భూ కబ్జా నిరోధిక చట్టం`2024

‘‘ ప్రస్తుతమున్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే ఏపీ డ్రోన్‌ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.రాష్ట్రంలో ఇష్టానుసారం ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేలా, అలాంటి కఠిన శిక్షలు విధించి, భారీ జరిమానాలతో చెక్‌ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే ఏపీ డ్రోన్‌ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని అన్ని భూములకు రక్షణ : ప్రభుత్వ, ప్రైవేటు భూములు అక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్నవారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీపత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించేందుకు ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం-1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం-2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. దాని ద్వారా రూ.5 వేల వరకు జరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూముల రక్షణకు వీలుంటుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, భూమి విలువతోపాటు, నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.’’
ఏపీలో ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూకబ్జాదారులకు భారీ జరిమానా,14ఏళ్లు జైలుశిక్ష వేయనుంది.ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇష్టానుసారం భూకబ్జాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఉండనున్నాయి.
పాత చట్టం కన్నా కొత్త చట్టం భేష్‌ : ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం -1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం -2024 అమలుకు బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీని ప్రకారం పాత చట్టంలోని ప్రభు త్వ,ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం,ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం,నకిలీ పత్రాలతో రిజిస్ట్రే షన్లు చేయడం వంటి వాటిని నిరోధించేది.ఇప్పుడు ఈ చట్టానికి కొన్ని మార్పులు తీసుకొచ్చింది.పాతచట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితం అవ్వగా, దాని ద్వారా రూ.5వేల వరకుజరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మాత్రమే విధించేవారు.కానీ కొత్త చట్టం రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లోని భూములు రక్షణకు వీలుం టుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14ఏళ్ల వరకు జైలు శిక్ష, పరిహారం,భూమి విలువతో పాటు జరిమానా విధించనున్నారు.దీనికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయ నున్నారు.నిర్ణీత కాలంలో కేసులు పరి ష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు.ఎ.పి.భూ దురా క్రమణ(నిషేధం)చట్టం-1982కంటే గట్టిచట్టం తెస్తు న్నందున,ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న ఆచట్టాన్ని రద్దు చేస్తున్నామ న్నారు. పాత చట్టానికి,కొత్త చట్టానికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ‘1982’యాక్ట్‌ అప్పటి ఉమ్మడి ఎ.పి.లోని అర్బన్‌ ప్రాంతా లకు పరిమితంకాగా,‘2024’బిల్లులో రూర ల్‌,అర్బన్‌ సహారాష్ట్రంమొత్తానికీ వర్తి స్తుం ది.అప్పుడూ ఇప్పుడూ ల్యాండ్‌ గ్రాబర్‌ అనే దానికి నిర్వచనం మక్కికి మక్కికి దించారు. ప్రభుత్వ, ఎండోమెంట్‌, వక్ఫ్‌,చారిటబుల్‌, ప్రైవేటు భూముల ఆక్రమణలను నేరా లుగా పరిగణించి శిక్షిస్తామన్నారు.