బడి మారుతోంది
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇటీవలనే జిల్లాల వారీగా విద్యా సంబంధమైన సమాచారాన్ని విడుదల చేసింది.దాంతోపాటే2023లో-24లో మొత్తం విద్యార్థు ల నమోదు డేటా కూడా వుంది.విద్యా రంగంలో ఏదో గొప్ప అభివృద్ధి వచ్చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పల పసఏమిటో ఈసమాచారం తేల్చివేసింది. అంతకు ముందుతో పోలిస్తే 2023-24లో మొత్తం విద్యార్థుల నమోదు కోటికిపైగా తగ్గిపోయినట్టు చెబుతున్నది. 20 23-24లో మొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లు గా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37లక్షల మందివిద్యార్థులు తక్కువగా నమోదయ్యారు. అయితే 2018-19లోసూళ్లలోనమోదు26.02కోట్లుగా వుంది. తర్వాతి ఏడాది అంటే 2019-20లో ఇది 1.6శాతం పెరిగి,26.45 కోట్లకు చేరుకుంది. అంటే 42లక్షల కంటే ఎక్కువ మంది అదనంగా చేరారన్నమాట. వెనక్కుపోతే 2012-13లో కూడా 26.3కోట్ల నమోదు వుంది. 2012-24 మధ్య దేశ జనాభా పెరుగుదలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈతగ్గుదల మరింత కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది.
2023-24లోమొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లుగా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 లక్షల మంది విద్యార్థులు తక్కువగా నమోదు కావడాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. 21 లక్షల మంది పురుష విద్యార్థులు తక్కువగా నమోదు కాగా సంఖ్య 16లక్షల మంది విద్యార్థినులు విద్యా రంగాన్ని వదలివెళ్లిపోయినట్టు చెబుతున్నది. నమోదు సంఖ్యను లెక్కగట్టడంలో గతంకన్నా మెరుగైన పద్ధ తులు తీసుకువచ్చినట్టు మంత్రిత్వశాఖ చెబుతున్నది. బహుశా అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే సంఖ్యలు తగ్గిపోవడానికి ఇది కారణమై వుండొచ్చు నంటున్నది. అయితే ఈతగ్గుదల ఆందోళనకర మైం దనీ ఈసమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆ శాఖే చెబుతున్నది.
నూతన విధానంతో పెద్ద ఎత్తున స్కూళ్ల మూత
బీహార్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలలో ఈతగ్గుదల అత్యధి కంగా వుందని గమనించడం చాలా ముఖ్యం. 20 18-19లో బీహార్‌లో 2.49కోట్లమంది విద్యార్థులు నమోదుకాగా ఇప్పుడు2.13కోట్లకు తగ్గిపోయారు (అంటే35.65లక్షల కంటే ఎక్కువగాతగ్గారు).ఉత్తర ప్రదేశ్‌లో2018-19లో నమోదు 4.44కోట్లు కాగా తాజా నివేదికలో ఈసారి 28.26 లక్షల మంది తగ్గి ఇప్పుడు 4.16 కోట్లకు చేరుకున్నారు. మహారాష్ట్రలో గతంలో2.32కోట్ల మంది నమోదైతే తాజా నివేదిక లో ఆసంఖ్య 2.13కోట్లకు పడిపోయింది. ఈనివేదిక విడుదల తర్వాత ఈ తగ్గుదలకు కారణాలేమిటనే దానిపై వేర్వేరు నిపుణులు వేర్వేరు కారణాలు ముం దుకు తెస్తున్నారు.విద్యా విధానంలో మార్పులు, ఆర్థిక కడగండ్ల పెరుగుదల, స్కాలర్‌షిప్ మొత్తాలు సకాలంలో విడుదల చేయకపోవడమో ఎగవేయ డమో ముఖ్య కారణాలుగా వస్తున్నాయి. బిజెపి ప్రభు త్వం మూడేళ్ల కిందట ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రైవేటు విద్యకే పెద్ద పీట వేసింది. హర్యా నా వంటి బిజెపి పాలిత రాష్ట్రాలు ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థులకు సబ్సిడీలిచ్చి ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులు పెంచాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో అత్య ధిక భాగం (కాంగ్రెస్,బిజెపి రెండిరటి సర్కార్లు నడి చిన రాజస్థాన్ వంటి రాష్ట్రాలతో సహా) ప్రభుత్వ స్కూళ్లను భారీ ఎత్తున మూసివేయడం లేదా కలిపే యడం జరిగింది.అంటే పిల్లలు మరీ ముఖ్యంగా పేదకుటుంబాలకూ దళితులకూ సంబంధించిన పిల్ల లు వెళ్లవలసిన స్కూళ్లు దూరమై పోయాయి. ఎంత దూరమంటే వారు వెళ్లడమే మానుకునేంత. ఇక బాలికల విషయంలో అంత దూరం ప్రయాణిం చడంలో భద్రతా సమస్యలు మరింత నిరుత్సాహ పరుస్తున్నాయి. 2018-19 మధ్య 50 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని యు.డి.ఐ. ఎస్.సి (యుడైస్) 2022 నివేదిక పేర్కొం టున్నది. 2024లో యు.పి ప్రభుత్వం 27వేలపాఠశాలలు మూసివేసింది.ప్రత్యేకించి బీహార్,మహారాష్ట్రలో ప్రైవే టు స్కూళ్లు ఉధృతంగా ప్రారంభమవుతున్నాయి.ఈ రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల నమోదు తగ్గడం, ఉత్తర ప్రదేశ్‌లో స్కూళ్ల మూతలు చూస్తుంటే కేవలం ప్రైవే టు స్కూళ్లలో నమోదు పెరగడం ఒక్కటే సమ స్యను పరిష్కరించలేదని అర్థమవుతుంది.
