ప్రశ్నిస్తేనే…ప్రగతికి మార్గం
మనస్తాపానికి గురి చేసే హక్కు అనేది ప్రత్యేకంగా ఉండదు. మనస్తాపానికి గురి చేసే హక్కు… లేదా పూర్తిగా మాట్లాడే హక్కు, సంపూర్ణ భావ ప్రకటనా స్వేచ్ఛ-స్వేచ్ఛగా మాట్లాడే హక్కులో కొన్ని అంశాుంటాయి. అవి కొంతమందిని లేదా ఒక వర్గానికి చెందిన వారిని బాధ పెట్టవచ్చు. మరొకరి భావ ప్రకటనా స్వేచ్ఛ వ్ల ఒక వర్గం ప్రజు బాధపడే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇదే,ఈ విష యంలో కీకాంశమని నా భావన. 2012 బ్యాచ్ ఐఎఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ గారు వారి కలం నుంచి జాలువారిన ఈ ప్రత్యేక కథనం ఎంతో ఆసక్తి కలిగిస్తోంది.
నాగరికతా దృక్పథం నుంచి దీన్ని మనం చూసినట్లైతే,మనకు తర్కశాస్త్రం (తర్కం యొక్క తత్వశాస్త్రం,చర్చించే కళ) అని పిలిచే పు ఒప్పందాు లేదా శాస్త్రాలు ఉన్నాయన్న వాస్తవాన్ని మన నాగరికత గర్వంగా చెప్పుకోవాలి. మనం చర్చించుకుంటాం, పరస్పరం ఎదుర్కొంటాం, విభేదించుకుంటాం. ఆ రకంగా మనం ఇప్పుడున్న ఈ నాగరికత అనేంతవరకు వచ్చాం. భావ ప్రకటనా స్వేచ్ఛ కంటే కూడా ప్రస్తుతమున్న వాతావరణంలో మనం చేస్తున్నదేమంటే ఇతరును బాధ పెట్టేలా చేయడం. ‘నన్ను ముట్టుకోవద్దు’ (టచ్ మి నాట్) అనే సమాజంగా మనం మారి పోయాం. నాగురించి, నామతం గురించి,నా కమ్యూనిటీ, నా రాష్ట్రం, నా దేశం ఇలా…నా గురించి ఏదీ మాట్లాడవద్దు. ఎందుకంటే, మనకు మనం చాలా అభద్రమైన వాతావరణంలో ఉన్నామని భావిస్తున్నాం. మన మతం గురించి చాలా అభద్రతగా ఫీవడం మొదుపెట్టాం. అందువ్ల ఆమతాన్ని దెబ్బ తీస్తుందని భావించే ఏ రకమైన భావ ప్రకటనా స్వేచ్ఛ నుండైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం అభద్రంగా ఉండడంవ్ల మనల్ని బాధపెట్టారనే భావన చాలా తేలికగా వచ్చేస్తుంది. మీరు ఐన్‌స్టీన్‌ను మూగవాడిగా పివవచ్చు. అతడు ఏమీ ఫీల్ అవడు. చాలా భద్రతగా ఫీల్ అవుతూ కూర్చుంటాడు. తానేం చేస్తున్నాడో తనకు తొసు. ఈరకంగా మనం ఇక్కడే మన సొంత నాగరికతను, మన సొంత బలాన్ని, మన దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామని నా భావన. ఇతరును బాధ పెట్టడం లేదా మనస్తాపానికి గురి చేయడం గురించి మనం మాట్లాడేటప్పుడు మన మనస్సులోకి వచ్చే మరో అంశం ఏమంటే-ఎవ రిని బాధ పెడుతున్నాం? దేన్ని బాధ పెడుతున్నాం? నాభావనలో,ఇలా బాధపెడు తున్నామన్న అంశానికి సంబంధించి మూడు కోణాున్నాయి. మొదటిది, ప్రభుత్వాన్ని బాధపెట్టే హక్కు. వివిధరూపాల్లో ఇప్పటికే మనం దీన్ని కుదించేశాం. ఒకవేళ ప్రభుత్వ మైతే, మనకు దేశద్రోహ చట్టం-ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 124(ఎ) ఉంది. న్యాయ వ్యవస్థ అయితే, కోర్టు ధిక్కరణను ఉపయోగించి మనం దీన్ని కుదించేశాం. చట్టసభలైతే, హక్కు తీర్మానం మనకుంది. ఆ రకంగా ఈ సంస్థన్నీ ఇతరు భావ ప్రకటనా స్వేచ్ఛవ్ల మనస్తాపానికి గురయ్యే హక్కును తమకు తాముగా ఉంచుకున్నాయి. మనస్తాపానికి గురవడంవారి హక్కు. ఇటువంటి వివిధ సెక్షన్ల ద్వారా మనస్తాపానికి గురవుతున్న వారి హక్కును మనం పరిరక్షిస్తున్నాం. మనకు స్వాతంత్య్రం భించక ముందు నుంచీ వారసత్వంగా మనకు ఈ దేశద్రోహ చట్టం ఉందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విమర్శను