పాత చట్టంలో భూముల కబ్జాకు పాల్పడిన వారిపై అభి యోగం రుజువైతే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్షఅన్నారు.జైలు శిక్షను ఐదేళ్ల వరకు వేయొచ్చు.ఐదు వేలరూపా యల జరిమానా కూడా అన్నారు.కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పదేళ్లకు తక్కువ కాకుం డా జైలు శిక్ష అన్నారు.పధ్నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విస్తరించవచ్చు అన్నారు. కబ్జాకు గురైన ఆస్తి మార్కెట్‌ విలువను జరిమానాగా వేస్తారు. ప్రత్యేక కోర్టులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. ఆ కోర్టులను ఏర్పాటు చేసే, జడ్జిలను నియమించే అధికారం, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పర్చారు. సర్కారు ఎప్పుడైనా ఆ పని చేయొచ్చు.1982 జూన్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తదుపరి ఆగస్టులో అసెంబ్లీలో బిల్లు పెట్టింది. 1982 ఆగస్టు 10న ఆ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సిపిఎం అగ్ర నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడుతూ ఎప్పుడు పడితే అప్పుడు కోర్టులను, జడ్జిలను ఏర్పాటు చేసే, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిస్తే,ఒక వేళ ప్రభుత్వంలో ఉన్న వారిపైనే భూకబ్జా అభియోగాలువస్తే, శిక్షల దాకా వెళితే సదరు కోర్టులను,జడ్జిల నియామకాలను బతకనిస్తారా, ఆగ్యారంటీ బిల్లులో లేదని నిలదీశారు.రద్దు చేసిన చట్టంలో ఏముందో, కొత్తగా తెచ్చిన చట్టంలోనూ అదే ఉంది.ఇక్కడే ప్రభుత్వ నైజం అర్థమవుతుంది.నాలుగు న్నర దశాబ్దాలలో పరిస్థితుల్లో మార్పొచ్చింది. అదానీ వంటి వారు భూకబ్జాలకు పాల్పడి శిక్షలు పడే దాకా వస్తే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్‌ కోర్టులను, జడ్జిలను రద్దు చేయిస్తారు.చట్టంలో పొందుపర్చిన ఈ లొసుగు ముందు ల్యాండ్‌ గ్రాబ్‌ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి,డిఎస్‌పి స్థాయి కి తక్కువ కాకుండా అధికారితో దర్యాప్తు చేయించాలి, ఆర్నెల్లలో విచారణ పూర్తి కావాలి అనేవి చాలా చాలా చిన్నవి.
మతలబు ఇదే : బిల్లులో పేర్కొన్న శిక్షల విషయానికొస్తే జైలు శిక్ష, జరి మానా అన్నారు.కబ్జాకు పాల్పడిన ఆస్తి మార్కెట్‌ విలు వను గ్రాబర్‌ నుంచి వసూలు చేస్తామంటు న్నారు. ఇక్కడ మార్కెట్‌ విలువంటే రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఉండే బుక్‌ వాల్యూనా లేదంటే బహిరంగ మార్కెట్‌లో క్రయవిక్రయాల రేటా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ బుక్‌వాల్యూనే అయితే గ్రాబర్‌కే లాభం. గ్రాబింగ్‌ చట్టబద్ధమై పోతుంది.అందుకే కబ్జా చేసిన ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తే కబ్జాదారులకు సరైన శిక్ష అవు తుంది. జైలు శిక్ష, జరిమానాతో పాటు ఆస్తి జప్తు కూడా చట్టంలో ఉండాలి.బిల్లులో ఆ అంశం లేదు. అందువల్లనే కొత్త చట్టం ఆర్థికంగా,రాజకీయంగా బలవంతులైన పెద్ద వాళ్లకు,కార్పొరేట్లకు చుట్టం అవుతుందని సందేహిం చాల్సి వస్తుంది. ప్రభుత్వ,ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్నవారు ల్యాండ్‌ గ్రాబర్ల కిందకు వస్తారని బిల్లు చెబుతోంది. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూముల్లో వంద యాభై గజాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటే చట్ట ప్రకారం ల్యాండ్‌ గ్రాబర్‌ అయిపోతారు. ఇళ్లు వేసుకోమని పేదలను ప్రోత్సహించిన వారు కూడా నేరస్తులవుతారు. ప్రభుత్వ,ఎండోమెంట్‌,వక్ఫ్‌ భూములను ఎకరమో, రెండె కరాలో సాగు చేసుకుంటున్న పేదలు భూ దురాక్రమణ దారులై శిక్షలకు గురవుతారు.