ప్రభుత్వ బడిని బతికించుకుందాం..!
అమ్మ లాంటి ప్రభుత్వ బడి. అమ్మా నాన్న కూలికి వెళితే అక్కున చేర్చుకుని విద్యా బుద్ధులు నేర్పిన బడి. సమాజంలో ఎలా బతకాలో నేర్పిన బడి. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించడం తన జీవనంలో భాగంగా చూడమన్న బడి. పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులను పూజించండి అని రోజూ ఓనమాలు దిద్దించిన బడి. ఇప్పుడు ఏదో పాడు ప్రపంచీకరణ వచ్చి అమ్మ, బడి నేర్పాల్సిన దాన్ని సెల్‌ఫోన్ నేర్పు తుంది కానీ..ఆ రోజుల్లో బడే నేర్పేది. పాఠశాల ప్రారంభం కాబోతుంది కనుక ఆ బడిని రక్షించు కోవడం కోసం ఉపాధ్యాయులుగా, సమాజంగా ఏం చేయాలో చూద్దాం.
పాఠశాలలు-పిల్లలు
ఏప్రిల్ 30,2021 ప్రభుత్వ లెక్కల ఆధారంగా ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ రంగంలో 33,813 ఉంటే,ఎయిడెడ్ ప్రాథమిక పాఠ శాలలు 1,287ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రాథమికోన్నత పాఠశాలలు 4,158 ఉంటే, ఎయిడెడ్ పాఠశాలలు 250 ఉన్నాయి.ప్రభుత్వ రంగంలో ఉన్నత పాఠశాలలు 6,648 ఉంటే, ఎయిడెడ్ పాఠశాలలు 435 ఉన్నాయి.2021 ఏప్రిల్ నాటికి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 44,54,038.
జిఓ 117 పేరుతో పాఠశాలలకు సంఖ్యను 6 పాఠశాలలుగా మార్చిన తర్వాత కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం నుంచి బహిర్గతం కాలేదు. కొన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఫౌండేషన్ స్కూళ్లు అంటే 1,2 తరగ తులు మాత్రమే నిర్వహించే పాఠశాలలు మొత్తంగా 4600 ఉంటే దానిలో 20 లోపు ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాల 2,730. ఫౌండేషన్ ప్లస్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పైచిలుకు ఉంటే 8,900 వరకు 20 లోపు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అంటే సుమారుగా 12,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రీ హైస్కూల్ అంటే 1నుంచి 8వ తరగతి వరకు ఉన్న మొత్తం పాఠశాలలు 3,500 దాకా ఉన్నాయి. వీటిలో 30లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 900 వరకు ఉన్నాయి.ఉన్నత పాఠశాలలు 5,400 దాకా ఉంటే దీనిలో 100లోపు విద్యార్థులు ఉన్న పాఠ శాలలు 450 దాకా ఉన్నాయి.20లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 30లోపు వున్న ప్రీ హైస్కూళ్లు, 100లోపు ఉన్న ఉన్నత పాఠశాలల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారబో తుంది. ఆశ్చర్య కరమైన విషయం ఏమంటే హైస్కూల్ లో చదువుతున్న మూడో తరగతి విద్యార్థికి సబ్జెక్టు టీచర్లతో పాఠాలు,అదే ఒక ప్రాథమిక పాఠశాలలో లేదా ప్రీ హైస్కూల్‌లో 8వ తరగతి దాకా ఉన్న యూపీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థికి సబ్జెక్టు టీచర్లతో బోధన ఉండదు. ఒక భిన్నమైన విద్యా విధానం గత రెండు సంవత్సరాల కాలంగా అమలు చేయబడిరది. మేధావులు,ఎమ్మెల్సీలు,ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు దీన్ని సరిచేయాలని ఇది సరైన పద్ధతి కాదని చెప్పినా ఇది మాపాలసీ అనే పేరుతో అప్పటి ప్రభుత్వం అమలు చేసు కుంటూ పోయింది. దీంతో ఈ రోజున 12,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపా ధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. అలాగే కొన్ని ఉన్నత పాఠశాలల డీ గ్రేడ్,కొన్ని యూపీ పాఠశాలల డిగ్రేడ్‌గా మారిపోయాయి. ఎయిడెడ్ పాఠశాలలు కనుమరుగు అయి పోయాయి. ఇప్పుడు ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ చూస్తే ఈ లెక్కలు కూడా ప్రభుత్వం అధికారి కంగా ఎక్కడా వెబ్‌సైట్‌లో పెట్టలేదు.కానీ 36 లక్షలకు మించి విద్యార్థులు ప్రభుత్వ పాఠశా లల్లో చదవటం లేదనేది అర్థమవుతుంది. ప్రాథమిక పాఠశాల వ్యవస్థ జిఓ117వల్ల అస్తవ్యస్తంగా మారిపోయింది. అక్కడ చదివే పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారో ప్రైవేటు పాఠశాలకు వెళ్లారో కూడా గణాంకాలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. పాఠశాల స్ట్రక్చర్, మౌలిక వసతులు, పిల్లలకు కావలసిన సదుపాయాలు కలుగచేసిన తర్వాత కూడా పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గడానికి కారణమేమిటో, ఉపాధ్యాయ పోస్టులు కుదించబడటానికి కారణమేమిటో సమీక్ష జరగకపోవటం ప్రధాన లోపంగా ఉన్నది. ఇప్పటికైనా తక్షణం ఈ విద్యారంగంలో చేస్తున్న మార్పుల మీద ఒక స్పష్టమైన సమీక్ష జరగాలి. దాన్ని సరిచేసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకునేవైపు ప్రణాళికలు ఉండాలి. బైజూస్, సిబిఎస్‌ఇ, టోఫెల్, ఐఎఫ్‌బి ప్యానల్. ఇలా అనేక పథకాలు పాఠశాలలోకి వచ్చి చేరాయి. ఏపాఠశాలలో ఏసిలబస్ ఉందో,ఏ పరీక్షా విధానం ఉందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపైన మాట్లాడుకోవడం గానీ, చర్చించుకోవడం గానీ సమగ్రంగా జరగలేదు. మరో విచిత్రం ఏమంటే ఉపాధ్యాయులు తమ సొంత నెట్,సెల్‌ఫోన్‌లోనే అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవటం.పిల్లలకు ఏమైనా నాలుగు అక్షరాలు వచ్చాయా అనే దానికంటే ఉపాధ్యాయులు యాప్‌లు నింపడం,ఫార్మేట్లు పూర్తి చేయటం మీదే పర్యవేక్షణ సాగింది. పర్యవేక్షణ పాఠశాలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది.ఒక్క ఉపాధ్యా యులే కాదు.విద్యార్థులు,తల్లిదండ్రులు, డీఈఓ,ఆర్‌జెడి,పై అధికారులు కూడా భయ పడాల్సిన పరిస్థితి ఏర్పడిరది.ఒక స్వేచ్ఛా యుత వాతావరణం పాఠశాలో దెబ్బతిన్నది.
