ప్లాటీనం జూబిలీ స్వాత్రంత్య్ర సంబరాల సవివరంగా
భారతదేశం సామ్రాజ్యవాదుల చేర నుండి బయటపడి స్వతంత్య్ర దేశంగా అవతరించి 75 సంవత్సరాలైంది. స్వాతంత్య్ర సాధన కోసం నేలకొరిగిన అసంఖ్యాకుల త్యాగనిరతికి పునరంకితమయ్యే ఉద్విగ్న సమయమిది. గాంధీ,నెహ్రూ,పటేల్ అకుంఠిత పోరాట పటిమకు ముందు రాణిలక్ష్మీబాయి,మంగల్ పాండే,భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్ అస్ఫకు ల్లా ఖాన్,రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు ఉద్ధం సింగ్ వంటి ఎందరో త్యాగధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈస్వాతం త్య్రం. దేశానికి స్వతంత్రాన్ని సిద్ధించి పెట్టిన అమరవీరులకు భారత జాతి సర్వదా రుణపడి ఉంటుంది. మన స్వాతంత్య్ర సంగ్రామం అజరామరమైనది.. శత్రుశేషం లేనిది. చాలా దేశాలు స్వాతంత్య్రాన్ని పొంది ఉండవచ్చు, అట్టి స్వాతంత్రం కోసం ఆదేశ సైనికులు వీరోచితంగా పోరాటం చేసి ఉండవచ్చు, కానీ మన స్వాతంత్య్ర సంగ్రామంలో అసంఖ్యాకమైన ప్రజానీకమే అన్ని రకాల సైన్యం. సత్యం, అహింసా,శాంతి ఆయుధాలుగా పోరాడి సాధించిన ప్రత్యేకత ఇది.
దేశానికి స్వాతంత్య్రం తో పాటు,దాదాపు 12 లక్షల మంది చనిపోయి కోటిన్నర మంది నిరాశ్రయులైన, దేశ విభజన గాయాన్ని మిగిల్చిన ఆంగ్లేయుల దుర్నీతిని ఈ జాతి ఎన్నడు మర్చిపోదు. సంకుచిత వాదనతో మతరాజ్యంగా పాకిస్తాన్ ఏర్పడినప్పటికీ, ఏడు మతాలు వందలకొలది కులాలతో 22 అధికా రిక భాషలు 122 బహుళ ప్రాచుర్యం గల భాషలు మరియు 1600 ఇతర మాట్లాడ గలిగిన భాషలతో విరాజిల్లుతున్న భారతదేశం సర్వమతాలకు నిలయమై లౌకిక రాజ్యంగా అవతరించింది. 200 ఏళ్ల ఆంగ్లేయుల పాలన కన్నా ముందే వందల సంవత్సరాలుగా భారత దేశం విభిన్న కులాలకు, భాషలకు, ఆచారాలకు ఆలవాలమై ఉన్నది. మతమనే ప్రస్తావన అత్యా ధునికమైనది. ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగానే భారతదేశం పై కూడా ఎందరో సామ్రాజ్యవాదులు దండెత్తడం,కొంతకాలం పాలన సాగించడం ఆతర్వాత అది మరొకరి సొంతం కావడం జరిగింది. ఆక్రమించుకున్న ప్రతి ఒక్కరూ తమ మతాన్ని, అభిమతాన్ని, ఆచారాలను అమాయక ప్రజలపై బలవంతంగా రుద్ది బలిపశువులను చేశారు. దేశమంతా వివిధ సంస్థానాలుగా ఉండి, సంస్థానాధీశులు బ్రిటిష్ కు దాసోహంగా ఉన్న పరిస్థితుల్లో విదేశీ పాలనను వ్యతిరేకించాలంటూ రాజుకుంటున్న ప్రతి పౌరుడి కాంక్షనూ మహాత్మా గాంధీ పెల్లుభికేలా చేసి పోరు మార్గం చూపారు. ఆయన ఆధ్వర్యంలో కుల, మత,ప్రాంత మరియు ధనిక, బీద అనే తారత మ్యాలు లేకుండా స్వతంత్ర సంగ్రామంలో ఆనాటి ప్రజలంతా పాల్గొన్నారు.