కొంతమంది పెద్దలు ప్రభు త్వ భూములను ఆక్రమించి ప్లాట్లువేసి దర్జాగా అమ్ముకుం టున్నారు.చౌకగా వస్తుందన్న ఆశతో సామాన్యులు కొంటున్నారు.ఎవరు ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్నారో వారు గ్రాబర్‌ అయిపోతారు తప్ప అక్రమంగా భూము లను ఆక్రమించి అమ్మిన అసలు వ్యక్తి తప్పించుకుం టారు. ఒక వేళ భూ దురాక్రమణ ఆరోపణలొచ్చినా వ్యవస్థలను మేనేజ్‌ చేసే పలుకుబడి అటువంటి పెద్దలకు ఎలాగూ ఉంటుంది. అపరాధులయ్యేది పేదలు, చిన్న వాళ్లే.అందుకే పేదలకు,చిన్న చిన్న వారికి కొంత వరకు మినహాయింపులుండాలి.ప్రభుత్వ అభ్యంతరాల్లేని నివాసా లకు ప్రభుత్వం కొంత విస్తీర్ణ పరిమితి పెట్టి పట్టాలిస్తోంది. అనధికారిక బిల్డింగ్‌లను రెగ్యులరైజ్‌ చేస్తోంది. అలాగే చట్టంలో పొందుపర్చాలి.పెద్దలను పట్టుకొని కఠినంగా శిక్షించాలి.అటువంటి సదుద్దేశం బిల్లులో కనిపించదు. పాత చట్టం ఉన్నా ఆచరణలో పేదలకు,సామాన్యులకు నష్టం జరిగింది. అర్బన్‌ ప్రాంతాల్లో యథేచ్ఛగా పెద్దల ఆక్రమ ణలు సాగిపోయిన అనుభవం ఉండనే ఉంది. రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కబ్జాలు, వీరంగాలు రోజూ చూస్తున్నవే. ఆ కారణం గానే 2024-ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టంపై పేదల్లో, ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవు తున్నాయి.
అసైన్డ్‌లో జరుగుతున్నదేంటి? :1977-అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణల సమయం లోనూ ఎస్‌సి,ఎస్‌టి,పేదలు నష్టపోతారన్న భయాలు వ్యక్తమయ్యాయి. ఆచరణలో నిజం అయ్యాయి కూడా.1977-చట్ట ప్రకారం అసైన్డ్‌ భూములు అమ్మడం,కొనడం నిషి ద్ధం.2019లో టిడిపి ప్రభుత్వం దిగిపోయే ముం దు అసైన్డ్‌ ఇళ్ల స్థలాలు పొంది 20 సంవ త్సరాలు దాటితే ఒరిజనల్‌ ఎస్సయి నీలకు సర్వ హక్కులూ కల్పిస్తూ చట్టం తెచ్చింది. అమరావతి ప్రాంతంలో ఐదేళ్ల గడువుపై చట్టానికి ప్రయత్నించగా నాటి గవర్నర్‌ అంగీకరించలేదు. అదే దారిలో ఐదేళ్ల కాల పరిమితి పెట్టి సర్వ హక్కులూ అంది వైసిపి సర్కారు.కోర్టులు అంగీక రించకపోయే సరికి అసైన్డ్‌ వ్యవసాయ భూములకు 20ఏళ్లు, ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాలపరిమితి పెట్టి జగన్‌ సర్కారు సవరణ చట్టం తెచ్చింది.ఈచట్టం పైకి బాగానే ఉన్నట్లు కనిపించినా కార్యక్షేత్రంలో చూస్తే అసైన్‌ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన,ఆక్రమించిన,బెదిరించి లాక్కున్న పెద్ద లకే ఎక్కువగా ఉపయోగ పడుతోంది. ఈ పూర్వరంగంలో ప్రస్తుత ల్యాండ్‌ గ్రాబింగ్‌ (నిషేధం)చట్టంకూడా అంతే.ల్యాండ్‌ గ్రాబింగ్‌ (నిషేధం) చట్టంపై ప్రజల్లో సందే హాలు,భయాందోళ నలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏపక్షంగాచట్టం చేయబూను కోవడం ప్రజా ప్రభుత్వం అనిపించుకోదు. రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులతో విస్తృతంగా చర్చించి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తే ప్రభుత్వా నిది సదుద్దేశం అనిపించు కుంటుంది. చట్టాన్ని అమలు చేసే ముందైనా అన్ని పక్షాలతో చర్చలు జరపాలన్న డిమాండ్‌ సహేతుక మైనది.ఎలాంటి చర్చలు,సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా చేసే చట్టం ఆచరణలో నిలబడదు. అప్పటికి తాత్కాలిక రాజకీయ కక్షలకు ఉపయోగపడితే పడ వచ్చు.ప్రధానంగా పేదప్రజలకు నష్టం జరగకూడదు. పేదల పక్షాన,వారి హక్కులకోసం పోరాటాలు, ఉద్యమా లు నిర్వహించే సంస్థలపై,వ్యక్తులపై అణచివేత, నిర్బంధా లకు ప్రభుత్వానికిచట్టం ఆయుధం కాకూ డదు.అప్పుడే ‘మంచి ప్రభుత్వం’ అవుతుంది.