ఎదుర్కొనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదొక రక్షణ. అందువ్ల ఏతరహా విమర్శ అయినా దాన్ని దాడిగా పరిగణించవచ్చు, ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశిత హింసకు ప్పాడవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోదగిన, నాన్ బెయిబుల్ నేరాు. ప్రభుత్వం మెచ్చనిదాన్ని మీరు చెప్పారంటే వెంటనే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు. బెయిల్ తిరస్కరించవచ్చు. ప్రభుత్వం గురించి మీరు మాట్లాడినా, విమర్శించినా, ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. అప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చు. రెండోది, మనస్తాపం చెందడానికి ఒక కమ్యూనిటీకి ఉండే హక్కు.153-ఎసెక్షన్‌లో ఇది ఇమిడి ఉంటుంది. రెండు కమ్యూనిటీ మధ్య సామరస్యతను పెంపొందించడానికి ఉద్దేశించినందున ఇది ఇప్పటికీ అంగీకారమే. 295-ఎ సెక్షన్ అసంబద్ధమైనది, ఎందుకంటే మతాన్ని అవమానించడానికి సంబంధించినది ఇది. నేను మతాన్ని అవమానించేలా ఏదైనా అంటే దాన్ని వెంటనే హింసాత్మక చర్యగా పరిగణిస్తారు. జైల్లో పెడతారు. మళ్లీ ఇక్కడ కూడా పరిగణనలోకి తీసుకోదగ్గ నేరమే, నాన్ బెయిబుల్ కేసే. మనం మన పురాణాను చదివినట్లైతే, శివపురాణం చదవండి. బ్రహ్మ గురించి ఏం చెబుతున్నదో దృష్టి పెట్టండి. నా లెక్క ప్రకారం,శివపురాణం రాసిన వాడిని ఈసెక్షన్ కింద జైల్లో పెట్టాలి. లేదా రాముని కాం నాటి పరిస్థితును చూడండి, ఒక చాకలివాడు ఏకంగా రాజుకే ప్రశ్ను సంధించాడు. ఆ చాకలివాడు లేవనెత్తిన ప్రశ్నతో నేను ఏకీభవించను. కానీ, ఆవ్యక్తి రాజును ప్రశ్నించగలిగాడు. అందుకుగానూ ఆచాకలి త నరకలేదు. జైల్లో పెట్టలేదు. ఆ ప్రశ్న ఏంటో విన్నారు. దానిపై చర్చించారు. ఇక మూడోది,పరువు నష్టం. ఐపీసీలోని 499, 500 సెక్షన్లు- ఇవి సివిల్‌బీ క్రిమినల్ పరువు నష్టాను పేర్కొంటున్నాయి. ఈనాడు మనకున్నది మనస్తాపానికి గురయ్యే హక్కును ప్రోత్సహించే చట్టబద్ధమైన చట్రపరిధి. నేను మీ మీద నిందు, అపవాదు మోపవచ్చు. ప్రభు త్వంతో నాకు తగిన సంబంధాుంటే మీరు వేధింపుకు గురవుతారు. ఈ అధికారాల్లో చాలా వాటికి ఎలాంటి అడ్డూ అదుపు లేదు. ఇక్కడ నాకు – దేశద్రోహం కేసు నమోదుకు కొన్ని మార్గదర్శకాు విధించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు అన్న- ఒక విషయం గుర్తుకు వస్తోంది. భారతదేశం తన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత సెక్షన్ 124-ఎ తన కాలానుగుణ్యతను కోల్పోయిందని నేను భావిస్తున్నా. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని ప్రవేశ పెట్టినట్లైతే ఇది పరిశీనలో ఉండేదని నేను అనుకోను. హింసను నివారించడంలో నీకు సాయ పడేందుకు ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయి. హింసను రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా సెక్షన్ 505 ఉంది. కానీ,ఒకమతాన్ని అవమానించడాన్ని ఎన్ని రకాుగానైనా అన్వయించుకోవచ్చు. ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం ప్రయివేటు ఫిర్యాదుకైనా మనం చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 53 లేదా 295 కింద దాఖలైన ప్రయివేటు ఫిర్యాదును తప్పనిసరిగా అటార్నీ జనరల్ లేదా కనీసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి సీనియర్ లా అధికారికి పంపాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంది.వ్యక్తిగతంగా ఇక్కడ నాకు సంబంధించిన కేసు ఒకటి ఉంది. ‘’షేమ్ ఆన్ యు, ప్రైమ్ మినిస్టర్’’ అన్న వ్యాసం రాసినం దుకు సెక్షన్ 295 కింద నా మీద కేసు దాఖలైంది. సెక్షన్ 295-(ఎ)ను ఎందుకు వర్తింపచేశారో నాకు తెలియదు. ఎందుకంటే 295-ఎ మతాన్ని అవమానించడానికి సంబంధించినది. కానీ ఎవరో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 295-ఎ కింద కేసు నమోదైంది. దీన్ని ఫిర్యాదు స్థాయిలోనే నివారించడానికి చూడాలి. ఈ సెక్షన్లలో చాలావరకు-ప్రభుత్వాన్ని, కమ్యూనిటీని, న్యాయవ్యవస్థను, చట్టసభను, వ్యక్తును మనస్తాపానికి గురిచేసే హక్కు – భావ ప్రకటనా స్వేచ్ఛలోని భాగమే.ప్రస్తుతమున్న వ్యవస్థను, ప్రభుత్వాన్ని, అధికారంలో వున్నవారిని సవాు చేయడానికి మనల్ని మనమే అనుమతించుకోకపోతే మనం ఎన్నటికీ ఎదగలేం. మెరుగు పడలేం. అధికారంలో వున్న వారిని నిరంతరం సవాు చేస్తున్నందునే మనం ఇంత దూరం వచ్చాం. వారు మొగల్ పరిపాకులైనా, బ్రిటిష్ వారైనా లేదా ప్రస్తుత పాకులైనా ఎవరైనా కానివ్వండి. మనం నిరంతరంగా సవాు చేస్తూనే ఉండాలి. విమర్శిస్తూనే ఉండాలి. అధికారంలో వున్నవారి సున్నితత్వాన్ని (సెన్సిబిలిటీస్) తరచూ బాధపెడుతూ ఉండాలి. ఆ రకంగానే మనం ఇంత దూరం రాగలిగాం. ఈ హక్కును మనం అట్టిపెట్టుకుంటేనే మనం మరింతగా ఎదగగుగుతాం. లేనిపక్షంలో, ‘నన్నంటుకోకు’ (టచ్ మి నాట్) అన్న సమాజం స్థాయికే మనం కూడా దిగజారిపోతాం.
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
చట్టబద్దంగా మాట్లాడే మాటను, భిన్నాభిప్రాయా వ్యక్తీకరణను కార్యనిర్వహకశాఖ నేరంగా పరిగణించడం, పూర్తిగా వాటిని తొగించడం లాంటి చర్యకు పూనుకుంటున్నది. విద్యార్థు, కార్యకర్తు, కమెడియన్‌ు, జర్నలిస్టును క్రిమినల్, టెర్రరిస్టు వ్యతిరేక చట్టం కింద నేరాను ఆరోపించి కేసు నమోదు చేయడం, విమర్శను అదుపు చేయడమే ప్రభుత్వ వ్యూహంగా ఉంటున్నది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వ యుద్ధం, మతపరమైన అంశాతో ప్రజ అభిప్రాయాను నాశనం చేస్తుంది. ద్వేషపూరిత ప్రసంగాను సృష్టించే ఖూజ జిహాద్’, ‘కరోనా జీహాద్’ లాంటి ప్రదర్శన ద్వారా ఒకవైపు ముస్లింపై అపవాదు వేసే చర్యను ప్రోత్సహిస్తున్నది. మరో వైపు ప్రభుత్వం లేదా ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ఏ చిన్న విమర్శ చేసినా నేరారోపణు చేస్తున్నారు. ఆర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా నేరం మోపినపుడు, దానిని బహిరంగంగా ఖండిరచిన కేంద్ర మంత్రు, ప్రభుత్వ విధానాతో ఏకీభవించని జర్నలిస్టుకు ఆ విధమైన రక్షణను కల్పించ లేదు. ఈ అసమానతు ప్రభుత్వం యొక్క హిందూ జాతీయ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం సంతోషించే అభిప్రాయాను వ్యక్తం చేస్తున్న వారి కంటే అభిప్రాయాను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వారికుండే హక్కును కూడా కుదిస్తుంది. నూతన వ్యవసాయ చట్టాకు వ్యతిరేకంగా నిరసన తొపుతూ, స్వేచ్ఛగా అభిప్రాయాను