భాషా పితామహుడుగా రిషి రాజ్‌పాటిల్
కేంబ్రిడ్జ్‌లోని భారతీయ విద్యార్థి 2,500ఏళ్ల నాటి సంస్కృత పజిల్‌ను పరిష్కరించాడు.27 ఏళ్ల రిషి అతుల్ రాజ్పోపట్, సుమారు రెండున్నర వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృత భాషలో మాస్టర్ అయిన సంస్కృత భాషా మాస్టర్ పాణిని రాసిన వచనాన్ని డీకోడ్ చేసినట్లు నివేదించ బడిరది. కేంబ్రిడ్జ్ లోని సెయింట్ జాన్స్ కాలేజ్ లోని ఆసియన్, మిడిల్ ఈస్టర్న్ స్టడీస్ ఫ్యాకల్టీలో పీహెచ్డీ విద్యార్థి రిషి రాజ్పోపట్. 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు..భారతీయ విద్యార్థి పరిష్కారించడం అందరూ సంతోషించాల్సిన విషయం.- రెబ్బాప్రగడ రవి
మలివేద కాలంలో..ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే తొలిభాషా పితామహుడిగా పేరొందిన సంస్కృత పండితుడు పాణిని రాసిన‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథంలోని ధాతు నియమాల(మెటా రూల్స్)ను ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకు న్నారా?పాణిని వ్యాకరణంపై తొలిసారిగా భాష్యం రాసిన కాత్యాయనుడు కొన్నినిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడంవల్ల..అదే సంప్ర దాయం కొనసాగిందా?ఈప్రశ్నలకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సంస్కృతంపై పీహెచ్డీ చేస్తున్న 27 ఏళ్ల భారత విద్యార్థి రిషిరాజ్ పోపట్ అవునని చెబుతున్నారు. క్రీ.పూ.4-5శతాబ్దాల మధ్యకాలంలో భారత వాయవ్యం(ప్రస్తుతం పాక్-అఫ్ఘానిస్థాన్‌ల మధ్య ప్రాంతం)లో పాణిని నివసించాడనడానికి ఆధారాలున్నాయి. సంస్కృతంపై ఆయన రాసిన ‘అష్టాధ్యాయి’ లోని వ్యాకరణ సూత్రాలు నేటికీ కొనసాగుతున్నాయి.‘‘అష్టాధ్యాయిని ఇంత కాలం మన పండితులు సరిగ్గాఅర్థం చేసుకోలేదు. ఆయన రాసిన ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ పుస్తకంలో 4,000 నిబంధనలున్నాయి. పదాలను అర్థం చేసుకోవడం,కొత్తపదాల సృష్టి, విశేష ణాలు,విభక్తుల ప్రాధాన్యం.. ఇలా పలు అంశాలను ఈ నిబంధనలు స్పృశిస్తున్నాయి.గడిచిన 2,500 ఏళ్లుగా మన వాళ్లు ఈ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుని,వివరణలు ఇచ్చారు’’అని రిషి రాజ్పోపట్ వ్యాఖ్యానించారు. ‘పాణిని బోధించిన మెటారూల్ ప్రకారం..సమాన ప్రాముఖ్యం కలిగిన రెండు సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే..వ్యాకరణ క్రమంలో వచ్చే తర్వాతి సూత్రం వర్తిస్తుందని ఇప్పటి వరకూ పండితులు భావించారు. ఈనిబంధన వ్యాకరణకోణం నుంచి తప్పుడు ఫలితాలను ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. పదానికి ఇరువైపులా వర్తించే నియమాల గురించి చెప్పడమే పాణిని ఉద్దేశం.పాఠకుడు కుడివైపు నియమాన్ని ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం.అష్టాధ్యాయిలోని 1.4.2 నిబం ధన(విప్రతిశేధే పరం కార్యం)ను అర్థం చేసుకుంటే ఈ విషయం తెలుస్తుంది’’ అనిరాజ్‌పోపట్ వాదించారు.ప్రాథమిక శబ్దాల నుంచి నూతన పదాలు, వాక్యాలను రూపొం దించడానికి అవసరమైన నిబంధనలను పాణిని తన ‘అష్టాధ్యాయి’లో చక్కగా వివరించారని పేర్కొన్నారు. పాణిని అల్గారిథమ్‌ను సరిగ్గా అర్థం చేసుకుని,కంప్యూటర్‌ప్రోగ్రామ్‌ను రూపొందిస్తే..సంస్కృతం నుంచి ఇతరభాషల తర్జుమా కూడా సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరో రెండున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజ్పోపట్ పరిశోధనకు గైడ్(మార్గనిర్దేశకుడు)గా ఉన్న విన్సెంజో వెర్జియాని కూడా ఈకృషిపట్ల అభినందనలు తెలిపారు.శతాబ్దాలుగా ఎందరో పండితులు పరిష్కరించలేని సమస్యకు రాజ్పోపట్ మార్గ దర్శకుడయ్యారని, ఈపరిశోధనతో మరింత మంది సంస్కృత భాషపై ఆసక్తిచూపుతారని అభిప్రాయపడ్డారు.