బ్రతిక ఉన్నా లేనట్లే..
‘‘ ప్రపంచం ముందుకు వెళ్తోందని, సాంకేతి కతని అందిపుచ్చుకుంటున్నా మని మనమం దరం అనుకుంటాం.కానీ ఇప్పటికీ ఆధార్ అంటే ఏంటో తెలియని గిరిజనులు, ఆధార్ కార్డ్ ప్రయోజనం పొందలేనివారు, తద్వారా పభుత్వ సంక్షేమ పథకాలకు ఆమడ దూరంలో ఉన్నవారు ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారు.అనకాపల్లి, అల్లూరి సీతారామారాజు జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్‌కార్డు,ఆరోగ్యశ్రీకార్డు లేని గిరిజన కుటుంబాలు అనేకం ఉన్నాయి. చాలా బడిఈడు పిల్లలు ఆధార్‌కార్డులు లేక చదువులకు దూరమవుతున్నారు.’’ – (గునపర్తి సైమన్)
అందరికీ ఆధార్ ఓవరం.ఆధార్ కార్డ్‌తో అన్ని పథకాలు అందిపుచ్చుకోవచ్చు. కానీగిరిజనులకు మాత్రం అది ఇంకా ఓశాపంగా మారింది.ఉమ్మడి విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నివశించే గిరిజనులు కూడా ఆధార్ సౌకర్యానికి దూరంగా ఉంటు న్నారు. చిన్నపిల్లల్ని స్కూల్‌లో వేయాలంటే ఆధార్ తప్పనిసరి,రేషన్ కార్డ్ కావాలంటే ఆధార్ ఉండాలి,అనుకోని ప్రమాదం జరిగితే ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి కూడా ఆధారే కీలకం.కానీ ఆధార్ గురించి, పథకాల గురించి సరైన అవగాహన లేక గిరిజనులు వీటన్నిటికీ దూరమైపోయారు. వీరితోపాటు సంచార జాతుల్లో సగటున 50శాతం మంది గిరిజనులకు ఆధార్ కార్డ్ అంటే ఏంటే తెలియదంటే అతిశయోక్తి కాదు.ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఎన్ని ఏర్పాటు చేసినా,ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆధార్ కార్డు పొందలేని స్థితిలో చాలామంది గిరిజనులు ఉన్నారు.దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ బల్లిపురం అనే ఓగిరిజన గ్రామం.అక్కడ కొండదొర,నూకదొర,భగత్, మన్నెదొర తెగలకు చెందిన సుమారు 39మంది కుటుంబాలున్నాయి.మొత్తం జనాభా120మంది.ఈ గ్రామంలో అధికశాతం వలస వచ్చిన గిరిజన జనాభా అధికం.దీంతో సుమారు 25మందికి పైగా ఆధార్ కార్డులు, రేషన్‌కార్డులు,ఓటర్ ఐడీ కార్డులు లేవు.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వీరంతా ఓటు హక్కు లేక ఓటును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిరది.అల్లూరి జిల్లా బొర్రా,కొయ్యూరు,అనంతగిరి మండ లాల్లోని మారుమూల పంచాయితీల నుంచి దశాబ్దాల క్రితం మైదాన గిరిజన గ్రామా లకు వలస వచ్చి కూలీ పనులకు వెళ్లే గిరిజన కుటుంబాలకు ఆధార్‌కార్డులుగానీ, రేషన్‌కార్డులుగానీ లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఆఖరికి వారికి పుట్టిన బడిఈడు పిల్లలు చదువుకు సైతం దూరమవుతున్నారు.అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ పరిధిలోగల బల్లిపురం తదితర గిరిజన గ్రామాలు మైదాన ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయి.అల్లూరి జిల్లా నుంచి వలస వచ్చిన అనేక మంది గిరిజనులకు నేటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచు కోలేదు.కనీసం అవ్వతాతలకు, వితంతువు లకు,దివ్యాంగులకు సామాజిక పింఛన్ అందని వైనం నెలకొంది.అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట గ్రామానికి చెందిన కర్రిచిలకమ్మకు సామాజిక ఫించన్ అందక వృద్దాప్యంతో కొట్టిమిట్టులాడుతున్నారు. కొయ్యూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రా రామచంద్రర్‌కు ఆధారకార్డు లేదు.