బడి కోసం ఉపాధ్యాయులు
విద్యార్థి బడి ద్వారా సమాజంలో మంచి పౌరుడుగా మారడానికి టీచరు ఉపయోగ పడాలి.నిరంతరం తల్లిదండ్రులతో మమేకం అవ్వాలి.పిల్లల యోగక్షేమాన్ని అడిగి మనోధైర్యా న్ని ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి నిరంతరం ప్రత్యేక కృషి చేయాలి.చదవటం,రాయటం ప్రతి విద్యార్థికి వచ్చే బాధ్యత తీసుకోవాలి. మన బడికి వచ్చే పిల్లలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వారినే విషయం స్పృహలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆప్యాయతను విద్యార్థికి బడిలో ఉపాధ్యాయులు ఇవ్వాలి. బడి సమయాన్ని పిల్లల కోసం మాత్రమే కేటా యించాలి. ఉపాధ్యాయుల జీతాలు తల్లిదం డ్రులు, సమాజం కట్టే పన్నుల నుంచే వస్తున్నా యనే వాస్తవాన్ని గ్రహించి, పిల్లల తల్లిదం డ్రులతో, సమాజంతో అనుసంధానం అయ్యేలా వారి పని ఉండాలి. ప్రతి రోజు నూతన అంశాలు, నిరూపించిన శాస్త్రీయ అంశాలు బోధించాలి. విద్యార్థుల్లో చదువుల పట్ల ఆసక్తి కలిగించేటట్లు పని మెరుగు పరచుకోవాలి. ఏదైనా పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే, ఉత్తీర్ణత కాకపోతే తనువు చాలించడం కాకుండా మనోధైర్యంతో బతికేటట్లు, మరల విజయాన్ని అందుకునేటట్లు ప్రోత్సహించాలి. కష్టం,శ్రమ,నిజాయితీ లాంటి నైతిక విలువ లను నేర్పాలి.మొత్తంగా బడి చుట్టూ ఒక సామాజిక కంచెను ఏర్పాటు చేసుకోవాలి. సమాజంలో మనం మనలో సమాజం భాగంగా ఉంటుందని భావనతో ఉపాధ్యా యులు తమ పనిని అభివృద్ధి చేసుకునే వైపు ఉండాలి. బడి తల్లిదండ్రుల ఆదరాభిమానాల్ని పొందే విధంగా టీచర్లు ఆదర్శంగా ఉండాలి. అవసరమైతే ఒకగంట అదనంగా పనిచేయ డానికి సిద్ధపడాలి.బడి నుంచి బయటికి వెళ్లిన విద్యార్థి సమాజంలో ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా బతకగలిగే సామర్ధ్యాన్ని ఇవ్వగలిగేలా బోధన ఉండాలి. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా బడి సమయంలో పిల్లల చుట్టూ, పిల్లల అభివృద్ధి చుట్టూనే ఉపాధ్యాయుల ఆలోచనలు,ఆచరణ, కార్యాచరణ ఉండాలి. బడి కోసం ప్రభుత్వం బోధనకు మాత్రమే ఉపాధ్యాయుని పరిమితం చేయాలి. పాఠశాల పర్యవేక్షణ కక్ష సాధింపు ధోరణితో కాకుండా పొరపాట్లను సరిచేసుకునే పద్ధతిలో ఉండాలి. విద్యారంగానికి హాని చేసే జీవో117ని పూర్తిగా రద్దు చేయాలి.విద్యార్థి ఏమీడి యంలో చదువుకోవాలనే దానిపై విద్యార్థికి స్వేచ్ఛ నివ్వాలి. ప్రాథమిక పాఠశాల విద్య మాతృ భాషలో మాత్రమే ఉండాలి. మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో రెండు మీడియంలను అనుమ తించాలి.ఖాళీలన్నీ డిఎస్సీ ద్వారా తక్షణం భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాలి. ఎంఈఓ-2,ప్లస్ టు పాఠశాలల వ్యవస్థపై సమీక్ష జరపాలి.ప్రతి పంచాయతీకి అన్ని హంగులతో ఒక ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉండేటట్లుగా ఏర్పాట్లు జరగాలి. ఉపాధ్యాయుల సమస్యలను విని పరిష్కరించే ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. బది లీల కౌన్సిలింగ్ విధానాన్ని బలోపేతం చేసే విధంగా బదిలీల చట్టాన్ని రూపొందించాలి. బదిలీల చట్టానికి భిన్నంగా ఎలాంటి బదిలీలు చేయడానికి అనుమతించకూడదు. యాప్‌లు, సెక్షన్లు, ఫార్మేట్లు పూర్తి చేయటం అనేది పాఠశాల పరిధిలో ఉండకూడదు. పాఠశాల పనిదినాలలో ఎలాంటి శిక్షణలు ఉండకూడదు. బడి అంటే పిల్లల కేంద్రంగా ఉండాలి. పిల్లలకు నైపుణ్యమైన, నాణ్యమైన విద్య అందించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానం అదనపు సోర్సుగా ఉండాలి తప్ప ఉపాధ్యాయుడు మింగివేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించకూడదు. స్కీముల పేరుతో రోజుకో రకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం కూడదు.రాష్ట్ర అవసరాలను తీర్చగలిగిన నూతన తరాన్ని తయారు చేసేటట్లు రాష్ట్ర విద్యా విధానం రూపొందించాలి. మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం విద్యలో చేస్తున్న మార్పులపై సమగ్ర చర్చ జరిపి, అందరి ఆమోదంతో అమలు చేయాలి. అంతి మంగా ప్రభుత్వ బడిని బలోపేతం చేసే వైపు కార్యాచరణ, ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులు జరగాలి. బడిలో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి.
