి సహాయ పడతాయి. ఇది ఈ సహజ ప్రమాదాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
చేపలు,వన్యప్రాణుల ఆవాసాలు : మడ అడవులు వివిధ రకాల చేపలు, షెల్ఫిష్‌లు, పక్షులు మరియు ఇతర జంతు వులకు నిలయంగా నిలుస్తాయి. మడ చెట్ల వేర్లు మరియు కొమ్మలు ఈ జంతువులకు ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. ఈ అడవులు అనేక జాతుల చేపలకు నర్సరీగా కూడా పనిచేస్తాయి.
నీటిని శుద్దీచేయడం: మడ అడవులు కాలుష్య కారకాలు,అవక్షేపాలను ఫిల్టర్ చేయడం ద్వారా నీటిని శుద్ధి చేయడా నికి సహాయపడతాయి.అవి నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి, ఇది వరదలను నిరోధిం చడంలో సహాయ పడుతుంది.
కార్బన్ నిల్వలు: మడ అడవులు ఒక ముఖ్యమైన కార్బన్ సింక్‌గా పనిచేస్తుంది, అంటే అవి వాతావ రణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను నిల్వ చేస్తాయి. ఇది వాతావరణ మార్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.
నిర్లక్ష్యంతో తీరని నష్టం..
తీరప్రాంతాల్లో పర్యావరణానికి నష్టం కలిగించే రీతిలో సాగుతున్న అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ,వన్యప్రాణుల వేట తదితర అంశాలు మడ అడవులకు ముప్పుగా పరిణ మిస్తున్నాయి. వీటి సంరక్ష ణకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగంలో ఉదాసీనత పెరుగు తోంది. ప్రకృతి వైపరీ త్యాలతోపాటు మానవ చర్యలు దుష్ప్రభావం చూపుతున్నాయి.మడ అడవులు వ్యవసాయ భూములుగా మారే ముప్పు అంతకంతకూ అధికమవుతోంది.తీరం వెంబడి వేగంగా పెరుగుతున్న పారిశ్రామి కీకరణ,పారిశ్రామిక వ్యర్ధాలు,శుద్దిచేయని మురుగునీరు శాపాలుగా పరిణమిస్తు న్నాయి.తీరప్రాంతాల్లో జనాభా పెరుగుదల నేపథ్యంలో భూమికోసం పెరుగు తున్న డిమాండ్‌తోపాటు మానవ ఆవాసాలు, కలప,వంటచెరకు,పశుగ్రాసం,అటవీ ఉత్పత్తుల సేకరణ వంటివి ఆశనిపాతంలా మారాయి. అభివృద్ధి పేరట నదుల వెంబడి జరుగుతున్న పలురకాల కార్యకలాపాలు, నదీప్రవాహాల్లో మార్పులు మడ అడవుల సహజత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి.కొన్నిచోట్ల వీటికి అవసరమైన నీరు కూడా సరిగ్గా అందకపోవడం తీవ్రనష్టాన్ని కలిగిస్తోంది. వాతావరణ సమస్యలు,ఉష్ణోగ్రతల్లో తేడాలు, నదీప్రవాహంలో కొట్టుకొచ్చే మట్టి మేట వేయడం,కాలువపూడిక,నీటినిల్వతో ఉప్పు శాతం పెరిగి మొక్కలు నశించడం,మొల కెత్తకపోవడం వంటి సమస్యలు ఎదురవుతు న్నాయి.మరో వైపు, మడ అడువులు నరికివేత ముప్పునూ ఎదుర్కొం టున్నాయి. ఇలాంటి అనేక సమస్యలపై ఎన్నో అధ్యయ నాలు,ఎన్నిసార్లు హెచ్చకిరలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నష్టం తీవ్రత అంత కంతకూ పెరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా 113దేశాల్లో 1.4కోట్ల హెక్టార్లకుపైగా విస్తీర్ణం లో మడఅడవులు ఉన్నాయి. ఇందు లో 50లక్షల హెక్టార్లకుపైగా ఆసియా ఖండంలోనే ఉండటం గమనార్హం. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో విస్తరించిన సుందర్‌బన్స్ ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన మడ అడవులు కావడం విశేషం.ఇవి యునెస్కో వారసత్వసంపద గుర్తింపును సొంతం చేసుకు న్నాయి. గంగ,బ్రహ్మపుత్ర నదుల నడుమ వందకుపైగా దీవులుగా విస్తరించిన సందర్‌బన్ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా గుర్తింపు పొందింది.ఇక్కడ 55ఎకరాల జంతవులు,54ఎకరాల సరీసృపాలు,248రకాల పక్షలు జీవిస్తు న్నాయి.వృక్షజాతుల్లోనూ ఎంతో వైవిధ్యం కొనసాగుతోంది.రాయల్ బెంగాల్ పులులకు సుందర్‌బన్‌లే ఆవాసం.వీటితోపాటు మనదేశంలో భితర్‌కనికా,కోరింగ, పిచావరం, గుజరాత్ మడఅడవులు కీలకమైనవిగా పేరొందాయి.
బహుముఖ వ్యూహాలు..
