బంగారు భవితకు బాట
దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తోంది. యూత్‌కు ఉన్న బలం, అంకితభావం ప్రపంచంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. సమాజానికి ఉపయోగపడేలా తమ కార్యాచరణ ఉండేలా యోచిస్తుంది. అటువంటి యువతకు ప్రపంచీకరణ ఆధునిక కాలం ఎన్నో సవాళ్లు విసురుతోంది. అయినా పుంజుకుని ముందుకు వెళ్లేందుకే చూస్తోంది. ఉపాధి అవకాశాలు, సరైన నైపుణ్యాలు లేక వెనకబడుతున్నారే తప్ప, ప్రకృతి విపత్తులు, ఆపదల వచ్చినా ముందుకు వచ్చేది యువకులే. అందుకే వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అవరోధాలు దాటి, విజయాలెన్నో సాధిస్తారు.
దేశానికి నిజమైన సంపద బంగారు గనుల్లో, అద్దాల మేడల్లో,అందాల నగరాల్లో కాదు.. యువతలో ఉందని- అటువంటి యువశక్తిని సక్రమంగా వాడుకుంటే దేశం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందనే స్వామి వివేకా నంద మాటలు నిత్యసత్యం.యుక్త వయ స్సులో ‘ఏదైనా సాధిస్తాం.ఎంతటి కష్టాన్నైనా ఛేదిస్తాం.మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి.అందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తాం’ అనేలా యువత ఉం టుంది. కొంగొత్త ఆలోచనలు పుట్టేది కూడా ఈ వయస్సులోనే. పిల్లల్ని పెంచేది తల్లిదం డ్రులే అయినా వారికి విద్యాబుద్ధులు నేర్పి, మంచి మార్గంలో నడిచేలా చేసేది ఉపాధ్యా యులు. విజ్ఞానంతో బయటకు వచ్చిన యువతకు నైపుణ్యాలు నేర్పించి-వారిని దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా చేసుకునే బాధ్యత మాత్రం ఆయా ప్రభుత్వాలదే.
నిధులు లేక
ఒకప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్ర మాలను విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన నెహ్రూ యువజన సంఘాలు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. నిరక్షరా స్యత నిర్మూలన, సామాజిక చైతన్య కార్యక్ర మాల్లో పాల్గొనే యువతకు ఆదరణ కరువైంది. గతంలో గ్రామాల్లో వివిధ రకాలశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నింపే కార్యక్రమాలు నిర్వహించే వారు. కానీ ఇప్పుడు అటువంటి చర్యలు కనిపించడం లేదు. దాంతో యువత ఉపాధి హామీ,వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. పాలకులు సరైన దిశానిర్దేశం చేయకపోవడంతో యువతలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది.ఇది భవిష్యత్తుకే ప్రమాదం. అందుకే కొత్త జిల్లాల్లో యువజన సంఘాల ఏర్పాటు చేసి-ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.సామాజిక దృక్పథం పెంపొందించేందుకు వారిలో చైతన్యం కల్పించి-విద్య,ఉద్యోగ సాధనలో నైపుణ్య వికాసం నింపేలా శిక్షణ ఇవ్వాలి. మట్టిలో మాణిక్యాలు ఉన్నట్లే గ్రామాల్లో ప్రోత్సాహం లేక ప్రాథమిక స్థాయిలో నిలిచిపోతున్న క్రీడామణులు ఉంటారు. వారిని గుర్తించి ప్రోత్సహించాలి.వారికి కావలసిన ఆట వస్తువులు సరఫరా చేయాలి.సమాజావృద్ధిని కాంక్షించేలా యువజన సంఘాలను బలోపేతం చేయాలి.
రాజకీయాల్లోనూ..
యువతీ, యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచి తమ గొంతును వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన శిరీష-డిగ్రీ చదివినా ఉద్యోగం – (పద్మావతి)