బాలల దినోత్సవం సందడే సందడి
‘‘ భయం మనలో ఎప్పటికీ ఉండ కూడని విషయం. మనం ధైర్యంగా ముంద డుగు వేసినప్పుడు మనకు మద్దతుగా బోలెడు మంది ఉంటారు.ఉర్దూ,హిందీ,ఇంగ్లిష్.. భాష ఏదైనా సరే.. అక్షరమాల నుంచే క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏ విషయమైనా అంతే. మూలం నుంచే క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దానిపై మనకు పట్టు వచ్చేస్తుంది. (నెహ్రూ ఇందిరతో చెప్పిన మాట ఇది. మన పాఠ శాల ల్లో పిల్లలను గమనిస్తే.. పై తరగతులు చదువు కునే వాళ్లు కూడా సరిగ్గా అక్షరాలు గుర్తు పట్ట లేరు. ఇలాంటి వారికి నెహ్రూ చెప్పిన విషయం అనుసరణీయం’’
స్వేచ్ఛ,స్వాతంత్య్రం,ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప అనుభవాల్ని సంపాదించాం.కానీ,ఆ స్వేచ్ఛ, స్వాతంత్య్రం,ప్రజాస్వామ్యం,మానవ హక్కుల విస్తా రంలోకి పిల్లల్ని చేర్చం. నేటి ఈప్రజా స్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసే చోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పెద్ద వాళ్ళు పిల్లల్ని కొట్టటం,తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజ నాలకు వినియోగించుకోవడం, సరిjైున ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన నేరం. జాతీయ,అంతర్జాతీయ స్ధాయిలో మానవ హక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ,చైతన్యంగానీ,ప్రయత్నం గానీ అంతగా జరుగలేదన్నారు గనుక తల్లిదం డ్రులకు పిల్లల మీద సర్వహక్కులూ ఉంటాయ నుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయట పడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే,బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా – దారిద్య్రం,నిరుద్యోగం, వివక్షత వంటి పరిస్ధి తుల్ని మూలకారణాలుగా పరిగణిస్తూ-పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధిస్తున్నారు.అందుకే పిల్లల హక్కులు,పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం,ఒక ఉద్యమం అవసర మయ్యాయి. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు,ఒడంబడికలు, అనేక ప్రయత్నాలు, కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ ఒడంబడిక విశిష్టమైనది,విలక్షణమైనది, సమగ్రమైనది. ఇది పిల్లల పౌర రాజకీయ,ఆర్ధిక,సాంఘిక, సాంస్కృ తిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం, అన్ని దేశాల్లోను,అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది. పరిమితవనరులున్న ప్రభుత్వాలు కూడా పిల్లల హక్కులు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన బేషరతు ఒప్పందమిది. రెండు దేశాలు తప్ప ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ ఈఒడంబడికను ఆమోదించాయి. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11న ఈ ఒడం బడికను ఆమోదించి సంతకం చేసింది
బాలల దినోత్సవం మనదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. బాలల దినోత్సవం జరుపుకోవడమే ప్రధాన లక్ష్యం బాలల పై భారతీయ పౌరులందరికీ అవగా హన కల్పించడం. తద్వారా ప్రజలంతా తమ పిల్లలకు సరైన మార్గదర్శకాన్ని అందిస్తారు. ఇది పిల్లల భవిష్యత్తుకు మంచి చేస్తుంది మరియు చక్కటి వ్యవస్థీకృత మరియు సంవృద్ధికరమైన దేశాన్ని సృష్టిస్తుంది. బాలల దినోత్సవాన్ని జరుపుకోవడమే ప్రధాన లక్ష్యం భారతదేశంలో ప్రతి పిల్లవాడు విద్యను పొందాలి. పిల్లలం దరూ చదవడం,రాయడం ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం కొరకు బాలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. బాలల దినోత్సవం బాలలకు అంకితం దేశం యొక్క జాతీయ ఉత్సవం. ఇది పిల్లలకు ఒక ముఖ్యమైన రోజు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్స వం సందర్భంగా ఆయన పిల్లలపై తనకున్న ప్రేమను తెలియజేస్తోంది. ప్రతి సంవత్సరం అత్యంత ఉత్సాహంతో ఈ పండుగను జరుపు కుంటారు. బాలల దినోత్స వాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివిధ రోజుల్లో జరుపుకుంటారు. ఇది మామూలు రోజు కాదు. మన దేశ హక్కుల గురించి అవగాహన పెంపొందించ డానికి ఇది ఒక ప్రత్యేక దినం.చాలా సంస్థల్లో పిల్లలకు రుచికరమైన ఆహారం తో మిఠాయిలు పంచుతున్నారు. పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి మరియు పిల్లల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి బాలల దినోత్స వాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యం. దేశంలో బాలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమి టంటే, ఈ రోజు, నవంబర్ 14,1889న దేశ తొలి పిఎం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మించారు. జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం. మన దేశంలోని పిల్లలంతా ఉత్సా హంగా ఉండే నెల ఏదైనా ఉందంటే అది నవంబర్ నెల అని అందరూ చెబుతారు. నవంబర్ 14వ తేదీ దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
నేటి బాలలే రేపటి పౌరులు..