ఎవరి కోసం భూ ఆక్రమణల (నిషేధ) చట్టం?
భూకబ్జాలను అరికట్టడానికి,కబ్జాదారులకు కఠిన దండన విధించడానికి ఆంధ్రప్రదేశ్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2024 తీసుకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది.జులై 15న జరిగిన క్యాబినేట్‌ సమావేశం అనం తరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మీడియాకు తెలియజేశారు. గుజరాత్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2020 ఆధారంగా త్వరలోనే కొత్త చట్టం తెస్తా మని ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,దేవదాయ, వక్ఫ్‌ భూములను ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు కబ్జా చేశారు. వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని, ఆక్రమణకు గురైన భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.భూ కబ్జాదారులను శిక్షిస్తే ప్రజాతంత్ర వాదులందరూ హర్షిస్తారు. కాని ఈ చట్టం మాటున పేదల పోరాటాలను అణచివేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు హర్షించరు.
మనరాష్ట్రంలో స్వాతంత్య్రానంతరం వామ పక్షాలు,ప్రజాసంఘాల పోరాటాల ఫలితంగా భూ సీలింగ్‌ చట్టం,కౌలుదారీ హక్కుల చట్టం,1/70చట్టం,9/77 అసైన్డ్‌ చట్టాలు వచ్చాయి. పాలకవర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యమాలకు తలొగ్గి దళిత,గిరిజన, బలహీ న వర్గాలకు చెందిన సుమారు 25లక్షల పేద కుటుం బాలకు 33లక్షల ఎకరాల భూమి ప్రభుత్వాలు పంపిణీ చేసినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. వీటిలో సుమారు 15లక్షలఎకరాల భూమిని పిఓటి 9/77చట్టాన్ని ఉల్లం ఘించి ప్రజా ప్రతినిధులు,రాజకీయంగాను,ధనబలం, కండ బలం కల్గిన నాయకులు అక్రమంగా,దౌర్జన్యంగా ఆక్రమించుకున్నట్లు2006 నుండి ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి.కాని రాష్ట్రంలో పిఓటియాక్ట్‌ (భూనిషేధ చట్టం) ప్రకారం ఆక్రమించుకున్న వారిపై 6 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించాలి,ఆక్రమించుకున్న భూములను తిరిగి పేదలకు ఇవ్వాలి. ఈ చట్టం చేసిన నాటి నుండి (1977) నేటి వరకు కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలే రాష్ట్రాన్ని పాలించాయి. కాని ఇప్పటి వరకు ఒక్క భూకబ్జాదారుని మీద కూడా కేసు పెట్టి జైలుకు పంపలేదు.జరిమానా విధించి వసూలు చేయలేదు. కనీ సం ఒక్క పేదవానికైనా తిరిగి భూమిని ఇప్పించారా? అంటే ఎక్కడా అమలు జరిగిన దాఖలాలే లేవు. అసైన్డ్‌ చట్టం ప్రకారం పేదల భూమి పేదలకివ్వాలని ఆందోళన చేసిన ప్రజా సంఘాలు, సామాజిక సంస్ధలు, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, పేదలపై క్రిమినల్‌ కేసులు,రౌడీషీటర్‌ కేసులు పెట్టి జైళ్ళకు పం పారు. వారు నేటికీ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క భూ కబ్జాదారుడు కూడా జైలుకు వెళ్ళలేదు. వేలాది ఎకరాలను పెద్దలు, ఉన్నతాధికారులు ఆక్రమించుకున్నా రని,వీటిని తిరిగి తీసుకోవాలని కోనేరు రంగారావు భూ కమిటి, ప్రజాసంఘాలు చెప్పినా ఏఒక్కరి నుండి ఒక్క ఎకరం భూమికూడా స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వ లేదు. ఏ కోర్టూ శిక్షించలేదు. నేడు తెలుగుదేశం ప్రభుత్వం తెస్తామని చెబుతున్న భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2024 కూడా అలాగే మిగులుతుందా! ఉన్న చట్టాలనే అమలు చేయకపోగా కొత్తచట్టాలను తెచ్చి అమలు చేస్తా రంటే ఎలా నమ్మగలం? గుజరాత్‌ తరహాలో చట్టం తెస్తామని చెప్పారు. గుజరాత్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2020లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ చట్టం 2020 అక్టోబర్‌ 9 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 2(4) ప్రకారం ఎవరైనా భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నా లేదా డబ్బు ఆశ చూపి వేరే వారి నుండి ఆక్రమించుకున్నా,చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా,భూమిపై అనధికారికంగా,అక్ర మంగా అద్దె (డబ్బు)వసూలు చేసినా లేదా భూఆక్ర మణ లకు సహాయం చేసినా,ప్రోత్సహించినా,వారి పక్షాన నిలబడినా భూఆక్రమణదారుల కిందకి వస్తారు. అటు వంటి భూములను కౌలుకి తీసుకున్నా, ఆ భూములలో పేదలు పని చేసినా నేరస్తులుగా పరిగణించబడతారు. నేరం రుజువైతే 10నుండి 14ఏళ్ళ జైలు శిక్ష, ఆ భూమి విలువను బట్టి జరిమానా విధించబడుతుంది.సెక్షన్‌ 6 (1) ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘించి పరిశ్రమ లేదా ఏదైనా కంపెనీ నిర్మించి ఉంటే కూడా శిక్షార్హులు.ఈ ఆక్రమణ తమకు తెలియకుండా జరిగిందని లేదా ఆక్రమణ జరగకుండా ఆపామని పరిశ్రమాధి పతులు రుజువు చేసుకుంటే శిక్ష నుండి మినహాయింపు ఇస్తారు.పైసెక్షన్లను బట్టి ఈ చట్టం ప్రకారం పెట్టుబడిదారులు, పారిశ్రా మికవేత్తలకు,పెద్దలకు శిక్ష విధించే కంటే కూడా చారెడు భూమి కోసం పోరాడే ప్రజా ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడానికే గుజరాత్‌ ప్రభుత్వం ఈచట్టం తెచ్చినట్లు కన్పిస్తుంది.
సెక్షన్‌ 7-న్యాయస్థానాల పాత్ర : రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి సమ్మతితో ఒకటి లేదా ఎక్కువ ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కోర్టులకు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తిని నియ మిస్తారు. దీనికి ప్రభుత్వం తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఉంటారు.ఈకోర్టులు భూ కబ్జాలను అరికట్టడానికి కలెక్టర్‌ నాయ కత్వంలో నియమించిన కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసినా లేదా కోర్టే సుమో టాగా చేపట్టినా లేదాఎవరైనా ఫిర్యాదుచేసినా చర్య లు తీసుకుంటారు.కేసు బనాయించబడ్డ వ్యక్తి పూర్తి ఆధారాలతో,రాత పూర్వకంగా తనే స్వయంగాకోర్టు ముందు ఆధారాలు సమర్పిం చుకోవచ్చు.నేరం రుజు వైతే జైలు శిక్షతో పాటు అతను లేదా వారు ఆక్రమిం చుకున్న భూమి ఆరోజు మార్కెట్టు విలువ ఎంతఉంటే అంత మొత్తం నష్ట పరిహారం చెల్లిం చాలి.అదే ప్రభుత్వ భూములైతే ఆక్ర మించు కున్ననాటి నుండి ఆక్రమణ దారులు ఎంత చెల్లించాలో కోర్టు నిర్ణయిస్తుంది.ఈ కేసుల న్నిటినీ 6నెలలలోపు పరిష్కారం చేయాలి. ఒక వేళకోర్టు పరిష్కరిం చకపోతే రాష్ట్ర ప్రభు త్వానికి నివేదిస్తుంది. –(కె.ఎస్‌.వి.ప్రసాద్‌,/వి.వెంకటేశ్వర్లు)