ప్రపంచ జీవకోటికి సముద్రమే ఆధారం

మన నివసించే ఈ భూ గ్రహంపై భూమి కేవలం 29 శాతం మాత్రమే ఉండగా.. మిగిలినదంతా సముద్ర నీరే. ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రాల పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తాచెదారంతో నిండిపోతు న్నాయి. విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి కడలి నీటిలో పడేస్తున్నారు మనుషులు. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని సముద్రజీవులు కూడా అంతరించిపోతున్నాయి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలా వరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతి సంవత్సరం జూన్‌ 8న ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రా న్ని చెత్తమయం చేస్తున్నారు. చాలా దేశాలు వ్యర్థాలను నౌకల్లో తరలించి సముద్రాల్లో పడేస్తున్నాయి. ఇలా రోజూ వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటుంది. భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు ఇతర జీవుల్ని చంపేస్తోంది. ఆ కాలు ష్యపు నీటిలో అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. సముద్రాలను కాపాడుకు నేందుకు తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమి కులు అంటున్నారు. ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచా లని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008లో తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి..జీవులూ బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌గా ఎంపిక చేశారు.సాగరం బాగుంటేనే సకల జీవరాసులు బాగుంటాయి అనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలావరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు అని, సముద్రానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్‌ 8 న సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రాన్ని చెత్త మయం చేసేస్తున్నారని, చాలా దేశాల్లో వ్యర్థాలను నౌకలో తరలించి సముద్రంలో పడేస్తున్నారని, ఇలా రోజూ వేల టన్నుల్లో చెత్త సముద్రంలో కలుస్తుందనీ,అందులో ఎక్కువ భాగం ప్లాస్టిక్‌ ఉంటుందని, ఈ కాలుష్య కారకం వల్ల సముద్రా ల అరుదైన జీవజాతులు అంతరించి పోతున్నాప్రజలకు సముద్రాల యొక్క ఆవశ్యకత ఉంది. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయో జనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యా వరణ ప్రేమికులు అంటున్నారు. బీచ్‌ల వంటి నీటి వనరుల చుట్టూ.. మన అజాగ్రత్త వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో సము ద్రంలోని అనేక వేల జీవరాశులు మరణిస్తు న్నాయి. కొన్ని కలుషితమైపోతు న్నాయి. వీట న్నింటి వల్ల ప్రకృతి విపత్తులు జరిగే అవకాశం కూడా ఉంది.అందుకే ఈ విషయాలన్నీ ప్రజల కు వివరించి..సముద్రాల సుస్థిర అభివృద్ధికి కృషి చేసేలా..వారికి అవగాహన కల్పిస్తారు.
ప్రాముఖ్యత
సముద్రం కనీసం 50% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని ఐక్యరాజ్యసమితి డేటా సూచిస్తుంది. మహాసముద్రాలు 30% కంటే ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయని.. ఇవి గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాలను తగ్గిస్తాయని రుజువు చేసింది. చెత్త, మురుగు, చమురు లీకేజీల వంటి మానవ కార్యకలాపాల చర్యల వల్ల.. విధ్వంసం జరిగే అవకాశముంది. ఈ విష యాలపట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకో వాలి.
సముద్రాలూ కలుషితం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి అటు జీవనోపాధిని ఇటు పౌష్టికాహారాన్ని సముద్రాలు అందిస్తున్నాయి. ప్రపంచ పటంలో మూడు వంతులకు పైగా సముద్రాలు విస్తరించి ఉన్నా యి. ప్రకృతి సంపదలో సముద్ర జలాలది కీలక స్థానం అయినప్పటికీ రానురానూ అవి కాలు ష్యం బారిన పడుతున్నాయి. మనం యథేచ్ఛగా సముద్ర జలాలను కలుషితం చేస్తూ, సముద్ర జీవుల మనుగడకే ముప్పు ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతున్నది. ప్లాస్టిక్‌ సంచులు, ఇతర వస్తువులు పర్యావరణానికి హాని చేస్తాయని అందరికీ తెలిసినా, వాటి వినియోగాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం గమనార్హం. ప్లాస్టిక్‌ వినియోగం విషయంలో యావత్‌ మానవాళి ‘తాను కూ ర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కొన్నట్లు’గా వ్యవహరిస్తున్నది. మానవ శరీర నిర్మాణంలో ప్రొటీన్లది చాలా కీలక పాత్ర. అటువంటి ప్రొటీన్లను సమృద్ధిగా అందజేసే సత్తా ఒక్క సముద్ర జీవులకే ఉంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సముద్రాలలో 5 ట్రిలి యన్‌ల మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయి. వీటిని సముద్ర జీవులు (చేపలు వంటివి) మింగడం, వాటిని మనం ఆహారంగా తీసుకోవడంతో పలువురు కాన్సర్ల బారిన పడుతున్నారు. 2025వ సంవత్సరం నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌, చేపల నిష్పత్తి 1:3గా ఉంటుందని అంచనా. పలు దేశాలు వ్యర్థ జలాల ను సముద్రంలోకి వి చక్షణా రహితంగా వ దులుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సముద్రం లో కలుస్తున్న డ్రైనేజ్‌ వాటర్‌లో 70 శాతం శుద్ధి చేయనందు న సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి. సముద్ర వాతవారణంలో పెను మార్పులు కలుగుతున్నాయి. దీనివల్ల సాలీనా 13 బిలి యన్‌ డాలర్ల నష్టం జరుగుతుందని యుఎన్‌ఇపి అంచనా వేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్ర జలాల్లో పారవేస్తున్న దేశాల్లో భారత్‌, చైనాలు ముందువరసలో ఉండటం గమనార్హం. మన దేశంలో సాలీనా ప్లాస్టిక్‌ వినియోగం 15 మిలియన్‌ టన్నులు. ఇది 2050 నాటికి 20 మిలియన్‌ టన్నులు అవుతుందని అంచనా. 2050 నాటికి సముద్ర జలాల్లోని ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించకపోతే, సముద్రాలలో ఉండే చేపల బరుకన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రీ సైక్లింగ్‌’కు పనికిరాని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల తయారీని చాలా దేశాల్లో నిషేధించారు. అయితే దాని అమలు శూన్యం. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కొన్ని దేశాలు రోడ్ల నిర్మాణంలోను, విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగి స్తున్నాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వినియో గిస్తున్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. మనకన్నా అభివృద్ధిలో, ఆర్థికంగా వెనుకబడిన దేశాలైన రువాండా, బంగ్లాదేశ్‌, కీన్యాలు ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ, వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. ఇకనైనా సముద్ర జలాలలోకి ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదలడం ఆపకపోతే, చేపలకన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.- జిఎన్‌వి సతీష్‌