నాటి స్వాతంత్య్ర సంగ్రామం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కోరుకోలేదు. ప్రజా జీవన విధానాలలో మార్పు కోరుకున్నది,బానిసత్వం నుండి విముక్తి కోరుకున్నది, గౌరవప్రదమైన జీవితానికి నిర్దేశిత ఉపాధి లభ్యతను కోరు కున్నది,పాలకుల జవాబుదారీతనాన్ని, ప్రోద్బ లాన్ని కోరుకున్నది. నిజం నిప్పులాంటిది. ఆ నిప్పు కూడా అప్పుడప్పుడు కదల్చకుంటే నివురు గప్పి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. చరిత్రకు సాక్ష్యాలుగా వాస్తవాలు లిఖించబడిన పుస్తకాలను కల్పిత వార్తల వాట్సాప్ ఫార్వర్డిం గ్లు రీప్లేస్ చేశాయి. ఇందులో భాగంగానే స్వాతంత్య్ర సంగ్రామ హీరోలను కనుమరుగు చేసేలా ఒక దుష్ప్రయత్నం జరుగుతుంది. దండెత్తి రాజ్యాలను స్వాధీన పర్చుకున్న నియంతల వలే ప్రజాస్వామ్య యుగంలోనూ సర్వ జనుల సమ్మిళితమైన దేశ చారిత్రక ఐఖ్యతకు భంగం కలిగేలా అస్తిత్వ విభజన బీజాలను వెదజల్లుతున్నారు. ప్రాంతాలూ, మతాలూ మరియు భాషలకు అతీతంగా సాగిన స్వాతంత్య్ర సంగ్రామాన్ని కొందరు మితవా దులకు ఆపాదించజూస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల దేశ సమైఖ్యత, మత సామరస్యం ప్రమాదంలో పడ్డాయి. సత్యా గ్రహం, సహాయ నిరాకణోద్యమం,క్విట్ ఇండియా వుద్యమాల్లో అభేద్యమైన పాత్ర పోషించి స్వాతంత్య్ర సాధనలో కీలకంగా నిలిచిన కార్మిక వర్గానికి వారసులుగా విచ్చిన్నకర శక్తుల పట్ల జాగరూకులై వుండటం మన కర్తవ్యం. ఆజాదీ కా అమృత మహోత్సవము జరుపుకోవాలని కేంద్రం దేశ ప్రజలందరినీ కోరుతున్నది. ఈ ఆజాది ప్రయాణంలో అమృతం ఎంత అన్నది చూడటమే కాకుండా వాస్తవానంతర కథలను చరిత్రగా ప్రకంటించజూస్తున్న వారి కుయు క్తులను భగ్నం చేస్తూ నిజానిజాలతో ప్లాటినం జుబిలీని జరుపుకోవటం మన బాధ్యత.
స్వేచ్చ భారత్ ఏమి సాధించింది
ఈ ముప్పావు శతక కాలంలో చాలానే సాధించాం. రవాణా వ్యవస్థల నుండి భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విద్యాలయాలు, వైద్య పరిశోధనలకు భారత దేశం నెలవై ఉన్నది. స్వాతంత్రం పొందిన సందర్భంలో కేవలం14శాతానికి పరిమితమైన అక్షరాస్యత నేడు 70శాతానికి చేరింది, రు. 2 లక్షల70వేల రూపాయలుగా నమోదైన దేశ స్థూల జాతీయోత్పత్తి నేడు 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది(210 లక్షల కోట్ల రూపా యలు). అంతరిక్ష పరిశోధనల్లో దాదాపు స్వయం సమృద్ధి సాధించుకున్నాం. త్రివిధ దళాలతో సహా పర్పాలనా సంబదిత వర్గమెప్పుడూ ప్రభుత్వ గీత దాటలేదు. ఇది అభినందనీయం. ఆంగ్లేయుల ఆధీనంలో ఉంటే ఇవన్నీ సాధించగలిగే వాళ్ళమో కాదో చెప్పలేము. కానీ కేంబ్రిడ్జి యూనివర్సిటీ చరిత్రకారులు ప్రకారం 1700 సంవత్సరం వరకు ప్రపంచ స్థూల జాతి ఉత్పత్తిలో భారత్ 22.6% కలిగి ఉన్నది. ఆనాటికి ఐరోపా మొత్తం 23.3 శాతాన్ని మాత్రమే కలిగి ఉండెను. ఆంగ్లేయులు భారత్?ను విడిచి వెళ్లిన తర్వాత,1952లో,ప్రపంచ జిడిపిలో భారత్ 3.8%నికి పరిమితమైంది. ఇప్పుడది 3.09% మాత్రమే. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు నివేదికలోని వాస్తవాలు. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి 80 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధార పడి స్థూల జాతీయోత్పత్తిలో 50శాతం వాటాను కలిగి ఉండెను, ఇప్పుడు 60శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి స్థూల జాతి ఉత్పత్తిలో కేవలం 17శాతానికే మాత్రమే పరిమితమైంది. 