మన దేశంలో నేటి బాలలే రేపటి పౌరులు అని భారత తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ గాఢంగా నమ్మారు. పిల్లలు భావి భారత భవిష్యత్తు పౌరులు అని విశ్వసించారు. వారందరి అభివృద్ధి మన బాధ్యత అని తెలిపారు. చాచాగా మారిన నెహ్రూ..పండిట్ జవహార్ లాల్ నెహ్రూ పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తూ, వారితో ఎక్కువ సమయం గడపాలని అనుకున్నాడు. అప్పటి పిల్లలు నెహ్రూను చాచా అని పిలిచేవారు. నెహ్రూకు ఇష్టమైన బిడ్డ అయిన చాచా ఆగియే అనే దాని గురించి అప్పట్లో అందరికీ తెలుసు. అందుకే పండిట్ నెహ్రూ పిల్లలకు ఎప్పుడూ చాచానే. పిల్లలతోనే భవిష్యత్తు.. మన దేశ భవిష్యత్తు మన పిల్లల చేతుల్లోనే ఉందని అప్పటి మన ప్రధానమంత్రి నెహ్రూ సగర్వంగా ప్రకటన చేశారు. ‘‘నేటి బాలలే భారతదేశ ఆకృతిని అందంగా తయారు చేస్తారు. ఈరోజు మనం తీసుకువచ్చే విధంగా భారతదేశం భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది‘‘ అని నెహ్రూ తరచూ వివరించేవారు. కళాశాలల స్థాపనలో నెహ్రూ కీలక పాత్ర..పిల్లలకు విద్య విషయంలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. పిల్లల కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో కళాశాలల స్థాపనతో పాటు పలు విద్యా సంస్థల ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు. ఆయన అంత పట్టుదల పని చేశారు కాబట్టే నెహ్రూ విశ్వవిద్యాలయం ఇప్పటికీ దేశంలోని ఉత్తమ విద్యాసంస్థగా పరిగణించబడుతుంది. పిల్లలకు అంకితం.. ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన నెహ్రూ 1964లో మరణించిన తర్వాత, అతడు జన్మించిన రోజును అతను ప్రేమించిన వ్యక్తుల కోసం కేటాయించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ఆయన పుట్టినరోజున అంటే నవంబర్ 14వ తేదీన పిల్లలకు అంకితం చేయబడిరది. పిల్లలకు ఆటల పోటీలు.. బాలల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాల మరియు కళాశాలలో అనేక ఆటల పోటీలు నిర్వహిస్తారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి కూడా నిర్వహిస్తారు. అలాగే ఆటలలో విజేతలుగా నిలిచిన చిన్నా రులకు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న, మంచి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక చాలా పాఠశాలల్లో మిఠాయిలు, పుస్తకాలను అందజేస్తారు. నవంబర్ 20వ తేదీన.. మన దేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటే, ఐక్య రాజ్య సమితి నవంబర్ 20వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్స వంగా ప్రకటించింది. తల్లిదండ్రులు ఏమి చేయాలంటే.. బాలల దినోత్సవం యొక్క ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి పిల్లల అభివృద్ధి. దేశంలోని ప్రతి బిడ్డకు విద్య అందేలా చూడా ల్సిన తొలి బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. పిల్లలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేందుకు తల్లిదండ్రులు చేయూత అందించాలి. పిల్లలే పిల్లర్స్.. మన దేశాన్ని ఇంటిగా భావిస్తే.. దాన్ని అందంగా నిర్మించాలంటే పిల్లలే ప్రధాన పిల్లర్లు అని అందరూ గుర్తించాలి. ఎందుకంటే పిల్లర్లు, ఇటుకలతోనే భవనం అందంగా రూపుదిద్దు కుంటుంది. అలాగే దేశంలోని సంస్కృతి,కళ, సాహిత్యం, సాంప్రదాయాలు మనుగడ సాగిం చాలంటే, ప్రతి వయోజన పిల్లవాడు సజీవంగా ఉండాలి. ప్రతి బిడ్డకు ఉత్తమ పోషక పునాది అందేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పని చేయాలి.