ప్రభుత్వ బడికి ప్రత్యామ్నాయం లేదు
సమాజంలో నైతిక విలువలు,ప్రజాస్వామ్య విలువలు దృఢంగా నిలబడాలన్నా, మానవత్వం పరిమళించాలన్నా శ్రమజీవుల గురించి ఆలోచించే గొంతుకలు కావాలన్నా,ప్రశ్నించే తత్వం, పరిశోధనలు పెరగాలన్నా, భవిష్యత్తు తరంలో సమానత్వపు ఆలోచనలు పెంపొందిం చాలన్నా, చదువుకున్న చదువుని సమాజం కోసం నిస్వార్ధంగా వినియోగించాలన్నా ప్రభుత్వ బడి వుండాలి. డబ్బుతో కొనుక్కునే చదువు ద్వారా తయారైన పౌరుడు ప్రతిదాన్ని కొనుక్కునే వైపుగానే ఆలోచిస్తాడు. విద్యార్థి పరిపూర్ణ మానవత్వం కలిగిన వ్యక్తిగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలంటే ప్రభుత్వ బడిని బతికించుకోవాలి. కనుక ప్రభుత్వ బడిని రక్షించుకోవాల్సింది బలోపేతం చేయాల్సింది ఆ రంగంలో పని చేస్తున్నటు వంటి ఉపాధ్యాయులే. ఉపాధ్యాయ హక్కుల కోసం ఎంతగా కదులుతున్నామో, ఎంతగా తపిస్తున్నామో, హక్కుల రక్షణకు ఎంతగా ఆలోచిస్తున్నామో అంతకంటే ఎక్కువ బాధ్యతతో, చిత్తశుద్ధితో ప్రభుత్వ బడిని బతికించుకునేందుకు కదలాలి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యా యులు ముందుకు కదలాలి. నిరంతరం సమాజంతో మమేకం కావాలి.
తెలుగు భాషలో సరిగా పునాదులు వేయాలి! -డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్
‘బడి ఈడు పిల్లలకు ‘తెలుగు భాషలో సరిగా పునాదులు పడకపోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే ‘సమాజంలో ఉన్న సమస్యల గురించి లోతైన పరిశీలన చేయకపోవడం పరిష్కారాల గురించి సరైన దిశగా విశ్లేషణతో కూడిన చర్చ చేయక పోవడం.నిజానికి ప్రస్తుత చర్చలు అన్నీ కూడా ….పైపై మెరుగుల్లాగా,అంతా పైపై చర్చలే! 21వశతాబ్దంలో మన తెలుగువారు నమ్ముతున్న అతిపెద్ద అవాస్తవం ఏమిటంటే ‘ఇంగ్లీష్ రావా లంటే చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.తెలుగు రావాలంటే తెలుగు మీడియం లో చదవాలి‘అని.ఈ రెండు భావనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను,తల్లిదండ్రులను,రాజకీయ పార్టీలను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ రెండు భావనలతో ఆలోచించడం మానేసి , మెదడును మూసివేసి…వాస్తవాన్ని,సత్యాన్ని చూడటం లేదు మరియు కనీసం వినడం కూడా లేదు!! చర్చలలో వాస్తవాలను తెలుసు కోవడానికి ‘ఓపెన్ మైండ్‘తో ఉండటం ఎంతో అవసరం.కానీ ఘనీభవించిన ఆలోచనలు ఉన్న మెదడులు…నిజాలను తెలుసుకోవడానికి కానీ, వాస్తవాలను అంగీకరించడానికి కానీ సిద్ధంగా ఉండవు.