75సంవత్సరాల స్వపరి పాలనను ఇది వెక్కిరించడం లేదా ప్రత్యా మ్నాయనికి బదులు గత్యంతరం లేని ఉపాధిగా వ్యవసాయం మారింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం,ప్లాటినం జూబ్లీ సందర్భంలో లోతైన విశ్లేషణ అవసరం. 1947లో ఆంగ్లేయుల పాలన అంతమై భారతీయుల పరిపాలన మొదలైంది. ఇదేనా స్వాతంత్య్రం అంటే ఒక జాతికి స్వాతంత్య్రం అంటే తమను తాము స్థానిక భౌగోళిక సాంస్కృతిక పద్ధతుల ప్రకారం పాలించుకోవటమే కావచ్చు కానీ సామ్రాజ్య వాదము ఈ 75సంవత్సరాలలో అనేక రూపాలు తీసుకున్నది. సామ్యవాద పోకడలు లేని ఏ రాజ్యము స్వేచ్ఛాయుత ప్రదేశం కాదు. కమ్యూనిస్టు దేశాలైతేనే సామ్యవాద పద్ధతులు అమలు అవుతాయనేది సరైన నిర్ధారణ కాదు. సామ్రాజ్యవాద కాంక్ష వదిలిపెట్టని, పూర్తి పెట్టుబడిదారీ దేశమైన అమెరికా పౌరులకు అక్కడ ఉన్నంత స్వేచ్ఛా సమానత్వాలు, సమాన అవకాశాలు సమాన గౌరవాలు భారతదేశంతో సహా అనేక దేశాల్లో లేవన్నది సత్యం.
నామమాత్రం అవుతున్న ప్రజాస్వామ్యం.
ఇప్పటికైతే ఎన్నికలలో ఓటమిని అంగీకరిస్తూ అధికార మార్పిడికి అందరూ సహకరిస్తుండటం మనం సాధించిన ఘనతే.రిసార్టు రాజకీ యాల నేపధ్యం దీనిపై అనుమానాలు రేకెస్తున్నది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల నిర్వహణకు మాత్రమే పరిమితమైపోయింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాట్లలో ప్రజాస్వామ్య విధానాలు పాటించబడటం లేదు. మెజారిటీ ప్రజల ఓట్లు పొందిన రాజకీయ సమీకరణాలు గద్దెనెక్కి పరిపాలన చేస్తాయన్న నమ్మకం లేదు. ఎవరైనా ఎప్పుడైనా డబ్బులకు అమ్ముడుపోయి మెజారిటీ ప్రభుత్వాలు మైనారిటీగా మైనారిటీ ప్రభుత్వాలు మెజారిటీగా మారుతున్న అసహజ పరిస్థితులు నేడు నెలకొన్నాయి. యదేచ్ఛగా పార్టీ పిరాయింపులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పార్లమెంటు అసెంబ్లీల ఎన్నికలన్నీ కూడా ప్రజా సమస్యలపై కాకుండా కుల మత ప్రాంతీయ విద్వేశాల ఆధారంగా జరుగుతున్నవి. సమాజ అసమానతలకు కారణం కులమేనని, దాని ప్రక్షాళనకు నడుము కట్టిన అంబేద్కర్ ఆశయం కొంతైనా సాధించగలమని భావించిన వాళ్ళకి 75 సంవత్సరాల తర్వాత అదే చేదు నిజం బయటపడుతోంది మరియు కులమే ప్రధానమై రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలుగా వ్యవహరించాల్సిన శాసన నిర్మాణం, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థ మరియు మీడియా అన్యాక్రాంతమైపోతున్నవి. శాసన నిర్మాణాలలో సలహాలకు, మార్పు చేర్పులకు తావు లేకుండా ఏకపక్షంగా సాగుతున్నది. రైతు చట్టాలు, విద్యుత్ సవరణల బిల్లు, కార్మిక చట్టాల సవరణ వంటివన్నీ కొన్ని ఉదాహర ణలు. కార్యనిర్వహణ న్యాయవ్యవస్థలు కనీసం శాసనాలను తూచా తప్పకుండా పాటించడం వదిలిపెట్టి ఆ సమయంలోని పాలకులకు ఏజెంట్లుగా వ్యవహరించే స్థితికి పడిపోయాయి. రాజ్యాంగ నిర్దేశాల కన్నా రాజుల ఆజ్ఞలకే ప్రాధాన్యమిస్తున్నాయి. నాలుగవ స్తంభమైన