ప్రకృతి వైఫరిత్యాలు..పెరుగుతున్న మార్పులు

ప్రకృతి ప్రకోపానికి ప్రపంచ దేశాలు అల్లకొల్లోల మవుతున్నాయి. మొన్న అమెరికాలో సంభవించిన ఐస్‌ తుఫాన్లు, నిన్న టర్కీ,సిరియా రెండు దేశాల్లో సంభవించిన వరస భూకంపాలుతో సుమారు 4,500మంది మృతిచెందగా వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు. నేడు ఆఫ్రికా దేశం లిబియా లోని డెర్నా నగరంలో సంభవించిన డేనియల్‌ తుఫాన్‌ కారణంగా ఏర్పడిన వరదల ధాటికి లిబియా దేశం అతలాకుతలమైంది. ఓ వైపు భారీ వర్షాలు,మరోవైపు ఆకస్మిక వరదలు లిబియాలో పెను వివిధ్వంసాన్ని సృష్టించాయి.ఈ క్రమంలోనే డ్యామ్‌లు పగిలిపోవడం తో ఏకంగా డెర్నా నగరం పూర్తిగా మునిగిపోయింది. రాత్రి నిశ్శబ్ధంగా ఉన్న నగరంలో ఉదయం వరకు తుఫాన్‌ విలయం సృష్టించింది. ఎటు చూసినా కూలి పోయిన బిల్డింగ్‌లు, కొట్టుకుపోయిన శవాలు, వాహనాలతో భీతావహ దృశ్యాలు కనిపి స్తున్నాయి. సుమారు 20వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.మెరుపు వరదల ధాటికి వేల మంది తీరానికి కొట్టుకొస్తున్నాయి. దీంతో సముద్ర తీరంలో శవాలు కుప్పగా మారింది. ఇప్పటికే టెర్రరిజం, అశాంతితో నిత్యం ఘర్షణలు జరిగే డెర్నా నగరంలో డేనియల్‌ తుఫాన్‌ మరింత పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం డెర్నా నగరంలో తుఫాన్‌ బీభత్సానికి సంబం ధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడి యాలో వైరల్‌గా మారాయి. కొండలు, గుట్టల మధ్య నుంచి డెర్నా నగరం గుండా ప్రవహించే నది పరిసరాల్లో ఉన్న ఇళ్లు, భవనాలు పూర్తిగా నేల మట్టం అయ్యాయి. ఎన్నో అపార్ట్‌మెంట్‌లు బురదలో కూరుకుపోయినట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలుస్తోంది.
భూకంపం,తుఫాను,వరదలు,సునామీ మొద లైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి,ప్రాణనష్టాలు జరు గుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొన డానికి, ముందుగా సిద్ధం కావటానికి మానవ చైత న్యం అవసరం.పునరావాస పనులు,ప్రథమ చికిత్స, ఆహారం,బట్ట్‌లు,మందులు,రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురిం చి ప్రజలు తగినంత అవగాహన కలిగి వుండాలి.ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభ వించేది గాలి-నీరు వలనే. తుఫాన్‌, అతి భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులు ఇంకా సునామీ వంటి విపత్తులు మనవాళికి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. సముద్ర గర్భంలో జరిగే విపరీత చర్యలు వలన సునామీ ఏర్పడితే, తీర ప్రాంతం అంతా నీటిమయం అవుతుంది. తీరప్రాంతాలు అన్నీ నీట మునుగుతాయి. ఇటువంటి సునామీలు వలన ఏర్పడే ప్రకృతి వైపరీత్యాలు అపార నష్టం తీసుకువస్తాయి. ఇంకా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వలన తీవ్ర వర్షాలు, అతి భారీ వర్షాలు కురవడం వలన కూడా నదులు విపరీతంగా ప్రవచించి వరదలుగా సంభ విస్తాయి.వరదల వలన ప్రాణ నష్టం, పంటనష్టం,ఆస్తి నష్టం,వ్యవస్థలు స్తంభించడం వంటివి జరుగుతాయి. వాయుగుండం తీరం దాటుతున్నప్పుడు ఈదురు గాలులు, అతిభారీ వర్షాలు చాలా నష్టం కలిగిస్తాయి. వాతా వరణం మార్పులు గమనిస్తూ, ముందస్తు హెచ్చరికలు చేయడం వలన ఒక్కోసారి గాలి-నీరు వలన సంభవించే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త వహించినా ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవించేది.గాలి-నీరు వలన సంభవించే విపత్తుల నుండి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడగలరు కానీ ఆస్తి నష్టం,ఆర్ధికనష్టం,వ్యవస్థలు స్తంభించడం వంటివి జరగకుండా అడ్డుకోవడం అసాధ్యమే అవుతుంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు జరిగిన వెంటనే పునరుద్దరణ చర్యలు తీసు కునే వ్యవస్థ మనకు అందుబాటులో ఉండాలి. అందుకు అందరూ స్పందించి తగినంత సాయం చేయాలి. ఇటువంటి సాయం చాలామంది చేసి ఉన్నారు కూడా.