కేరళలో మెరుగైన ఫలితాలు
విద్యార్థుల నమోదు పెంచడానికే గాక వారు కొనసా గేలా చూడాలన్నా ఉచిత ప్రభుత్వ విద్య అందించడం ఏకైక మార్గమని కేరళ అనుభవం మనకు నొక్కి చెబు తుంది.విద్య నాణ్యత పెంచేందుకూ అదే మార్గం. 2021-22లో కేరళలోస్థూలనమోదు నిష్పత్తి (జి.ఇ. ఆర్) 41.3శాతంగా వుంది. జాతీయ సగటు 28.4 శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. ఒక నిర్దిష్ట వయో బృందంలో ఉన్నత విద్యా భాగస్వామ్యం ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి జి.ఇ.ఆర్ కీలక సూచిక. తాజాగా2023-24 నివేదికలోకూడాకేరళ నమోదు సంఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా వున్నాయి. ఈ రాష్ట్రంలో బాలికల చేరిక అబ్బాయిలను మించి వుం డటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు, ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడం, స్కూళ్లలో ఆరోగ్యవంతమైన సుహ్రృద్భావ పూర్వకమైన వాతావ రణంకోసం కేటాయింపు ఇవన్నీ విద్యార్థుల నమోదు పెరగడానికి, నిలబడటానికి దోహదం చేస్తున్నాయి.
కనీస సదుపాయాల లేమి
యుడైస్ తాజా నివేదిక వెల్లడిరచే అంశాలు విద్యా ర్థుల సమస్యలకోణం నుంచి కూడా చూడాలి. ప్రత్యే కించి పేదలు సామాజికంగా అణగారిన వర్గాల పిల్లలు అనేక రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితిని పరిశీలించాలి.చాలా స్కూళ్లలో అమ్మాయిలకు ప్రత్యే కంగా మరుగుదొడ్లు కూడా లేవని ఈ నివేదిక చెబు తున్నది. ఉన్నవాటిలో చాలా చోట్ల తలుపులు లేవు. చాలా బళ్లలో మంచినీటి సదుపాయం లేదు. అనేక స్కూళ్ల భవనాలు శిథిలావస్థలో వున్నాయి.తరగతి గదుల్లోకి వేటలుతురే రాదు. కుర్చీలు,టేబుళ్లు కూడా వుండవు. అనేక రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు, ప్రిన్సి పాళ్లు, ఉద్యోగులు పిల్లలపై అత్యాచారాలకు, లైంగిక హింసకు పాల్పడిన ఘటనలు జరిగాయి. దేశంలో అత్యధిక చోట్ల స్కూళ్లలో కుల వివక్ష సంఘటనలు లెక్కలేనన్ని జరిగాయి.విద్యారంగంలో విచారకర మైన ఈ పరిస్థితికి ఇవన్నీ కారణాలే.
ఏకోపాధ్యాయులు, పారా టీచర్లు
చాలా రాష్ట్రాల్లో ప్రస్పుటంగా కనిపించే పెద్ద లోపం ఏకోపాధ్యాయపాఠశాలలు పెద్ద సంఖ్యలో వుండటం. ఉదాహరణకు ఒకేటీచరు నాలుగు నుంచి ఆరు క్లాసులు ఇంకా ఎనిమిది క్లాసులు కూడా చూసుకునే పరిస్థితి వుంది.ప్రభుత్వ నివేదికల ప్రకారం 2023-24లో భారత దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,10,971వున్నాయి.ఇలాంటి పాఠశాలల్లో 89 శా తం గ్రామీణ ప్రాంతాల్లోనే వున్నాయి. అరుణాచల్ ప్రదేశ్,గోవా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,జార్ఖండ్,ఉత్త రాఖండ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో ఏకోపాధ్యా య పాఠశాలలు ఎక్కువగా వున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అధికంగా వుండగా కేరళలో కూడా కొన్నివున్నాయి.కానివాటిలో విద్యా ర్థుల సంఖ్య చాలా తక్కువ. హిమాచల్ ప్రదేశ్‌లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ గా పిల్లలున్నారు. కేరళలోనైతే వాటిలో సగటున పది మంది పిల్లలున్నారు. నిజానికి కేరళలో ఏకోపాధ్యా య పాఠశాలలు అతి తక్కువగా వుండగా వాటిలో పిల్లల సంఖ్య కూడా దేశంలోకెల్లా తక్కువగా వుంది. సగటున ఒకఏకోపాధ్యాయ పాఠశాలలో 70, బీహార్ లో నైతే 96 మంది పిల్లలు వున్న పరిస్థితితో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా వుంటుంది.