మీడియా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించేలా ప్రజ లను మేల్కొల్ప వలసిన బాధ్యతను వదిలి ప్రభుత్వానికి వందిమాగదుల్లా వంత పాడుతూ వ్యవహరిస్తున్నది. మీడియాలోని మెజారిటీ భాగం ఇలా వ్యవహరించడం వలన కాస్తో కూస్తో ప్రశ్నించిన వారందరినీ నిర్దాక్షిణ్యంగా జైలు పాలు చేస్తున్న సంఘటనలు ఉన్నవి. అవాస్తవ ప్రచారాలను వెలికి తీసిన గౌరీ లంకేష్ ను హతమార్చారు, అదే బాటలో పయనిస్తున్న జుబేర్?నూ జైలు పాలు చేసి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే గాని బెయిల్ ఇవ్వని ఉదాహరణ మన కళ్ళ ముందు ఉన్నది. గత ఎనిమిదేళ్ల కాలంలో చేయని నేరాలకు జైలు పాలై నాపత్రికా ప్రతినిధులు 22 మంది. ప్రభుత్వ తీరును, వైఫల్యాలనూ ప్రజలకు వివరించగలరన్న మేధావి వర్గాన్ని జైల్లో నిర్బం ధించి కనీసం వాదించుకునే అవకాశం లేకుండా చేస్తున్న ఫాసిస్టు ధోరణి నేడున్నది.అంటే సర్వమత సమ భావన ప్రమాదంలో ఉన్నది. భారతదేశ సర్వమ తాలకు, సంస్కృతులకు ఆచారాలకు నిలయమైనప్పటికీ 75 సంవత్స రాలుగా ఐక్యంగా ఉండగలగడం గొప్ప విషయమే కాదు విజత్యం కూడా. అదే సమయంలో స్వేఛాయుత రాజ్యాలుగా అవతరించిన పాకిస్తాన్ వంటి అనేక దేశాల్లో ఇంత ఐఖ్యత కొనసాగటం లేదు. ఇంతటి సహనాన్ని, మెజారిటీ అభిప్రా యానికి గౌరవాన్నీ ప్రదర్శిస్తున్న ప్రజలూ పార్టీలూ అభినందనీయులే. కానీ ఈ ఐఖ్యత శత వసంతాల స్వతంత్ర భారత్ వరకు కొనసాగగలదా సబ్ కా సాథ్ సబ్ కా విశ్వాస్ను గౌరవించకుండా ఇది అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు లౌకికత్వం గురించి మాట్లాడటం అంటే మెజారిటీ మతాన్ని అవమానించినట్లేనని భావించబడుతున్నది. మైనార్టీలైన ఇస్లాం, క్రైస్తవ మతాలు పరదేశీయమైనవిగా భావింపబడుతున్నవి. కేవలం భావనకే పరిమితం కాకుండా అర్టీ మైనారిటీల పైన విపరీతమైన దాడులు కొనసాగుతున్నవి. హిందూ మతానికి ఈ రెండు మతాలతో వైరమున్నట్లుగా భావితరాల మెదళ్ళలో విశబీజాలేస్తున్నారు. ఇతర మతాల ప్రస్తావన హిందూమత మనుగడకు ప్రమాద మని తప్పుడు సంకేతాలు ప్రచారంలో పెట్టబడు తున్నవి. ఇట్లాంటి పోకడలను రాజ్యమే నేరుగా ప్రోత్సహిస్తున్నది. మతపరమైన ఏకీకరణ కోసం దేవుడి గుళ్ళపేర భక్తి భావనను అడ్డం పెట్టు కొని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ సమాజంలో ఒకజాతిపై మరొక జాతికి వైరం విపరీతమయ్యేలా నేటి పాలకుల వ్యవహరి స్తున్నారు. ఈ పరిణామాలన్నీ, నివారించకుంటే, భవిష్యత్తులో తీవ్ర రూపం దాల్చి మారణహో మానికి దారి తీయవని చెప్పలేము. అభ్యుదయ వాదం అంటే అసాధ్యమైనదిగా భావవాదము, భక్తివాదము అంటే ఫలితాలు ఇచ్చేదిగా ప్రజాజీవనంలో చూపించబడుతున్నది.దీనిని తిప్పి కొట్టే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపో తుంది. దేశ విభజనకు మతసంకు చితత్వం కారణం,మరి నేడు ఆసంకుచితత్వం పెరిగిందా తగ్గిందా విఆల భారత్ కోరుకునే వారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయమిది.
అంతర్జాతీయ సంబంధాలూ అంతంతే!