మడ అడవుల సంరక్షణలో విస్తీర్ణం పెంపుదలలో ఒడిశా ఆదర్శంగా నిలు స్తోంది.నదీ తీరప్రాంతాలతోపాటు నదులు సముద్రంలో కలిసే భూభాగంలో మొక్కలు నాటడం ద్వారా విస్తీర్ణం పెరుగుతోంది.మడ అడువులు పెంచేందుకు అనువైన ప్రాంతా తలన్నింటినీ సమర్ధంగా ఉపయోగించు కుంటున్నారు. సముద్ర జలాలు చొచ్చుకుని వచ్చే ప్రాంతాల్లో వీటిని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం మడ అడవులను సంరక్షిం చాలి.ఈ అడవుల్ని పెంచేందుకు ఎక్కడ అవకాశం ఉన్నా వదులుకోకూడదు. ఒడిశా తరహాలో విస్తరించేందుకూ కృషి చేయాలి. మడఅడువుల నిర్వహణ ప్రణా ళికలు రూపొందించి అమలు చేయడం కీలకం.మడ అడవుల వైవిధ్యం,ప్రత్యేకతలపై మరింత లోతుగా పరిశోధనలు చేయట్టాల్సిఉంది.వీటి సంరక్షణలో బహుముఖ వ్యూహాల కార్యాచరణ ఎంతో అవసరం.మడఅడువుల్ని కాపాడు కోవడంలో ప్రభుత్వాలతోపాటు.. విశ్వవిద్యా లయాలు,పరిశోధన సంస్థలు,స్థానిక సంస్థలూ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉంది.
ఏపీలో తగ్గిన విస్తీర్ణం..
పలు రాష్ట్రాల్లో మడఅడవుల విస్తీర్ణం..ఎంత కొంత పెరుగుతుండగా,ఆంధ్రప్రదేశ్ మాత్రం తగ్గుతుండటం ఆందోళనకరం.ఏపీలో 1987 లో మడ అడవుల విస్తీర్ణం 495చదరపు కిలోమీటర్లు.ఇప్పుడు అది 405చదరపు కి.మీ.ఇందులో 70శాతం అంతకంటే ఎక్కువ సాంధ్రత కలిగిన దట్టమైన మడ అడవుల జాడే లేదు.213చదరపు కి.మీ ఒక మోస్తరు (40`70శాతం సాంద్రత)ఉన్నవి.మరో 162చదరపు.కి.మీ.40శాతం కంటే తక్కువ సాంద్రత కలిగినవి కావడం గమనార్హం.ఉమ్మడి తూర్పుగోదావరి,కృష్ణా,గుంటూరు జిల్లాలతో పాటు పరిమితంగా నెల్లూరు జిల్లాలోనూ మడ అడవులు విస్తరించాయి. ఏపీలోని ప్రధానమైన కోరింగ మడ అడువుల్లో 34రకాల మొక్కలు ఉన్నట్లు అంచనా.వీటి పిల్లి(మరకపిల్లి/ఏటిపిల్లి) అనే వన్యప్రాణితోపాటు అనేక రకాల జంతు వులు,పక్షులకు అవాసంగా నిలుస్తున్నాయి. విదేశీ పక్షలకూ విడిది కేంద్రంగా ఆకర్షిస్తున్నాయి.
మడ అడవుల పరిరక్షణ…
మడ అడవులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత ప్రజల శ్రేయస్సు, ఆహార భద్రత మరియు రక్షణ కోసం ముఖ్యమైనవి.వారు చేపలు,క్రస్టేసియన్లతో సహా గొప్ప జీవవైవిధ్యా నికి మద్దతునిస్తారు.ఇవి సునామీలు, తుఫా నులు,కోత,పెరుగుతున్న సముద్ర మట్టాలకు వ్యతిరేకంగా అవరోధంగా పనిచేస్తాయి.ఇవి సముద్రం మరియు భూమి మధ్య సరిహద్దు లుగా కూడా పనిచేస్తాయి అలాగే అనేక తీర ప్రాంత వర్గాలకు రక్షణ మరియు ఆహార భద్రతను అందిస్తాయి. మడ పర్యావరణ వ్యవస్థ యొక్క నేలలు కార్బన్ సింక్‌లుగా పనిచేస్తాయి మరియు భూమి ఆధారిత అడవులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేయగలవు.
మడఅడవులకు ఎదురౌతున్న ప్రమాదాలు
దురదృష్టవశాత్తు, గత నాలుగు దశాబ్దాలుగా, వివిధ మానవ చర్యల కారణంగా మడ అడవుల విస్తీర్ణం దాదాపు సగానికి పడిపో యింది. రొయ్యల పెంపకం ఇందులో ప్రాధ మిక ప్రమాదంగా తెలుస్తోంది. రొయ్యల పెంపకం కోసం చుట్టుపక్కల చెరువులను సృష్టించడానికి అడవిలో ఎక్కువ భాగాలను నరికేస్తున్నారు. వ్యాధులను నివారించడానికి మరియు దిగుబడిని పెంచడానికి యాంటీబ యాటిక్స్ మరియు రసాయనాలను అధికంగా ఉపయోగించడం వంటివి కూడా వీటికి హాని చేస్తున్నాయి. ఇది అడవుల పర్యావరణ సమతు ల్యతకు కోలుకోలేని నష్టానికి దారితీస్తుంది. అంతేకాక, ఈ అడవుల నుండి విలువైన కలప తరచుగా దోపిడీ చేయబడుతొంది మరియు గణనీయమైన లాభాలకు విక్రయిస్తున్నారు, అలాగే వీటిని బొగ్గు ఉత్పత్తిలో కూడా ఉపయో గిస్తున్నారు. అన్నింటివలన తీవ్రమైన అటవీ నిర్మూలన జరుగుతోంది.రోడ్లు, భవనాల నిర్మాణం,నీటిపారుదల అవసరాల కోసం నదు లను మళ్లించడం మడ అడవుల ఆవాసాన్ని మరింత దెబ్బతీస్తుంది, ప్రత్యేకించి చాలా మడ అడవులు నదీతీరాల దగ్గర ఉన్నాయి.(జూలై26 అంతర్జాతీయ మడ అడువుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా…)
-గునపర్తి సైమన్