భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వరద తీవ్ర నష్టం కలిగించింది.బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన కుండ పోతకు వాగులు, నదులు పోటెత్తి ఊళ్లు, పట్టణాలను ముంచేశాయి. జలాశయాలు, చెరువుల కట్టలు తెగాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది. బస్సులు నీటిలో కొట్టుకుపో యాయి. స్వర్ణముఖి ఒడ్డున ఓ ఇల్లు నిలువునా కుంగి నదిలో కలిసిపోయింది. తిరుమల కొండలలో కుంభవృష్టి కురవడంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు ఆటంకమేర్ప డిరది. వర్షాలు వరదలకు రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. మొత్తం18 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికా రులు తెలిపారు. 50 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. రేణిగుంట-గుంతకల్ రైలు మార్గంలో కిలోమీటరు మేర రెండు ట్రాక్లు కొట్టుకు పోయాయి. అనంతపురం జిల్లా కదిరిలో మూడంతుస్తుల భవనం వర్షాలకు నాని కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు, ఒక వృద్ధురాలు మరణించారు.
ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో రాయలసీమలోని కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలోనూ విలయం సృష్టించింది. భారీ వర్షాలకు పెన్నా, దాని ఉపనదులన్నీ పొంగిపొర్లాయి. ఆనకట్టలు తెగిపోయాయి. గ్రామాల మీదకు ఒక్కసారిగా జలప్రళయం మాదిరి ఎగిసిపడడంతో నేటికీ పలు గ్రామాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. 18వ తేదీ సాయంత్రం నుంచే..ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 16.2021,22వ తేదీవరకు వర్షాలు కురుశాయి. వర్షాన్ని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో వాయుగుండం తీరం దాటు తుందని హెచ్చరించింది. ఆ క్రమంలోనే 17వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుమలలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీటీడీ అధికారికంగా వెల్లడిరచింది.వర్షాల ప్రభావంతో 18వ తేదీకి తిరుమల అల్లకల్లోలంగా మారింది. తిరుపతి వరద నీటిలో చిక్కుకుంది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కూడా వర్ష తాకిడి తీవ్రంగా కనిపించింది. చెరువులన్నీ నిండుకుండలయ్యాయి. వాగులు పొంగిపొర్లాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. తిరుమల ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా దిగువన పింఛా నదీకి వరదనీరు భారీ స్థాయిలో చేరింది. 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చే పింఛాడ్యామ్కి ఒక్కసారిగా 4లక్షల క్యూసెక్కుల వరకూ వరద జలాలు రావడంతో కట్ట తెగిపోయింది.18వ తేదీ చీకటి పడిన తర్వాత పింఛా డ్యామ్ కట్ట కొట్టుకుపోయింది. ఈ నీరు, బాహుదా నుంచి వచ్చిన నీటితో కలిసి చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఫలితంగా అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో చిక్కుకుంది.
అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయింది..
1976లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేసి..ఎన్టీఆర్ హయంలో పూర్తిచేసిన అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు, రాజంపేట పట్టణం సహా సమీప గ్రామాలకు తాగునీరు అందు తోంది. ఈడ్యామ్ నిర్వహణ లోపాలపై పలు ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు పింఛా డ్యామ్ నుంచి వచ్చిపడిన వరద ప్రవాహంతో ఒక్క సారిగా 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లోని అన్నమయ్య ప్రాజెక్ట్ తట్టుకునే స్థితిలో లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి,కడప జిల్లా ప్రత్యేక అధికారిగా వరద సహాయక చర్యల కోసం వెళ్లిన శశి భూషణ్ కుమార్ తెలిపారు. ‘‘సహజంగా 2లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. కానీ దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో వరద వచ్చింది. అప్పటికే గేట్లు ఎత్తి నీటిని తరలించే ప్రయత్నం చేశాం. కానీ కట్ట పై నుంచి ప్రవాహం సాగింది. చివరకు 19వ తేదీ ఉదయం 5.30 గంటలు దాటిన తర్వాత కట్ట తెగిపోయింది. దిగువన గ్రామాల్లోకి వరద ప్రవాహం ఒక్కసారిగా వెళ్లింది. ముందుగానే హెచ్చరికలు చేయడం వల్ల ప్రాణనష్టం తగ్గింది. కానీ నందలూరు, రాజంపేట మండ లాల్లో 9 గ్రామాలు జలమయమయ్యాయి’’ అని ఆయన వివరించారు.చాలా మంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. కొండలపైకి ఎక్కి తలదాచుకున్నారు. అందులో కొందరు వరద ప్రవా హంలో కొట్టుకుపోగా, మిగిలిన వారు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కళ్లెదురుగానే కొట్టుకుపోయారు
‘మా ఆయనకు చెవుడు. ఎంత చెప్పినా వినబడలేదు. వరద వచ్చేస్తుందని మాకు ఎవరో ఫోన్ చేశారు. ఆలోగానే నీరు వాకిట్లోకి వచ్చేసింది. కొండపైకి వెళ్లాలంటే మాకు ఓపిక లేదు. అరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా గానీ ఇలాంటి భయంకర దృశ్యాలు చూడలేదు. మిద్దె పైకి ఎక్కి తలదాచుకున్నాం. చుట్టూ వరద నీరు. అలలు అలలుగా ఎగిసిపడేది. ఏం జరుగుతుందో తెలియదు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. మూడు,నాలుగు గంటల తర్వాత శాంతించింది. మా కళ్లెదురుగానే కొందరు నీటిలో కొట్టుకుపోయారు. మా బంధువులిద్దరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’’ అంటూ పులపుత్తూరు గ్రామానికి చెందిన ఎం నాగమణి బీబీసీకి తెలిపారు.సమీపంలోని గుం డ్లూరు శివాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ శివాలయ పుజారి కుటుంబం ఆచూకీ కూడా ఇప్పటి వరకూ దొరకలేదు. ఇంకా అనేక మంది గల్లంతయినట్టు చెబుతున్నారు. చెయ్యేరు వరదల మూలంగా మరణించిన వారిలో 12 మంది మృతదేహాలు లభ్యమయినట్టు అధికా రులు ప్రకటించారు. మరో 15 మంది వరకూ ఆచూకీ దొరకాలని చెబుతున్నారు.
