ప్రైవేట్‌ ఫీజులం తగ్గేనా?

రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వామ్మో ఇంత ఫీజులా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్ని స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్యలో వసూళ్లు చేస్తున్నాయి. పాఠ శాలల ప్రారంభానికి ఇంకా ఎనిమిది రోజులే ఉం డడంతో ప్రైవేట్‌ స్కూళ్లు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లో నైతే అప్పుడే అడ్మిషన్లు అయి పోయినట్లు సమాచారం. తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం, కార్పొరేట్‌ చదువులు చెప్పించాలనే ఉద్ధేశ్యంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం రూపకల్పనకు ఐదు నెలల క్రితమే కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ మంత్రులతో సబ్‌ కమిటీని కూడా నియమించారు. అందులో భాగంగానే ఫీజుల నియంత్రణపై ఇప్పటికే ఈ కమిటీ పలుమార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో గతంలో ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు.

ప్రతి ఏటా 10శాతం ఫీజు పెంచుకో వచ్చనే ప్రతిపాదన చేసింది. ఫీజుల వివరాలను ప్రజ లకు తెలిసేలా చర్యలు చేపట్టాలని సూచిం చింది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కావొ స్తున్నా ఇంతవరకూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఫీజుల నియంత్రణ చట్ట్కంట స్పష్టతే లేదు. ఫీజులు ఎంత వసూలు చేయాలో? లేదో? అనేదానిపై స్పష్టమైన మార్గ దర్శకాలు ఏవని పలు విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్‌ అసోసియేషన్స్‌, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.గతేడాది ఆన్‌లైన్‌ క్లాసులకు రూ. వేలు, లక్షల్లో ఫీజులు కట్టించుకున్న కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు..ప్రస్తుతం జూన్‌ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకావొస్తుండటంతో ఆ నష్టాన్ని ఈసారి రాబట్టాలనే నయా దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫీజులను కడితెనే ఈ ఏడాదికి తరగతు లకు అనుమతిస్తామనే నిబంధనలు కూడా పెడుతు న్నట్లు తెలుస్తోంది.కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలనే నిభంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడంలేదు. ప్రైవేటు స్కూల్స్‌ అధిక ఫీజులకు అడ్డు కట్టవేస్తాం.. అని రెండేళ్ల క్రితం జీవోతెచ్చిన ప్రభుత్వం చతి కలపడిరది.ఫీజుల నియంత్రణ నిబంధన ప్రచా రానికే తప్ప ఆచరణకు నోచుకోలేదు.వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజుల నియంత్రణపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టడంపై తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే అమలు ఎలా ఉంటుం దనేదానిపై లెక్కకు మిక్కిలి అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి దాదాపు 62,063 పాఠశాల లున్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రీ-ప్రైమరీ, ఎలిమెంటరీ,సెకండరీ, సీనియర్‌ సెకండరీ పాఠ శాలలు ఉన్నాయి. భారతదేశంలోని గ్రామీణ ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన పిల్లల వాటా గురిం చి 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం…7 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలోదాదాపు 39.5శాతం మంది గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరారు. అలాగే 11నుండి 16 సంవత్సరాల వయసున్న పిల్లలు 32శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. పైలెక్కలను చూస్తే ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ప్రైవేటు పాఠశాలల పాత్ర గణనీయమైనదని అర్థమవు తుంది. ఇంత ప్రాముఖ్యత గలిగిన ప్రైవేటు పాఠశా లలు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ప్రైవేటు పాఠశాలల నిర్వహణపట్ల ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరి స్తున్నది.