భారత్ గణతంత్ర దినోత్సవం`2025 ప్రత్యేకతలు

‘‘ భారత సైనిక శక్తిని,ఆయుధ పాటవాన్ని,సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.అత్యాధునిక క్షిఫణులు,యుద్ద విమానాల ప్రదర్శన,జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. సశక్త్ ఔర్ సురక్షిత్ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢల్లీిలోని కర్తవ్య పథ్‌లో జనవరి 26న జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ,కేంత్రమంత్రులు,త్రివిధ దళాధిపతులు,ప్రముఖలు పాల్గొన్నారు.రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.’’
త్రివర్ణ స్పూర్తి`సమున్నత కీర్తి
భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా,అపారమైన సైనిక పాటవానికి అద్దం పట్టేలా,పురోభివృద్ధి ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్లు వివరించేలా శకటాలు,కవాతులకు కర్తవ్యపథ్ వేదికగా నిలిచింది.76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఢల్లీిలోని కర్తవ్యపథ్ నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.వారిద్దరూ కలిసి గుర్రపుబగ్గీలో ప్రధాన వేదికవద్దకు వచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని తీసుకురావడం ఈసారి ఒక ప్రత్యేకత.అభివృద్ధి ప్రధాన ఇతివృత్తంగా ‘స్వర్ణిమ్‌భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో ప్రత్యేక శకటాలకు రూపకల్పన చేశారు.బ్రహ్మోస్,ఆకాశ్ క్షిపణులు,పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ ప్రత్యే-ఆకర్షణగా నిలిచాయి.కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన 31శకటాలను ప్రదర్శించారు.
మార్మోగిన ‘నారీశక్తి’
కవాతులో నారీశక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం, డోలు వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్ పరేడు ప్రారంభించారు. సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో నారీశక్తిని చాటేలా అధికారిణులు- లెఫ్టినెంట్ కర్నల్ రవీందత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మ అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు. డీఆర్డీవో బృందానికి మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. సహాయ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని 148 మంది సభ్యుల సీఆర్పీఎఫ్ మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని ఆర్పీఎఫ్ బృందం పరేడ్లో పాల్గొన్నాయి. 15 మంది మహిళా పైల బృందం గగనతల విన్యాసాలతో తమ ప్రతిభను చూపింది.
ప్రపంచ రికార్డులు..
కదులుతున్న మోటారుసైకిల్ మీద 12 అడుగుల ఎత్తైన నిచ్చెనపై నిలబడి రాష్ట్రపతికి శాల్యూట్ చేయడం ద్వారా మహిళాధికారిణి కెప్టెన్ డిరపుల్సింగ్ భాటి ప్రపంచరికార్డు సృష్టించారు. డేర్రెవిల్స్ ప్రదర్శించిన మరో విన్యాసం కూడా ప్రపంచరికార్డు సృష్టించనుంది. 33మంది కలిసి మానవ పిరమిడ్ ఆకారంలో చేసిన ఇంకో విన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. సుఖోయ్ విమానాల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. కొయ్యబొమ్మల నుంచి మహా కుంభమేళా వరకు వివిధ అంశాలకు ప్రతీకగా శకటాలు నిలిచాయి. 5వేల మంది జానపద కళాకారులు, గిరిజనులు కలిసి 45 రకాల నృత్యరీతుల్ని ప్రదర్శించారు. ఇండోనేసియా సైనిక దళానికి చెందిన 152 మంది బృందం కవాతులో పాల్గొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి పది సూత్రాల ప్రణాళికతో
రాష్ట్రప్రగతికి పది సూత్రాల ప్రణాళికతోముందుకు వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిం చిన 76వ గణతంత్ర దిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక, పరిపాలనా గందరగోళంతో దెబ్బతిం దన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వనరుల మళ్లింపుతో పాటు దుష్పరి పాలన సాగించడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై పడిరదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయని, నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాలనా వ్యవస్థ దెబ్బ తిన్నదన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, ప్రతి సవాలును అవకాశంగా మార్చడం మన బాధ్యతని, ఇందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 రోడ్‌మ్యాప్ రూపొందిం చినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొదట ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ను పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక అడ్డంకులను అధిగ మించడం, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రూ.16లక్షల కోట్ల నుంచి 2047నాటికి రూ.305 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
పది సూత్రాలు
`-పేదరికం నిర్మూలనకు పీ 4 విధానం.
-అందరికీ స్వచ్ఛమైన తాగునీరు.
-మహిళ, యువత సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి.
-యువతను రేపటి అవకాశాలకు సిద్ధం చేస్తూ వేగంగా నైపుణ్య గణన
-నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పులు
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మామిడి,అరటి,మిర్చి,కాఫీ,సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు లాంటి పంట ఉత్పత్తులు ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రపంచ మార్కెటోతో నుసంధానం.
-మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానా శ్రయాలు,మల్టీమోడల్ రవాణా కేంద్రాల అభివృద్ధి.
-క్లీన్ ఎనర్జీ పాలసీ 2024తో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు. 5వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు. పీఎం సూర్య ఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహం.
-గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతిలో పండిరచే పంటలకు విలువ జోడిరపు సౌకర్యాల కల్పన.
అసెంబ్లీ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు : అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం,ఓటుహక్కు కల్పించిందని అయ్యన్న పాత్రుడు స్పష్టంచేశారు. సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈసందర్భంగా పిలుపు నిచ్చారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శాసనమండలి ఛైర్మన్: శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్‌రాజు త్రివర్ణ పతా కాన్ని ఎగురవేశారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని మోషేన్ రాజు తెలిపారు. పాఠ్యాం శాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజ యానంద్ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎస్ కె.విజయానంద్ మిఠాయిలు పంచారు..
హైకోర్టులో..: హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా 76వగణతంత్ర వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్‌ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమైక్యస్ఫూర్తిని పెంపొందించుకు ని ప్రతి ఒక్కరూ ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలని అంద రికీ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ శకటం..
ఢల్లీిలోని కర్తవ్య పథ్ 76వ రిపబ్లిక్ డే పరేడ్ సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్ శకటం ప్రదర్శించ బడిరది. ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈకళాఖండాలు ఎన్నోఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లాగా ఉన్నాయి. ఎలాంటి రసాయ నాలు ఉపయోగించకుండా అడవి లో దొరికే కట్టెలతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.ఈ శకటం ఆంధ్ర ప్రదేశ్ కీర్తి కిరీటంలో ఓకలికితురాయి వంటివి. మా మూలు కర్రతో తయారు చేసే ఈబొమ్మలు.. దేశ విదేశాల్లోనూ ఏపీ సృజనా త్మకతను సగర్వం గా చాటి చెబుతు న్నాయి.ఘన చరిత్ర కలిగిన ఈబొమ్మలు గణ తంత్ర దినోత్స వంనాడు శకటం రూపంలో దర్శన మిచ్చి ఆకట్టుకున్నాయి.
విశాఖ జిల్లాలోగణతంత్ర దినోత్సవ వేడుకలు
విశాఖపట్టణం పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాంతత్య్రసమర యోధులు, పద్మ అవార్డుల విజేతలు,రాజకీయ ప్రముఖులు, న్యాయ, పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వా మ్యం కాగా..జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగాడీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సంద ర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఎన్.వి. రమణ సారథ్యంలో మార్చ్ ఫాస్ట్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది,ఎన్.సి.సి. క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుంచి కలెక్టర్, వేదికపై ఆశీనులైన ఇతర అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం, జాతి సమైక్యతను చాటి చెబుతూ జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. -(జి.ఎ.సునీల్ కుమార్)