వ్యక్తం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇటీవ స్పందించిన తీరును, ఉదారవాద ప్రజాస్వామ్యాు విమర్శను ఎలా పరిగణనలోకి తీసుకోవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిరసను వ్యక్తం చేస్తున్న రైతు పట్ల కేంద్రం వైఖరిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే,రాజ్యాంగబద్దంగా కల్పించబడిన స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా వక్రీకరిస్తుందో తొసుకోవచ్చు. మొదటిది, శాంతియుతంగా జరుగుతున్న సభను అనుమ తించడానికి బదుగా,ప్రభుత్వం దాన్ని పరిమితం చేసేందుకు,సరిహద్దు నిరసన ప్రదేశాలో రోడ్లపై మేకు నాటించడం, కాంక్రీటు గోడను,బారికేడ్లను నిర్మించడంపై కేంద్రీకరించింది. బారికేడ్లుపెద్ద అవరోధమేమీ కాదు,కానీ ఈఒక్క ఉదాహరణ ప్రభుత్వ హింసాత్మక చర్యను తొపుతుంది. ఇంటర్నెట్, విద్యుత్తు, నీటి సరఫరాను కుదించడంతో పాటు, గౌరవప్రదమైన జీవితానికి, భావవ్య క్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే మన రాజ్యాం గంలోని ఆర్టికల్ 19(1),21ని పూర్తిగా నిలిపివేశారు. రెండవది,ప్రభుత్వం నిరసనను చాలా చురుగ్గా అడ్డుకుంటుంది. అనేక మంది నిరసనకారును నిర్బంధించింది. అనేక సందర్భాల్లో హింస చెరేగింది. ప్రభుత్వం, దాని మిత్రు చొచ్చుకొని పోవడం వ్లనే ఈ హింస చెరేగిందని రైతు నాయకు ఆరోపిస్తున్నారు. ఢల్లీికి రైతు రాకుండా అడ్డుకునేందుకు, నిరసనకు కేంద్రంగా ఉన్న ఆగ్రాలో రైతును హౌస్ అరెస్ట్ చేయించింది. మూడవది, రైతు ఉద్యమంపై తయారైన విమర్శ నాత్మక నివేదికలో కొన్ని అంశాను తొగించడం, నేరారోపణు చేసి కేసు బనాయిస్తామనే బెదిరింపు ద్వారా అడ్డుకునే విధానం. వ్యవసాయ చట్టాను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనను, ప్రతిఘటనను అణచి వేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాు అంతర్జాతీయ విమర్శకు గురి అయ్యాయి. ఫిబ్రవరి 2న నిరసనలో సంభవించిన మరణా గురించి తమ నివేదిక ద్వారా తెలియజేసిన కనీసం ఎనిమిది మంది సీనియర్ జర్నలిస్టుపైన దేశద్రోహం కేసు, మతసామ రస్యానికి విఘాతం కలిగించారని నేరారోపణు చేస్తూ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాను (తొగింపు అభ్యర్థన ద్వారా) తొగించడం మొదుపెట్టింది. భారతదేశంలో ప్రస్తుతం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క స్థితి,1970వ దశకంలో విధించిన జాతీయ ఎమర్జెన్సీతో పోల్చే విధంగా ఉంది. ఇక్కడ ఎవరికైనా రాజ్యాంగబద్ధమైన రెండు పరస్పర విరుద్ధ క్షణాు కనిపిస్తాయి. 42వ రాజ్యాంగ సవరణద్వారా ఇందిరాగాంధీ పాన, ప్రభుత్వానికి విస్తతమైన అధికారాను సమకూర్చి, న్యాయ సమీక్ష చేసే అవకాశాన్ని పరిమితం చేసింది. ఇది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కును కుదించడానికి అనుమతించింది. బీజేపీ కంటే ముందున్న భారతీయ జనసంఫ్‌ు భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ 1977లో అధికారాన్ని చేపట్టి, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అంతకు ముందు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మార్పున్నింటినీ రద్దు చేసింది. దాని ఫలితంగా, కేబినెట్ ఆమోదం లేకుండా అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటన, ప్రాథమిక హక్కు నిలిపివేత సాధ్యం కాదు. ప్రభుత్వ చర్యను సమీక్షించే కోర్టు అధికారాన్ని పునరుద్ధరించారు. ముఖ్యంగా ఆ రాజ్యాంగ సవరణ, కార్యనిర్వహకవర్గం నిర్ణయాు తీసుకునే క్రమంలో ప్రజాస్వామిక ప్రక్రియలో మివైన అంశాను పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు, జనసంఫ్‌ు ఒక కొత్త అవతారంలో బీజేపీగా అధికారం చేపట్టినప్పుడు,రాజ్యాంగంపై చేసిన దాడున్నీ అనధికారమైనవి, అయినా వాస్తవమైనవి. ఒక్క అధికారిక రాజ్యాంగ సవరణ లేకుండా, ప్రభుత్వం అనేక ప్రాథమిక హక్కు అమును రద్దు చేసింది. శాంతియుతంగా చేస్తున్న ఆందోళన, రాజకీయ చర్చ కుదింపుతో, సమకాలీన భారతదేశం దురదష్టం కొద్దీ వాస్తవ ఎమర్జెన్సీకి దగ్గరగా ఉంది. కొత్త అధికార వ్యవస్థ ప్రతీ నిరసనను ఒక ‘’అంతర్గత అ్లరిగా’’ పరిగణిస్తూ, దానిపై గట్టి చర్యకు పూనుకుంటుంది. న్యాయ విధానం కార్యనిర్వ హకవర్గం ఎవరూ అంగీకరించని రీతిలో భావప్రకటనను పరిమితం చేసినప్పుడు, న్యాయవ్యవస్థ ఈ స్వేచ్ఛను సంరక్షిస్తుందని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. ఇక్కడ ఒక కేసును పరిశీలిస్తే, 1950లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు కేసును సుప్రీంకోర్టు ఎదుర్కొంది. మొదటిది, ‘క్రాస్ రోడ్స్’ అనే పత్రికపై మద్రాసు ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సవాల్ (రొమేష్ థప్పర్ వెర్సస్ మద్రాసు ప్రభుత్వం). రెండవది, ‘ఆర్గనైజర్’ పత్రికపై కార్యనిర్వహక ఉత్తర్వు విధించిన నియంత్రణకు వ్యతిరేకంగా సవాల్ (బ్రిజ్ భూషణ్ ఐ ఢల్లీి ప్రభుత్వం). ఆసక్తికరంగా, ఇద్దరు పిటీషన్ దాయి రాజకీయ రంగంలో ఎదురెదురుగా నిబడి ఉన్నారు. ‘క్రాస్ రోడ్స్’ రొమేష్ థప్పర్ సంపాదకత్వంలో నిర్వహించబడుతున్న కమ్యూనిస్ట్ పత్రిక. ‘ఆర్గనైజర్’ ఆరెస్సెస్ పత్రిక. కానీ రెండూ, వారి వారి కేసుకు మద్దతుగా (భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు) రాజకీయ మివపై ఆధారపడి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా స్వేచ్ఛకు ఉండే సుగుణం. ఇది సాంప్రదాయ వాదుకు వ్యతిరేకంగా, ఉదారవాదుకు అనుకూంగా ఏ విధమైన వివక్షతను చూపదు. ఇది అసమ్మతిని తెలిపే, తప్పు చేసే, ఎగతాళిచేసే, చర్చించుకునే స్వేచ్ఛకు అనుమతిస్తుంది. రెండు కేసులో కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోరిన పిటీషన్ దారుకు అనుకూంగా తీర్పు చెప్పింది. థప్పర్ కేసులో, ‘’భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అన్ని ప్రజాస్వామిక సంస్థ పునాదులో ఉంటాయి, స్వేచ్ఛా యుతమైన రాజకీయ చర్చ లేకుండా ప్రభుత్వ విద్య సాధ్యపడదు, ప్రజా ప్రభుత్వ పనితీరు ప్రక్రియ సరిగా ఉండేందుకు స్వేచ్ఛ అవసరం’’ కాబట్టి చీఫ్ జస్టిస్ పతంజలి శాస్త్రి చాలా సంకుచితమైన ఆలోచనా చర్యు మాత్రమే భావప్రకటనను కుదిస్తాయని రాశాడు. రర70సంవత్సరా తరువాత, జనవరి 2021లో మునావర్ ఫారూఖీ బెయిల్ మంజూరు కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాని మధ్యప్రదేశ్ హైకోర్టును కోరాడు. అసాధారణంగా ఒక కమెడియన్‌ను, (బహుశా తాను భావించిన