అసలు సమస్య..
విద్యార్థి తెలుగు మీడియంలో చదివినా (లేక) ఇంగ్లీష్ మాధ్యమంలో చదివినా ప్రాథమిక స్థాయిలో..వారి మోడల్ టైమ్ టేబుల్ ప్రకారం,1వ తరగతి నుండి 5వ తరగతి వరకు వారానికి తెలుగుకు కనీసం10 పీరియడ్‌లు ఉంటాయి.నిజానికి చాలా మంది ‘ మంచి ఉపాధ్యాయులు‘ తెలుగు ఇంగ్లీష్‌లకు ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తారు (అనగా ప్రతీ భాషకు వారానికి సుమారు 12నుండి 15పీరియడ్‌ల వరకు) తగినంత బోధనా సమయం కేటాయించినా కూడా విద్యా ర్థులకు తెలుగులో చక్కటి పట్టు ఎందుకు రావడం లేదు అన్నది అసలు ప్రశ్న లోపం ఎక్కడుంది? ఏదైనా భాషలో నైపుణ్యం (లాంగ్వేజ్ ప్రోఫిషియన్సీ) ఉన్నది అంటే ‘సంసిద్ధం కాని) పరిస్థితులలో కూడా విన డం,విన్నదాన్ని అర్థం చేసుకొని తగురీతిలో మాట్లాడటం,చదవడం మరియు రాయడం అనే నాలుగు నైపుణ్యాలు (శ్రీఱర్‌వఅఱఅస్త్ర,ంజూవaసఱఅస్త్ర, తీవaసఱఅస్త్ర aఅస షతీఱ్‌ఱఅస్త్ర)వచ్చి ఉండా.మన రాష్ట్రంలో పిల్లలు బడిలో చేరటానికి ముందే …ఇంటివద్దే వారికి తెలుగులో మాట్లాడిరది విని అర్థం చేసుకొని,తదుపరి తగినట్లుగా మాట్లాడటం అనేవి (శ్రీఱర్‌వఅఱఅస్త్రడ ంజూవaసఱఅస్త్ర) చక్కగావచ్చు.వాస్తవానికి బడి పిల్లలకు నేర్పా ల్సింది…తెలుగులో చదవడం,వ్రాయడం మాత్రమే! ఈరెండు నైపుణ్యాలు తెలుగు పిల్లలకు,తెలుగుగడ్డపై నేర్పడంలో‘తెలుగు రాష్ట్రాలబడులు’ఎందుకు విఫలమవు తున్నాయి..?లోపం ఎక్కడుంది?తెలుగును బోధించే విధానంలో లోపం ఉన్నదా?(లేక) తరగతి గదిలోనూ,పరీక్షలలోనూ విద్యార్థులు వ్రాసిన తప్పులను సరిచేయకపోవడంలో ఉన్నదా?
తెలుగును బోధించే విధానం..
అ) ముందుగా తెలుగు అక్షరాలు,గుణింతాలు, తదుపరిపదాలు,వాక్యాలు నేర్పుతూ ముందుకు వెళ్లడం ఒక పద్ధతి.
