ప్రజలకు జవాబుదారిగా ఉండేలా పాలన చేద్దాం

ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సీఎంగా తాను కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తానని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరిం చాలని ముఖ్యమంత్రి సూచించారు. పీ4 ద్వారా పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్స్‌ పార్టనర్షిప్‌ ద్వారా పేదల జీవన ప్రమాణాల్ని మార్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ఏపీ దేశంలో నెంబర్‌ 1గా ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ చేయలేక పోవటం వల్ల 4 లక్షల ఎకరాలకు నీరివ్వలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే వాటి నిర్వహణను కూడా సక్రమంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని గుంతలు పడిన రహదారులకు మరమ్మత్తులు నిర్వహణ చేయాల్సి ఉందన్న సీఎం ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడిరచారు. -జిఎన్‌వి సతీష్‌
సంక్షేమం,అభివృద్ధి,సుపరిపాలన ఎన్డీయే విధానం.పేదల ఆదాయం పెరగాలి..ఖర్చులు తగ్గాలి. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పని చేస్తాం.సూపర్‌-6,మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం.సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఉండాలనేది ఎన్టీఆర్‌ ఇచ్చిన నినాదం. ఎన్టీఆర్‌ రూ.2 లకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు…అది ఇప్పుడు దేశం మొత్తం అమలైంది.పేదలకు పింఛనురూ.30లతో ప్రారంభించారు.రైతులను ఆదుకు నేందుకు రూ.50లకే హార్స్‌ పవర్‌ విద్యుత్‌ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు…పక్కా ఇళ్లని ఆలోచించి ఇళ్లు కట్టించారు.సగం ధరకే జనతా వస్త్రాల పంపిణీ చేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.162రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు.
భవిష్యత్‌లో 3.7లక్షల కోట్ల మేర పెట్టుబడులు: ప్రస్తుతం ఏపీలో 1.2 లక్షల కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులు జరగాల్సి ఉందని, అలాగే 70 వేల కోట్ల రైల్వే లైన్‌ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఎన్డీఏ కూటమి ప్రథమ ప్రాధాన్యత జాబ్‌ ఫస్ట్‌ అన్న సీఎం అందుకే మొదటి సంతకం16 వేల 300ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై చేశానని స్పష్టంచేశారు. మెగా డీఎస్సీద్వారా ఈఉద్యోగాల భర్తీ చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వీటితో పాటు పారిశ్రామికంగా,పర్యాటకంగా,చిన్నతరహా పరిశ్రమలు,ఫుడ్‌ ప్రాసెసింగ్‌ద్వారా పెట్టుబడులు, ఉపాధి సాధించాలని అందుకే వీటిపై కొత్తవిధానాలను తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సా హక బోర్డులోనూ 85వేలకోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.34 వేల ఉద్యోగాలు వీటి ద్వారా వస్తాయని భావిస్తున్నామన్నారు.అలాగే 1లక్షకోట్ల పెట్టుబడులు ఎన్టీపీసీ,ఏపీ జెన్కో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌?ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు.రిలయన్స్‌ బయో సంస్థ కూడా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోందని, వీటి ద్వారా 2.5లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సమీప భవిష్యత్‌లో 3.7లక్షల కోట్ల మేర పెట్టుబడులు,అదేస్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఉద్యోగాల ఆధారంగా ప్రోత్సాహకాలను ఇచ్చే పాలసీని కూడా ఏపీలో అమలు చేస్తున్నామ న్నారు.గత ప్రభుత్వం శాంతిభద్రతల్ని నిర్లక్ష్యం చేసిందని, రాజకీయ ప్రాధాన్యతతో అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గంజాయి,డ్రగ్స్‌తో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నా సీఎం,మహిళల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గంజాయి నివారణకు డ్రోన్స్‌ద్వారా నిఘా పెట్టినట్లు వెల్లడిరచారు.
కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదు
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డిసెంబరు మొదటి వారం లో రాష్ట్రవ్యా ప్తంగా ర్యాలీ చేస్తామని, ఆర్యాలీలో తాను కూడా పాల్గొంటానన్నారు.తెలుగువారు ప్రపంచ వ్యాప్తం గా నాలెడ్జ్‌ ఎకానమీలో రాణిస్తున్నారన్నారు. కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదని,వారికి గట్టిగా హెచ్చరి కలు జారీచేశారు.గతంలో ఫింగర్‌ ప్రింట్‌ అనాలసిస్‌ కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.కూటమి ప్రభు త్వం శాంతి భద్రతలకు అగ్రపాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.అభివృద్ధి,సంక్షేమంసజావుగా సాగాలంటే సుపరి పాలన ఉండాలన్నారు.ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ యాక్టు`2024కు తీసుకువస్తున్నామన్న సీఎం,ఇందులో భూఆక్రమణ దారే తనకు హక్కులు ఉన్నాయని నిరూపిం చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.తప్పని తేలితే14ఏళ్ల జైలు శిక్ష భారీజరిమానా ఉంటుందన్నారు. మద్యందు కాణాల విషయంలో ప్రభుత్వం కఠి నంగా ఉంటుందని, బెల్టు దుకాణాలు వస్తే బెల్టు తీస్తామని హెచ్చరించారు. మద్యం అక్రమాల విషయంలో మన, తన అనే బేధాలు ఏవీ ఉండవని తెలిపారు.ఉచిత ఇసుక సరఫరా విషయంలోనూ ఎలాంటి రాజీ ఉండబోదని తేల్చి చెప్పా రు.ఐదేళ్లపాటు చీకటిజీవోల ద్వారా పాలన సాగించారని, వాటన్నింటినీ ఆన్‌లైన్‌లో పెడుతూ నిర్ణయం తీసుకున్నా మన్నారు.పౌరసేవలన్నీ ఇకపై వాట్సప్‌లో ఇచ్చేలా నిర్ణ యం తీసుకుంటున్నామని వెల్లడిరచారు.రెవెన్యూ, దేవా దాయ,రవాణా,ఆర్టీసీ,గ్రీవెన్సు ఇలా వివిధ శాఖల సేవలు ఇక వాట్సప్‌ ద్వారా ఇస్తామన్నారు.150 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌,వాట్సప్‌ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
శాసనసభ వేదికగా 2047 విజన్‌ డాక్యుమెంట్‌
నదుల అనుసంధానం కూటమి ప్రభుత్వ విధాన మని స్పష్టం చేశారు.సంక్షేమం,అభివృద్ధి,ఆదాయం, సాంకేతికతతో కూడిన సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యాలని వెల్లడిరచారు. ఓర్వకల్లులో డ్రోన్స్‌ సిటీ ఏర్పాటు చేసి నైపుణ్యశిక్షణ,పైలట్‌ ట్రైనింగ్‌,ఉత్పత్తి చేస్తామని అన్నా రు. రాష్ట్రంలో సవాళ్లు,సమస్యలు చాలా ఉన్నాయన్న సీఎం,రాత్రికి రాత్రి మారిపోతుందని చెప్పటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగకుండా మంత్రుల కమిటీ నియమించా మన్నారు.శాసనసభ వేదికగా 2047విజన్‌ డాక్యు మెంట్‌ ను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడిరచారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టాలు వారసత్వంగానే వచ్చా యని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్‌ పోయిందని, సమస్యలు కూడా వచ్చాయ న్నారు. వ్యవస్థలు కూడా ఛిన్నాభిన్నం అయ్యాయన్నారు. రాష్ట్రానికి దశ దిశ చూపించటంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాముల బలిదానం వృథాగా పోదని,ఆస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే లా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్వాతంత్య్రం రాక ముందు తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ ఎంత మంది వచ్చినా అన్నం పెట్టారన్న సీఎం,అందుకే మధ్యా హ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో అరాచకాలు, గంజా యిపై డిప్యూటీ సీఎం చాలా గట్టిగా ఉన్నారని, తాము ఇద్దరం కలిసి ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. మహిళ లకు అవమానం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు లు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్య మంత్రి హెచ్చరించారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని సూచించారు. ప్రాణాలకు ముప్పు ఉన్నా లెక్క చేయకుండా ముఠా నాయకులు, మత విద్వేషాలు, నక్సల్స్‌ను నియంత్రించానని తెలిపారు.
కొందరు రౌడీలు,బ్లేడ్‌ బ్యాచ్‌లు ఉన్నాయి. వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థను కూడా సంస్కరిస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరూ శాంతిభద్రతల్ని చేతుల్లోకి తీసుకో వద్దని చెబుతున్నామని అన్నారు. ఎవరైనా దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఉక్కుపాదంతోనే అణచివేస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్‌ కావాలని అన్నారు.ప్రజలు కూడా ప్రభుత్వానికి సహక రించి వారి కుటుంబాలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని చంద్ర బాబు ఆకాంక్షించారు.రైతులు పంపుసెట్ల వద్ద సౌర విద్యుత్‌ ప్యానళ్లుపెట్టుకుంటే మిగిలిన విద్యుత్‌ విక్రయిం చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రిడ్‌కు అనుసంధానించడంద్వారా తిరిగి సొమ్ము పొందే అవకా శం రైతులకు ఉంటుందని వెల్లడిరచారు.దీనిపై శాసన సభ్యులు తమ నియోజకవర్గాల్లో రైతులను ప్రోత్సహిం చాలని సూచించారు.
ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు – 10 భారీ పరిశ్రమలకు లైన్‌ క్లియర్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 85 వేల కోట్ల పెట్టుబడు లకు ప్రభుత్వ ఆమోదం లభించింది. 34వేల ఉద్యోగాలు కల్పించే 10భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు అధ్య క్షతన జరిగిన ఎస్‌ఐపీబీ (ూ్‌a్‌వ Iఅఙవర్‌ఎవఅ్‌ ూతీశీఎశ్‌ీఱశీఅ దీశీaతీస) తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రు లు నారాలోకేశ్‌,పయ్యావుల కేశవ్‌,గొట్టిపాటి రవి, అన గాని సత్యప్రసాద్‌,అచ్చెన్నాయుడు,టీజీ భరత్‌, నారా యణ,వాసంశెట్టి సుభాష్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ భేటిలో ఈ అను మతులు, భూములు ఇచ్చేందుకు నిర్ణయిం చారు.