జోకుకు) అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూరు వాదనలో, న్యాయస్థానాల్లో నేరాు చేసిన వారి తప్పును గుర్తించని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని హైకోర్టు నిస్సంకోచంగా చెప్పింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు సంఘటనలో రెండు కోర్టు వైఖయి భిన్నంగా ఉన్నాయి. మొదటిది, రాజ్యాంగాన్ని సంరక్షించే క్రమంలో కోర్టు వెంటనే స్పందించింది. రెండవది, ప్రభుత్వానికి ఉన్నంత అసహనాన్ని కోర్టు కూడా ప్రదర్శించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో (కొన్ని మినహాయింపుతో) హైకోర్టు, సుప్రీంకోర్టు పని తీరు. సుధా భరద్వాజ్, వరవరరావు, ఆనంద్ టెల్ టుబ్డేతో పాటు అనేకమంది రచయితు, విద్యార్థు, జర్నలిస్టుపై నమోదు చేయబడిన నేరారోపణను కొట్టివేయాని పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏఅరెస్ట్‌కూ రాజకీయ గుర్తింపు గానీ, కోర్టు అనంగీ కారానికి ప్రభుత్వం యొక్క క్రమబద్ధమైన విధానం గానీ లేకుండా పోయింది. ఆఖరికి ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోరినప్పటికీ, సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్లో 4జీ ఇంటర్నెట్ను పునరుద్ధరించడానికి తిరస్కరించింది. కోర్టు కూడా కండీషన్ బెయిల్ మంజూరుకు భావ వ్యక్తీకరణను పరిమితం చేసే భారమైన నియమ నిబంధనను విధించడం మొదు పెట్టాయి. ఉదాహరణకు, కేరళ హైకోర్టు 2020లో రెహానా ఫాతీమా ఆవు మాంసాన్ని వండుతున్న వీడియోను అప్ లోడ్ చేసిందన్న నేరారోపణపై అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాను ఉపయోగించకూడదన్న నిబంధనతో మాత్రమే బెయిల్ మంజూరు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడన్న అభియోగంపైన అరెస్ట్ చేయబడిన ఒక యువకుడిని సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ అహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాంటి నిషేధం భావ వ్యక్తీకరణకు ప్రత్యక్షంగా ముప్పు కుగజేస్తుంది. ఈ తొలగింపు (సెన్సార్ షిప్) న్యాయస్థానా నుంచి వచ్చాయన్న నిజం ప్రమాదకరమైన సూచికను తెలియజేస్తుంది. ఇది సాధారణంగా న్యాయవ్యవస్థ పట్ల ప్రజకు ఉండే విశ్వసనీయతను బహీన పరుస్తుంది.
అందువన భారతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక శాఖ నుంచి అనేక దాడును ఎదుర్కొంటుంది. స్వేచ్ఛ అనేది ఒక రాజకీయ ఆవశ్యకత. ప్రజాస్వామ్యం పునరుత్థానం అవడానికీ, దానితోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోసం సహాయం అందించిన వారికి దేశం కృతజ్ఞతు చెప్పే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కార్యనిర్వహక వర్గాన్ని కఠినమైన ప్రశ్ను అడిగిన ప్రతిపక్ష రాజకీయ నాయకు, రైతుకుబీ ప్రభుత్వ హింసను ధిక్కరించిన స్వతంత్ర జర్నలిస్టుకు, రాజకీయ పరిహాసాన్ని పండిరచిన కమెడియన్‌కు కూడా దేశం ఆ రోజున కృతజ్ఞతు తెలియ జేస్తుంది. కానీ చరిత్ర, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తొగించిన నిరంకుశ ప్రభుత్వం పట్ల, ఆ స్వేచ్ఛను పునరుద్ధరించడంలో విఫమైన న్యాయస్థానా పట్ల మాత్రం కనికరం చూపించదు.
- ‘ఫ్రంట్ లైన్’ సౌజన్యంతో,అనువాదం:బోడపట్ల రవీందర్
–కాళీశ్వరమ్ రాజ్ / తులసీ కే.రాజ్