ప్రాణాలు తోడేస్తున్న రక్తహీనత
మన్యంవాసులు పోషకాహారానికి దూరమవుతున్నారు.సక్రమంగా సరఫరా చేయకపోవడంతో గిరిజన తెగలకు చెందిన పిల్లలు,బాలింతలు,గర్భిణులు రక్తహీనత బారిన పడుతున్నారు.ఈపరిస్థితి వారికి ప్రాణసంకటంగా మారింది.నీరసించి నిస్పత్తువతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయినా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పాడేరు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో పీటీజీ గిరిజన తెగలకు చెందిన వారు తీవ్ర పోషకాహార సమస్యతో సతమవుతున్నారు.తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గిరిజన కుటుంబాల్లోని పసిప్రాణాలు విలవిల్లాడుతున్నాయి. తల్లీబిడ్డల మరణాలు సంభవిస్తున్నాయి.ఏటా మరణాలు నమొదువుతున్నా ప్రత్యేక పోషకాహార సరఫరా,వైద్యసేవల కల్పనపై ఎటువంటి చర్యలు కానరావడం లేదు.చాలా గ్రామాలకు అంగన్‌వాడీ వ్యవస్థ కూడా విస్తరించడం లేదు.
అంగన్‌వాడీలే ఆధారం..
ఏజెన్సీలో అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహారమే చిన్నారులకు,బాలింతలకు ఆధారం.అయితే వీటిద్వారా అరకొరగానే పోషకాహారం సరఫరా జరుగుతోంది.పర్యవేక్షణ లేకపోవడంతో పంపిణీ అస్తవ్యస్థంగా ఉంటోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు,గుడ్లు,పంపిణీ సవ్యంగా జరగడం లేదు.నెలరోజులుగా పూర్తిగా పోషకాహారం అందడం లేదు.దీంతో పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు.పిల్లలకు పాలు ఇచ్చేం దుకు కూడా గిరిజనులకు పాడి పశువులు లేకుండా పోయాయి.మన్యంలో ఆహార పంటలు బాగా తగ్గిపో యాయి.దీంతో ప్రస్తుతం గిరిజనులకు రాగి అంబలి, కోటా బియ్యమే ప్రధాన ఆహారంగా ఉన్నాయి. పప్పు దినుసులు,ఇతర పోషకాహారం అందుబాటులో లేని కారణంగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి గిరిజ నుల ప్రాణాలకు ముప్పు కలుగు తోంది.ఏటా ఏజెన్సీ లో సంభవిస్తున్న మరణాలకు కారణం పోషకాహార లోపమేనని వైద్యులు చెబుతు న్నారు.రేషన్ దుకాణా ల్లో నాణ్యమైన సరుకులు అందని పరిస్థితి.అంగన్ వాడీలు, పాఠశాలలో మధ్యాహ్నా భోజనం,ఆశ్రమ పాఠశాలల్ల్లో విద్యార్థులకు మెనూలో కూడా సరైన పోషకాహారాన్ని అందించ లేకపోతున్నారు. ఏజెన్సీ లోని కొన్ని మండలాల్లో గతంలో ఐటీడీఏ పోషకా హార కేంద్రాలను నిర్వహించినప్పటికీ కొన్నాళ్లకే పరిమితమైంది.గిరిజనుల ఆహార భద్రతపై నిర్ధష్టిమైన కార్యాచరణ ఐటీడీఏ చేపట్ట లేదు.
దిగజారిన జీవన ప్రమాణాలు..
మన్యంలో సుమారు 1.80లక్షలగిరిజన కుటుం బాలు ఉన్నాయి.3,574 గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజన జనాభా ప్రస్తుతం6లక్షలు దాటి ఉంది.సగానికి పైగా గ్రామాల్లో గిరిజన కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో ఇబ్బందు లకు గురవుతు న్నారు.ఫలితంగా పోష కాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. రోజుకు ఒకపూట అంబలి,ఒకపూట గంజి అన్నం తిని జీవనం సాగిస్తున్న గిరి జన కుటుంబాలు చాలా ఉన్నాయి. నిత్య వసర ధరలు అధికం కావడంతో పేద గిరిజన వర్గాల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి.
గుడ్లు,పాలు సరఫరా లేదు..
సంపంగి గరువు గ్రామంలో మినీ అంగన్‌వాడీ కేంద్రంఉంది.ఇక్కడకు ప్రతి నెల సరుకులు రావడంల లేదు.ముఖ్యం గా గుడ్లు,పాలు సరఫరా సరిగ్గా లేదు. జనవరి నెలలో 8రోజులే గుడ్లు ఇచ్చారు. ఈనెలలో ఒక్కరోజు కూడా గుడ్లు అంది వ్వలేదు.బాలింతలకు ఏడు నెలల వరకు పోషకాహారం ఇస్తున్నారు.కూరగాయలు, పాలు,గుడ్లు,పప్పు దినుసులకు కొరతగా ఉంది.ఎప్పుడైనా సంతకు వెళ్లినప్పుడే తెచ్చుకుంటాం.` మజ్జిప్రమీల,సంపంగి గరువు గ్రామం.
గిరిజన ప్రాంతాలకు 125బహుళ ప్రయోజన కేంద్రాలు..
గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రాంతాలకు ఆదివాసీ తెగలు(పీటీజీ) గిరిజన పిల్ల లకు పాఠశాల భవనాలు,అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్య సేవల నిమిత్తం వారు నివసించే గూడేల్లో ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు కేంద్ర,రాష్ట్రప్రభు త్వాలు నిర్ణయించింది.ప్రాథమిక పాఠశాల,అంగన్ వాడీ కేంద్రం,వైద్య ఉపకేంద్రం ఒకేచోట నిర్వహిం చేలా మల్టీపర్పస్ సెంటర్ల(బహుళ ప్రయోజన కేంద్రా లు)నిర్మాణానికి చర్యలు చేపట్టింది.పీఎం జన్‌మన్ పథకం కింద ఆదివాసీ గిరిజనులు నివసించే ప్రాంతాలకు 125 కేంద్రాలనుమంజూరు చేసింది. దీని కోసం ఇప్పటికే రాష్ట్రానికి రూ.75కోట్లు విడు దల చేసింది.వచ్చే ఏడాది మార్చినాటికి పనులు పూర్తి చేయాలని నిర్ధేశించింది.వీటిలో రెండు నెలల క్రీతం 72 కేంద్రాల నిర్మాణానికి రూ.43.20కోట్లు విడుద ల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు.త్వరలో పనులు మొదలు పెట్టనున్నారు.తాజాగా మిగతా 53కేంద్రాల నిర్మాణా నికిరూ.31.80కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతిలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామారాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం,శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఈకేంద్రాలు మంజూరయ్యాయి.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్
రాష్ట్రంలో 924గిరిజన ఆవాసాల్లో అభివృద్ధి కార్యక్ర మాల అమలుకు ప్రభుత్వాలు ప్రతిపాదనలు తయారు చేశారు.దేశంలో గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృ ద్ధిపై దృష్టిసారించిన కేంద్రం-రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాద నలు గిరిజనుల సామాజిక,ఆర్థికాభివృద్ధిపై కేంద్రం దృష్టిసారించింది.ఏజెన్సీలు,మైదాన ప్రాంతా ల్లోని గిరిజన ఆవాసాల పరిధిలో4జీ సర్వీసులు,అన్ని గ్రామాలకు వందశాతం విద్యు దీకరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు,విద్య,ఆరోగ్యం, జీవనోపాధి,నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్ట నుంది.దీనికి రాష్ట్ర నిధులు లేకుండా కేంద్రమే మొత్తం నిధులు కేటాయి స్తుంది.ఇప్పటి వరకు అమల్లో ఉన్న పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్‌ను ఉన్నతీకరించి ప్రధానమంత్రి జన్ జాతీ య ఉన్నత్ గ్రామ అభియాన్‌గా మార్చింది.రానున్న ఐదేళ్ల కాలంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని గిరిజనుల సామాజిక,ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది.ఈ పథకం కింద ఐదేళ్లలో దేశవ్యాప్తం గా రూ.79,156కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలి పింది.పథకం వివరాలను ముసాయిదా రూపంలో ప్రకటించింది. ఇందులో భాగంగా 17మంత్రిత్వశాఖ లు ఆయా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం నాలుగు కమిటీలు వేయాలని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అపెక్స్ కమిటీపథకం అమలును పర్య వేక్షిస్తుంది.దీంతో పాటు రాష్ట్ర, జిల్లా,మండల స్థాయి ల్లో కమిటీలు మౌలిక సదుపాయాలు,ఇతర పనుల ప్రతిపాదనల్ని నోడల్ విభాగమైన గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పంపించనున్నాయి.పీఎంజుగా కార్యక్ర మాలకు ప్రత్యేక విధివిధానాలు త్వరలో జారీ చేస్తా మని వెల్లడిరచింది.గిరిజన జీవన పర్యాటకం కోసం స్వదేశీదర్శన్ పేరిట నూరుశాతం నిధులతో హోం స్టే గృహాలు నిర్మించనున్నట్లు పేర్కొంది.
కేంద్రం చేపట్టే పనులు : కరెంటు లేని గిరిజన ఆవాసాల్లో కుటుంబాలు, ప్రభు త్వ విభాగాలకు విద్యుత్తు సౌకర్యం, రహ దారుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఏజెన్సీ ప్రాంతా ల్లో 5కి.మీ.మైదాన ప్రాంతాల్లో 10కి.మీ.దూరంలో హెల్త్‌సెంటర్ లేకుంటే సంచార మెడికల్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. గిరిజన కుటుంబాలకు ఆయు ష్మాన్ భారత్ వైద్య బీమా కార్డుల పంపిణీ చేస్తుంది. గిరిజన రైతుల సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల కోసం నిధుల కేటాయింపు.పశుపోషణ కార్యక్రమాలు చేపడతారు.
కొత్త అంగన్‌వాడీలకు రూ.12 లక్షలు : రాష్ట్రంలో ఇప్పటివరకు అమలైన పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియా న్ కింద81గిరిజన ప్రాంతాల్లో అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణానికి మహిళాశిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిం ది.పాత నిబంధనల ప్రకారం కేంద్రం 60,రాష్ట్రం40శాతం నిధులు భరించాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం పూర్తి నిధులు కేంద్రమే భరిస్తుంది.గిరిజన ప్రాంతాల్లో కొత్త అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.12లక్షల చొప్పున నిధులివ్వనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల ఉన్నతీకరణకు రూ.లక్ష చొప్పున అందిం చనుంది.ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యని వివరించారు.గర్భిణులు, బాలింత లకు అమలవుతున్న పథకాలు,పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై చంద్ర బాబు సమీక్ష చేశారు.2014లో ప్రవేశ పెట్టిన బాలామృతం,అమృతహస్తం, గోరు ముద్ద,గిరిగోరుముద్ద,బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను అధికారు లను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో మొత్తం 55,607అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని అందులో ప్రధాన అంగ న్వాడీ కేంద్రాలు48,770ఉండగా, మినీ అంగన్వాడీలు 6,837ఉన్నాయని అధికా రులు తెలిపారు.ఇందులో గిరిజన ప్రాం తాల్లో 8,311అంగన్వాడీ కేంద్రాలుఉన్నా యని వివరించారు. – గునపర్తి సైమన్