ప్రజాస్వామ్యం నుదుట చెరగని తిలకం
-(థింసా రీసెర్చ్ సెంట్రల్ డెస్క)
- ప్రజాస్వామ్యానికి పండుగ వంటి ఎన్నికల నిర్వహణలో కాలంతోపాటు ఎన్నోమార్పులు వచ్చా యి.కానీ దశాబ్దాలుగా చెక్కు చెదరని ఒక అంశం మాత్రం ఈ ప్రక్రియలో కీలక భూమిక వహిస్తూనే ఉంది.అదే.. ఓటు వేసినవ్యక్తి ఎడమచేతి చూపుడు వేలుపై సిరా ముద్ర.కొన్ని రోజులపాటు చెరిగి పోకుండా ఉండే ఈసిరా (ఇండెలిబుల్ ఇంక్)కు పెద్ద చరిత్రే ఉంది.
- దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది.ప్రభుత్వం ప్రకటించిన విధంగా మే13న ఏపీలో ఒకేవిధంగా 175అసెంబ్లీ స్థానా లకు 25పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగ బోతున్నాయి. పోలింగ్ తేదీన ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ లోపల ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఎడమచేతి చూపుడువేలుపై ఒకసిరా చుక్కను పెడతారు.ఈచుక్క 72గంటల వరకు (3రోజులు) చెరిగిపోకుండా ఉంటుంది.దొంగ ఓట్ల నివారణకై దీనిని ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. 10మి.లీ. సామర్ధ్యం కలిగిన ఒకసిరా సీసా(వైల్)700 మంది కి చుక్కలు పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఓటరుకు ఎడమచేయలేకపోయినా, ప్రమా దంలో కోల్పోయినా,అప్పుడు మాత్రమే అధికారుల అనుమతితో కుడిచేతికి పెట్టాలనే నిబంధన కూడా ఉంది.
- 1962 నుంచి కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమి టెడ్ దీనిని ఉత్పత్తి చేస్తుంది. ఎన్నికల సంఘానికి మాత్రమే సరఫరా చేస్తోంది.చెరగని సిరాను ఢల్లీి లోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్` నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ ప్రత్యేకంగా ఈ కంపెనీ కోసం అభివృద్ధిపరిచి ఇచ్చింది.ప్రస్తుతంలోక్‌సభ, దాంతో పాటే నిర్వహించే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల కోసం ఏర్పాటుచేసే 12లక్షల పోలింగ్ కేంద్రా లకు అవసరమైన సిరా సరఫరా ఇప్పటికే పూర్త య్యిందని తయారీ సంస్థ వెల్లడిరచింది. రూ.55 కోట్ల విలువైన 26.55లక్షల సిరా బుడ్ల(వయల్స్) ను అందించినట్లు తెలిపింది.అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌కు 3.64లక్షల వయల్స్,అత్యల్పంగా లక్ష ద్వీప్‌కు 125 వయల్స్ పంపించారు.ఒక్కో బుడ్డీలో 10మిల్లీటర్ సిరా ఉంటుందని,700మంది ఓటర్ల వేలికి రాయడానికి వస్తుంది.
- అక్కడ సిరాలో వేలిని ముంచుతారు..
- చెరిగిపోని సిరాను 25కు పైగా దేశా లకు మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎగుమతి చేస్తోంది.కెనడా,ఘనా,నైజీరియా, మంగోలియా,మలేసియా,నేపాల్,దక్షిణాఫ్రికా, మాల్దీవులు,తుర్కియో తదితర దేశాలు మన సిరాను ఎన్నికల్లో అక్రమాలను ఆరికట్టడానికి వినియోగి స్తున్నాయి.అయితే,సిరా విని యోగించే విధానం వేర్వేరుగా ఉంటుంది. కంబోడియా,మాల్దీవులలో ఓటరు తన వేలిని సిరాలో ముంచాలి. బర్కినా పాసోలో కుంచెతో,తుర్కియేలో నాజిల్‌తో ఇంక్ ముద్ర వేస్తారు.
- పోలియో చుక్కల కోసం..