భూకంపాలు -భూమి కంపించుట వలన ప్రకృతి వైపరీత్యాలు
భూమి అడుగుభాగం వివిధ పొరలతో వివిధ లోహాలతో ఉంటుంది. భూమి లోపల కూడా నీరు, ఖనిజాలు ఉంటాయి. భూమి లోపల చర్యలు జరిగినప్పుడు భూమి ప్రకంపనలకు గురి అవుతుంది. అకస్మాత్తుగా భూమిలోపల ఏర్పడే చర్యలతో లేక విడుదల అయ్యే శక్తి వలన భూమి కంపిస్తుంది. అలా భూమి కంపించినప్పుడు భూమి పగిలి బీటలువారు తుంది.భూమి కంపించడం భూమి పగలడం వలన భూమిపైన ఉండే భవనాలు కూలి పోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదాలు వలన ప్రాణనష్టం, ఆస్తినష్టం, ఆర్ధిక నష్టం జరుగుతూ ఉంటుంది. ఇలా భూమి నుండి ఏర్పడే ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కొరకు భూకంపాలను అంచనా వేసే పరికరాల సాయంతో భూకంపం సంభవించే సమయం ముందుగానే పసిగడితే, ముందస్తు చర్యలు వలన ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చు.అయితే ఆస్తి నష్టం,ఆర్ధిక నష్టం అడ్డుకోవడం అసాధ్యం.
అగ్ని ప్రమాదాలు వైపరీత్యాలు
అగ్ని వలన జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వలననే జరుగుతాయి.గ్యాస్‌ లీక్‌ కావడం, కెమికల్‌ లీకేజ్‌ తదితర తప్పుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇటువంటి అగ్ని ప్రమాదాలు నుండి రక్షణ కొరకు నీరు, ఇసుక, వాయువులు వంటివి అందుబాటులో ఉండడం వలన అగ్ని ప్రమాదాలు పెద్ద ప్రమాదాలుగా పరిణ మించకుండా జాగ్రత్త పడవచ్చు.పెద్ద మొత్తం లో గ్యాస్‌ లీకేజ్‌ వంటివి అపార నష్టం చేయ గలవు. మానవ తప్పిదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే, అగ్ని ప్రమాదాల నుండి రక్షణ ఉంటుంది.అగ్నిమాపక సిబ్బంది వలన చాలావరకు అగ్ని ప్రమాదాలను ఆర్పిన ఘటనలు ఉన్నాయి.
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు
ప్రకృతి వైపరీత్యాల జరగకుండా చర్యలు, అంటే ప్రకృతిలో అసహజత్వం జరగకుండా చూసుకోవడమే అంటారు. సహజంగా ఏర్పడిన పర్యావరణంలో భూమిపై గాలి, నీరు, నిప్పు సాయంతో జంతుజాలం, మానవుడు నివాసం ఉంటారు. జంతువులు కేవలం వాటి ఆహారం, నివాసం విషయంలో ప్రకృతిలో లభించే సహజస్థితిలోనే జీవిస్తాయి. ప్రకృతిని తనకు నచ్చినట్టుగా మార్చుకునే తెలివి, సామర్ధ్యం మనిషికి సొంతం. అటువంటి తెలివి ప్రకృతి సహత్వాన్ని దెబ్బతీసి, ప్రకృతి సమతుల్యత పాడైతేమాత్రం ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. ఎంత సహజంగా ప్రకృతి ఉంటే అంతా ఆహ్లాద కరమైన ప్రకృతి, ఎంత అసహజత్వానికి గురి అయితే, అంతటి విపత్తులను పొందుతుంది. అది విపరీత స్వరూపాన్ని పొందితే మాన వాళికి నష్టమే కానీ లాభం ఉండదు.ప్రకృతి విపరీత స్థితికి చేరడానికి గాలి-నీరు ఎక్కువగా సాయపడతాయి. ప్రకృతిలో కుత్రిమ చర్యలు సహజత్వాన్ని పాడు చేయకుండా తగు జాగ్రత్తలు టేసుకోవాలి. మనిషితోబాటు కలిసి జీవించే జంతుజాలం వలన కూడా ప్రకృతి సమతుల్యత ఉంటుంది అని అంటారు. కాబట్టి ప్రకృతిలో జంతుజాలం అంతరించిపోయే చర్యలను కూడా నివారించాలి. ప్రకృతి వైపరీత్యాల నివారణకు, ప్రకృతిని సహజత్వం నుండి దూరం చేయకుండా ఉండడమే ప్రధానం. ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం.అయితే వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలవంటి ప్రకృతివైపరీత్యాలు సంభ వించడంవల్ల పర్యావరణం కలుషితమవు తుంది.అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగా లబారిన పడ తాయి. కాబట్టి ఇలాంటి సంద ర్భాలలో మనం అప్ర మత్తంగా ఉండడంతో పాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు, ఆహారపదార్థాలు సేకరించి పంపడం,సేవా క్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకో వలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగించ డానికి ప్రయత్నం చేయాలి. ప్రకృతి వైపరీ త్యాలు సంభవించి నప్పుడు 12 నుండి 15 సంవత్స రాల వయస్సుగల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ా వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
ా మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
ా విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్‌ లైన్లకు దూరంగా ఉండండి.