ఏడు దేశాలతో సరిహద్దును పంచుకుంటూ, 4000 కిలోమీటర్ల మేర భూ సరిహద్దును కలిగిన దేశం భారతదేశ అంతర్రాష్ట్ర సంబం ధాలు అధమ స్థాయిలో ఉన్నవి.నేపాల్ మినహా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ దేశాలన్నింటితో ఏదో ఒక అంశంలో వైరం ఏర్పరచుకొని ఉన్నది. నిజానికి పాకిస్తాన్ కు భారత్ ను ఎదిరించే శక్తి గాని యుక్తిగాని లేవు.కేవలం రాజకీయ లబ్ది కోసం చేత దానిని బూచిగా చూపించడం ఆనవాయి తీగా మారింది.చైనాతో సరిహద్దు అంశంలో వెభేదాలుంటే పరిశ్కరించుకోవాల్సింది పోయి చైనా వ్యతిరేకతనూ, అక్కడి కమ్యూనిస్టు భావ జాలాన్నీ భారతీయతకూ, హిందూ మతానికీ ప్రమాదకరంగా చిత్రిస్తూ రాజకీయ పబ్బానికై ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా జరిగే అతి జాతీయతా భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు బెడిసికొట్టే ప్రమాదమున్నది. భారత్ అంటే మత స్వేచ్చ, స్త్రీ స్వేచ్చా లేనిదని అంతర్జాతీయ మీడియా కోడై కూసినప్పటికీ దృష్టి పెట్టడం లేదు. పరిష్కరించవలసిన కేంద్రం అగ్గికి ఆజ్యం పోసే తీరున వ్యవహరిస్తోంది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తిస్తూ రాష్ట్రాలను స్వయం శక్తి లేని వాటిగా తయారయ్యేలా కేంద్రం వ్యవహరిస్తోంది. రాష్ట్రాలు బలంగా ఉండడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవసరం. కానీ కేంద్రం రాష్ట్రాలని బలహీనపరిచి తాను బలంగా ఉండాలనే తిరోగమన సూత్రాన్ని వల్లే వేస్తోంది.
భారత పౌరులందరూ ఓటు హక్కు వినియోగించుకోవడంలో తప్ప మరెందులోనూ సమానమైన వారు కారన్నది ఎంత నిజమో స్త్రీల వెనుకబాటుతనం స్వాతంత్రం సిద్ధించిన నాటి స్థాయిలోనే ఉన్నదనేది కూడా అంతే నిజం. మహిళల హక్కులను హరించడంలో మతాలన్నీ ఏకీభవిస్తున్నవి. ఆచారాలు సంప్రదాయాలు ఆధిపత్యం అనే గొలుసులతో బంధించి ధిక్కరించిన వారి భవిష్యత్తును అంత మందించడంలో అందరూ పోటీ పడుతున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ అంశంలో స్వతంత్ర భారత్‌ను పాలించిన ఏప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోలేదు. భారతదేశం తర్వాత స్వేచ్ఛా యుత రాజ్యాలుగా అవతరించిన అనేక దేశాలు అక్షరాస్యతలో ఆర్థిక సమానత్వాలలో ఎంతో ముందున్నవి. పొరుగు దేశాలైన చైనా బంగ్లా దేశ్లు దీనికి ఉదాహరణ. ఎన్నో రంగాల్లో సాధించబడిన అభివృద్ది కొలమానాలు మరింత మెరుగుపడవలసిన అవసరం ఉంది.వెనుక బడిన జాతులలో ఒకరిద్దరికి రాజ్యాంగ పదవులు ఇచ్చి, కొన్ని కమీషన్లు ఏర్పాటు చేసి అదే దళిత గిరిజనాభివృద్ది అని ప్రకటిస్తే నిజమైన రిపబ్లిక్ ఎలా అవుతుంది.దేశ జనాభాలో ప్రతి ఏడుగురిలో ఒకముస్లిం ఉన్నాడు.మూడు వందలకు పైగా పార్లమెంటు సభ్యులను లను కలిగి వున్న భాజపాలో ఒక్క ముస్లిం ఎం.పి కూడా లేకపోవడం వారు సబ్ కా సాథ్ లేరనడానికి సాక్షం. ప్రపంచానికి కోవిడ్ టీకా ఇవ్వగలిగిన దేశంలో మెరుగైన వైద్యం,వంద శాతం అక్షరా స్యత, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రయత్నా లతో ఆర్థిక అసమానతల తొలగింపే నేటి అత్యంత ఆవశ్యకంగా కనిపిస్తున్నా మత సామ రస్యం, స్వేచ్చాయుత వాతావరణం అత్యంత ప్రాధాన్యత ఇప్పుడు సంతరించు కున్నాయి. – (జి.తిరుపతియ్య)