గల్లంతయిన వారి సంఖ్య ఎక్కువే
అన్నమయ్య ప్రాజెక్టు దిగువన వరదల్లో గల్లంతయిన వారి సంఖ్యపై అనేక రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో సాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వారి సంఖ్య 15గా నిర్ధరిం చింది. తమ వాళ్లు కనిపించడం లేదంటూ ఎక్కడికక్కడ స్థానికులు చెబుతున్న సంఖ్యతో పోల్చితే ఇది సగం కంటే తక్కువే.‘‘ప్రభుత్వం చెప్పిన సంఖ్యకు, మా ఊరిలో కనిపించకుండా పోయిన వారి సంఖ్యకు సంబంధం లేదు. మా సొంత మేనత్త, ఆమె భర్త కనిపించడం లేదు. ఇంట్లో సామాను కోసం అని కొంత ఆలస్యం చేశారు. మేం కేకలు వేస్తున్నా వారు తొందరగా బయటపడలేదు. దాంతో ఇప్పుడు వారి ఆచూకీ లేదు. మా గ్రామంలోనే ఎస్సీ కాలనీలో ముగ్గురు కనిపించడం లేదు. రాజుల పేటకు చెందిన నలుగురు కనిపించడం లేదు. ఒక్క మా ఊరిలోనే 10 మంది. మందపల్లిలో ఆరు, గుండ్లూరులో 10 ఇలా ఇప్పటికే మా ప్రాం తంలో 26 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వం మాత్రం తక్కువగా చెబుతోంది’’ అని పులపు త్తూరుకి చెందిన ఎం.నాగిరెడ్డి తెలిపారు.
నెల్లూరులో కకావికలం
ఎగువన కురిసన వర్షాలతో పెన్నా నది పోటెత్తింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించింది. నెల్లూరు నగరం, కోవూరు నియోజకవర్గం సహా పలు ప్రాంతాలను జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణమైంది. 20వ తేదీ తెల్లవారుజాము నుంచి నెల్లూరులో వరద తాకిడి తీవ్రంగా కనిపించింది. అంతకు ముందే గూడురు వద్ద జాతీయ రహ దారిపై నీరు చేరింది. కావలి, సూళ్లూరుపేట పరిసరా ల్లో లక్షల ఎకరాల పంట నీటమునిగింది. పొలాలు చెరువులను తలపించాయి.చివరకు 20వ తేదీ రాత్రి నెల్లూరు వద్ద ఎన్హెచ్-16కి కూడా గండిపడిరది. కోవూరు సమీపంలో కూడా కృష్ణపట్నం,బళ్లారిరోడ్డు పైకి వరద ప్రవాహం చేరడం, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోవడంతో తీవ్రంగా వరద తాకిడి కొనసాగుతోంది.ఎగువన సోమశిల శాంతించి నప్పటికీ మైలవరం డ్యామ్తో పాటుగా, పెన్నార్ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. దాని కారణంగా పెన్నా నదికి వరద 21 వ తేదీ రాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.18 మంది మృతి, 3,500 పశువులు మృతిభారీ వర్షాలు, వరదల మూలంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 18 మంది మరణించినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నట్టు ప్రకటించారు. వేల పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. సుమారు 3,500 పశువులు మృతి చెందినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 28 కుంటలు, చెరువులు, కాలువలు తెగిపోయాయని విపత్తుల నిర్వహణశాఖ వెల్లడిరచింది.
తిరుపతిపై జలఖడ్గం..
తిరుమల తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో తిరుమల గిరులన్నీ జలపాతాల్లా మారాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే. వరద వెళ్లే కాలువలు చిన్నగా ఉండడం.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. కాలనీలన్నీ నదుల్లా మారిపోయాయి. వాహనాలు, జంతువులు కళ్ల ముందే కొట్టుకుపోయాయి. ఇళ్లలోని సామానులు కాగితపు పడవల్లా నీటితో తేలియాడుతూ వెళ్లిపోయాయి. తిరుమల, తిరుపతిలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యాలను చూడలేదని స్థానికులు తెలిపారు. కనివినీ ఎరుగని రీతితో వరద ముంచెత్తిందని వాపోతున్నారు. ఇంతటి ప్రకృతి విపత్తును ఊహించలేదని చెబుతున్నారు.టీటీడీకి 4కోట్లకు పైగా నష్టం..30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’ నవంబరు 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్లు పొంగి పొర్లి..కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని ఆయన తెలిపారు.