ఈప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని బాహాటంగానే ఉల్లంఘిస్తున్నాయనేది జగ మెరిగిన సత్యం.పోయిన సంవత్సరం మొదటి సారిగా,రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠ శాలల్లో నర్సరీ నుండి పదో తరగతి వరకు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలలో ఇంటర్మీడియట్‌ కోర్సుల కోసం 2023-24వరకు ఫీజులను నిర్ణయిం చింది. ప్రభుత్వం ప్రాథమిక విద్య అయిన నర్సరీ నుండి 5వ తరగతి వరకు పంచాయతీలలో రూ. 10,000, మునిసిపాలిటీలలో రూ. 11000, మునిసిపల్‌ కార్పోరేషన్లలో రూ.12000గా నిర్ణయిం చింది. అలాగే మాధ్యమిక విద్య అయిన 6 నుండి 10వ తరగతులకు పంచాయితీలలో రూ.12000, మునిసిపాలిటీలలో రూ.15000,మునిసిపల్‌ కార్పోరేషన్లలో రూ.18000గా నిర్ణయించింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బాహా టంగానే ఈ ఫీజు నియమాలను ఉల్లంఘిస్తున్నాయి. పంచాయితీలలో సాధారణంగా ప్రైవేటు పాఠశా లలు తక్కువగా ఉంటాయి, మండల కేంద్రాలలోనే ప్రైవేటు పాఠశాలలు కేంద్రీకృతం అయ్యి విద్యార్థులను బస్సుల ద్వారా పాఠశాలలకు రవాణా చేస్తూ ఉంటాయి. మండల కేంద్రాలలో సరాసరి ప్రతి ప్రైవేటు పాఠశాల నర్సరీ,5వ తరగతి విద్యా ర్థుల నుండి రూ.10,000 వేల నుండి రూ.25, 000 వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే మాధ్య మిక విద్య అయిన 6 నుండి పదవ తరగతులకు రూ. 20,000 నుండి రూ.60,000 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీనికి అదనంగా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రాథమిక తరగతుల విద్యార్థుల నుండి రూ.3వేల నుండి రూ.5 వేల వరకు, అలాగే మాధ్యమిక విద్యార్థుల నుండి రూ.5 వేల నుండి రూ.10వేల వరకు పుస్తకాలు అమ్ముతున్నాయి. వేల రూపాయల పుస్తకాలను అంత చిన్న వయసులోనే ఎందుకు కొనిపిస్తున్నారో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. డిగ్రీ వంటి పైచదువులకు కూడా పుస్తకాల ఖర్చు సంవత్సరానికి రూ.3000కు మించదు. అలాంటిది పాఠశాల స్థాయిలోనే తల్లిదండ్రుల నుండి ఈ ప్రైవేటు యాజ మాన్యం ఫీజులకు అదనంగా వేలకు వేల రూపాయలను పుస్తకాల పేరుతో దోచుకుం టున్నాయి.
ఇలా బాహాటంగా చట్టాలను ఉల్లంఘి స్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా విద్యార్థి సంఘం నాయకులు విషయాలను గుర్తించి ఆందోళన చేసి నట్లైతే అధికారులకు రాజకీయ నాయకుల నుండి వత్తిళ్లు వస్తాయి. అధికారుల ఉదాసీనతపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదోరకమయిన రాజీ కుదురుస్తున్నారు.విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రైవేటు పాఠశాలలు 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య చెప్పాలని చట్టం చెబుతున్నాగానీ ఎక్కడా అమలు చేయటం లేదు. నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను కూడా ప్రభుత్వం దుర్మార్గంగా దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠాశాలల్లో కలిపి పేదపిల్లలు బడికి దూరం అయ్యేలా చేస్తున్నది. విద్యార్థులను ఆటోలలో తరలించకూడదని చట్టం చెబుతున్నా సెవెన్‌ సీటర్‌ ఆటోలలో పాఠశాలలకు తీసుకువెళ్తున్నారు. ఇలా ప్రయాణ సమయాలలో ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఎన్నో వున్నాయి. ప్రమాదం జరిగిన పుడు కొంత హడావుడి చేసే అధికారులు చివరగా యాజమాన్యానికే మద్దతు తెలిపి ఏ చర్యా తీసుకోకపోవటమో లేదా నామమాత్రపు చర్యలు తీసుకోవటమో పరిపాటిగా మారింది.- (జి.ఎ.సునీల్‌ కుమార్‌)