ప్రత్యేకత ఇదే
మన దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహ ర్లాల్ నెహ్రూ. దేశానికి ఎక్కువ కాలం ప్రధాని గా సేవలు అందించింది కూడా ఆయనే. బ్రిటిష్ పాలనలో చతికిలపడ్డ దేశాన్ని తనదైన దార్శనికత, ముందుచూపుతో పురోగతి దిశగా నడిపించారు. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీ లన్నా అమితమైన ప్రేమ.నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరిం చేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహ పరిచేవారు. ప్రధాని కాకముందు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రుకు తన కుమార్తె ఇందిర అంటే ఎనలేని అభిమానం. అందుకే ఆయన జైలు గోడల మధ్య నుంచి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రు తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో బోలెడు మంచి సంగతులు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహిం చాలి? సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించే వారు. నెహ్రూ నింపిన ఉత్సాహం, ధైర్యంతోనే ఇందిర ‘ఉక్కు మహిళ’గా రూపొందారు. ప్రధానిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. తన కుమార్తె ఇందిరకు నెహ్రు రాసిన ఉత్తరాలు నేటి తరానికి పాఠాలయ్యాయి. ఆయన చెప్పిన ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించ దగినవే.పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయణ్ని ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. ఇష్టమైన మేనమామ/ బాబాయి అని దీని అర్థం. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వ హించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
స్వాతంత్య్రానికి ముందు నవంబర్ 20న
స్వాతంత్య్రానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న నిర్వహించుకునేవాళ్లం. ఈ రోజున పిల్లల దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ తీర్మానిం చాయి. 1964 వరకు మనం కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాం. కానీ, నెహ్రు మరణం తర్వాత నుంచి నవంబర్ 14న నిర్వహించుకుంటున్నాం.ఈ రోజున పాఠశా లల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. అనం తరం సాంసృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారు. పిల్లల అరుదైన వేషధారణ కూడా ఆహ్లాదం నింపుతుంది. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకుగాను ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెఫ్ను స్థాపిం చింది. మానవతా దృక్పధంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడం లోనూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయం లోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.బాలల కోసం అహర్ని శలూ శ్రమిస్తూనే ఉంది. ప్రస్తుతం 155 దేశాకు విస్తరించిన ఈ సంస్థ 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది. కేవలం యునిసెఫ్ మాత్రమే కాకుండా అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు బాలల కోసం ప్రత్యేకం గా స్థాపించ బడి,వారి ఉన్నతికి కృషి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బాలల హక్కులు ప్రాధ మిక హక్కుగా చేసినప్పటికీ వారి హక్కులు కాపాడ్డం అనేది కేవలం అచరణ సాధ్యంకాని పనిగా కనిపిస్తోంది.
బాలల హక్కులపై ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న స్వచ్చంద సంస్ధలు బాలలను అడ్డుపెట్టుకొని లక్షలాది రూపాయ లు స్వదేశి, విదేశి నిధులు దుర్విని యోగ పరుస్తున్నారే తప్ప వీరి హక్కులు కాపాడేందుకు ఏ ఒక్కరూ చిత్తశుద్ది, అంకిత భావంతో పనిచేయడం లేదనే అరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. బాల కార్మిక చట్టాలు, బాలల హక్కుల చట్టాలు కొంత మందికి చుట్టంగానే కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా బాలలు ఎక్కువగా ప్రమాదకర మైన పనుల్లో కనిపించడం అలా పనుల్లో పెట్టుకున్న వారిపై కేసుల నమోదులు తూతూ మంత్రంగానే జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం.-జి.ఎన్.వి.సతీష్