జీకేవీధి మండలం దమ్మయన్న పల్లి గ్రామపంచాయితీ సింగనపల్లి గ్రామానికి చెందిన వీర్రాజి (11)ఆధార్‌కార్డు లేక చదువుకు దూరంగా ఉన్నారు. పంటపొలాలు,బొగ్గు,ఇటుకల బట్టీల వద్ద ఏడాదిలో తొమ్మిది నెలలు జీవనం సాగించే ఎస్టీలకు ఎలాంటి ధ్రృపత్రాలు లేకపోవడంతో ఆధార్ నమోదుకు అర్హత కోల్పోతున్నారు. ఆర్డీవో కార్యాలయం జారీ చేసిన జనన ధ్రువపత్రం కావాలని ఆధార్ కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో నిరుత్సాహంతో వెనుదిరుగు తున్నారు.ఇళ్లు,పొలాల్లో పురుడు పోసుకున్న చిన్నారుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయని కారణంగా పంచాయితీ కార్యాల యాల్లో జనన ధ్రువీకరణ పత్రాలు అందడం లేదు.దీంతో వారికి ఆధార్‌కార్డులు జారీ చేయడం లేదు.ఆధార్ కార్డు లేని కారణంగా వీరికి రేషను,ఓటరుకార్డులు లేవు.పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టిన ఏ సంక్షేమ పథకాలు వీరిదరి చేరడం లేదు. వృద్దులు,వితంతువులు,దివ్యాంగులు ఉన్నా పింఛను ఇతర సౌకర్యాలు అందడం లేదు. బడిలో పేరు నమోదు చేయాలన్నా ఆధార్ తప్పని సరి కావడంతో పిల్లలు చేరలేని పరిస్థితి నెలకొంది.ఎస్టీ కార్పొరేషన్ అంచనాల ప్రకారం జిల్లాలో అయిదువేల మందికిపైగా ఆధార్ కార్డు లేని గిరిజనులు ఉన్నాట్లు అంచనా.గతంలో ఐటీడీఏ ద్వారా గిరిజనులకు నమోదు కార్యక్రమం జరిగేది.ప్రస్తుతం ఆవిధానం నిలిపివేయడంతో ఇటీవల జన్మించిన పిల్లలు,ఇంకా ఆధార్ తీసుకోని వారు అవస్థలు పడుతున్నారు.అంగన్‌వాడీలో పోషణ,ఉచిత బియ్యం,ప్రబుత్వ ప్రయోజనాలు కోల్పోతున్నారు.అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో సుమారు 105మంది ఆధార్ లేనివారినిఅధికారులు గుర్తించారు. వీరిలో బల్లిపురంలో సుమారు 70మంది పాఠశాల విద్యార్థులు ఉండగా,50మందికిపైగా చిన్నారులు ఉన్నారు.వలస పనులకు వెళ్లేన గిరిజనులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే..కనీసం ప్రభుత్వ బీమా సొమ్ము కూడా వారికి రాదు.ఎందుకంటే వారికి ఆధార్ లేదు.దీంతో ఆరోగ్యశ్రీకార్డు,రేషన్ కార్డులు కూడా లేని పరిస్ధితి నెలకొంది. చాలామంది గిరిజనులు అసంఘటిత రంగంలో కార్మికు లుగా పనిచేస్తున్నారు.వీరంతా ఏదైనా ప్రమాదానికి గురైనా ఇచ్చే బీమాకు వారు అనర్హులు మారుతున్నారు.ఎలాంటి పత్రాలు లేకపోయినా,వారివద్ద వివరాలు సరిగా ఉంటే.. అక్కడికక్కడే ఆధార్ నమోదు చేసుకుంటారు.
పింఛన్ లేదు..
మాది బల్లిపురం గిరిజన గ్రామం. పదిహేనేళ్లక్రితం బొర్రా పంచాయితీ నుంచి బల్లిపురం వలస వచ్చేశాం. ఇప్పుడు నాకు 65సంత్స రాలు.ఆధార్‌కార్డు గానీ,రేషన్‌కార్డు కానీ లేదు. భర్త చనిపోయి పదేళ్లువుతుంది. అప్పటి నుంచి ఆధార్‌కార్డు లేక పింఛన్ ఇవ్వలేదు.ఆరోగ్యశ్రీ కార్డు లేక ముగ్గురు కొడుకులను అనారోగ్యం తో బాధపడుతూ మృత్యువాత పడ్డారు.వారికి పుట్టిన ఒక మగబడ్డ (15వయస్సు)ఆధార్‌కార్డు లేక చదవించలేకపోయాను.
తమ గ్రామంలో ఆధార్‌కార్డులు,రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు చాలామందికి లేవని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సుమారు ఊరులో సగానికిపైగా కుటుం బాలకు ఆధార్‌కార్డులు లేవు.దీనివల్ల చాలా మంది బడిఈడు పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా అధికారులకు తమ గోడును చెప్పుకున్నా పట్టించుకునే నాధుడు కరవయ్యారు.`ఆగారి బంగారుబాబు,బల్లిపురం గ్రామ పంచాయితీ సభ్యుడు