ా ఓపెన్‌ డ్రెయిన్స్‌ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆప్రదేశంలో కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
ా వరదనీటిలో నడవకండి లేదా డ్రైవ్‌ చేయవద్దు
ా రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకు పోగలవు
ా తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి.
ా తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి
ా వేడిచేసిన లేదా క్లోరినేటెడ్‌ నీరు త్రాగాలి.
ా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు
్చ మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి
్చ రిపేర్‌కు వచ్చిన విద్యుత్‌ వస్తువులను ఉపయోగించవద్దు
్చ అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందిం చిన ప్రధాన స్విచ్లు లను,ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి
్చ తడిగా ఉంటే విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.
్చ విరిగిన విద్యుత్‌ స్తంభాలు,తీగలు,పదునైన వస్తువులను పరిశీలించండి
్చ వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
్చ మలేరియావంటి వ్యాధులను నివారిం చడానికి దోమతెరలను వాడండి.
్చ వరద సమయంలో పాము కాటు సాధారణంకాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
్చ నీటి మార్గాలు/మురుగునీటిపైపులు దెబ్బతి న్నట్లయితే టాయిలెట్‌ లేదా కుళాయి నీటిని వాడకండి.
్చ నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖసలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
్చ మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసివస్తే మంచం,టేబుళ్లపై మీ ఫర్నిచం ఇతర ఉపకరణాలను పెట్టండి.
్చ మీ కరెంట్‌,గ్యాస్‌ కనెక్షన్‌ ను ఆపివేయండి
్చ ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి.
్చ మీ వద్ద ఉన్నఅత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె,విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవర ణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత15డిగ్రీసెంటీగ్రేడ్లు.గతంలో ఇది ఇంత కన్నా ఎక్కువగా,తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌హౌజ్‌వాయువులు గ్రహిం చుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలి తంగా వాతావరణం,భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమ య్యేది.అయితే ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయంవల్ల వెలువడే వాయువులుతోడై మరిం త శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభా వవంతమైంది నీటిఆవిరి.కానీ,అది వాతా వర ణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రా మికీకరణ కన్నా ముందుఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడంవల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి,కాల్చేయడంవల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది.గ్లోబల్‌వార్మింగ్‌ ఎక్కువవు తోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలై నప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.అయితే,కార్బన్‌డైఆక్సైడ్‌ అం తటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతా వరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది. అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20ఏళ్లు..గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలను1.5డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసు కోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు,నాయకులు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగు తున్న కృషికి ఐరాసనేతృత్వం వహిస్తోంది. ఇప్పటి కిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీ యంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటు దన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహారఉత్పత్తి పైనా తీవ్ర ప్రభా వం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలులవల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడంవల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. సముద్ర మట్టాలు పెరుగు తాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామ ర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీ తంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించి పోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్‌ఓ)అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడంవల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు. వాతావరణ మార్పులపై స్పందించడమే ఈశతాబ్దంలో మానవాళికి అతి పెద్ద సవాలు కాబోతోంది.
`వ్యాసకర్త : వాతావరణ మార్పుల పరిశోధకుడు,సెంట్రల్‌ యూనివర్శిటీ,హైదరాబాద్‌- (మల్లేష్‌ నాయక్‌)