ఆ) మరొక పద్ధతి నేరుగా పదాలలోని అక్షరాలను గుర్తిస్తూ,పదాలను కూడా ఒకేసారి పరిచయం చేసుకుంటూ వెళ్లడం.ఇందులో అక్షరమాలను వరుస క్రమంలో పిల్లలకు నేర్పరు.నిజానికి విద్యార్థికి ఏవిధానంలో నేర్పినా…అక్షరమాలలోని అన్ని అక్షరాలు నేర్పడం,వాటి ఆధారంగా పదాలను చదవడం,తర్వాత రాయడం నేర్పుతారు.
పలకపై దిద్ధితేనే తెలుగు వస్తుందా..
తెలుగు అక్షరాలు నేర్పేటప్పుడు ‘ఒకప్పుడు అక్షరాలు ఇసుకలో దిద్దించేవారు,తర్వాతి కాలంలో పలక మీద, ప్రస్తుతం నోట్ పుస్త కంలో వ్రాయిస్తున్నారు.ఇందులో ఒకపద్ధతి కన్నా,మిగిలిన పద్ధతులు ఏమాత్రం ఉత్తమ మైనవి కావు.
తప్పులను సరిచేయకపోవడమే అసలు లోపం..
ప్రాథమిక స్థాయినుండే అత్యధిక మంది ఉపాధ్యాయులు తెలుగులో విద్యార్థుల తప్పులను (చదివినప్పుడు,వ్రాసినప్పుడు)సరిచేయడం చాలా వరకు ఆపేశారు. కనీసం క్లాస్ నోట్స్‌లో కూడా తప్పులను ఎర్ర పెన్నుతో రౌండ్ చేసి …సరైనది వ్రాయడం లేదు.1వ తరగతినుండి పరీక్షలలో25కి23-24-25లు వేయడంకోసం అన్నిటికీ కరెక్ట్ అని టిక్కులు కొడుతున్నారు. దీని వలన విద్యార్థులు వాళ్ళు వ్రాసింది( తప్పు లు అయినా) కరక్టే అనే భావనలో ఉంటు న్నారు. ఇదే విధానంపై తరగతులలో కూడా జరుగుతుంది.ఏదైనామార్కులు 23,24,25లు వేయాలంటే..అన్నిటికీ రైట్‌లు కొట్టుకుంటూ వెళ్ళాల్సిందే కదా !!అదే ఉపాధ్యాయులు చేస్తున్నారు.విద్యార్థులు వ్రాసినదాన్ని సరిచేయడం అనేది దాదాపు ఆగిపో యింది.కొద్ది మంది నిబద్ధత కల్గిన ఉపాధ్యా యులు,ప్రశ్నించే తల్లిదండ్రులు ఉన్న చోట్ల మాత్రమే తప్పొప్పులు కొంతమేర సరిచేస్తున్నారు.
బాధ్యతా రాహిత్యం నుండి మార్కుల వరద వరకు…
తరగతి గదిలో ప్రాథమిక స్థాయిలో,సెకండరీ స్థాయిలో చేయాల్సినవి చేయకుండా..పరీక్షలలో మార్కుల వరద తీసుకువస్తున్నారు.2024 పది పబ్లిక్ పరీక్షలలో6,854మందికి తెలుగులో 100 కి100మార్కులు వచ్చాయి.ఇవి నిజంగా నిక్కచ్చిగా పేపర్లు దిద్దిన తర్వాత వస్తే … ఆవిద్యార్థులు మన తెలుగు జాతికి గర్వకా రణం.అప్పుడు భాషాభిమానులు దిగులు పడాల్సిన పనేమీలేదు!! ఎందుకంటే భాషను కాపాడే శక్తియుక్తులు ఆ పిల్లలకు ఉన్నాయి అని గుండెల మీద చేయివేసుకొని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు! ఈమార్కులు నిజమైనవని,వారు వ్రాసిన సమాధానాలలో తప్పులే లేవని ప్రభుత్వం భావిస్తే ‘తెలుగులో 100కి100మార్కులు వచ్చిన విద్యార్థుల జవాబు పత్రాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టండి. (విద్యార్థుల పేర్లు,హాల్ టికెట్ నెంబర్‌లు కనబడకుండాచేసి…ఆపేపర్లు పబ్లిక్ డొమైన్‌లో ఉంచడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు). తప్పులు లేకుండాఉన్న జవాబుపత్రాలు తల్లిదం డ్రులు చూస్తే,వారి పిల్లలు కూడా అలా రాయలని తపన పడతారు ,వారి పిల్లలను కూడా ఆదిశగా ప్రోత్సహిస్తారు.నిజానికి దీనివలన సమాజంపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
తల్లిదండ్రులపై నెపం వేయడం తప్పు….