- ఈ సిరా చుక్కను మనదేశంలో 1962 నుంచి వాడుతున్నారు.ఇది కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిస్ కంపెనీ తయారు చేస్తుంది. అయితే డిమాండ్‌ను బట్టి కర్ణాటకతో పాటు హైదరా బాద్‌లోనూ తయారీచేసే కంపెనీ ప్రభుత్వం అనుమతించింది.ప్రస్తుతం ఇదే సిరాను చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసినప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు.ఇదే సిరాను మనదేశంలో ఎన్నికలకు కాకుండా 1976 నుంచి 29 దేశాలకు భారతదేశం ఎగుమతి చేస్తుంది. ఎన్నికల సంఘ నిబంధనలు సెక్షన్37(1)ప్రకారం ఓటరు ఎడమ చేతిపై చూపుడు వేలుపై సిరా చుక్క వేయ్యాలి. 2006 ఫిబ్రవరి నుంచి వేలుతోపాటు గోరు పై భాగంలో కూడా సిరా చుక్క వేస్తున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య ప్రజానీ కం మొదలు సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. కొందరు తాము ఓటు వేసిన అనంతరం తాము ఓటు చేశామని చెబుతూ తమ ఎడమ చేతిచూపుడు వేలును చూపుతుంటారు. కొంత మంది తాము వేసిన ఓటు చిహ్నం(చూపుడు వేలిపై ఉన్న సిరా చుక్క)తో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇంత చేస్తున్నా వారికి ఓటు వేసే సమయం అధికారులు తమ వేలిపై వేసే సిరా చుక్కను అంతంగా పట్టించుకోరు. అయితే అధికారులు వేలిపై వేసే సిరా చుక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఓటు వేసిన వ్యక్తి మళ్లీ ఓటు వేయకుండా ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి 1962 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది. దొంగఓట్లు వేయకుండా కట్టడి చేసేందుకు సిరా గుర్తు పద్ధతి మంచి ఫలితాలే ఇస్తోంది. సిరా చుక్క. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు..దొంగ ఓట్లను నిరో ధించే ఆయుధం కూడా అదే. ఎన్నికల్లో ఉపయోగించే సిరాను చెరగని సిరా (ఇండెలిబుల్ ఇంక్) అంటారు. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్ మార్కర్లను తీసుకొచ్చారు.ఈ ఇంకును స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లల కు పోలియో చుక్కలు వేసే సమయంలోనూ వీటిని ఉపయోగి స్తుండటం గమనార్హం.
- 1950లో పేటెంట్
- ఓటర్లకు సిరా వేసే విధానం చాలాకాలంపాటు లేదు.1950 సంవత్సరంలో ఈ సిరా పేటెంట్ ను భారత్‌లోని నేషనల్ రీసెర్స్ అండ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఆర్‌డీసీ) పొందింది. ఆతర్వాత సీఎస్‌ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్‌కు చెందిన నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఈసిరాను అభివృద్ధిచేసింది
- సీరా చుక్క ప్రత్యేకతలు..
- సిరా గుర్తు మాత్రమే కాదు..దొంగ ఓట్లను ఆపే ఆయుధం కూడా..
- ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తికి ముందుగా ఎడమ చేతి చూపుడు వేలుకి సిరా గుర్తు వేసి అనుమతి ఇస్తారు.
- గోరుతోపాటు చర్మానికి కలిపి వేసిన ఈగుర్తు చెరపడం సాధ్యం కాదు.దీంతో ఆవ్యక్తి తిరిగి వచ్చి మరో ఓటు వేయడం సాధ్యం కాదు.
- వేలికి పూసిన 15నుంచి 20 సెకండ్లలో ఈ సిరా ఆరిపోతుంది.కొన్ని రోజులకి ఈ గుర్తు మెల్లగా చెరిగిపోతుంది.
- ఎన్నికలకు వినియోగించే దీని తయారీ కోసం పదిశాతం ఇంకుతోపాటు 14 నుంచి 18శాతం సిల్వర్ నైట్రేట్ కలిపి చేస్తారు.
- సిల్వర్ నైట్రేట్ సన్‌లైట్ తగిలిన వెంటనే గుర్తులా ఏర్పడుతుంది.దీని కారణంగానే ఈ ఇంకు గుర్తు త్వరగా పోదు.
- దొంగ ఓట్ల నిర్మూలనే లక్ష్యంగా చేసుకొని ఈ సిల్వర్ నైట్రేట్ సిరా ఎన్నికల సమ యంలో ఎలక్షన్ అధికారులు ఉపయోగి స్తున్నారు.