అందువల్ల ఇక్కడ ప్రభుత్వ తాజా నివేదికలో ఆందోళన కలిగించేది పిల్లల నమోదు తగ్గిపోవడం ఒక్కటే కాదు. పాఠశాలల్లో వసతులు అధ్వాన్నంగా వుండటం,చాలా స్కూళ్లలో బోధనా ప్రమాణాలు కూడా దారుణంగా వుండటం. ఈ విషయంలోనూ కేరళ పరిస్థితి చాలా మెరుగ్గా వుంది. ఇక్కడ ముఖ్యం గా గమనించాల్సింది ఏమంటే కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో పారాటీచర్లు, కాంట్రాక్టు టీచర్ల నియా మకమే లేదు.అక్కడ టీచర్ల ఉద్యోగాలు పర్మనెంటు పోస్టులు. వారు తమ బోధనా నైపుణ్యాన్ని బోధనా పద్ధతులను నిత్యం మెరుగు పర్చుకుంటుంటారు. ఆ ప్రక్రియపై పర్యవేక్షణా నిరంతరంగా సాగుతుంటుం ది.దీంతో పోలిస్తే యు.పిలో24వేల మంది కాంట్రా క్టు పద్ధతిలో ఆదేశాల ఉపాధ్యాయులు వున్నారు. ఎనిమిదో తరగతి వరకూ బోధించేందుకుగాను వీరికి రూ.7000 ఇస్తారు. వారిలో చాలా మంది అవసరమైన అదనపు ఆదాయంకోసం టైలర్లు, ఆటో డ్రైవర్లు, దుకాణాలలో సహాయకులుగా పని చేస్తుం టారు. అంతేగాక 1,42,000 విద్యా మిత్రలను కూడా వార్షిక కాంట్రాక్టు పద్ధతిలో నియమించు కున్నారు.ఏ క్షణంలోనైనా ఉద్యోగం ఊడిపోవచ్చు ననే భయంలో కొట్టుమిట్టాడే వారు బోధనపై శ్రద్ధ పెట్టడం ఊహకందని విషయం. ఇంతేగాక ప్రభుత్వ పాఠశాలల్లో లక్షమంది ప్రిన్సిపాళ్లు, టీచర్ల పోస్టులు ఖాళీ పడి వున్నాయి. చాలా రాష్ట్రాల పాఠశాలల్లో నమోదు తగ్గిపోవడం, విద్యా ప్రమాణాలు నాసిగా వుండటం భవిష్యత్తుపై చాలా హానికర ప్రభావం చూపిస్తాయి.నమోదులోనూ పిల్లలను నిలబెట్టు కోవ డంలోనూ కేరళ విజయం ఉత్సాహకరంగా వుంది. దాంతోపాటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిరంతరం మెరుగుదల తీసుకురావడం, కూడా విస్తృతంగా ప్రచారం చేయవలసి వుంది. అత్యవసరమైన ఈ మార్పులు సాధించాలంటే ఆ విజయాలకు కారణ మైన అక్కడి పద్ధతులను అనుసరించడం కూడా కీలకమవుతుంది.
ఏపీలో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.దీనిలో భాగం గా ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగిం చింది.అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హైస్కూల్ ప్లస్‌ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది.అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశా లలకు అనుసంధానం చేసి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు.బేసిక్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ-1,2తో పాటు 1నుంచి 5తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యఆధారంగా టీచర్లను కేటా యిస్తారు.మోడల్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగ తులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి, ప్రతి తరగతికి ఒకటీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటారు.హైస్కూల్ ప్లస్‌లకు ప్రత్యామ్నా యంగా బాలికలకు ఇంటర్ విద్య అందించే ఉద్దే శంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్ కాలేజీల విధా నం తేవాలని భావిస్తున్నారు.దీంట్లో భాగంగా జిల్లాలో ప్రక్రియకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
హైస్కూల్ ప్లస్ వ్యవస్థ రద్దు..
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ బడులను ఉన్నతీకరించడం,లేదంటే ప్రాథమిక బడులుగా మార్చడం చేస్తుంది.ఇంటర్మీడియట్‌తో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్ వ్యవస్థను తీసేయనుంది.వీటిల్లోని ఇంటర్‌ను ఇంటర్మీడియట్ విద్యాశాఖఖు అప్పగించ నుంది.గతేడాది డిసెంబర్ 31వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.జాతీయ రహదారులు,రైల్వే లైన్లు,వంతెనలు,పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల విధానాన్ని అమలు చేయనుంది.ఈవిధానాలపై అవగాహన కల్పించేందుకు,ఇప్పటికే జిల్లా,క్లస్టర్, మండలస్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. -(సుభాషిణీ అలీ)