తల్లిదండ్రులకు తెలుగుపై మక్కువలేదని, ఇంగ్లీష్‌పై మోజుందని చెప్పడం అనేది ‘సమస్య ను పక్కదారి పట్టించడమే !.వాళ్ళపిల్లలు వ్రాస్తున్న, చదువుతున్న తప్పులను సరికుండా,కనీసంఎత్తి చూపకుండా మార్కులు కుమ్మరిస్తుంటే…వాళ్ళు అంతా సవ్యంగా ఉంది అని అనుకుంటున్నారు.
చక్రపాణి మాష్టారు లాంటి వారు ఆదర్శం…
తాడికొండ గురుకులపాఠశాలలో 1992లో 10వ తరగతి విద్యార్థులందరికీ పబ్లిక్ పరీక్ష లలో తెలుగులో 90కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. మార్కులు నిక్కచ్చిగా వేసే ఆరోజుల లోనే కాదు…ఇప్పటికీ అది రికార్డే! ఈరికార్డుకు మూలకారణం‘చక్రపాణి మాష్టారు ‘…ఆయన తెలుగు మాష్టారు.ఆయన జవాబు పత్రాలు దిద్దేటప్పుడు ప్రతీతప్పును హైలైట్ చేసేవారు.ప్రతీతప్పుకు 1/4% మార్కు తగ్గించే వారు.కొత్తగా చేరిన విద్యార్థులు కూడా, రెండు మూడు పరీక్షలు ముగిసేటప్పటికి తప్పులు లేకుండా వ్రాసేవారు.నేర్చుకోవడం అనేది విద్యార్థికి ఉన్న సహజ స్వభావం.పరీక్షలలో తప్పులు సరిజేయకుండా, అధిక మార్కులు వేసుకుంటూ వెళ్లడం వలన ‘విద్యార్థులకు ఉండే నేర్చుకునే స్వభావం మసకబారు తుంది,మరియు మొద్దుబారిపోతుంది. కావున తెలుగు భాషను కాపాడాలంటే ‘ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు (క్లాస్‌టీచర్‌లు),హై స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయులు నడుంకడితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. విద్యార్థులు వ్రాసిన తప్పొప్పులను,ఉపాధ్యాయులు ప్రతీ దశలోనూ సరిచేయాలి.తప్పులను సరిచేస్తే పిల్లలు బాధపడతారు అనేది …చాలా అసంబద్ధమైన, పసలేని వాదన!! ఎందుకంటే వారు బాధపడటం,బాధపడకపోవడం అనేది మన హావభావాల మీద-దండన లాంటి విషయాలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కావలసింది తప్పులనుసరిదిద్ది,విద్యార్థులను మరింతగా ప్రోత్సహించే అభ్యుదయ కాముకులైన ఉపాధ్యాయులు, హెడ్‌మా స్టార్లు.వారికి పాఠశాల యాజమా న్యాలు మరియు విద్యాశాఖ అధికారులు పూర్తి సహకారాన్ని అందిస్తూ, పర్యవేక్షణను పెంచాలి.అప్పుడే తెలుగు భాష మరలా తన పూర్వ వైభవాన్ని పొందుతుంది.
-(ఎన్.వెంకటేశ్వర్లు)