ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకం
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఓటును సద్వినియోగం చేసుకోవాలి.పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంచి నాయుకుడిని ఎన్నుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది.ఎన్నికల్లో ఉత్తములను ప్రజాప్రతి నిధులుగా ఎన్నుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఓటు హక్కు వినియోగం విషయంలో స్వచ్ఛంధంగా నిర్ణయం తీసుకోవాలి.ఎవరో చెప్పారని ఓటు వేయకూడదు.దీనిపై మరింతగా చైతన్యం పెంపొం దించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును వజ్రాయుధంగా వినియోగించాలి. విద్యావంతులను ఎన్నుకుంటే సుపరిపాలనకు అవకాశం ఉంటుంది.నేర చరితులు చట్టసభల్లోకి వెళ్లకుండా చూడాలి. ఈ బాధ్యతను యువత తీసుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలి.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగిం చుకోవాలని ఎన్నికల సమయంలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును ఎలాంటి ఒత్తిడులకు, ప్రలోభాలకులోను కాకుండా సక్రమంగా వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్ను కోవడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించిన వరం.ఈహక్కును సద్వినియోగం చేసుకొని సమర్థవంతమైన నాయక త్వాన్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఓటు విలువ,ప్రాముఖ్యత తెలుసుకోవాలి.ఇతరలను చైతన్యవంతులను చేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని, దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చాటిచెప్పాలి.
దేశ ఆర్థిక,సామాజిక,రాజకీయాలలో ఓటు హక్కు ఎంతో విలువైన పాత్ర పోషిస్తుంది. అర్హతగల ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి.నోటుకు తలవంచితే జీవితాంతం తలదిం చుకునే జీవించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.విజ్ఞులైన భవిష్యత్ భద్రంగా ఉండాలంటే నీతి నిజా యితీగా ఎన్నికల్లో పోటీచేసి వారికి అండగా నిలవండి.ఓటును మించిన ఆయుధం లేదు.మనం వేసే ఓటు బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ గొప్పది.ఆదాయం,చదువులో మాత్రమే కాదు..సామాజిక బాధ్యతతో కూడా ఓటు వేసేందుకు ముందుండాలి.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటే వేసేలా ఇంటిలో,ఆఫీసుల్లో,బంధువులు,స్నేహితులకు అవగాహన కల్పించి చైతన్యపర్చాలి.ఓటుకు మించిన ఆయుదం లేదు.ఓటుతో తీసుకురాలేని విప్లవం ఉండదు.ఓటు అనేది హక్కు కాదు..నీబాధ్యత. బాధ్యతాయుతమైన పౌరులు అనిపించుకోవాలంటే ఓటుహక్కును తప్పనిసరిగా వినియో గించు కోవాలి.
ప్రజాస్వామ్యాన్ని మన ఓటేనడిపిస్తుంది.భవిష్యత్తుకు ఓటు అభివృద్ధికోసం ఓటు. ప్రజా స్వామ్య విలువలకు జీవంపోయాలి.ప్రజాస్వామ్యంలోవిలువలను చాటి చెప్పాలన్నా, అక్రమార్కుల పాలనకు స్వస్తి పలకాలన్న నీ ఓటే కీలకం. ప్రజాసంక్షేమానికిపాటు పడేవారిని ఎన్నుకోవాలి. ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపే తమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.అందుకే ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధానకర్తవ్యం.అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకో వద్దు.మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మా ణం సాధ్యమవుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం.ప్రజల చేతఎన్నుకోబడి,ప్రజల కొరకు పనిచేస్తూ,ప్రజలే పాలకులు గల పాలన విధానమే ప్రజాస్వామ్యం.మనలోనే మార్పు రావాలి..ఓటే వారధి కావాలి!– రవి రెబ్బాప్రగడ ,ఎడిటర్